కోచింగ్ సెంటర్లపై సర్వీస్ ట్యాక్స్
కోచింగ్ సెంటర్లపై సర్వీస్ ట్యాక్స్
Published Thu, Nov 24 2016 1:59 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా జోరుగా కొనసాగుతున్న విద్యా వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సేవల పన్ను విభాగం కన్నేసింది. ప్రధానంగా కోచింగ్ సెంటర్లపై వారు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎస్సార్‌నగర్‌లోని సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏపై దాడులు నిర్వహించారు. సదరు సంస్థ రూ.1.5 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు అనుమానిస్తున్న సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) అధికారులు తనిఖీల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంస్థపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధి ఎస్టీ అధికారులు సమన్లు జారీ చేయడం ద్వారా గురు లేదా శుక్రవారం యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు.
‘కమర్షియల్’ అన్నీ ఎస్టీ పరిధిలోకి...
వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ఏటా రిటర్‌న్‌స దాఖలు చేస్తూ, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తారుు. ఏటా రిటర్‌న్‌స దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి.
విద్యారంగానికి మినహాయిపు ఉన్నా...
సాధారణంగా విద్యా రంగానికి సర్వీసు ట్యాక్స్ మినహయింపు ఉంది. అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు సాధారణ విద్య కాకుండా సీఏ, సీఎస్, ఐఐటీ, ఐఐఎం, సివిల్ సర్వీసెస్‌లకూ శిక్షణ ఇస్తుంటాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తుంటారుు. ఇది పూర్తిస్థారుు వాణిజ్య వ్యవహారని సర్వీసు ట్యాక్స్ విబాగం నిర్థారిస్తూ ఈ తరహా విద్యా బోధనకు మినహాయింపు ఉండదని స్పష్టం చేస్తోంది. వివిధ రకాలైన కోచింగ్‌స పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కార్యకలాపాలు నడుపుతున్న కోచింగ్ సెంటర్లన్నీ సర్వీసు ట్యాక్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా వ్యాపారంపై ఏటా 14 శాతం (సెస్‌లు అదనం) చొప్పున పన్ను చెల్లించాలని పేర్కొన్నారు.
సీఎంఎస్‌కు కేంద్రీకృత రిజిస్ట్రేషన్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దాదాపు ఎనిమిది శాఖలు నిర్వహిస్తున్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏ ఎస్సార్‌నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థ మూడేళ్ళ క్రితం సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద కేంద్రీకృత రిజిస్ట్రేషన్ చేరుుంచుకుంది. దీనిప్రకారం ప్రతి బ్రాంచ్ కార్యకలాపానికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్‌ను హైదరాబాద్‌లోని సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్న తర్వాతి నుంచి పన్ను చెల్లించక పోవడంతో సదరు సంస్థకు గతంలోనే ఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. సరైన స్పందన, సమాధానం లేకపోవడంతో తదుపరి చర్యలుగా బుధవారం సంస్థ కార్యాలయంపై దాడి చేసి రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఎంఎస్ యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదు.
మరికొన్ని సంస్థల పైనా చర్యలకు సన్నాహాలు...
ఈ తరహాలోనే విద్యా వ్యాపారం చేస్తున్న మరికొన్ని సంస్థల కార్యకలాపాల పైనా ఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిలో కొన్ని పన్ను చెల్లించట్లేదని, మరికొన్ని అసలు రిజిస్ట్రేషనే చేరుుంచుకోలేదని గుర్తించారు. వీటిపై వరుస దాడులు చేసేందుకు సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకారుుపడిన వారిని అవసరమైన అనుమతుల తర్వాత అరెస్టు చేసే అధికారం సైతం తమకు ఉందని సర్వీసు ట్యాక్స్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణైతే గరిష్టంగా ఏడేళ్ళ వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Advertisement