వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదన | Raos Study Circle Incident Live video Shared By Student | Sakshi
Sakshi News home page

వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదన

Published Sun, Jul 28 2024 10:58 AM | Last Updated on Sun, Jul 28 2024 12:13 PM

Raos Study Circle Incident Live video Shared By Student

 

సాక్షి, ఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్‌ అకాడమీ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో భవనం బేస్‌మెంట్‌లో చిక్కుకున్న ముగ్గురు అభ్యర్థులు నీటిలో చిక్కుకుని మృతిచెందారు. మృతులను తానియా సోని(25), శ్రేయా యాదవ్‌(25), నీవైన్‌ దాల్విన్‌(28)గా గుర్తించారు. వీరిలో శ్రేయా యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌, నవీన్‌ దాల్విన్‌ కేరళకు చెందిన వ్యక్తి కాగా... తన్యా సోనీ తెలంగాణకు చెందిన యువతి. ఇక, ఘటనలో అకాడమీ  యాజమన్యం, పోలీసుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై ఓ అభ్యర్థి(ప్రత్యక్ష సాక్షి) ట్విట్టర్‌ వేదికగా ప్రమాద సమయంలో ఏం జరిగిందో వీడియోను పోస్టు  చేశారు. ఈ సందర్భంగా అతను.. కేవలం పది నిమిషాల్లోనే బేస్‌మెంట్‌లో మొత్తం వరద నీటితో నిండిపోయింది. సాయంత్రం 6:40 గంటలకు మేము పోలీసులకు సమాచారం అందించాం. కానీ, పోలీసులు మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చారు. ఈ కారణంగానే ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. పోలీసులు సకాలంలో అక్కడికి వచ్చి ఉంటే వారే ప్రాణాలతో బయటపడేవారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరోవైపు.. రావు ఐఏఎస్‌ అకాడమీ వద్ద విద్యార్థులు ధర్నాకు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటనకు కారణంగా ఆప్‌ సర్కార్‌దా? లేక ఢిల్లీ పోలీసులదా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వరద నీటిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్స్‌ ఉన్నాయి. వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. ఇలా భద్రత లేకుండా కోచింట్‌ సెంటర్స్‌ నిర్వహించడంపై వారు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement