Car Stunt On NH-5 Goes Wrong As Driver Jumps Over Divider - Sakshi
Sakshi News home page

Virla Video: భయానక స్టంట్‌...ఘోరంగా ధ్వంసమైన కారు

Published Wed, Jul 27 2022 2:03 PM | Last Updated on Wed, Jul 27 2022 3:21 PM

Viral Video: Car Stunt Goes Wrong As Driver Jumps Over Divider - Sakshi

బిజీగా ఉండే జాతీయ రహదారులపై విచిత్రమైన స్టంట్‌లు చేసి కటకటాలపాలైన సంఘటనలు కోకొల్లలు. అదీకూడా చాలా రద్దీగా ఉండే రహదారుల్లో పిచిపిచ్చి స్టంట్‌లు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొదరు ప్రబుద్ధులు. ఇలాంటి స్టంట్‌లు చేయొద్దని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా.. చేస్తూనే ఉండటం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఘోరమైన స్టంట్‌ చేసి కటకటాల పాలయ్యాడు. 

వివరాల్లోకెళ్తే....హిమచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో అమృతసర్‌కు చెందిన నివాసి జాతీయ రహదారి పై అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ... ఒక స్టంట్‌ చేశాడు. ఈ మేరకు అతను ఫ్రంట్‌ డోర్‌ తెరిచి మరీ డ్రైవ్‌ చేస్తూ...ఒక భయానక స్టంట్‌ చేసేందకు యత్నించాడు. ఇంతలో కారు అదుపుతప్పి డివైడర్‌ ఢీ కొట్టడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను కూడా ఢీకొట్టింది.

ఐతే ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడలేదు గానీ కారు దారుణంగా ధ్వంసమైంది. సదరు డ్రైవర్‌ తన ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి పడేసేలా ఇలాంటి స్టంట్‌ చేసినందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనను ఆ కారు వెనుక డ్రైవింగ్‌ చేస్తూ... వస్తున్న మరో వ్యక్తి రికార్డు చేశాడు. ఈ మేరకు ఈ వీడియోని ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో  నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి:  తమిళనాడు చెస్‌ ఈవెంట్‌ హోర్డులపై మోదీ ఫోటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement