పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లి వద్ద ఓ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లి వద్ద ఓ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం అయింది. లారీ తాడేపల్లి గూడెం వైపు వెళ్తుండగా.. గుండుగొలను వంతెన సమీపంలోకి వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి దానిపైకి ఎక్కేసింది. లారీ ముందు భాగంలో మంటలు లేవగా.. కేబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేశారు. స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు.