రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
Published Wed, Oct 16 2013 3:48 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ఆటోనగర్, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో భర్త అక్కడికక్కడే మృ తి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం...బాలానగర్ చింతల్ ప్రాంతంలో నివాసముండే శివశంకర్ (30), జగదీశ్వరి (25) భార్యాభర్తలు. దసరా పండుగకని ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఉండే జగదీశ్వరి అమ్మమ్మ ఇంటికి ఇద్దరూ వెళ్లారు. మం గళవారం బైక్ (ఏపీ28బీబీ3556)పై నగరానికి తిరిగి వస్తుండగా..బీఎన్‌రెడ్డి నగర్ కృష్ణానీటి రిజర్వాయర్ దగ్గర బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. జగదీశ్వరికి తీవ్రగాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసులు జగదీశ్వరిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి శివశంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.
గచ్చిబౌలి : బైక్ రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం ప్రకారం... కూకట్‌పల్లికి చెందిన బి.రమేశ్(35) కూలీ. కొండాపూర్‌లో ఉండే బంధువుల ఇంటిలో మంగళవారం ఉదయం జరిగిన పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమానికి హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలకు బైక్‌పై తిరిగి వెళ్తూ కొండాపూర్‌లోని అపర్ణ అపార్ట్‌మెంట్ సమీపంలో ఆగివున్న ట్రక్కును ఢీ కొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోల్నాక: ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ మృతి చెం దిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. బాగ్‌అంబర్‌పేట డివిజన్ గంగాబౌలి ప్రాంతానికి చెందిన మల్లయ్య (60) కూలీ. ఈయన సోమవారం రాత్రి చే నంబర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుం డగా సికింద్రాబాద్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement