Divider
-
రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
చంద్రగిరి/హనుమాన్‌జంక్షన్ రూరల్: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు తన భార్య నీరజకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ)కు తీసుకువెళ్లేందుకు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ సమీర్(26)తో కలిసి ఆదివారం రాత్రి కారులో బయలుదేరారు. వారితోపాటు శ్రీనివాసులు అన్న శేషయ్య(49), ఆయన భార్య జయంతి(43) కూడా ఉన్నారు.మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మ(56)ను సైతం వీరు కారులో ఎక్కించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.40గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు సమీర్, పద్మావతమ్మ, జయంతి, శేషయ్య అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, నీరజలకు తీవ్ర గాయాలపాలయ్యారు. చంద్రగిరి సీఐ రామయ్య తన సిబ్బందితో కలసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారిద్దరినీ 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలంలోనే నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా వేదసంతూర్కు చెందిన స్వామినాథన్ తన కుటుంబంతో కలిసి పదేళ్లుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అడ్వొకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న స్వామినాథన్ తమిళనాడులోని సొంతూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన కారును మితిమీరిన వేగంతో నడపటంతో కోడూరుపాడు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను దాటుకుని అవతల వైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్వామినాథన్(40), ఆయన కుమార్తె రాధాప్రియ(14), కుమారుడు రాకే‹Ù(12), సోదరుడి కుమారుడు గోపి(23) అక్కడికక్కడే మృతిచెందారు. స్వామినాథన్ భార్య సత్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్ సీఐ అల్లు నవీన్ నరసింహామూర్తి, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గన్నవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఈజీ మనీ, క్రేజీ బోయ్: ఈ వీడియో చూస్తే మీకు పిచ్చెక్కుద్ది!
ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే దూకుడు సినిమా డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే.. ది ఇన్స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. పలు నగరాల్లో డివైడర్ కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే, స్మార్ట్ ఐడియా ఇలా పలు కమెంట్లు సందడి చేస్తున్నాయి. Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk — The Instigator (@Am_Blujay) March 19, 2024 -
చిన్న ప్రమాదమే, క్షేమంగానే ఉన్నాను: శర్వానంద్
‘నా కారు చిన్న ప్రమాదానికి గురైంది. కానీ, నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ హీరో శర్వానంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ జంక్షన్ లో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా శర్వానంద్ స్పందిస్తూ – ‘‘ఈ రోజు (ఆదివారం) ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడొద్దు’’ అన్నారు. కాగా జూన్ 3న రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం రక్షితతో జరగనున్న విషయం తెలిసిందే. There has been news that my car met with an accident this morning. It was a very minor incident.I am absolutely safe and sound at Home with all your love and blessings. There is nothing to worry about. Thank you all for your concern.Have a great Sunday everyone.— Sharwanand (@ImSharwanand) May 28, 2023 -
రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా..
సాక్షి, హైదరాబాద్: బైక్ అదుపుతప్పి డివైడన్‌రు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ మారుతీనగర్ కాలనీకి చెందిన దంతులూరి అభిసాయిరామ్‌రాజు (22) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అభి సిద్దిపేట నుంచి వచ్చిన మిత్రుడు రమేష్‌నును కలిశాడు. ఇద్దరు కలిసి నాగారంలోని మరో మిత్రుడి ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రావడం లేదని మరుసటి రోజు ఉదయం వస్తానని తన తల్లికి ఫోన్ చేసి చెప్పిన అభి రాత్రంతా మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆదివారం తెల్లవారుజామున రమేష్‌ను జేబీఎస్లో డ్రాప్ చేయడానికి మరో మిత్రుడి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో ఈసీఐఎల్ చౌరస్తా నుంచి రాధిక వైపుగా వెళ్తుండగా సోనీ సెంటర్ మూలమలుపు వద్ద అదుపు తప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అభిసాయిరామ్‌రాజు తల పగిలి అక్కడిక్కడే మృతిచెందగా రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. చదవండి: విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి -
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం...ఆటోని ఢీ కొట్టిన ట్రక్కు
లక్నో: మితిమీరిన వేగంతో దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘనట ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్ అతి వేగంతో ఆటోని ఢీకొట్టి, అక్కడే ఉన్న డివైడర్ని, కరెంట్ స్థంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఐతే ఆ ఆటోలోని ప్రయాణికులంతా విద్యాంచల్ నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటిక వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన క్షతగ్రాతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..) -
డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది.. ట్రక్కు దూసుకెళ్లి..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలువ నీడలేని కొందరు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది. సీమాపురి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ట్రక్కు అతవేగంతో డివైడర్‌పై పడుకున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) బస్ డిపోకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు.. కరీం(52), ఛోటే ఖాన్(25), షా అలాం(38), రాహు(45)లుగా గుర్తించారు. మరో ఇద్దరు మనీశ్(16), ప్రదీప్(30)లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా ట్రక్కుతో సహా పారిపోయాడు డ్రైవర్. నిందితుడుని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి! -
ర్యాష్ డ్రైవింగ్ స్టంట్!...ఘోరంగా ధ్వంసమైన కారు: వీడియో వైరల్
బిజీగా ఉండే జాతీయ రహదారులపై విచిత్రమైన స్టంట్లు చేసి కటకటాలపాలైన సంఘటనలు కోకొల్లలు. అదీకూడా చాలా రద్దీగా ఉండే రహదారుల్లో పిచిపిచ్చి స్టంట్లు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొదరు ప్రబుద్ధులు. ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా.. చేస్తూనే ఉండటం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఘోరమైన స్టంట్ చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే....హిమచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో అమృతసర్‌కు చెందిన నివాసి జాతీయ రహదారి పై అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ... ఒక స్టంట్ చేశాడు. ఈ మేరకు అతను ఫ్రంట్ డోర్ తెరిచి మరీ డ్రైవ్ చేస్తూ...ఒక భయానక స్టంట్ చేసేందకు యత్నించాడు. ఇంతలో కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను కూడా ఢీకొట్టింది. ఐతే ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడలేదు గానీ కారు దారుణంగా ధ్వంసమైంది. సదరు డ్రైవర్ తన ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి పడేసేలా ఇలాంటి స్టంట్ చేసినందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనను ఆ కారు వెనుక డ్రైవింగ్ చేస్తూ... వస్తున్న మరో వ్యక్తి రికార్డు చేశాడు. ఈ మేరకు ఈ వీడియోని ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. #WATCH | HP: A video went viral showing a car jumping over a divider & colliding with railing on NH-5 in Solan; a resident from Amritsar tried performing stunts while rash driving. Vehicle damaged but driver safe. Case filed u/s 279 of IPC in Dharampur PS: Solan Police (25.07) pic.twitter.com/o5ajWRJuiG — ANI (@ANI) July 25, 2022 (చదవండి: తమిళనాడు చెస్ ఈవెంట్ హోర్డులపై మోదీ ఫోటోలు) -
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి
మదనపల్లె టౌన్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో.. ఓ యువకుడు మృతి చెందగా, సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె అప్పారావు తోటకు చెందిన అయూబ్‌బాషా కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్ వద్ద బిర్యానీ హోటల్ నడుపుతున్నాడు. బిర్యానీకి అవసరమైన మసాలాను తీసుకురావాలని తన ఇద్దరు కుమారులు ఆరీఫ్, అమీర్‌ఖాన్(18)కు చెప్పాడు. వారు బైక్‌పై తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. వారు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అమీర్‌ఖాన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్ లేక ప్రమాదాలు
సాక్షి, విజయనగరం రూరల్ : మండలంలోని చెల్లూరు–ముడిదాం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా డివైడర్లు లేక ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని చెల్లూరు నుంచి ముడిదాం, రీమాపేట గ్రామాల మీదుగా వీటీ అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్లు లేకపోవడంతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకోవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఒడిశాకు రోజూ వేలాది వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే జాతీయ రహదారి, పట్టణ శివారు కావడం రోడ్డు చిన్నదైనా వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం నెలకోసారైనా మూడు కిలోమీటర్ల రోడ్డులో ఎక్కడోచోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండే విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించడంతో తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను పాఠశాలలకు సాగనంపుతున్నారు. పాలకులు, ఆర్ ఆండ్ బి అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ మంజూరు చేసి నిర్మించాలని ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ ప్రజలు కోరుతున్నారు. భయమేస్తోంది రోడ్డు ఇరుగ్గా ఉండటం, భారీ వాహనాలు, కార్లు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయమేస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటాలంటే మనిషి తోటు ఉండాల్సిందే. – తుపాకుల అప్పలరాజు, ప్రశాంతినగర్ డివైడర్లు ఏర్పాటు చేయాలి ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. ప్రశాంతినగర్ వద్ద భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డుకు ఇరుకుగా ఉండటం, వాహనాలు అతివేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. – అలమండ అప్పలరాజు, మాజీ సర్పంచ్, ముడిదాం -
అవినీతికి అభివృద్ధి ముసుగు
‘ఒంగోలు నగరాన్ని నేనే అభివృద్ధి చేశా...’ అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తరచూ డబ్బాలు కొట్టుకుంటుంటారు. కానీ ఉన్న డివైడర్లను కాస్తంత పొడిగించి, పార్కులకు రంగులేసి..ఇదే అభివృద్ధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. పనిలోపని అభివృద్ధి పేరు చెప్పుకొని భారీగా అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుయాయులు కోట్ల రూపాయలు దండుకుని నగర పాలక సంస్థ ఖజానాకు గండికొట్టారు. సాక్షి, ఒంగోలు అర్బన్: వందల కోట్లు కేటాయించి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశామని బాజాలు కొట్టుకుంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి మాటున కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు అండగా నాటి కమిషనర్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు చేతులు కలపడంతో అవినీతికి అభివృద్ధి ముసుగు వేసి నగరపాలక ఖజానాకు చేరవలసిన సొమ్మును తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పంచుకున్నారు. నగరంలో బ్యూటిఫికేషన్ పేరుతో ప్రధాన రహదారుల్లోని సెంటర్ డివైడర్లలో అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలు వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువుకు సంబంధించిన ప్రైవేటు ఏజెన్సీకి నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ డివైడర్లను అప్పగించారు. బూట్ (బిల్ట్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్) పద్ధతిన అప్పగించి అక్రమాలకు తెరతీశారు. బూట్ పద్ధతి అంటే కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీ నిర్మాణాలు చేసుకుని దానిని పరిరక్షిస్తూ పచ్చదనంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ యాడ్స్‌ను వేసుకుని ఏజెన్సీ ఆదాయం పొందాలి. అదికూడా నిబంధనల ప్రకారం మొదట 3 సంవత్సరాలు మాత్రమే ఏజెన్సీకి ఇవ్వాలి. అనంతరం నగరపాలక టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు ఏజెన్సీ డివైడర్ల మెయింటెన్స్ విషయంలో సంతృప్తి వెలిబుచ్చితే తిరిగి మరో 3 సంవత్సరాలు రెన్యువల్ చేయాలి. అయితే ఎమ్మెల్యే బంధువు కావడంతో నగరపాలక అధికారులు అత్యుత్సాహంతో ఏకంగా 9 సంవత్సరాలు లీజు కేటాయించి ప్రతి మూడు సంవత్సరాలకు రెన్యువల్ చేసేలా అనుమతులు ఇచ్చారు. ఆదాయం లేకపోగా ఖజానాకు గండి డివైడర్లకు సంబంధించి సదరు ఏజెన్సీకి 2014లో లీజుకు ఇస్తే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నగరపాలక సంస్థకు దక్కకపోగా నగరపాలక నిధుల నుంచి డివైడర్లలో మొక్కలకు సుమారు రూ.20 లక్షలు, డివైడర్లకు రంగులు వేసేందుకు మరో రూ.50 లక్షలు కేటాయించి పనులు చేశారు. సదరు ఏజెన్సీ మాత్రం లాలీపాప్‌లో యాడ్ ప్రకటన ఇస్తే వేలల్లో వసూలు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. ఏజెన్సీకి లీజుకు ఇచ్చి ఇప్పటికి మూడేళ్లు దాటినా ఇంత వరకు రెన్యువల్ చేయకుండా ఖజానాకు గండి కొడుతున్నారు. ఎక్కడైనా డివైడర్లు పగిలిపోయినా ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు పర్యటన ఉన్నప్పుడు ప్రతిసారి డివైడర్లకు రంగులు వేస్తూ ఓఎంసీ అధికారులు లక్షల్లో బిల్లులు చేసుకున్నారు. డివైడర్లలో లాలీపాప్‌లు మాత్రమే ఏర్పాటు చేసి యాడ్స్ ప్రచురించాల్సిన ఏజెన్సీ డివైడర్లలోని విద్యుత్ స్తంభాలకు సైతం బోర్డులు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే ఇటు నగరపాలక అధికారులు కుమ్మక్కై వాటాలు పంచుకుని నగరపాలక ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా నగరాభివృద్ధికి చెందాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ అధినేత ఒంగోలు పర్యటన సందర్భంగా లాలీపాప్ల్లో యాడ్స్ వస్తే ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో నగరపాలక అధికారులు వాటిని తొలగించి నానా బీభత్సం చేసిన విషయం తెలిసిందే. లాలీపాప్‌ల ఆక్రమణ.. పన్నుల వసూలు నిల్: టెండర్ ద్వారా లాలీపాప్‌లు ఏజెన్సీకి అప్పగించినా గజిట్ షరతులు ప్రకారం ఎంక్రోచ్మెంట్ టాక్స్ (ఆక్రమణ పన్ను) విధించి టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు వసూలు చేయాలి. అయితే డివైడర్లలోని లాలీపాప్ యాడ్స్‌కు సంబంధించి చదరపు మీటరుకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయాలి. అయితే గడిచిన నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ప్రకటనలు, ఆక్రమణ పన్నులు ఎమ్మెల్యే, ఓఎంసీ అధికారుల జేబుల్లోకే.. కార్పొరేషన్ చట్టం ప్రకారం నగరంలోని వ్యాపార కేంద్రాలు రోడ్డు ముఖంగా ఏర్పాటు చేసుకున్న ప్రకటనల బోర్డులకు సంబంధించి ప్రకటన పన్నులు టౌన్‌ప్లానింగ్ అధికారులు వసూలు చేయాలి. వాటికి కూడా చదరపు మీటర్ల లెక్కన పన్నులు విధించాల్సి ఉంటుంది. అయితే నగరంలో వేలాదిగా వ్యాపార కేంద్రాలు ఉంటే కేవలం వందల్లోనే ప్రకటన పన్నులు వసూలు చేస్తున్నారు. వ్యాపార కేంద్రాలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ఎమ్మెల్యే అండదండలు ఉండటం, వాటాలు కేటాయిస్తూ నగరపాలక ఆదాయానికి గండి కొడుతున్నారు. నిజంగా ప్రకటన పన్నులను కచ్చితంగా అమలు చేస్తే ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది. నగరంలో ఆక్రమణ పన్నులకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి. ఏ పన్ను విధించాలన్నా ఎమ్మెల్యే హుకుం జారీ చేయాలి. ఆయన అనుమతి లేకుండా నగరపాలక అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. వేలల్లో ఉన్న ఆక్రమణలకు సంబంధించిన పన్నులు వందల్లో వేస్తూ ఇష్టానుసారంగా కొలతలు చూపిస్తూ ఖజానాకు చిల్లు పెడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలు వస్తే టౌన్‌ప్లానింగ్ విభాగానికి కాసుల పంట కురుస్తోంది. వచ్చిన ఆదాయంలో ఎమ్మెల్యే వాటాను ఆయనకు పంపాల్సిందే. కొంచెం నిర్మించి ఎక్కువ ఆదాయం వైపుగా.. సెంటర్ డివైడర్లు నిర్మించుకుని లాలీపాప్‌లు ఏర్పాటు చేసుకునే ఏజెన్సీకి లడ్డూలాగా నగరంలోని డివైడర్లు దొరికాయి. దాదాపుగా గతంలోనే నిర్మించిన డివైడర్లను కొంత మేరకు పొడిగించడమే తప్ప మొత్తం డివైడర్లు నిర్మించే అవసరం లేకుండా పోయింది. చర్చి సెంటర్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు బాలినేని హయాంలోనే డివైడర్ నిర్మించారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు వరకు మాత్రమే నిర్మించారు. చర్చి సెంటర్ నుంచి ఎస్బీఐ కూడలి వరకు పాత డివైడర్లు ఉన్నాయి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు. అద్దంకి బస్టాండ్ నుంచి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వరకు గతంలోనే డివైడర్లు ఉన్నాయి. అద్దంకి బస్టాండ్ నుంచి గుంటూరు రోడ్డులో పోతురాజు కాలువ వరకు పాత డివైడర్లే. అక్కడి నుంచి బైపాస్ వరకు మాత్రమే కొత్తగా నిర్మించారు. పాత డివైడర్లు కొంత మేరకు మరమ్మతులు చేశారు. నగరంలోని డివైడర్లలో సుమారు 400 నుంచి 500 లాలీపాప్‌లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా ప్రకటనలు వేస్తూ సదరు ఎమ్మెల్యే బంధువుకు చెందిన ఏజెన్సీ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. మామూళ్ల మత్తులో ఉన్న నగరపాలక అధికారులు ఎమ్మెల్యే బంధువు కావడంతో ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నగరవాసులు మాత్రం ఎమ్మెల్యే బినామీ వ్యాపారం అని అనడం గమనార్హం. కమిషనర్ చెప్పమంటే చెప్తా.. టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కేవీ ప్రకటనల పన్నులు, ఆక్రమణ పన్నులకు సంబంధించి వివరణ అడిగేందుకు వెళ్లగానే టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కనీసం విషయం కూడా తెలుసుకోకుండా ఏ వివరణ అయినా కమిషనర్ చెప్పమంటే చెప్తా లేకుంటే లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అంశం అని చెప్పినా ఏ అంశం అయినా కమిషనర్ మాత్రమే చెప్తారు అని వివరణ ఇవ్వడం గమనార్హం. -
రోడ్డు మధ్య డివైడర్‌తో ప్రజల అవస్థలు
-
హీరో నానికి తప్పిన ప్రమాదం
-
నాని ఈజ్ సేఫ్
ఐయామ్ ఓకే అంటున్నారు హీరో నాని. ఇంతకీ ఏం జరిగిందంటే... ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని శుక్రవారం ఉదయం డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నారు హీరో నాని. ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర గంటల సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. నానికి పెద్ద గాయాలేం కాలేదు. అయితే... ముందు కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారన్న వార్తలు వచ్చాయి. పోలీసులు నాని తండ్రి రాంబాబుకు ఫోన్ చేయగా ఆ సమయంలో నాని కారులోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై నాని స్పందించారు. ‘‘ఐయామ్ ఓకే. అక్కడక్కడా చిన్నగా గీసుకుపోయింది. అంతే. యుద్ధానికి (షూటింగ్‌కు) స్మాల్ బ్రేక్. నెక్ట్స్ వీక్‌లో మళ్లీ యాక్షన్‌లోకి దిగుతాను’’ అన్నారు నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్ట్ లుక్స్‌తోపాటు ఓ సాంగ్‌ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అదుపు తప్పి డివైడర్‌పైకి వెళ్లిన కంటైనర్
జాతీయ రహదారిపై డేంజర్ జోన్ల వద్ద ఏర్పాటు చేస్తున్న వేగ నిరోధకాలు కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా భారీ కంటైనర్లతో వచ్చే లారీలకు వేగ నిరోధకాలు అడ్డుగోడలుగా మారి ప్రమాదానికి హేతువుగా మారుతున్నాయి. కోమర్తి వద్ద శనివారం ఇదే తరహాలో వేగనిరోధకాల వద్ద ఓ కంటైనర్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నరసన్నపేట: మండలంలోని కోమర్తి కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఓ కంటైనర్ అదుపు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విశాఖ నుంచి బరంపురం వైపు వెళ్తున్న కంటైనర్ వేగనిరోధకాలను క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. అదే సమయంలో ఎదురుగా కోల్‌కతా నుంచి హైదరాబాద్ వైపునకు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే లారీ బోల్తా పడి బస్ కోసం రో డ్డు పక్కన నిల్చున్న వారివైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన రాజాంకు చెందిన బత్తుల వీర్రాజు పాటు మరో ముగ్గురు పరుగులు తీయగా ఉర్లాంకు చెందిన నడిమింటి గోవిందరావు దొరికిపోయాడు. ఈయనపై లారీలో ఉన్న పశువుల దాణా బస్తాలు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రున్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ సి.యాదవ్‌కు గాయాలయ్యాయి. రోడ్డుపై లారీ, కంటైనర్లు అడ్డంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నరసన్నపేట సీఐ పైడిపినాయుడు, ఎస్ఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బార్ కోసం దారి మాయం
♦ పిడుగురాళ్లలో బార్ నిర్వహణకు గాను పన్నాగం ♦ ఎదురుగా ఆసుపత్రి ఉంటే అనుమతులు రావని ♦ డివైడర్ మధ్య దారి మూసేసిన టీడీపీ నాయకులు పిడుగురాళ్ల టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటు విషయంలో అధికార పార్టీ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. పిడుగురాళ్లలో ఏభై పడకల ఆసుపత్రి ఎదురు బార్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా మారిందని అధికార పార్టీకి దగ్గరి వ్యక్తులు ఏకంగా డివైడర్ మధ్య దారినే మూసివేయడం విశేషం. రాకపోకలకు బంద్ అయిన తర్వాత దూరం చూపి అనుమతులు పొందుదామని పన్నాగం పన్ని సోమవారం రాత్రి దారి మూసేశారు. నిబంధనలు మారిన తర్వాత జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉండకూడదనే నియమం రావడంతోనే ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయం సమాచారం. రాత్రికి రాత్రే దారి మూసివేత.. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ మధ్యలో ఉన్న దారిని రాత్రికి రాత్రే మూతపడింది. పదేళ్ల క్రితం ఈ దారి నిర్మించగా పాదచారులకు, రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఈ ప్రాంతంలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు ఎక్కువ. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రోడ్డులో ఏభై పడకల ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఉంది. అలాంటి మార్గాన్ని మూసివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వైద్యశాల ఎదుట బార్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం, వంద అడుగుల దూరం చూపేందుకు గాను బార్ నిర్వాహకులు ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇచ్చారు. -
‘డెత్’ స్పాట్.. డివై‘డర్’!
రోడ్డు మధ్యలో మృత్యువు వారంలో ఏడుగురు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు డివైడర్ల నిర్మాణంలో అశాస్త్రీయత.. నగరంలో ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు నిర్మించిన డివైడర్లు దడ పుట్టిస్తున్నాయి. రోడ్డు మధ్యలో ప్రమాద హేతువులవుతున్నాయి. వీటిని ఢీకొని ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. డివైడర్ల నిర్మాణంలో శాస్త్రీయత కొరవడడం, కనీస ప్రమాణాలు సైతం పాటించపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గత ఆదివారం నుంచి జరిగిన ఐదు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం ముగ్గురిని బలితీసుకోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో జరుగుతున్న ప్రమాదాల్లో 30 శాతం వీటివల్లేనని లెక్కతేలింది. సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు వాహనదారుల పట్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు లెక్కతేల్చారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జునుజ్జు అవుతోంది. చోదకుడు సైతం ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువగా ఉంటోంది. గడిచిన కొన్నేళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రి వేళ్లల్లో వాహనచోదకుల ప్రాణాలను హరిస్తున్నాయి. కారణాలు అనేకం.. డివైడర్లు వాహనదారుల పాలిట మృత్యువుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం అదుపుతప్పి వాటిని ఢీకొంటున్నాయి. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచుగా ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్స్తో పాటు వాణిజ్య ప్రాంతాలు, కనెక్టివిటీ ప్రాంతాలుగా పరిగణించే కోఠి, అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారుల్లో తరచూ డివైడర్ల చోటు మారుతున్నాయి. వీటితోపాటు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లోని డివైడర్లు, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణనగర్, ఎస్సార్నగర్తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ తదితర శివార్లలోని అనేక రహదారుల్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. డివైడర్ల నిర్మాణంలో తేడా.. సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాలి. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరితో డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతున్నాయి. వీటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. కనిపించని ‘హెచ్చరిక’ బోర్డులు ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో ‘హెచ్చరిక’ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్–1), 100 మీటర్ల వద్ద మరొకటి (కాషన్–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా ప్రమాద సూచికలు (హజార్డ్ మార్కర్స్) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. కానీ నగరంలో ఇవి మచ్చుకైనా కనిపించవు. కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే.. ప్రమాద హేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ రిఫ్లెక్టివ్ పెయిటింగ్ వేయడం తప్పనిసరి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రిపూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంత మాత్రమే. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. ఈ చర్యలు తీసుకుంటేనే డివైడర్ ప్రమాదాలను అదుపు చేయవచ్చు. వారం రోజుల్లో ప్రమాదాలు ఇలా.. ఈనెల 1న చందానగర్ పరిధిలో జరిగిన ప్రమాదంలో విష్ణుమూర్తి (32), కిరణ్‌కుమార్ (32) కన్నుమూశారు. రస్తారంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదేరోజు మేడిపల్లి ఠాణాపరిధిలో జరిగిన యాక్సిడెం ట్లో ప్రవీణ్ఖంద్రా (26) చనిపోగా ప్రశాంత్ క్షతగాత్రుడయ్యాడు. ∙3వ తేదీ తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద జరిగిన ప్రమాదంలో వీరాస్వామి, యుగల్ క్షతగాత్రులయ్యారు. ఇదేరోజు మాదాపూర్ పరిధిలో జరిగిన ప్రమాదంలో రిత్‌రాజ్ (23), బులెటిన్రే (25) మరణించారు. ఆదివారం నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై ఇంద్రారెడ్డి నగర్ కంచె వద్ద జరిగిన ప్రమాదంలో నారాయణ(60), సత్యవతి(55) ప్రాణాలు కోల్పోగా, భాస్కర్, భరత్, హారిక, మధు తీవ్రంగా గాయపడ్డారు. -
డివైడర్‌ను ఢీకొన్న పోలీస్ వాహనం
-
రోడ్డుపాలైన వందల లీటర్ల పాలు
-
డివైడర్‌ను డీకొట్టిన కారు: ఇద్దరికి గాయాలు
-
కారు బోల్తా: ఎనిమిది మందికి గాయాలు
ఘట్కేసర్: బైక్ ఢీకొట్టి ఇన్నోవా బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడిన సంఘటన ఘట్కేసర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏదులాబాద్కు చెందిన అంజన్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం బైక్‌పై డ్యూటీకి వెళుతుండగా బైపాస్ రోడ్డులోని మైసమ్మగుట్ట దేవాలయ సమీపంలో వరంగల్ వైపు వెళతున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీనిని చూసిన అంజన్‌కుమార్ పక్కకు తప్పుకోగా కారు బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అంజన్‌కుమార్‌కు స్వల్పగాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్, గోపి, మేఘనాధ్, మేకలింగం, ప్రవళిక, వనజాక్షి్మ, డ్రైవర్ రాజుకు గాయపడ్డారు. గాంధీనగర్‌కు చెందిన వారు వరంగల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఒకరు మృతి, మరో వ్యక్తికి గాయాలు ఏన్కూరు : డివైడర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన కె.భరత్(22), అతడి బంధువు సాగర్ ఇద్దరూ కలిసి కారులో సుజాతనగర్ నుంచి కారేపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏన్కూరు సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టి పల్టి కొట్టిన కారు
-
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్(35) మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: యువతి మృతి
చిట్యాల(నల్లగొండ): విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సుమో చిట్యాల వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై బోల్తా పడింది. ఆ వెనుకే వేగంగా వచ్చిన కారు కూడా డివైడర్‌ను, సుమోను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో సుమోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా, కారులో ఉన్న బెంగళూరుకు చెందిన నాన్సీ(22) అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లి అనిత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
డివైడర్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
మెదక్: మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. వారు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెత్తురోడిన రహదారి
♦ బంధువు కర్మకాండకు వెళ్లి వస్తూ కానరాని లోకాలకు.. ♦ ప్రమాదంలో ఐదుగురు మృతి మృతులది నెల్లూరు జిల్లా బంధువుల ఇంట్లో చావు... బాధల్లో పాలుపంచుకుని ఓదార్చి కర్మకాండల కార్యక్రమం ముగించి తిరుగుపయనం. అంతలోనే విషాదం. అద్దంకి సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో ఇరవై అడుగుల ఎత్తుకు ఎగిరి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఐదుగురు తనువు చాలించారు. అంతా సాఫీగా సాగిఉంటే మరో రెండున్నర గంటల్లో వారి గమ్యస్థానమైన నెల్లూరు జిల్లా చేరుకునేవారు. నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేవారు కూడా లేకుండాపోయూరు. మూడు పదుల వయసు కూడా నిండని జ్యోతి అనే యువతి బస్సులో వచ్చి వెళ్లేటప్పుడు కూడా బస్సులో వెళ్దామనుకుని చివరి నిమిషంలో కారు ఎక్కి మృత్యుకౌగిలిలోకి చేరుకుంది. అద్దంకి : బంధువు కర్మకాండకు వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిగా, మరో వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. ఈ విషాధ ఘటన గురువారం అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని శ్రీనివాసనగర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుల బంధువుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా బోగుల మండలం జేపీ(జెక్కేపల్లి)గూడూరుకు చె ందిన 50 మంది, గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శ్రీరాంపురం గ్రామంలో తమ బంధువు కర్మకాండకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రెండు కార్లు, మరికొందరు బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కో కారులో ఐదుగురు చొప్పున, మిగిలిన వారు బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బోల్తా కొట్టిన ముందు కారు బయలుదేరిన రెండు కార్లలో ముందు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారు వేగంగా వస్తూ అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని శ్రీనివాసనగర్ సమీపంలో అదుపు తప్పింది. సుమారు 20 అడుగులు పైకి లేచి మార్జిన్లో పడింది. కారులో ప్రయాణిస్తున్న పేరం రమణమ్మ(55), గునపాటి వెంకటేశ్వరరెడ్డి(50), గునపాటి బుజ్జమ్మ(52),జ్యోతి(25)మృతదేహా లు కారు వెనుక అద్దంలో గుండా విసిరేసినట్లుగా అక్కడొకటి.. అక్కడొక్కటి పడ్డాయి.కారు నుజ్జునుజ్జయింది.కారులో ప్రయాణిస్తున్న ఐదో వ్యక్తి పేరం శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలు కాగా 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అతను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కారులో నేను వెళ్తా బాబాయ్. మృత్యువు పిలిచిందో ఏమో..!! బస్సులో వెళ్లిన జ్యోతి, తిరిగి వచ్చే సమయంలో కారు ఎక్కుతున్న బాబాయి పాణ్యం వెంకయ్యకు అడ్డుపడింది. తాను కారు ఎక్కి విగత జీవిగా మారిందని బాబాయి వెంకన్న బోరున విలపించా రు.అక్క కూతరు జ్యోతి, తల్లి రమ్మణమ్మ ఇద్దరూ మరణించడంతో.. రమణమ్మ కుమారుడు వెంకటేశ్వరరెడ్డి విలపించిన తీరు చూపరులను కంటతపడి పెట్టించింది. ఈ విషాధ ఘటనలో కారు 20 అడుగుల ఎత్తుకు పైకి లేచి పడడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే అద్దంకిఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు,సీఐ బేతపూడి ప్రసాద్,దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. -
వలసకూలీ దుర్మరణం
► వలసకూలీ దుర్మరణంతో వీధిన పడిన కుటుంబం ► కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువులు ► గోపాల్ పేటలో విషాదఛాయలు గోపాల్పేట : పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వలస వె ళ్లి న ఓ కుటుంబం పెద్ద దిక్కును కో ల్పో యి వీధిన పడింది.. రోడ్డు ప్రమాదం లో కుటుంబ యజమాని దుర్మరం చెం దడంతో వారు కన్నీరు మున్నీరయ్యా రు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌పేటలోని ఈ దమ్మగడ్డకాలనీకి చెందిన దాసర్ల బా బు (32) కు భార్య అలివేలతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదుకు వలస వెళ్లాడు. అప్పటి నుంచి నగరంలోని సంతోష్‌నగర్‌లో నివాసముంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భార్యాభర్తలు కూలి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం అక్కడ నా లుగు లైన్ల రోడ్డు డివైడర్ పనుల్లో నిమగ్నమైన భర్తను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే చనిపోయాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేయడంతో లారీ డ్రైవర్‌పై కేసు దర్యాప్తు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీం తో వారు రాత్రి స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
మరణ మృదంగం
రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది వృత్యువాత ఒకే ఘటనలో 12 మందిని కబలించిన మృత్యువు మరోఘటనలో ఓ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ మరో ముగ్గురికి మృత్యువై ఎదురొచ్చిన‘టాటా సఫారీ’ డివైడర్‌ను ఢీ కొని మరో ఇద్దరు టీనేజర్లు... అన్ని ఘటనల్లోనూ అతి వేగమే ప్రమాదానికి కారణం బెంగళూరు: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. శుక్రవారం ఒక్కరోజే నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన సంబంధికుల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు.... ధార్మిక కార్యక్రమం నుంచి తిరిగి వస్తూ... బెంగళూరు నుంచి హొసపేటకు ఉక్కు కడ్డీల లోడుతో వెళుతున్న లారీ (యూపీ-81,ఏఎఫ్-5415) చిత్రదుర్గ శివారు ప్రాంతాలకు శుక్రవారం తెల్లవారుజాము 3 గంటలకు చేరుకుంది. ఆసమయంలో వేగంగా వెలుతున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టాట్ఏస్ను ఢీ కొని దాని పై ఒరిగిపోయింది. దీంతో టాటాఏస్ డ్రైవర్ కుమార్ (35)తో సహా వాహనంలోని 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొల్లప్ప(68), మంజణ్ణ(61), గంగమ్మ(60), దుర్గప్ప(51), తిప్పేస్వామి(45), నాగణ్ణ(45), గంగణ్ణ(43), గంగాధర్(42), మంజునాథ్(40), టాటా ఏస్ డ్రైవర్ కుమార్(35), సుదీప్(17), చేతన్(10)లు ఉన్నారు. వీరంతా కూడగహళ్లి గ్రామానికి చెందిన వారు. గురువారం రాత్రి టాటా ఏస్ వాహనంలో సంఘటన జరిగిన చోటుకు దగ్గరగా ఉన్న చిక్కగూండనహళ్లిలో ఉన్న పాం డురంగ దేవస్థానానికి గురువారం రాత్రి వెళ్లారు. అక్కడ భజన ముగిసిన వెంటనే సొంతఊరైన కూడగహళ్లికి వెళ్లే సమయంలో మృత్యురూపంలో వచ్చిన లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక తురువనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్‌మార్టం తర్వాత సంబంధీకులకు అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.... రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన జయకీర్తి ఇంద్ర, (55), వాజ్యశీల అలియాస్ వాగేశ్వరి (50) దంపతులు కుమారుడు ప్రశాంత్ (31)తో కలిసి బెంగళూరు నుంచి మూడబిదరి పట్టణానికి ఆల్టోకారులో వెళుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని చెన్నపట్టణ శివారుల్లో బండిహళ్లి వద్ద ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు నుజ్జునుజ్జు కాగా, వాహనంలోని ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలిసిన వెంటనే చెన్నపట్టణ గ్రామీణ పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తును ప్రారంభించారు. బైక్‌ను టాటా సఫారీ ఢీ కొన్న ఘటనలో గదగ్ జిల్లా శిరహట్టిలో ఉంటున్న అజీత్ (35) తన బంధువులైన మల్లేశప్ప (55), ఫక్కీరప్ప (45)తో కలసి బైక్‌పై సొంత గ్రామమైన హళ్యాలకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం శిరహట్టి తాలూకా చిక్కసవణూరుకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న టాటా సఫారీ ఢొకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ కిందికి పడ్డారు. ఘటనలో వీరి తలలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను దగ్గరల్లోని ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే వీరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న శిరహట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని... చిక్కబళాపుర జిల్లా బాగేపల్లి పట్టణానికి చెందిన ముఫ్తియార్ బేగ్ (18), అతీఫ్ (20) బైక్‌పై వెళ్తుండగా పట్టణంలోని న్యాయస్థానం వద్దకుఅదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొన్నారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన లారీ
దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లి వద్ద ఓ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం అయింది. లారీ తాడేపల్లి గూడెం వైపు వెళ్తుండగా.. గుండుగొలను వంతెన సమీపంలోకి వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి దానిపైకి ఎక్కేసింది. లారీ ముందు భాగంలో మంటలు లేవగా.. కేబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేశారు. స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. -
ఫోన్ తెచ్చిన చేటు
-
నా దారి అడ్డదారి
ఉరుకులు పరుగులు తీసినా.. కాలంతో పందెం వేసినా.. గజిబిజిగా తిరిగినా.. ప్రతి ఒక్కరి పరుగు భద్రమైన రేపటి కోసమే. కొద్దిక్షణాల కోసం కొండంత భవితను పణంగా పెట్టడం వివేకమనిపించుకోదు. పక్క చిత్రాల్లో చూడండి. మొగల్రాజపురంలోని సీతారామపురం సిగ్నల్ నుంచి పుష్పా హోటల్ సెంటర్‌కు వెళ్లే కస్తూరి భాయిపేట రోడ్డులో డివైడర్ మధ్యలో ఖాళీ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు ఇలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. రాంగ్రూట్లో వెళ్లడం అప్పటికి బాగానే ఉన్నా.. ఏదైనా ప్రమాదం జరిగితే.. - సాక్షి, విజయవాడ -
గుంటూరుకు రాజయోగం
హైదరాబాద్ తరహాలో ఫ్లైవోవర్లపై ప్లాంటర్స్ ఏర్పాటు నగరంలోని 14 ఫౌంటెన్లకు అదనపు హంగులు డివైడర్లపై పచ్చదనం పెంచేందుకు చర్యలు ప్రతిపాదనలు సిద్ధంచేసిన జీఎంసీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని నిర్ణయించడంతో జిల్లా కేంద్రమైన గుంటూరుకు రాజయోగం పట్టనుంది. హైదరాబాద్ తరహాలో ఈ నగరాన్ని సుందరీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం నగర పాలక సంస్థ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. గుంటూరు : తుళ్లూరును రాష్ట్ర రాజధానిగా నిర్ణయించడంతో గుంటూరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా గ్రేటర్ గుంటూరు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో హైదరాబాద్ తరహాలోనే ఈ నగరాన్నీ సుందరీకరించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో నగరానికి నూతన హంగులు తీసుకొచ్చేందుకు జీఎంసీ చర్యలు వేగవంతం చేసింది. ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్.శ్రీధర్ నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు, పట్టణ ప్రణాళికాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీంతో సూపరింటెండెంట్ ఇంజినీర్ డి.మరియన్న, ఇతర అధికారులు ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. తొలుత విజయవాడ నుంచి గుంటూరుకు చేరుకునే మార్గంలో ముఖ ద్వారంగా ఉన్న ఆటోనగర్ ప్రాంతం నుంచి సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. అక్కడ డివైడర్లకు రంగులు వేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఆకర్షనీయమైన పూల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. రోడ్డుపై క్యాట్‌ఐస్ స్టిక్కర్లను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి సమయాల్లో ఆ ప్రాంతంలో వెలుగులు నిండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మణిపురం, కంకరగుంట, అరండల్‌పేట ఫ్లైఓవర్లపై హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు తరహాలో ప్లాంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఫ్లైఓవర్లకు రెండువైపులా పెద్దపెద్ద ఆకర్షణీయమైన కుండీలను ఏర్పాటు చేసి వాటిల్లో మొక్కలను పెంచనున్నారు. ఓవర్‌బ్రిడ్జి సెంట్రల్ డి వైడర్లకు రంగులు వేయడం ప్లాస్టిక్ పూలతో సుందరీకరించాలని నిర్ణయించారు. ఇందు కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన కొంత మంది కళాకారులతో కుండీల నిర్మాణం, డిజైన్లను రూపొందిస్తున్నారు. నగరంలోని 14 ఫౌంటెన్లను అభివృద్ధి చే యనున్నారు. వివిధ రంగుల విద్యుత్ వెలుగులతో ఫౌంటెన్లును తీర్చిదిద్దనున్నారు. లాడ్జిసెంటర్, నాజ్‌సెంటర్, జిన్నాటవర్ సెంటర్, ఆర్టీసీ బస్‌స్టాండ్, రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫౌంటెన్లకు మహర్దశ పట్టనుంది. నగరంలోని 11 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగర పాలకసంస్థ పరిధిలోని పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ఎనిమిది వారాల్లో నగర రూపురేఖలు మారతాయి గుంటూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ సిహెచ్.శ్రీధర్ ఆదేశాలతో సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధంచేశాం. ఎనిమిది వారాల్లో నగర రూపురేఖలను మారుస్తాం. సెంట్రల్ డివైడర్లు, ఫౌంటెన్లు, కూడళ్లును అభివృద్ధి చేస్తాం. నగరంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తాం. రాజస్థాన్ కళాకారులతో కొన్ని ప్లాంటర్స్ డిజైన్ చేయిస్తున్నాం. - డి.మరియన్న, సూపరింటెండెంట్ ఇంజినీరు -
డివైడర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం గంగరావుపాలెంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పి ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందినవారిలో ఒకే కుటుంబానికి చెందిన మహిళ సహా ఇద్దరు ఉన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
బస్సు దగ్ధం
బెంగళూరు కేఆర్‌పురం వద్ద ప్రమాదం బైక్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్న వైనం నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం కృష్ణరాజపురం : వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొంది. దీంతో చెలరేగిన మంటల్లో బస్ దగ్ధమైన సంఘటన కేఆర్ పురం ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి బెంగళూరుకు ఎస్వీటీ అనే ప్రైవేట్ బస్సు మంగళవారం బయలుదేరింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నాల్గవ జాతీయ రహదారిలోని కృష్ణరాజపురంలో ఉన్న వెంగయ్య చెరువు వద్ద వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తున్న విద్యార్థులు తమ బైక్‌ను మలుపు తిప్పే ప్రయత్నంలో బస్‌కు ఎదురుగా వెళ్లారు. ఈ సమయంలో బస్సు ఎక్కువ వేగంగా వస్తుండటంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేక డివైడర్‌కు ఢీకొట్టాడు. దీంతో బైక్ పైన ఉన్న యువకులు హరీష్ (21), హరీష్ (25), మల్లికార్జున (25), కళ్యాణ్ (20) బస్ కింద పడ్డారు. వీరి బైకు వెళ్ళి డీజిల్ ట్యాంకు తగిలింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటున్నాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోయారు. ఆ బస్సులో సుమారు 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. పోలీసులకు విషయం తెలియడంతో ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కాగా ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ హరీష్, హరీష్‌లకు నిమ్హాన్స్లో, కళ్యాణ్‌కు కేఆర్ పురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో, మల్లికార్జునకు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో మల్లికార్జున, హరీష్ పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సంఘటణ స్థలాన్ని ఎమ్మెల్యే బసవరాజు, ఆర్టీఓ అధికారులు పరిశీలించారు. ప్రమాద స్థలానికి సమీపంలోనే ప్రభుత్వాస్పత్రి, ప్రవేట్ ఆస్పత్రులు ఉన్నా.. ప్రమాదం జరిగి గంట సేపైనా ఒక్క అంబులెన్స కూడా రాకపోవడంపై బాధితులు మండిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న కృష్ణరాజపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన ఈ విద్యార్థులంతా కృష్ణరాజపురానికి చెందిన వారేనని పోలీసులు చెప్పారు. -
కారు బీభత్సం...
* మద్యం తాగి డ్రైవింగ్ * అదుపుతప్పి డివైడర్ ఎక్కిన కారు * పోలీసులపై యువకుల దాడి లంగర్‌హౌస్: తప్పతాగి ఉన్న ఇద్దరు అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించారు. అదుపుతప్పిన కారు డివైడర్‌పై నుంచి దాదాపు రెండు వందల మీటర్ల దూరం దూసుకెళ్లి తర్వాత గాలిలో ఎగిరి పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... టోలీచౌకి నదీం కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్(33), తన స్నేహితుడు ఖుద్రత్ ఖాన్‌తో కలిసి పీ అండ్ టీ కాలనీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మద్యం తాగాడు. తెల్లవారుజామున 4 గంటలకు తన ఇన్నోవా కారులో టోలీచౌకిలోని ఇంటికి బయల్దేరారు. లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. వేగంగా దూసుకెళ్లి ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టి.. గాలిలోకి లేచి 30 మీటర్ల దూరంలో పడింది. బ్రిడ్జిపై ఉన్న 8 సిమెంట్ దిమ్మెలు చెల్లాచెదురైపడగా.. కారు టైర్లు నాలుగూ పగిలిపోయాయి. ఒక టైర్ అక్కడే పాల వ్యాపారం చేస్తున్నవారిపై పడింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మత్తులో వీరంగం.... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న వారిని బయటకు దించారు. స్టేషన్‌కు రమ్మని వారిని కోరగా.. మద్యం మత్తులో ఉన్న అన్వర్, ఖుద్రత్‌లు తాము సీఎం మనుషులమని, మమ్మల్నే స్టేషన్‌కు రమ్మంటారా అంటూ పోలీసులపై దాడి చేశారు. జనం గుమిగూడటంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడని, తమ డ్రైవర్ కూడా పారిపోయాడని వారిపై కూడా వీరంగం సృష్టించారు. షెడ్డులో కారు...? లంగర్‌హౌస్ పోలీసులు, టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరగడానికి గంట ముందు వరకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి 7 కార్లు పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అయితే, మద్యం తాగి కారు నడపడమే కాకుండా డివైడర్‌పై దూసుకెళ్లిన కారును మాత్రం సీజ్ చేయనీకుండా ఆ యువకులు పోలీసులతో గొడవపడ్డారు. మరమ్మత్తుల నిమిత్తం కారును బలవంతంగా షెడ్డుకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేయకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
డైవైడర్!
దడపుట్టిస్తున్న రోడ్ డివైడర్లు పెరుగుతున్న ప్రమాదాలు మృత్యువాతపడుతున్న సిటిజన్లు నిర్మాణంలో అశాస్త్రీయతే కారణం ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్-లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన డివైడర్లు గ్రేటర్ వాసుల ప్రాణాలను హరిస్తున్నాయి. నిర్మాణంలో కొరవడిన శాస్త్రీయత.. ప్రమాణాలు పాటించక పోవడం.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కేం ద్రాలుగా మారుతున్నాయి. నగరవాసులకు డర్ పుట్టిస్తూ ప్రమాదహేతువులుగా మారుతున్నాయి. జంట కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతోపాటు శివారు మార్గాల్లో ఏర్పాటుచేసిన డివైడర్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండడంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జునుజ్జుకావడంతోపాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. వీటివల్ల ఏటా ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రి సమయాల్లో కనిపించిక ప్రాణాలను హరిస్తున్నాయి. నిర్మాణంలో తేడానే కారణం: సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పున్న రోడ్ల మధ్యలో డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ ఏర్పాటు చేయాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉన్న వీటి మధ్య ఖాళీ స్థలం ఉండడంతో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతున్నాయి. వీటివల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి. కనిపించని హెచ్చరిక సైన్‌బోర్డ్స్... ఫలాన ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్-1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్-2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు. హజార్డ్ మార్కర్స్ విషయమూ పట్టదు.. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే... ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తోపాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయింటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువ. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్తోపాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. పరిష్కారం మార్గం ఇలా.. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ‘డివైడర్ మృతుల్లో’ కొందరు... మలేషియా టౌన్షిప్ సర్కిల్లో ఎంబీఏ విద్యార్థులు దీపక్, శశాంక్ పహాడీషరీఫ్ కొత్తరోడ్డు స్విమ్మింగ్ పూల్ వద్ద కె.హరి, చిన్నారి శృతి ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.283 వద్ద ప్రింటింగ్ ప్రెస్వర్కర్ కుమార్ మల్కాజ్‌గిరిలోని ఓ మోడల్ స్కూల్ వద్ద బీటెక్ విద్యార్థి సాయికిరణ్ ఉప్పల్ నల్లచెరువు కట్టపై సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ పెద్ద షాపూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్ ఉద్యోగి లక్ష్మారెడ్డి అఫ్జల్‌గంజ్ నేషనల్ లాడ్జి వద్ద ఇంటర్ విద్యార్థి అఫ్సర్ ఆలియాబాద్ చౌరస్తా వద్ద సెంట్రింగ్ వర్కర్ విష్ణువర్ధన్ -
అతివేగానికి ఇద్దరు బలి
యడ్లపాడు అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఏడుగురిని తీవ్రగాయాల పాల్జేసింది. వేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చరై అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం యడ్లపాడు వద్ద జాతీయ రహదారి అండర్‌పాస్ వంతెనపై చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంలో చిలకలూరిపేట శారద జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద సమీప బంధువు దశదిన కర్మకు హాజరయ్యేందుకు బయలుదేరారు. మార్గంమధ్యలో ఉదయం 10.30 గంటల సమయంలో యడ్లపాడు సెంటర్లోని అండర్‌పాస్ వంతెనపైకి వచ్చేప్పటికి వేగంగా వస్తున్న వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి పక్కకు ఒరిగిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితోపాటు డ్రైవర్ కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితుల హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. వంతెనకు ఇరువైపులా ఉన్న గ్రామస్తులు పరుగున వంతెన పైకి వెళ్లేసరికి రక్తపు మడుగుల్లో కన్నీరుమున్నీరుగా రోదిస్తూ బాధితులు కనిపించారు. వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన ముగ్గురిలో కోట సాంబశివరావు (50) చికిత్సపొందుతూ మృతి చెందాడు. కూలిపనులు చేసుకునే సాంబశివరావుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వాహన డ్రైవర్ వెలిశెట్టి బాజి, పుప్పాల రోశయ్యలను ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించారు. కాటూరి మెడికల్ కళాశాల వైద్యశాలలో క్షతగాత్రులు బండి రత్తయ్య, వెలిశెట్టి వెంకటేశ్వరమ్మ చికిత్సపొందుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన వారిలో కోట శ్రీరాములు (60) చికిత్సపొందుతూ మృతిచెందగా, వెలిశెట్టి లక్ష్మి, వెలిశెట్టి అన్నపూర్ణమ్మ, సూరిశెట్టి రమాదేవి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల వద్ద బంధువుల రోదనలు.. చిలకలూరిపేట, కాటూరు మెడికల్ కళాశాల వైద్యశాల, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించిన క్షతగాత్రుల హాహాకారాలు, వారి తాలూకు బంధువుల రోదనలు ఆయా ఆస్పుత్రుల వద్ద మిన్నంటాయి. ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న బాధితుల బంధువులు ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకుని వారి పరిస్థితిని గమనించేసరికి సాయంత్రమైంది. -
కల్వర్టును ఢీకొన్న కంటైనర్
-
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఆటోనగర్, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో భర్త అక్కడికక్కడే మృ తి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం...బాలానగర్ చింతల్ ప్రాంతంలో నివాసముండే శివశంకర్ (30), జగదీశ్వరి (25) భార్యాభర్తలు. దసరా పండుగకని ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఉండే జగదీశ్వరి అమ్మమ్మ ఇంటికి ఇద్దరూ వెళ్లారు. మం గళవారం బైక్ (ఏపీ28బీబీ3556)పై నగరానికి తిరిగి వస్తుండగా..బీఎన్‌రెడ్డి నగర్ కృష్ణానీటి రిజర్వాయర్ దగ్గర బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. జగదీశ్వరికి తీవ్రగాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసులు జగదీశ్వరిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి శివశంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. గచ్చిబౌలి : బైక్ రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం... కూకట్‌పల్లికి చెందిన బి.రమేశ్(35) కూలీ. కొండాపూర్‌లో ఉండే బంధువుల ఇంటిలో మంగళవారం ఉదయం జరిగిన పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమానికి హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలకు బైక్‌పై తిరిగి వెళ్తూ కొండాపూర్‌లోని అపర్ణ అపార్ట్మెంట్ సమీపంలో ఆగివున్న ట్రక్కును ఢీ కొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోల్నాక: ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ మృతి చెం దిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. బాగ్‌అంబర్‌పేట డివిజన్ గంగాబౌలి ప్రాంతానికి చెందిన మల్లయ్య (60) కూలీ. ఈయన సోమవారం రాత్రి చే నంబర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుం డగా సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.