![Stunt On Bullet Waving Pistol On Song Khalnayak Hoon Main - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/5/Bullet.jpg.webp?itok=3Z9PVTbS)
సోషల్ మీడియా స్టార్‌డమ్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అంతేకాదు ఈ స్టార్‌డమ్ కోసం సినిమాల్లో చేసే భయంకరమైన స్టంట్‌లన్నింటిని చేసేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు సినిమాలో మాదిరిగా బుల్లేట్ బండిపై తన స్నేహితుడితో కలిసి ఒక ప్రమాదకరమైన విన్యాసం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయంలోకెళ్లితే....గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్‌పై ఒక విన్యాసం చేశారు. ఒకరేమో బుల్లెట్ బండి నడుపుతుంటాడు. ఇంకొకరు బైక్ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్ కాలుస్తుంటాడు.
అలాగే వెనుక 'నాయక్ నహీ ఖల్‌నాయక్ హూన్' అనే పాట కూడా ప్లే అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాక ఆ యువకులిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసినందుకుగాను ఇద్దర్ని అరెస్టు చేశారు. తప్పయిందని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. వారిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.
(చదవండి: చెట్టను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు దారుణంగా కొట్టి!... చివరికి..)
குஜராத் : சூரத் நகரில் கையில் துப்பாக்கி ஏந்தி பைக்கில் சுற்றிய இருவர் கைது pic.twitter.com/ede8RB4wAI
— DON Updates (@DonUpdates_in) January 2, 2022
Comments
Please login to add a commentAdd a comment