coaching centres
-
Supreme Court: మృత్యుకుహరాలా..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ కేంద్రాలు డెత్ ఛాంబర్లుగా తయారయ్యాయని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోచింగ్ కేంద్రాలు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని వ్యాఖ్యానించింది. రావూస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఉదంతంపై సూమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీచేసింది. ‘‘ మేం చదివే అంశాలు భయంకరంగా ఉన్నాయి. వాస్తవానికైతే ఇలాంటి కోచింగ్ కేంద్రాలను మనం వెంటనే మూసేయించాలి. కానీ ప్రస్తుతానికి కోచింగ్ ఆపకూడదనే ఉద్దేశంతో వీటిని కేవలం ఆన్లైన్లో అయినా కొనసాగించాలి. భవన నిర్మాణ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి కోచింగ్ సెంటర్లు డెత్ చాంబర్లుగా మారాయి. పోటీపరీక్షల ఆశావహుల ఆశలు, జీవితాలతో కోచింగ్కేంద్రాలు ఆటలాడుతున్నాయి. ఎన్నో కలలతో దేశరాజధానికొచ్చిన వారికి తమ కలల సాకారం ఎంతో కష్టమవుతోంది. ముగ్గురు అభ్యర్థుల మరణం నిజంగా మనందరికీ కనువిప్పు కల్గించే ఘటన. అసలు కోచింగ్ సెంటర్లలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు? వాటిని ఏ మేరకు అమలుచేస్తున్నారో మాకు వివరణ ఇవ్వండి’’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. -
కోచింగ్ సెంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీలోని రాజేంద్రనగర్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భద్రత నిబంధనలపై తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లు మృత్యు కుహరాలుగా మారాయని మండిపడింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్‌లైన్‌లోకి మారాలని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవల్సిన భద్రత చర్యలపై ఎన్సీఆర్ వివరణ కోరింది. ఇటీవల ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. విమర్శలు చెలరేగడంతో.. అప్రమత్తమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. సెల్లార్లలో, అలాగే నిబంధనలను అతిక్రమించిన కోచింగ్ సెంటర్లకు సీజ్ వేసింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు సైతం అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అధికార యత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ
ఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకవచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ..బిల్డింగ్ బేస్మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాజేంద్రనగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్‌లో ఉన్న బేస్మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్ సెటర్లను సీజ్ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం. ఈ ఘటనలో మున్సిపల్ అధికారులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్ ఉన్న రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే. -
రెండు ఆత్మహత్యలు.. మేమిక్కడ ఎందుకు ఉండాలి?
ఇక్కడ రెండు ఆత్మహత్యలు జరిగాయి. మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? - ఓ విద్యార్థి వెలిబుచ్చిన ఆవేదన ఇది. రాజస్థాన్‌లో కోట నగరంలో నీట్ కోసం కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఈ ప్రశ్న ఎందుకో సంధించాడో తెలుసా? పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక తాను ఉండే వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతూ అతడు అడిగిన ప్రశ్న ఇది. కోట నగరంలో తాజాగా ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటంతో విద్యార్థి లోకం వణికిపోతోంది. ర్యాంకుల సాధనే లక్ష్యంగా కోచింగ్ సెంటర్లు సాగిస్తున్న శిక్షణ పర్వంలో విద్యార్థులు సమిధలవుతున్న ఘటనలు నిత్యకృత్యం మారాయి. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య కోట నగరంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు బిహార్‌కు చెందిన వారు కాగా, మరొకరది మధ్యప్రదేశ్. మృతులను అంకుష్ ఆనంద్ (18), ఉజ్వల్ కుమార్ (17), ప్రణవ్ వర్మ (17)గా గుర్తించారు. అంకుష్, ఉజ్వల్ బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. సుపాల్ జిల్లా వాసి అయిన అంకుష్.. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గయా జిల్లాకు చెందిన ఉజ్వల్.. జేఈఈ కోసం సిద్ధమవుతున్నాడు. కోట నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తల్వాండి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున వీరిద్దరూ తమ తమ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ప్రణవ్ వర్మ (17) అనే నీట్ శిక్షణ కోసం కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం అర్థరాత్రి విషం తీసుకుని అపస్మారక స్థితిలో పడివున్న ప్రణవ్ను ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఒత్తిడే చిత్తు చేసిందా? బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులు రెండేళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. అంకుష్, ఉజ్వల్ ఒకే సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారని జవహర్ నగర్ డీఎస్పీ అమర్ సింగ్ తెలిపారు. వీరిద్దరూ కొంత కాలంలోగా క్లాసులకు సరిగా హాజరుకావడం లేదని, దీంతో చదువుల్లో వెనుకబడి ఒత్తిడికి గురయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే వారి గదుల్లో ఎలాంటి సూసైడ్ నోట్స్ లభించలేదని చెప్పారు. ఉజ్వల్ సోదరి కూడా ఇదే ప్రాంతంలో బాలికల హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోందని వెల్లడించారు. కాగా, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీట్, జేఈఈ కోచింగ్‌కు ప్రసిద్ధి గాంచిన కోట నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అత్యంత ఎక్కువ పోటీ ఉండే నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకే లక్ష్యంగా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు కోట నగరానికి వస్తుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరిన తర్వాత విద్యార్థులకు కఠినమైన షెడ్యూల్ మొదలవుతుంది. రోజుకు దాదాపు 15 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక గంట ఎక్కువసేపు నిద్రపోయినా విద్యార్థులు అపరాధ భావంతో కుమిలిపోయేలా కోచింగ్ సెంటర్ల వ్యవహార శైలి ఉంటుందట. అంతేకాదు గాలి- వెలుతురు సరిగా లేని ఇరుకు హాస్టల్స్, పెయింగ్ గెస్ట్ వసతి గృహాల్లో చదువుకోవాల్సి రావడం కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. కంటితుడుపు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసిన హాట్‌లైన్ కూడా ఆత్మహత్యలను నిరోధించలేకపోతోంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, మూడో నెలలకొసారి పేరెంట్-టీచర్ మీటింగ్.. ఆదివారం తప్పనిసరి సెలవు, సోమవారం ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని అధికార యంత్రాంగం విధించిన నిబంధనలు కాగితాలకే పరిమితం అయ్యాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కోచింగ్ సెంటర్ల నియంత్రణకు శాసన ముసాయిదాను సిద్ధం చేయడానికి 2016లో రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఏం చేసిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కోచింగ్‌కు కేరాఫ్ కోట మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల శిక్షణకు కోట నగరం ప్రసిద్ధి చెందింది. ఎయిమ్స్, నీట్, జిప్మర్, జేఈఈ, జేఈఈ మెయిన్స్ శిక్షణ ఇచ్చేందుకు 300పైగా కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. తమ కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కానీ వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తుంటారు. మిగతా వారు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఒత్తిడికి గురయ్యే వారిలో కొంతమంది శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. వరుస బలవర్మణాలతో విద్యార్థుల ఆత్మహత్యల కేంద్రంగా కోట సిటీ అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. -
కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక సంస్థల చర్యలు వేగవంతమవడంతో అభ్యర్థులు సైతం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒకదఫా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మరోసారి స్వల్పకాలిక శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల బీసీ స్టడీ సర్కిల్ అధికారులతో ఉచిత కోచింగ్‌పై పలు రకాల సూచనలు చేశారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. జిల్లాలవారీగా స్టడీ సెంటర్లు బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. బీసీ సంక్షేమ వసతిగృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో అనువైన భవనాల లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. త్వరలో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4తోపాటు గురుకుల కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఆ యా కేటగిరీల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లా కేంద్రాల్లోనే శిక్షణలు ఇచ్చేవిధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులను అతిత్వరలో నిర్వహించాలని బీసీ స్టడీ సర్కిల్ భావిస్తోంది. వారంరోజుల్లోగా కోచింగ్‌కు సంబంధించి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. -
కొలువు కొట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లయితే కిక్కిరిసి పోయాయి. కొందరు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్, సిటీ లైబ్రరీలతో పాటు రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన బోధనా సిబ్బంది లేరని, హాస్టల్ గదుల్లో కనీస సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. అయినా సరే.. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనుండటంతో, ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే..: గ్రూప్స్‌తో సహా దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు హైదరాబాద్‌లో మకాం వేశారు. కొంతమంది హాస్టళ్ళల్లో, ఇంకొంతమంది చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలో ఉండి సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్న కొందరు అభ్యర్థులు పనిలో పనిగా గ్రూప్–1పై దృష్టి పెట్టారు. ఓ కోచింగ్ సెంటర్ అంచనా ప్రకారం గడచిన రెండు నెలల్లోనే దాదాపు 30 వేల మంది హైదరాబాద్‌కు కోచింగ్ కోసం వచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వెలువరిస్తే ఈ సంఖ్య రెట్టింపును మించిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో శిక్షణ పొందేవారు వీరికి అదనం. ఇదే చివరి అవకాశం! ఎప్పుడో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసే వాళ్ళు వాటిని మానేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వాళ్ళయితే సమయాన్ని ఏమాత్రం వృధా చేయడం లేదని ఓ కోచింగ్ సెంటర్లో మేథ్స్ బోధిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్ సత్య ప్రకాశ్ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశిస్తున్న కొందరు నిరుద్యోగులు తిండి, నిద్రను కూడా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అభ్యర్థులకు వల హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా భావిస్తున్నారు. ఊళ్ళల్లో అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన కోచింగ్ సెంటర్లు హంగులు, ఆర్భాటాలు, ప్రచారంతో అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు వెయ్యికి పైగా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నట్టు అంచనా. ఇందులో పేరెన్నికగల సెంటర్లు దాదాపు 50 వరకూ ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా హాస్టల్, అభ్యర్థులకు నెట్ సదుపాయం అందిస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీని ముందే ఏర్పాటు చేసుకున్నాయి. మిగతా కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకుని అభ్యర్థులకు వల వేస్తున్నాయి. అభ్యర్థిని ఎలాగైనా ఒప్పించి, ఎంతో కొంత ఫీజు ముందే చెల్లించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యాకల్టీ, వసతులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం తప్ప గత్యంతరం ఉండటం లేదు. ప్రభుత్వ ప్రకటనకు ముందు తమ కోచింగ్ సెంటర్‌కు 300 మంది మాత్రమే వచ్చే వారని, ఇప్పుడు వెయ్యి మంది వస్తున్నారని ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లలో గది సామరŠాధ్యనికి మించి అభ్యర్థులను కూర్చోబెడుతున్నారు. గాలి వెలుతురు లేని గదుల్లో నరకం చూస్తున్నామని, అయినా కోచింగ్ కోసం తప్పడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. అదును చూసి దండుకుంటున్నారు..! గత రెండు నెలలుగా కోచింగ్ కేంద్రాల్లో ఫీజులు పెరిగిపోయాయి. గ్రూప్–1కు కోచింగ్ తీసుకునే వారికి గతంలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉండేది. ఇప్పుడు రూ. 60 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారని అభ్యర్థుల ద్వారా తెలిసింది. ఇతర గ్రూప్స్ కోచింగ్, ఉద్యోగాల శిక్షణకు రూ.40 నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. గ్రూప్–1కు ఆరు నెలలు, ఇతర పరీక్షలకు కనీసం 4 నెలలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కేంద్రాలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్థుల్లో లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లలో సరైన శిక్షణ అందడం లేదు. నిర్వాహకుల బంధువులు మిత్రులతో గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తున్నారని, లోపాలు సరిదిద్దే ప్రక్రియ సరిగా సాగడం లేదని అభ్యర్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కోచింగ్‌కు పంపారు నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్ వచ్చా. ఎంక్వైరీ చేస్తే కోచింగ్ ఫీజు రూ.50 వేలు అన్నారు. హాస్టల్‌కు అదనంగా నెలకు రూ.6 వేలు. అయినా సరే వ్యవసాయం చేసే మా నాన్న అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు. కోచింగ్ సెంటర్లో చేరి కష్టపడుతున్నా. అక్కడ భోజనం సరిపడక బయట తినాల్సి వస్తోంది. అదనంగా నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. గ్రూప్స్ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా. – జునుగారి రమేష్, ముంజంపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ డబ్బుల్లేక సొంతంగానే చదువు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కోచింగ్ తీసుకుంటే తప్ప గ్రూప్స్‌లో పోటీ పడలేమని చాలామంది చెప్పారు. కాస్త పేరున్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి అడిగితే రూ.70 వేల వరకూ అడిగారు. అప్పు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్న కోచింగ్ సెంటర్లలో చేరినా లాభం ఉండదని స్నేహితులు చెప్పారు. దీంతో ఓయూ హాస్టల్లోనే ఉంటూ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎక్కువ గంటలు కష్టపడుతున్నా. –మేడబోయిన మమత, ఇస్కిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా తాకిడి బాగా పెరిగింది ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత కోచింగ్ తీసుకునే అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయింది. మేలో ఇది గణనీయంగా పెరిగే వీలుంది. అయితే నగరంలోని కొన్ని కోచింగ్ సెంటర్లు మాత్రమే అభ్యర్థులకు ఆశించిన విధంగా శిక్షణ ఇస్తున్నాయి. కొందరు అభ్యర్థులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం. మా దగ్గరకొచ్చే అభ్యర్థులకు ప్రతిరోజూ నిర్విరామంగా శిక్షణ ఇచ్చేందుకు మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు మెరుగైన రీతిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – కృష్ణప్రదీప్ (నిర్వాహకుడు, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ) -
రోజుకు పది గంటలు చదివితే ఉద్యోగం ఖాయం
వరంగల్: యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. వరంగల్ కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది సెంటర్లలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్‌కు చెందిన నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్ ఇచ్చా మని, ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువత శిక్షణ కాలం అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేం దర్, శ్రీనివాస్, రవికుమార్, రమేశ్, పీజేఆర్ కో చింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్లాట్ ఫామ్ మీది సదువులు!.. కలెక్టర్ చెప్పిన కథ ఇది
వనరులు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం. పైపెచ్చు ‘సొసైటీ మనకేం ఇచ్చింద’ని భారీ డైలాగులు సంధిస్తూ నిందిస్తుంటాం. కానీ, అవసరం మనిషికి ఎంతదాకా అయినా తీసుకుపోతుంది కదా!. పేదరికానికి తోడు అక్కడి పరిస్థితులు.. యువతను రైల్వే స్టేషన్ బాట పట్టించాయి. కొన్నేళ్లుగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న రైల్వే ప్లాట్ ఫామ్స్ కథ మీలో ఎంతమందికి తెలుసు?.. అదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అనగనగనగా.. బిహార్‌లోని సాసారాం రైల్వే జంక్షన్. రోజు పొద్దుపొద్దునే.. సాయంత్రం పూట వందల మంది యువతీయువకులు ఇక్కడి రైల్వేస్టేషన్‌కు క్యూ కడుతుంటారు. 1, 2 రైల్వే ప్లాట్‌ఫామ్స్ మీద వాళ్ల హడావిడితో కోలాహలం నెలకొంటుంది కాసేపు. అలాగని వాళ్లు ప్రయాణాల కోసం రావట్లేదు. కాసేపటికే అంతా గప్ చుప్. బిజీగా చదువులో మునిగిపోతారు వాళ్లు. వీళ్లలో బ్యాంకింగ్స్ పరీక్షలకు కొందరు, స్టేట్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు మరికొందరు, సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇంకొందరు సిద్ధమవుతూ కనిపిస్తుంటారు. కొందరి కష్టానికి అదృష్టం తోడై జాబ్‌లు కొడుతుండగా.. సీనియర్ల నుంచి విలువైన సలహాలు అందుకునేందుకు వచ్చే జూనియర్ల సంఖ్య పోనుపోనూ పెరుగుతూ వస్తోంది. కరెంట్ సమస్యే.. రోహతాస్ జిల్లాలో పేదరికం ఎక్కువ. మూడు పూటల తిండే దొరకడం కష్టమంటే.. పిల్లల్ని కోచింగ్‌లకు పంపించే స్తోమత తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తది?. పైగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అది. చాలా గ్రామాలకు కరెంట్ సదుపాయం లేదు. అదే సాసారాం రైల్వే స్టేషన్లో 24/7 కరెంట్ ఉంటుంది. ఈ ఒక్కకారణం వల్లే చుట్టుపక్కల ఉన్న ఊళ్లలోని యువత అంతా అక్కడికి వస్తోంది. 2002-03లో ఐదారుగురు ఫ్రెండ్స్‌తో మొదలైన బ్యాచ్.. ఇప్పుడు వందల మందితో కొనసాగుతోంది. ప్లాట్‌ఫామ్ లైట్ల వెలుతురులో చదివి తమ నసీబ్ మార్చేసుకోవాలని ప్రయత్నిస్తోంది అక్కడి యువత. విలువైన సలహాలు కొందరైతే ఇంటికి కూడా వెళ్లకుండా చదువుల్లో మునిగిపోతున్నారు. అంతేకాదు వాళ్లలో వాళ్లే పాఠాలు చెప్తూ కనిపిస్తుంటారు అక్కడ. ఇదే ప్లాట్‌ఫామ్ మీద చదివి సక్సెస్ కొట్టిన వాళ్లు సైతం సలహాలు అందించేందుకు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ఆసక్తిని గమనించే ఇక్కడి అధికారులు సైతం అడ్డుచెప్పడం లేదు. పైగా ఐదు వందల ఐడీకార్డులు సైతం జారీ చేసి వాళ్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా కోచింగ్ సెంటర్‌గా నడుస్తున్న.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాసారాం రైల్వే స్టేషన్ కథ. - ఐఏఎస్ అవానిష్ శరణ్ ఛత్తీస్‌గఢ్ కేడర్, 2009 బ్యాచ్ (ట్విటర్ సౌజన్యంతో..) For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a coaching class for young people who are aspirants for the Civil Services. Excellent Initiative.👍👏 Courtesy: Anuradha Prasad ILSS. pic.twitter.com/pLMkEn4AOF — Awanish Sharan (@AwanishSharan) October 2, 2021 చూడండి: ఏటీఎం నుంచి డబ్బులు రాగానే యువతి ఏం చేసిందంటే.. -
పెగాసస్‌తో నిఘా పెట్టడం ఎలా?.. జనాల ఆసక్తి !
కోలికోడ్ (కేరళ): ఓవైపు పెగాసస్ స్పై వేర్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇతరుల ఫోన్లపై నిఘా వేయాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆన్లైన్లో, యాప్‌స్టోర్‌లో పెగసెస్ అని కనిపిస్తే చాలు డౌన్‌లోన్ చేసేస్తున్నారు. ఇతరుల ఫోన్లు, వారి ఆంతరంగిక విషయాల్లో తలదూర్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. స్టడీ మెటీరియల్ యాప్ కేరళలోని కోజికోడ్‌లో పెగాసస్ పేరుతో ఓ కోచింగ్ సెంటర్ ఉంది. దీని నిర్వాహకులు కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం చాన్నాళ్ల కిందట పెగసెస్ అనే పేరుతో ఓ ఆన్లైన్ యాప్‌ని రూపొందించారు. ఉద్యోగార్థులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు. అయితే గత నాలుగు రోజులుగా ఈ పెగసెస్ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు వారానికి వెయ్యి డౌన్లోడ్లు ఉంటే పెగసెస్ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే వేల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కేరళలోనే కాదు సౌత్, నార్త్ తేడా లేకుండా ఇండియా అంతటా ఈ యాప్‌ని డౌన్లోడ్ పెరిగిపోయింది. నిఘా ఎలా ? పెగాసస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నదే ఆలస్యం... వెంటనే తమ టార్గెట్ వ్యక్తుల ఫోన్లపై ఎలా నిఘా వేయాలా అని డౌన్లోడ్ చేసుకున్న వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ యాప్‌లో కేవలం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా యాప్ రూపొందించిన కోచింగ్ సెంటర్ నిర్వహకులకే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు డౌన్‌లోడర్లు. పెగాసెస్ యాప్‌ను ఎలా మేనేజ్ చేయాలో... ఎలా నిఘా వేయాలో చెప్పాలంటూ ఒకరి తర్వాత ఒకరుగా కోచింగ్ సెంటర్లకు ఫోన్ల పరంపర పెరిగిపోయింది. సంబంధం లేదు దేశం నలుమూలల నుంచి ఒక్కసారిగా ఫోన్లు పెరిగిపోవడంతో... అందరికీ సమాధానం చెప్పలేక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చారు. ఇజ్రాయిల్ స్పై వేర్ పెగాసస్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని, తమది కేవలం ఎగ్జామ్ మెటీరియల్ యాప్ మాత్రమే నంటూ వివరణ ఇచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. పెగసెస్ పేరు, యాప్ లోగోగా రెక్కల గుర్రం ఉండటంతో చాలా మంది తమది స్పై వేర్‌గా పొరపడినట్టు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వాల మధ్యనే టార్గెట్ పర్సన్ ఫోన్లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి.. నిఘా ఉంచే సాఫ్ట్వేర్ పెగాసస్. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఈ సాఫ్ట్వేర్ లావాదేవీలు సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి తప్పితే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఈ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఇవ్వలేదు. అయినా పెగాసస్‌తో ఇతరుల ఫోన్‌పై నిఘా వేయోచ్చు అనే ఒకే ఒక్క కారణంతో నెట్లో పెగాసెస్ గురించి మన వాళ్లు వెతికేస్తున్నారు. పెగాసెస్ పేరు కనిపిస్తే చాలు డౌన్లోడ్ చేసేస్తున్నారు. -
సివిల్స్ కోచింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా అశోక్ నగర్
-
నారాయణా.. అనుమతి ఉందా!
కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నామ మాత్రపు తనిఖీలు.. జిల్లాలో ఇంటర్మీడియట్ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సాలబాయి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ►రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ►ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్ 22న ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ సాలబాయి సూచించారు. -
కోచింగ్ బోర్డులను తక్షణమే తొలగించాలి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో కోచింగ్ బోర్డులను ఈ నెలాఖరు కల్లా తొలగించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవో గుంటుక రమణారావు స్పష్టం చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన వీటి విధి విధానాలపై వివరించారు. కళాశాల నేమ్ బోర్డుపై కేవలం కళాశాల పేరు, అనుమతి ఉన్న గ్రూపులు, విద్యార్థుల సంఖ్యను మాత్రమే ఉండాలి, నేమ్ బోర్డు తెలుపు రంగులోనూ, నీలం రంగులో అక్షరాలు ఉండాలని సూచించారు. పాత బొర్డులను తొలగించకపోతే మొదటి అపరాధ రుసుంగా రూ.10 వేలు, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయమై ఇటీవలి ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆదేశించినట్టు పేర్కొన్నారు. మార్కులు, గ్రేడింగ్ ప్రచారం చేస్తే చర్యలు ఇంటర్మీడియెట్ మార్కులు, గ్రేడింగులు ప్రచా రం చేస్తే చర్యలు తప్పవని ఆర్ఐవో తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు రూ.4,470 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలన్నారు. కళాశాలల్లో హాస్టళ్లు నిర్వహిస్తే అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇంటర్æ విద్యార్థులకు బోర్డు నిర్దేశించిన పరీక్ష ఫీజులు మాత్రమే వ సూలు చేయాలని, అదనంగా వసూలు చేస్తే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కోచింగ్ సెంటర్ల నిలువు దోపిడీ
ఒకే గదిలో వందల మంది. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. కనీసం ఫ్యాన్ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉడికిపోవాల్సిందే. మరుగుదొడ్డి బాధలు అన్నీఇన్నీ కావు. ఫీజులు మాత్రం రూ.వేలల్లో బాదేస్తారు. జిల్లాలోని కోచింగ్ సెంటర్ల తీరిది. ఉద్యోగంపై ఆశతో వందలాది మంది అక్కడే ‘శిక్ష’ణ పొందుతున్నారు. నెలరోజులు ఓర్చుకుంటే భవిష్యత్ బాగుంటుందని బాధలన్నీ భరిస్తున్నారు. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. – అనంతపురం ఎడ్యుకేషన్ ► నగరంలోని ఆర్ఎఫ్ రోడ్డులో నిర్వహిస్తున్న సాయిగంగ కోచింగ్ సెంటర్. ఓ ప్రయివేట్ ఆసుపత్రిపైన నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లో అభ్యర్థుల అవస్థలు చెప్పుకుంటే తీరేవికావు. ► రఘువీరా టవర్స్‌లో నిర్వహిస్తున్న ప్రగతి కోచింగ్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా అభ్యర్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ► గుల్జార్‌పేటలోని ఓ రేకులషెడ్‌లో నిర్వహిస్తున్న శ్రీధర్ కోచింగ్ సెంటర్లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ వందలాది మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ షెడ్లో మగ్గిపోతున్నారు. ► ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులు అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం గమనార్హం. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పలు నోటిఫికేషన్లు...కోచింగ్ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. దీంతో ఏ కోచింగ్ సెంటర్లో చూసినా అభ్యర్థులతో కిటకిటలాడుతున్నారు. ఇదే అదునుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 8,545 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5) పోస్టులు 571, ఏఎన్ఎం/మల్టీపర్సస్ పోస్టులు 1,041, హెల్త్ అసిస్టెంట్ వీఆర్ఓ (గ్రేడ్–2) 384, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు 19, పశుసంరక్షణ అసిస్టెంట్ పోస్టులు 805, ఉద్యానశాఖలో అసిస్టెంట్లు 483, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ పోస్టులు 282, మహిళా పోలీస్ పోస్టులు 1,217, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 159, డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ(సెక్రటరీ గ్రేడ్–6) పోస్టులు 896, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 896, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పోస్టులు 896, విలేజ్ సర్వేయర్ పోస్టులు 896 భర్తీ చేయనున్నారు. కిక్కిరిసిన కోచింగ్ సెంటర్లు : ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. నెలరోజులు మాత్రమే గడువు ఉండటంతో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇదే అదనుగా జాబ్ గ్యారెంటీ పేరుతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్భా ట ప్రచారాలు చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేశ శిక్షణ ఇప్పిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. నెల రోజుల శిక్షణకు రూ.8 వేల దాకా ఫీజు ఫిక్స్ చేశారు. హాస్టల్ వసతి కావాలంటే మరో రూ.3,500 అదనంగా వసూలు చేస్తున్నారు. అధికారుల నియంత్రణ కరువు : ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై అధికారులకు నియంత్రణ లేదు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లను ఏ అధికారీ పర్యవేక్షించరు. ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. ఇదే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నోరు మెదపకపోవడంతో ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. పైగా కనీస సౌకర్యాలు కల్పించడం లేగు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని, కనీస సదుపాయాలు కల్పించేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. చుక్కల చిక్కులు తీరుస్తాం అనంతపురం అర్బన్: చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన ఫైళ్లన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామంటూ అవినీతి పాల్పడిన సిబ్బందిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ‘‘ రైతులకు చుక్కలు’’ శీర్షిక ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. చుక్కల భూములకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వారం రోజుల్లో ఫైళ్లన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ రైతులను వేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. విచారణ చేయించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైళ్ల పరిష్కారంలో ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే రైతులు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
కోచింగ్ తీసుకుని జడ్జి అయిపోవచ్చా!
సాక్షి, అమరావతి: ‘న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వారు న్యాయవాదిగా అనుభవం సాధించకుండా.. ఓ మూడు నెలలు కోచింగ్ సెంటర్ కెళ్లి కోచింగ్ తీసుకుని.. పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయితే సరిపోతుందా. కోచింగ్ సెంటర్లలో కోర్టు విధులను ఎలా నిర్వహిస్తారో నేర్పిస్తారా?. న్యాయవాదిగా కనీస అనుభవం లేకుండా జూనియర్ సివిల్ జడ్జి అయితే వారు న్యాయవ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లగలరు?. కోర్టు కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో తెలియని వారు జూనియర్ సివిల్ జడ్జిలు అయితే వ్యవస్థ పరిస్థితి ఏమిటి?. ఇటువంటి విధానాన్ని మనం అనుమతిద్దామా?. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనను ఐదేళ్లకు మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు గత నెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన యు.సురేఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మటం వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుకు మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టుతో పాటు పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని తెలిపారు. గతంలో ఉమ్మడి హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ, బాంబే తదితర చోట్ల జేసీజే పోస్టుల భర్తీకి పెద్దగా స్పందన రాకపోవడం వల్ల మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధనను సడలించి ఉండొచ్చు. వాస్తవానికి కనీస ప్రాక్టీస్ మూడేళ్లు కాదు.. ఐదేళ్లు ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే వ్యవస్థ పనితీరు తెలుస్తుంది. కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. సీనియర్లు ఎలా వాదనలు వినిపిస్తున్నారు, జడ్జీలు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు, తీర్పులు ఎలా ఇస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా నేరుగా కోచింగ్ సెంటర్‌కు వెళ్లి కోచింగ్ తీసుకుని పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయిపోతే ప్రయోజనం ఏముంది? దీని వల్ల వ్యవస్థకు ఏం లాభం?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మూడేళ్ల నిబంధనపై హైకోర్టు వైఖరి ఏమిటో తెలుసుకుంటామంటూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున హైకోర్టు తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. -
సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం
-
కోచింగ్ పేరుతో దోపిడీ!
సాక్షి, కామారెడ్డి: ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడుతాయనగానే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హడావుడి మొదలవుతుంది. అందమైన బ్రోచర్లు ముద్రించి నిరుద్యోగులను ఆకర్శించే ప్రయత్నం చేస్తారు. తమ దగ్గర అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారంటూ నమ్మిస్తారు. వీరి ప్రచారాన్ని చూసి కోచింగ్ సెంటర్లలో చేరిన నిరుద్యోగులు.. సెంటర్లలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి కనీస నియమాలు కూడా పాటించడం లేదు. అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని కోచింగ్ సెంటర్లను ఇష్టారాజ్యంగా నడుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో కోచింగ్‌లో చేరిన నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా.. జిల్లా కేంద్రంలో నడస్తున్న కోచింగ్ సెంటర్ల లో యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్, డీఎస్సీ అని ప్రకటనలు రావడంతోనే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ కార్యాలయాల దుమ్ముదులిపారు. రెండు మూడేళ్ల కాలంలో కామారెడ్డి పట్టణంలో టెట్, డీఎస్సీ పేరుతో క్లాసులు నిర్వహించి రూ. కోట్లల్లో వసూలు చేశారు. ఇప్పుడు వీఆర్వో, పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షల కోసం కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నోటిఫికేషన్లు వెలువడితే చాలు.. కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించాలంటే కోచింగ్ తీసుకోవలసిందేనన్న భావనతో కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు షార్ట్‌టర్మ్ కోచింగ్‌ల కోసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మెటీరియల్ కోసం అదనంగా డబ్బులు గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా... కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో ఏ ఒక్కదానికి సరైన అనుమతులు లేవని తెలుస్తోంది. కోచింగ్ సెంటర్లలో కూర్చోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. వెంటిలేషన్, టాయ్‌లెట్స్, తాగునీటి సౌకర్యం.. ఇలా ఏ వసతీ కల్పించడం లేదు. విద్యాశాఖ నుంచి అనుమతులు పొందిన తర్వాతనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. అర్హతలు లేని వారే బోధకులు కోచింగ్ సెంటర్లలో ఆయా అంశాలకు సంబంధించి పట్టభద్రులు బోధించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నడుస్తున్న సెంటర్లలో అర్హతలు లేనివారే ఎక్కువగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రాల్లో బోధకులు, వారి విద్యార్హతల జాబితాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. పూర్తిగా నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులను ప్రారంభించే సమయంలో గొప్పలు చెప్పిన యాజమాన్యాలు.. తరువాత వాటి ఊసెత్తడం లేదు. కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సెంటర్ల నిర్వాహకులు అధికారులను మేనేజ్ చేసుకుంటున్నారని, దీంతో వారు వీటివైపు చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లను నడిపిస్తున్న వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
కోచింగ్ సెంటర్ల మాయాజాలం
టెట్, డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టెట్ ర్యాంక్‌లే పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్న సంస్థల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. టెట్‌లో రాని ర్యాంక్‌లు వచ్చాయని ప్రకటిస్తూ పక్క సంస్థ అభ్యర్థులు తమవారంటూ ప్రకటనలిస్తూ కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): జిల్లాలోని కొన్ని కోచింగ్ సెంటర్ల బోగస్ ర్యాంకుల ప్రకటనలు చూసి డీఎస్సీ కోచింగ్‌కు ఏ సంస్థలో చేరాలో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగం నుంచి ఐఏఎస్ వరకు పోటీతత్వం పెరిగింది. ఈ నేథ్యంలో మంచి కళాశాల, కోచింగ్ సెంటర్ తదితర వాటిలో చేరేందుకు విద్యార్థులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. బోగస్ ర్యాంకులు ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు బోగస్ ర్యాంక్‌లు ప్రకటించి ఆర్భాటం చేస్తున్నారు. అభ్యర్థి హాల్‌టికెట్, ఫొటో అడిగితే ముఖం చాటేస్తున్నారు. తాజాగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)లో ఇదే తంతు సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఐదు విడతల్లో టెట్ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20,093 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. సోమవారం ప్రకటించిన టెట్ ఫలితాల్లో కొన్ని కోచింగ్ సెంటర్లు 100శాతం ఫలితాలు సాధిం చాయని ప్రకటిస్తే, మరికొన్ని 98శాతం, 95శాతం పైగా ఫలితాలు వచ్చాయని ప్రకటించాయి. టెట్‌లో అత్యధిక మార్కులు తమకే వచ్చాయని ప్రకటించిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని వివరాలు అడిగితే ముఖం చాటేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ టెట్ ఫలితాల్లో స్పష్టత రాలేదు. జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎంత, అ«త్యధిక మార్కులు ఎన్ని అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హడావుడిగా టెట్ ఫలి తాలను ప్రకటించి డీఎస్సీకి కోచింగ్ ఇస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. భారీగా ఫీజు వసూలు టెట్, డీఎస్సీకి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజు వసూళ్లు చేస్తున్నారు. రూ.12వేల నుంచి రూ.18వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు నెలలపాటు కోచింగ్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఎక్కువ మంది అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించకుంటే డబ్బులు వృథా అనే కారణంగా కేవలం టెట్‌కు ఫీజు చెల్లించారు. వారి దగ్గర నుంచి కూడా రూ. 8వేల నుంచి రూ.10 వేల వరకు ఫీజు వసూలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ మరో వారంలో వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు కోచింగ్ చేరేందుకు ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కోచింగ్ సెం టర్ల నిర్వాహకులు ఆమాంతంగా ఫీజులు పెంచేశారు. ఒక్క డీఎస్సీకి కో చింగ్ ఇచ్చినందుకు కోచింగ్ సెంటర్‌ను బట్టి రూ.10వేల నుంచి రూ.12వేల వరకు వ సూలు చేస్తున్నారు. బోగస్ ర్యాంక్‌ల ప్రకటనతో ఓ వైపు టెట్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చిన సంస్థలు నష్టపోవడం, మరోవైపు సరైన ఫ్యాకల్టీ లేని కోచింగ్ సెంటర్లలో చేరి అభ్యర్థులు మోసపోతున్నారు. పోటీ పరీక్షల్లోనూ ఇదే పరిస్థితి పోటీ పరీక్షల్లో ఉద్యోగం గ్యారెంటీ పేరుతో జిల్లాలో పుట్టగొడుగుల్లా పలు కోచింగ్ సెంటర్లు వెలిశాయి. బ్యాంక్‌లు, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూపు పోటీ పరీక్షలు, ఆఫీసర్స్, సీఏ తదితర పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సంస్థలు రాని ర్యాంక్‌లను ప్రకటించడం, మరికొన్ని పక్క రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంక్‌లను ప్రకటించి అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో చేరిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాక ఆం దోళనకు గురవుతున్న సందర్భాలున్నాయి. నియంత్రణ లేక పోవడమే.. కోచింగ్ సెంటర్లపై నియంత్రణ లేకపోవడంతో కొంతమంది నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పదోతరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్‌కు ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీకి యూనివర్సిటీలు కంట్రోలు చేస్తున్నాయి. అవి విధించిన నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. అయితే కోచింగ్ సెంటర్లపై ఈ నియంత్రణ లేదు. ఎవరి ఇష్టారాజ్యం వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ కళాశాలల మాదిరిగానే కోచింగ్ సెంటర్లకు నియంత్రణ ఉండాలి. బోగస్ ఫలితాలు ప్రకటించిన మాత్రాన ఫలితం ఉండదు. ఏది మంచి సంస్థ అని అభ్యర్థులు గమనిస్తుంటారు. -
కోర్సుల కోట అమీర్‌పేట
-
అనుమతి లేని కోచింగ్ సెంటర్లు సీజ్
వనపర్తి విద్యావిభాగం : జిల్లాకేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న గురుకుల, నవోదయ కోచింగ్ సెంటర్లను శుక్రవారం ఎంఈఓ ఫయాజుద్దీన్ సీజ్ చేశారు. ఇటీవల జిల్లాలో అనుమతి లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ సాధన సమితీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.భరత్‌కుమార్ డీఈఓ సుశీందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అనుమతి లేని కోచింగ్ సెంటర్లను తనిఖీ చేసి సీజ్ చేయాలని ఎంఈఓలకు డీఈఓ ఆదేశించారు. దీంతో గత రెండు రోజులుగా కొత్తకోట, పెబ్బేరు మండలాల్లో ఎంఈఓలు తనిఖీలు నిర్వహించి కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. దీంతో వనపర్తి పట్టణంలో కొనసాగుతున్న పలువురు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ముందుగానే సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు. వనపర్తిలోని పలు కోచింగ్ కేంద్రాల్లో గద్వాల, అలంపూర్, శాంతినగర్, ఇటిక్యాల, కొల్లాపూర్, పాన్‌గల్ తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులను చేర్చుకోవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి సొంత గ్రామాలకు పంపించారు. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జీటీ నారాయణ, జ్ఞానశ్రీ, జ్ఞానజ్యోతి, సాధన, సిందూజ, విక్టరీ కోచింగ్ సెంటర్లను ఎంఈఓ ఫయాజుద్దీన్ సీజ్ చేశారు. ఏ పోటీ పరీక్షలకైనా కోచింగ్ ఇచ్చే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని కొనసాగించాలని ఎంఈఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది రాధిక, సీఆర్పీ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్లపై సర్వీస్ ట్యాక్స్
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా జోరుగా కొనసాగుతున్న విద్యా వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సేవల పన్ను విభాగం కన్నేసింది. ప్రధానంగా కోచింగ్ సెంటర్లపై వారు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎస్సార్‌నగర్‌లోని సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏపై దాడులు నిర్వహించారు. సదరు సంస్థ రూ.1.5 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు అనుమానిస్తున్న సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) అధికారులు తనిఖీల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంస్థపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధి ఎస్టీ అధికారులు సమన్లు జారీ చేయడం ద్వారా గురు లేదా శుక్రవారం యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. ‘కమర్షియల్’ అన్నీ ఎస్టీ పరిధిలోకి... వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ఏటా రిటర్న్స దాఖలు చేస్తూ, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తారుు. ఏటా రిటర్న్స దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. విద్యారంగానికి మినహాయిపు ఉన్నా... సాధారణంగా విద్యా రంగానికి సర్వీసు ట్యాక్స్ మినహయింపు ఉంది. అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు సాధారణ విద్య కాకుండా సీఏ, సీఎస్, ఐఐటీ, ఐఐఎం, సివిల్ సర్వీసెస్లకూ శిక్షణ ఇస్తుంటాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తుంటారుు. ఇది పూర్తిస్థారుు వాణిజ్య వ్యవహారని సర్వీసు ట్యాక్స్ విబాగం నిర్థారిస్తూ ఈ తరహా విద్యా బోధనకు మినహాయింపు ఉండదని స్పష్టం చేస్తోంది. వివిధ రకాలైన కోచింగ్స పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కార్యకలాపాలు నడుపుతున్న కోచింగ్ సెంటర్లన్నీ సర్వీసు ట్యాక్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా వ్యాపారంపై ఏటా 14 శాతం (సెస్‌లు అదనం) చొప్పున పన్ను చెల్లించాలని పేర్కొన్నారు. సీఎంఎస్‌కు కేంద్రీకృత రిజిస్ట్రేషన్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దాదాపు ఎనిమిది శాఖలు నిర్వహిస్తున్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏ ఎస్సార్‌నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థ మూడేళ్ళ క్రితం సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద కేంద్రీకృత రిజిస్ట్రేషన్ చేరుుంచుకుంది. దీనిప్రకారం ప్రతి బ్రాంచ్ కార్యకలాపానికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్‌ను హైదరాబాద్‌లోని సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్న తర్వాతి నుంచి పన్ను చెల్లించక పోవడంతో సదరు సంస్థకు గతంలోనే ఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. సరైన స్పందన, సమాధానం లేకపోవడంతో తదుపరి చర్యలుగా బుధవారం సంస్థ కార్యాలయంపై దాడి చేసి రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఎంఎస్ యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదు. మరికొన్ని సంస్థల పైనా చర్యలకు సన్నాహాలు... ఈ తరహాలోనే విద్యా వ్యాపారం చేస్తున్న మరికొన్ని సంస్థల కార్యకలాపాల పైనా ఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిలో కొన్ని పన్ను చెల్లించట్లేదని, మరికొన్ని అసలు రిజిస్ట్రేషనే చేరుుంచుకోలేదని గుర్తించారు. వీటిపై వరుస దాడులు చేసేందుకు సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకారుుపడిన వారిని అవసరమైన అనుమతుల తర్వాత అరెస్టు చేసే అధికారం సైతం తమకు ఉందని సర్వీసు ట్యాక్స్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణైతే గరిష్టంగా ఏడేళ్ళ వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
-
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
శిక్షణార్థులను లూటీ చేస్తున్న కోచింగ్ సెంటర్లు సర్కారీ కొలువుల కోసం లక్షల మంది ఎదురుచూపు హైదరాబాద్‌కు చేరి కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు సిలబస్ మార్పులు ఖరారు కాకున్నా పుస్తకాలతో కుస్తీ నోటిఫికేషన్ల జారీపై ఇంకా లేని స్పష్టత సిలబస్‌నే నిర్ణయించని సర్కారు.. నిరుద్యోగుల్లో ఆందోళన శిక్షణ కేంద్రాలపై నియంత్రణ కరువు.. నిబంధనలు బేఖాతర్ ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. అప్పులపాలవుతున్న యువత సాక్షి, హైదరాబాద్: సర్కారీ కొలువుల కోసం నిరుద్యోగులు పట్నం బాట పట్టారు. ఉద్యోగ ప్రకటనలు రాకముందే రాజధానికి చేరుకుని కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కొత్త రాష్ట్రంలో వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారన్న ప్రచారంతో కనీసం నాలుగైదు లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. మరెంతో మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నగరంలోని అశోక్‌నగర్, గాంధీనగర్, దోమల్‌గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, కొత్తపేట, మలక్‌పేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నిరుద్యోగులే. అసలు ఉద్యోగమే లేని వారిని పక్కనబెడితే.. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి కొందరు, ఉద్యోగాలనే వదిలేసి మరికొందరు, కింది స్థాయి ప్రభు త్వ ఉద్యోగాల్లోని వారు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా, పోటీ పరీక్షల సిలబస్ కూ డా ఖరారు చేయకపోయినా శిక్షణ కేంద్రాలకు నిరుద్యోగుల రాక కొనసాగుతూనే ఉంది. దీంతో రాజధానిలో ఏ మూలన చూసినా హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగాలు వదిలేసి.. అప్పులు చేస్తూ.. గ్రూపు-1, గ్రూపు-2 వంటి ఉన్నత స్థాయి పోస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను పక్కనబెట్టి మరీ అనేక మంది సిద్ధమవుతున్నారు. కోచింగ్ ఫీజులు, రూమ్ అద్దెలు, భోజనం, వసతి, పుస్తకాల కోసం ఏడాది కాలంలో ఒక్కొక్కరు సగటున రూ.84 వేలకుపైగా వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అప్పులు చేసి మరీ శిక్షణ పొందుతున్నారు. సిలబస్ లేకుండా సన్నద్ధమయ్యేదెలా? మరోవైపు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులను రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, 1948 నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తదితర మార్పులు ఉంటాయని టీఎస్పీఎస్సీ ఇప్పటికే పేర్కొంది. కాని పూర్తిస్థాయి సిలబస్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాక రాత పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు మించి సమయం ఉండదు. అలాంటపుడు సిలబస్ ఏంటో తెలియకుండా పరీక్షకు తామెలా సన్నద్ధం కావాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి సిలబస్‌ను ముందుగా ప్రకటించకున్నా శిక్షణ తీసుకోకుండా వారు ఉండలేకపోతున్నారు. ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు కోచింగ్ కేంద్రాల్లో కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాత షాపింగ్ మాల్స్, ఫంక్షన్‌హాళ్లు, కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లోనూ శిక్షణ కేంద్రాల పేరుతో బహిరంగ సభలనుతలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బ్యాచ్‌లో 700 నుంచి వెయ్యి మందికి శిక్షణ ఇస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదులు తెలంగాణకు సంబంధించిన అంశాలు చదువుకుంటే సరిపోతుందని చెబుతూ శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 ప్రకారం ఈ కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇందుకు సంబంధించిన 1997 నాటి జీవో 200ను పాలకులు పట్టించుకోవడం లేదు. జీవోలో మార్గదర్శకాలు స్పష్టంగా లేవని పక్కన పడేశారు. రాజధానిలో కోచింగ్ కేంద్రాలు అశోక్‌నగర్ పరిసరాల్లో: 80కి పైనే దోమల్‌గూడ పరిసరాల్లో: 20కి పైనే చిక్కడపల్లి పరిసరాల్లో: 25కు పైనే దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ పరిసరాల్లో: 250కి పైనే ఏడాదిగా శిక్షణ పొందుతున్న వారు: లక్ష మందిపైగా శిక్షణ పూర్తయి సిద్ధమవుతున్న వారు: 2లక్షలకు పైనే మూడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారు: మరో లక్షకుపైగా. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా.. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా సిద్ధమవుతున్నాను. ఇప్పు డు పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులంటున్నారు. మరి త్వరగా సిలబస్‌ను ప్రకటిస్తే సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా? నోటిఫికేషన్లోనే సిలబస్‌ను ప్రకటిస్తే కష్టం. ప్రిపేర్ అయ్యేందుకు సమయం par సరిపోదు. - గుమ్మడి అనురాధ, ఇల్లెందు ప్రైవేటు ఉద్యోగం వదులుకున్నా.. గ్రూపు-1 రాసి డీఎస్పీ కావాలన్నది నా లక్ష్యం. 2013లో ఎంటెక్ పూర్తయింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాను. తెలంగాణ రాష్ట్రం రావడంతో నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో గతేడాది ఉద్యోగం మానేసి కోచింగ్ తీసుకుంటున్నాను. - బి. తిరుపతి, మహబూబ్‌నగర్ ఇప్పటికే రెండున్నర లక్షల అప్పు గ్రూప్-2 కోచింగ్ కోసం వరంగల్ నుంచి వచ్చాను. అశోక్‌నగర్‌లో రూం తీసుకొని చదువుతున్నా. గ్రూపు-2 అధికారి కావాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు అప్పు రెండున్నర లక్షలైంది. - ఎ. సురేష్, గ్రూప్-2 అభ్యర్థి