డివైడర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి | Three died in road accident at West godavari district | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

Published Sun, Dec 14 2014 6:28 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Three died in road accident at West godavari district

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం గంగరావుపాలెంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పి ఓ కారు డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందినవారిలో  ఒకే కుటుంబానికి చెందిన మహిళ సహా ఇద్దరు ఉన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement