ఢిల్లీ: ఢిల్లీలోని రాజేంద్రనగర్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భద్రత నిబంధనలపై తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని మండిపడింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్‌లైన్‌లోకి మారాలని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవల్సిన భద్రత చర్యలపై ఎన్సీఆర్ వివరణ కోరింది.
ఇటీవల ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. విమర్శలు చెలరేగడంతో.. అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. సెల్లార్లలో, అలాగే నిబంధనలను అతిక్రమించిన కోచింగ్ సెంటర్లకు సీజ్ వేసింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు సైతం అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అధికార యత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment