Four Died After Speeding Truck Ran Over People Sleeping On Road Divider In Delhi - Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి

Published Wed, Sep 21 2022 9:10 AM | Last Updated on Wed, Sep 21 2022 11:17 AM

Speeding Truck Ran Over People Sleeping On Road Divider In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలువ నీడలేని కొందరు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది. సీమాపురి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ట్రక్కు అతవేగంతో డివైడర్‌పై పడుకున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) బస్‌ డిపోకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులు.. కరీం(52), ఛోటే ఖాన్‌(25), షా అలాం(38), రాహు(45)లుగా గుర్తించారు. మరో ఇద్దరు మనీశ్‌(16), ప్రదీప్‌(30)లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా ట్రక్కుతో సహా పారిపోయాడు డ్రైవర్‌. నిందితుడుని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement