
బైక్ స్టంట్స్ చేయడం నేరమని, ప్రాణానికి ప్రమాదం అని అందరికీ తెలిసిందే. అయినా కూడా యువతకు స్టంట్స్ అంటే విపరీతమైన మోజు.. ఎన్ని దెబ్బలు తగిలినా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ అదో ఫ్యాషన్‌గా ఫీల్ అవుతుంటారు. స్టంట్స్‌అంటే గుర్తొచ్చేది ఎక్కువగా అబ్బాయిలే. అమ్మాయిలు చేయడం చాలా అరుదు. తాజాగా ఓ యువతి సైకిల్‌పై స్టంట్ చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తే యువతికి ఓ యువకుడు అడ్డురావడంతో ఆమె అద్భుతమైన ఫెయిల్ అయ్యింది. దీంతో ఇద్దరు బొక్కబోర్లా పడ్డారు.
రోడ్డుపై ఓ అమ్మాయి వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి.. సడన్‌గా బ్రేకులు వేసి విన్యాసాలు చేస్తుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఆమె సైకిల్ వెనుక చక్రం పైకి లేచింది. కానీ అప్పుడే వెనుక నుంచి మరో సైకిల్ పై వేగంగా వచ్చిన యువకుడు.. ఆమె విన్యానాన్ని చెడగొట్టాడు. అబ్బాయి సైకిల్‌తో వచ్చి అమ్మాయి సైకిల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోయారు. వీళ్లిద్దరూ కూడా స్టంట్స్ చేసేవారని తెలుస్తుంది.
చదవండి: Viral Video: పెళ్లిలో అమ్మాయిల తీన్‌మార్ స్టెప్పులు, చేతిలో డ్రింక్ బాటిల్ పట్టుకొని..
అయితే అబ్బాయి కూడా యువతి లాగే వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి బ్రేక్‌లు వేయాలి. కానీ అది మర్చిపోవడంతో ఎదురుగా ఉన్న యువతి సైకిల్‌ను ఢీకొట్టడంతో.. ఇద్దరూ పడిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు. కాగా ఈ వీడియో చూసిన వారంతా ఇది చూసినవారంతా..‘ అమ్మాయి మంచి స్టంట్‌ను అబ్బాయి చెడగొట్టేశాడు. పాపం ఒకరి వల్ల ఇద్దరు బలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ
Comments
Please login to add a commentAdd a comment