
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన లారీ ముందు భాగం
పశ్చిమగోదావరి: తణుకు మండలం తేతలి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉంగుటూరు నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చెరువుల్లో చేపలను పట్టేందుకు 11 మంది కూలీలు, డ్రైవర్‌తో కలిసి లారీలో వెళుతుండగా ముందుగా వెళుతున్న కాంక్రీటు మిక్సర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రులు ఉంగుటూరు మండలానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.