గాయపడిన సాగర్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
-
ఒకరు మృతి, మరో వ్యక్తికి గాయాలు
ఏన్కూరు : డివైడర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన కె.భరత్(22), అతడి బంధువు సాగర్ ఇద్దరూ కలిసి కారులో సుజాతనగర్ నుంచి కారేపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏన్కూరు సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.