Water logging area
-
వీడియో: ఢిల్లీ ప్రమాదం ఇలా జరిగింది.. అభ్యర్థి ఆవేదన
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో భవనం బేస్మెంట్లో చిక్కుకున్న ముగ్గురు అభ్యర్థులు నీటిలో చిక్కుకుని మృతిచెందారు. మృతులను తానియా సోని(25), శ్రేయా యాదవ్(25), నీవైన్ దాల్విన్(28)గా గుర్తించారు. వీరిలో శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్, నవీన్ దాల్విన్ కేరళకు చెందిన వ్యక్తి కాగా... తన్యా సోనీ తెలంగాణకు చెందిన యువతి. ఇక, ఘటనలో అకాడమీ యాజమన్యం, పోలీసుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ ఘటనపై ఓ అభ్యర్థి(ప్రత్యక్ష సాక్షి) ట్విట్టర్ వేదికగా ప్రమాద సమయంలో ఏం జరిగిందో వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా అతను.. కేవలం పది నిమిషాల్లోనే బేస్మెంట్లో మొత్తం వరద నీటితో నిండిపోయింది. సాయంత్రం 6:40 గంటలకు మేము పోలీసులకు సమాచారం అందించాం. కానీ, పోలీసులు మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చారు. ఈ కారణంగానే ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. పోలీసులు సకాలంలో అక్కడికి వచ్చి ఉంటే వారే ప్రాణాలతో బయటపడేవారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. I'm one of survivor of this horrible incident, within 10 min basement was filled it was 6.40 we called police and ndma's but they reach after 9 PM till then my 3 #UPSCaspirants mates lost their lives 😭 3 are hospitalized pray for them🙏who cares our life😭#RajenderNagar#upsc pic.twitter.com/hgogun1ehF— Hirdesh Chauhan🇮🇳 (@Hirdesh79842767) July 28, 2024మరోవైపు.. రావు ఐఏఎస్ అకాడమీ వద్ద విద్యార్థులు ధర్నాకు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటనకు కారణంగా ఆప్ సర్కార్‌దా? లేక ఢిల్లీ పోలీసులదా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వరద నీటిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. ఇలా భద్రత లేకుండా కోచింట్ సెంటర్స్ నిర్వహించడంపై వారు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. #WATCH | Old Rajender Nagar incident | Delhi: Outside visuals from the IAS coaching centre in Old Rajender Nagar where three students lost their lives after the basement was filled with water yesterday. pic.twitter.com/kJFpdg4xmm— ANI (@ANI) July 28, 2024Heartbreaking situation in Delhi's Karol Bagh one IAS aspirant confirmed dead and two others still missing after basement flooding at an IAS coaching centre due to intense rainfall Thoughts and prayers are with the victims and their families 😭 #DelhiFloods #KarolBagh #IAS #UPSC pic.twitter.com/n7gMElVaem— BLACKWOLF (@wohkhahai) July 27, 2024 -
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రానున్న రెండు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్నటి కుండపోత నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. ఈలోపు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు. మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. Moderate - Heavy downpours expected today in North, Central, East Telangana today and light - moderate rains ahead in South Telangana Moderate rains expected in Hyderabad city today but yesterday type huge rains not expected — Telangana Weatherman (@balaji25_t) September 6, 2023 జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు సికింద్రాబాద్ జోన్లో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం పరిశీలించారు. నీరు వెంటనే తొలగించాలని, మ్యాన్ హోల్స్ వద్ద మట్టి, చెత్తచెదారాన్ని వెంటవెంటనే తీసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. మయూర మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, యస్ పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లాగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్ సత్య నగర్ లలో నాలాలను సైతం ఆయన పరిశీలించారు. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్‌లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్‌పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
హ్యాపీ జర్నీ
⇒అరచేతిలోనే పార్కింగ్ ప్రాంతాలు.. ⇒నీరు నిలిచే ఏరియాలు సైతం ప్రత్యక్షం ⇒‘ట్రాఫిక్ లైవ్’కు కొత్త హంగులు ⇒వారం రోజుల్లో అందుబాటులోకి.. సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమేష్ షాపింగ్ కోసం తన కారులో బేగంబజార్‌కు వచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో వాహనం ఎక్కడ పార్క్ చేయాలో.. ఫ్రీ పార్కింగ్ ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. వర్షం వచ్చిందంటే నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తాయి. కీలక రోడ్డులో ఉన్న నీరు నిలిచే ప్రాంతాలు (వాటర్ లాగింగ్ ఏరియా) ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతాయి. అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందికి గురవడం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ సమస్యలకు నగర ఐటీ సెల్ పరిష్కారం చూపిస్తోంది. ఇప్పటికే సిటిజన్ ఫ్రెండ్లీ విధానాల్లో భాగంగా ట్రాఫిక్ విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’ యాప్‌లో ప్రత్యేక విభాగాలకు పొందుపరుస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ అదనపు హంగులు మరో వారం రోజుల్లో సెల్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పార్కింగ్.. నో పార్కింగ్.. నగరంలోని అన్ని రహదారులు, ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని అక్కడి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ఈ విభాగాలను రూపొందించారు. హై ఎండ్ ఫోన్ ఉన్న వాహన చోదకుడుకు ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు తన వాహనాన్ని ఎక్కడ నిలుపుకోవాలో తెలుసుకోవాలంటే ‘లైవ్’ యాప్‌లోకి వెళ్తే చాలు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ పరిజ్ఞానం.. సదరు వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు సమీపంలో ఉన్న ‘పెయిడ్, ఫ్రీ పార్కింగ్’ వివరాలు అందిస్తుంది. దీంతో పాటు అవి ద్విచక్ర వాహనాల కోసమా? తేలికపాటి వాహనాల కోసమా? వాటి కెపాసిటీ ఎంత? తదితర వివరాలను మార్కింగ్, పాప్అప్స్ రూపంలో అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న నో పార్కింగ్ ఏరియాలను స్పష్టంగా చూపిస్తుంది. దీనిద్వారా వాహనదారులు ‘పోలీస్ చలాన్’కు, ‘టోవింగ్స్’కు గురయ్యే అవకాశం తప్పుతుంది. ‘వాటర్ లాగింగ్’ ఏరియాలూ.. వర్షాకాలంతో పాటు ఓ మాదిరి వర్షానికీ నగరంలోని అనేక రహదారులపై నీరు నిలవడం పరిపాటి. ఇలాంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో.. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహన చోదకులకు తెలియదు. దీంతో సదరు వ్యక్తి ఆయా ప్రాంతాలకు వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటారు. దీనికి పరిష్కారంగా ఈ యాప్‌లో నగర వ్యాప్తంగా ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా మార్కింగ్ చేశారు. గడిచిన కొన్నేళ్ల పరిస్థితుల్ని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. తద్వారా వాహనదారుడు వర్షం కురిసినప్పుడు తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలనూ ఎంచుకోవడానికి యాప్‌లోని ‘వాటర్ లాగింగ్’ ఏరియాల సమాచారం ఉపకరిస్తుంది. పాదచారులకు ఉపయుక్తంగా.. ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ ప్రత్యేక విభాగంలో కేవలం వాహన చోదకులకే కాక.. పాదచారులు, సాధారణ ప్రయాణికులకు ఉపయుక్తమైన సమాచారం పొందుపరుస్తున్నారు.నగరంలోని తూర్పు మండలంలో నివసించే వ్యక్తికి దక్షిణ మండలంలో బస్టాప్స్ ఎక్కడ ఉన్నాయో, ఆటో స్టాండ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కాదు. పద్మవ్యూహాన్ని తలపించే రోడ్లపై పలువురిని పదేపదే అడిగితే తప్ప ఈ ‘గమ్యం’ చేరుకోలేరు. సామాన్యులకు ఈ సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో ఐటీ సెల్ ఈ విభాగంలో ప్రాంతాల వారీగా బస్టాండ్లు, ఆటో స్టాండ్ల వివరాలు మార్కింగ్ చేసింది.కొత్త ప్రాంతానికి వెళ్లిన వ్యక్తి ఈ యాప్ ద్వారా దారి చూసుకుంటూ అవసరమైన చోటుకు చేరుకోవచ్చు.