Service Tax
-
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ. 31 కోట్ల ట్యాక్స్ నోటీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాకు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమీషనర్ కార్యాలయం రూ. 31.46 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. 2014–15 నుంచి 2017–18 మధ్య కాలంలో సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి చెల్లించడం, వర్తించని సెన్వాట్ క్రెడిట్‌ను తీసుకోవడం ఆరోపణల కింద వడ్డీ, పెనాలీ్టతో సహా కట్టాలంటూ నోటీసులు వచి్చనట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఆర్డరుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఇది ఎయిర్పోర్ట్యేతర వ్యాపారాన్ని విడగొట్టడానికి ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశమని తెలిపింది. ఒకవేళ అపీలేట్ అథారిటీ తుది ఉత్తర్వులు ఏవైనా ఇస్తే డిమాండ్ నోటీసులో గరిష్టంగా 43.40 శాతం మొత్తం మేర తమ కంపెనీపై ప్రభావం ఉండవచ్చని వివరించింది. -
వస్తు సేవల పన్ను విధానం సూపర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అడ్డంకులను తగ్గించడం ద్వారా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం వ్యాపారాన్ని సులభతరం చేసిందని 90 శాతం మంది భారత్ పారిశ్రామిక ప్రతినిధులు భావిస్తున్నారని డెలాయిట్ సర్వే బుధవారం తెలిపింది. జీఎస్టీ విధానం అంతిమ వినియోగదారులకు సంబంధించి వస్తువులు, సేవల ధరల ప్రక్రియను సానుకూలం చేసిందని తెలిపింది. తమ సరఫరా చైన్లను పటిష్టం చేసుకోవడంలో కంపెనీలకు సైతం పరోక్ష పన్నుల విధానం దోహదపడుతోందని వివరించింది. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, వ్యాట్, 13 సెస్సులు వంటి 17 స్థానిక లెవీల స్థానంలో దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జీఎస్టీ:5 సర్వే 2022’ పేరుతో జరిపిన ఈ సర్వేలో వెల్లడయిన మరికొన్ని అంశాలు.. ► నాలుగు వారాల పాటు జరిగిన సర్వేలో 234 మంది చీఫ్ ఎక్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), సీఎక్స్‌వో–1 స్థాయి ఇండివిడ్యువల్స్ పాల్గొని తమ అప్రాయాలను వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ, ప్రజా సేవలు; లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సహా పలు కీలక రంగాలపై జీఎస్టీ ప్రభావాన్ని సర్వే ట్రాక్ చేసింది. ► కీలక రంగాల్లోని తొంభై శాతం మంది సీఎక్స్‌వోలు జీఎస్టీ పరోక్ష పన్ను విధానాన్నికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ’ఒక దేశం, ఒకే పన్ను’ సంస్కరణ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అడ్డంకులను తగ్గించి, వ్యాపారాన్ని సులభంగా, ప్రభావవంతంగా మార్చిందని వారు అభిప్రాయపడ్డారు. అటు వ్యాపారవ్తేలకు ఇటు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ► పన్నుల చెల్లింపునకు సంబంధించి ఆటోమేషన్, ఈ–ఇన్వాయిస్/ఈ–వే సౌకర్యాన్ని ప్రవేశపెట్ట డం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రయోజనకరమైన సంస్కరణ అని వారు తెలిపారు. ► వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థ మరింత సరళతరం కావాలని విజ్ఞప్తి చేశారు. ► నెలవారీ, వార్షిక రిటర్న్స్ పక్రియను సులభతరం చేయడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం కీలకమని తెలిపారు. ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్‌ను సరళీకృతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కోసం నిర్వహణా సంక్లిష్టతలను తగ్గించాలని, పన్ను వివాదాల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఆయా అంశాలు తీవ్రమైన దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారీ పన్ను వసూళ్లే విజయ సంకేతం ఇటీవలి నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యవస్థ గణనీయమైన విజయం సాధించిందనడానికి ఇదే ఉదాహరణ. వ్యవస్థ పట్ల పన్ను చెల్లింపుదారుల స్నేహ పూర్వక విధానాన్ని ఇది సూచిస్తోంది. ఈ పన్ను విభాగం మరింత విస్తృతంగా ప్రజాదరణ పొందడానికి మరిన్ని చర్యలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడుతున్నాం. – మహేశ్ జైసింగ్, డెలాయిట్ విశ్లేషణ విభాగం ప్రతినిధి ఎకానమీకి శుభ సంకేతం గత మూడు నెలల్లో వరుసగా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి. – ఎంఎస్ మణి డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా? ఎంత ఆలస్యమైనా ఈరోజు ఫైల్ చేసేయండి. ఐటీ రిటర్న్ ఈ రోజులోపు సమర్పించకపోతే 10 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సిరావొచ్చు. ఆదాయ పన్నుపై కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు రేపటి నుంచి (సెప్టెంబర్ 1) అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలు అమల్లో రానున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. కాబట్టి వేతన జీవులు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండ్సాలిందే. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్నవి ఏంటో చూద్దాం. ఇల్లు కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. రూ. కోటి విత్‌డ్రా చేస్తే ‘ఫైవ్’ పడుద్ది ఒక సంవత్సరంలో ఒక అకౌంట్ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. ఐఆర్సీటీసీ వడ్డన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను పునరుద్ధరించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న నాన్ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 సర్వీసు ఛార్జీలను ఐఆర్సీటీసీ వసూలు చేయనుంది. సర్వీస్ ట్యాక్స్ బకాయిలకు చెక్ సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు. బీమా డబ్బుకు తప్పదు పన్ను జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. కొత్త పాన్‌కార్డులు ఆధార్ నంబరుతో పాన్‌కార్డులు లింక్ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్‌కార్డులు జారీ చేయనుంది. ఉల్లంఘిస్తే బాదుడే సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించే వారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. (చదవండి: రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్) షాపింగ్.. బ్రీఫింగ్ ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్ రిటర్న్స్‌లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్క్షన్ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది. (ఇది చదవండి: సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!) -
రూ. 472 కోట్ల సేవా పన్ను ఎగ్గొట్టారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెలతో ప్రైవేట్ మద్యం వ్యాపారం ముగియనుంది. అయితే, మద్యం వ్యాపారులు గత లీజు కాలంలో(2015–17) కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సేవా పన్నును(సర్వీస్ ట్యాక్స్) ఇప్పటికీ చెల్లించలేదు. సెంట్రల్ ఎక్సైజ్ విభాగం గతేడాది నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. సేవా పన్నును మద్యం వ్యాపారులు చెల్లిస్తారా? లేక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా? అన్న అంశాన్ని తేల్చాలని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. 2015–17లో చేసిన వ్యాపారానికి గాను రూ.472 కోట్ల సేవా పన్ను కట్టాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం అప్పటి ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ట్యాక్స్‌ను మద్యం వ్యాపారులే చెల్లిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో అప్పట్లో జీఎస్టీ అధికారులు మద్యం వ్యాపారులకు నోటీసులు పంపించారు. 2015–17 లీజు కాలంలో లైసెన్స్ ఫీజు కింద మద్యం వ్యాపారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,100 కోట్ల చొప్పున వసూలు చేసింది. ఈ లైసెన్స్ ఫీజుపై సేవా పన్నును చెల్లించాలని సెంట్రల్ ఎక్సైజ్ విభాగం తేల్చిచెప్పింది. నోటీసుల నుంచి రక్షణ పేరిట వసూళ్లు 2015–17 లీజు కాలంలో లైసెన్స్ ఫీజు కింద వసూలు చేసిన రూ.2,100 కోట్లలో 18 శాతం సర్వీస్ ట్యాక్స్‌ను 15 నెలల పాటు చెల్లించాల్సి ఉంది. ఏడాదికి రూ.378 కోట్లు, మరో 3 నెలలకు గాను రూ.94 కోట్లు కలిపి మొత్తం రూ.472 కోట్ల ట్యాక్స్‌ను మద్యం వ్యాపారులు చెల్లించాల్సిందేనని సెంట్రల్ ఎక్సైజ్ విభాగం స్పష్టం చేసింది. అయితే, సేవా పన్నును ఎగ్గొట్టేందుకు అప్పట్లో మద్యం సిండికేట్లు రంగంలోకి దిగాయి. తమకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సేవా పన్ను నోటీసుల వల్ల ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో త్వరలో ప్రైవేట్ మద్యం వ్యాపారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారుల నుంచి సేవా పన్ను వసూలు చేసేందుకు జీఎస్టీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన కాలపరిమితి 15 నెలలు -
ఏడాదిన్నరలో రూ 50,000 కోట్ల పన్ను ఎగవేత..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా రూ 50,000 కోట్ల మేర పన్ను ఎగవేతలను కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సీబీఐసీ) గుర్తించింది. మొత్తం పన్ను ఎగవేతలో పది శాతం వరకూ జీఎస్టీ వసూళ్లున్నాయని పేర్కొంది. జులై 2017-18 మధ్య నమోదైన 604 కేసుల్లో రూ 4441 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు కనుగొన్నారని సీబీఐసీ పర్యవేక్షణలో పనిచేసే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) డేటా వెల్లడించింది. ఇక పన్ను ఎగవేతల్లో రూ 39,047 కోట్లు సర్వీస్ ట్యాక్స్ ఎగవేతలు కాగా, రూ 6,621 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేతలున్నాయని సీబీఐసీ గుర్తించింది. జీఎస్టీ అమలుకాక ముందు పన్ను ఎగవేతలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ హయాంలో పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, గుర్తించిన పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీ రేటు సాధించామని పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన పాత కేసుల్లో రికవరీ కేవలం 9 శాతంగానే ఉందని చెప్పారు. -
‘పాలు, బెంజ్‌పై ఒకటే పన్ను కుదరదు’
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ కింద 18 శాతం ఏకీకృత పన్ను రేటు ఆచరణ సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మెర్సిడెస్ కారుకు, పాలకు ఒకే పన్ను విధించలేమని కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ మోదీ తేల్చిచెప్పారు. ఏకీకృత పన్ను విధానంతో ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని అన్నారు. జీఎస్టీ అమలైన ఏడాది అనంతరం పరోక్ష పన్నుల వసూళ్లు 70 శాతం పెరిగాయని, చెక్‌పోస్ట్‌లను తొలగించి 17 పన్నులు, వివిధ రకాల 23 సెస్‌లను ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్ర పరిధిలో ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను రాష్ట్రాల్లో వ్యాట్ వంటి పన్నుల స్ధానంలో జీఎస్టీ పరోక్ష పన్ను వ్యవస్థను సరళతర చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వర్తకులు, ఇతర భాగస్వాములు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జీఎస్టీలో మార్పులు చేపడతామని చెప్పారు. జీఎస్టీలో 18 శాతంతో ఒకే పన్ను రేటు ఉండాలని కాంగ్రెస్ కోరుతున్నదని, అయితే ప్రస్తుతం జీరో, 5 శాతం పన్ను పరిధిలో ఉన్న ఆహారోత్పత్తుల ధరలు 18 శాతం పరిధిలోకి తెస్తే వాటి ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలు, మెర్సిడెస్ కారుపై ఒకే రకమైన పన్నులు వేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. -
ఐటీ నెత్తిన టాక్స్ పిడుగు: స్పందించిన కేంద్రం
సాక్షి: న్యూఢిల్లీ: దేశీయ ఐటీ రంగంపై పడిన టాక్స్ బాంబుపై కేంద్రం స్పందించింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలను అందించే కంపెనీలను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. దాదాపు రెండువందలకు పైగా కంపెనీలకు షాకిస్తూ జరిమానాతో సహా భారీ ఎత్తున సేవాపన్ను చెల్లించాలంటూ జారీ అయిన నోటీసుల పరిశీలనకు దిగింది. దీనిపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేసింది. రూ.10వేల కోట్ల మేర సర్వీస్ టాక్స్ చెల్లించాలంటూ ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు నోటీసులు జారీ కావడంతో సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) రంగంలోకి దిగింది. దీని ద్వారా ప్రభావితమైన కంపెనీల పేర్లు, సేవలందించిన ప్రదేశాలు తదితర వివరాలతో కూడిన వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని పత్యక్ష పన్నుల కమిషనర్‌ను కోరింది. కాగా గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్వేర్ సేవలను ఎక్స్పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అసలే సంక్షోభంలో పడిన దేశీయ ఐటీరంగంపై ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం మరింత కలకం రేపింది. అటు దీని ప్రభావం ఐటీ రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా నెలకొంది. -
కాగ్ కనుసన్నల్లో బాలీవుడ్ స్టార్స్
న్యూఢిల్లీ : సేవాపన్ను సరిగ్గా కట్టని బాలీవుడ్ స్టార్స్ అందరూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కనుసన్నల్లోకి వచ్చేశారు. రూ.50 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూలు ఆర్జిస్తున్నప్పటికీ తక్కువ సేవాపన్ను కట్టడం, నిబంధనలను అతిక్రమించడం వంటి వాటికి పాల్పడిన 150 కేసులను కాగ్ గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారందరిపై విచారణ సాగిస్తున్నట్టు కాగ్ శుక్రవారం పార్లమెంట్‌కు నివేదించింది. ఈ బాలీవుడ్ దిగ్గజాల్లో సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, అజయ్ దేవ్గన్, రితీష్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్ ఉన్నారు. అజయ్ దేవ్గన్, రితీష్ దేశ్‌ముఖ్, రాంపాళ్లకు షోకాజ్ నోటీసు జారీచేస్తున్నామని కాగ్‌కు, సేవాపన్ను అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు తక్కువ పన్ను చెల్లింపులకు ఎందుకు చర్యలు తీసుకోలేదో పన్ను డిపార్ట్మెంట్ స్పష్టంచేయలేకపోయింది. సల్మాన్ ఖాన్, రాంపాల్, రితీష్ దేశ్‌ముఖ్, అజయ్ దేవ్‌గన్‌ల రికార్డులను పరిశీలించినప్పుడు, నిర్మాతలకు, నటులకు మధ్యనున్న ఒప్పందాలను గమనించామని కాగ్ పేర్కొంది. దానిలో ప్రయాణ ఖర్చులు, లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్ ఆర్టిస్టు, హై స్టయిలిస్ట్, స్పాట్ బాయ్ వంటి ఖర్చులన్నీ నిర్మాతనే భరిస్తారని రిపోర్టు చెప్పింది. అయితే ఇవన్నీ సర్వీసెస్ కింద అసెసీకి అదనంగా సమకూరుతున్నాయని రిపోర్టులో పేర్కొంది. కానీ అసెసీలు మాత్రం తమ పన్ను విలువలో ఈ అదనపు విలువలను చూపించడం లేదని కాగ్ తేల్చింది. రణబీర్ కపూర్‌నే తీసుకుంటే.. యే దిల్ హై ముస్కిల్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిందని, దీన్ని కొంత భాగం భారత్‌లో, కొంత భాగం న్యూయార్క్‌లో తీసినట్టు కాగ్ చెప్పింది. ఈ షూటింగ్లో భాగంగా లండన్‌కు చెందిన ఫారిన్ కంపెనీ ఏడీహెచ్‌ఎం ఫిల్మ్స్ లిమిటెడ్ నుంచి రణబీర్‌కు రూ.6.75 కోట్లు లభించాయని, కానీ వాటికి చెల్లించాల్సిన సర్వీసెస్ పన్ను రూ.83.43 లక్షలను ఎక్స్‌పోర్టు సర్వీసుల లాగా ట్రీట్ చేసి, వాటిని చెల్లించలేదని ఆడిటర్ పేర్కొంది. -
టర్మ్ పాలసీకి.. క్లిక్ చేయండి!
⇔ జీఎస్టీతో మరింత పెరిగిన టర్మ్ పాలసీ రేట్లు ⇔ ఇప్పటిదాకా పన్ను 15 శాతం... ఇపుడు 18% ⇔ కొంతైనా ఉపశమనం కావాలంటే ఆన్లైనే మార్గం ⇔ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే 40–50 శాతం ధరలు చౌక ⇔ డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లోనే అందించొచ్చు ⇔ అన్ని వివరాలూ చెబితే తక్షణం కవరేజీ మొదలు ఉద్యోగులైనా, వ్యాపారులైనా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండి తీరాల్సింది టర్మ్ పాలసీ. కాకపోతే వీటిపై ఇపుడు జీఎస్టీ భారం అధికమైంది. గతంలో టర్మ్ పాలసీల ప్రీమియంపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్ విధించేవారు. జీఎస్టీ అమలుతో ఇది 18 శాతానికి పెరిగింది. దీంతో టర్మ్ పాలసీలు కాస్త ఖరీదయ్యాయి. అయితే, ఇప్పటికే పాలసీలు తీసుకున్నవారిని మినహాయిస్తే... కొత్తగా పాలసీలు తీసుకునే వారు ఈ భారాన్ని తగ్గించుకోవటానికి ఓ మార్గముంది. అది... ఆన్‌లైన్‌ను ఆశ్రయించటం. టర్మ్ పాలసీని ఏజెంట్ దగ్గరో లేక బీమా కార్యాలయానికి వెళ్లో తీసుకునే బదులు నేరుగా బీమా కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకుంటే మరింత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో తీసుకునే టర్మ్ పాలసీల ప్రీమియంతో పోలిస్తే ఆన్లైన్ వేదికగా కస్టమర్ నేరుగా తీసుకునే పాలసీ ప్రీమియం కనీసం 30 నుంచి 40 శాతం మేర తక్కువగా ఉంటుంది. జీఎస్టీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి లేదు. ఆన్లైన్లో టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం రేట్లు తక్కువ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది దీన్లో మధ్యవర్తి ప్రమేయం ఉండదు. నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్ లేదా మరో బీమా బ్రోకర్ ద్వారా పాలసీ తీసుకుంటే వారికి కంపెనీ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవేవీ ఉండవు కనుక ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. రెండోది ఆన్లైన్ ద్వారా తీసుకునే వారిలో అత్యధిక మంది విద్యాధికులై ఉండటం, వీరికి సంపాదన, ఆరోగ్యం వంటి విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుందన్న ఆలోచనతో కంపెనీలు తక్కువ ప్రీమియం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇక పరిపాలనా వ్యవహారాల వ్యయమూ కలుపుకుంటే కంపెనీలకు ఆ మేరకు భారం తగ్గినట్టే కదా!! అందుకే అవి ఆన్లైన్ పాలసీల ప్రీమియంలను ఆ మేరకు తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు సిగరెట్, పొగాకు అలవాటు లేని 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడు కోటి రూపాయలకు ఆఫ్‌లైన్ టర్మ్ పాలసీ కావాలనుకుంటే ఎల్ఐసీ అమూల్య జీవన్2 పాలసీలో జీఎస్టీ కూడా కలిపి ప్రీమియం రూ.39,648గా ఉంది. ఇంతే మొత్తానికి ఎల్ఐసీ నుంచే ఆన్లైన్ టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కేవలం రూ.23,340 చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదికి రూ.16,308 మేర మిగులుతుంది. ఇది భారీ వ్యత్యాసంగా చెప్పుకోవాలి. జీవిత బీమా విషయంలో సంప్రదాయ పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీలు చాలా చౌక. అందులోనూ ఆన్లైన్ టర్మ్ పాలసీ మరింత చౌక. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి చూసుకున్నా ఆఫ్‌లైన్ పాలసీ అయిన సూపర్ టర్మ్ ప్లాన్‌లో పైన చెప్పుకున్న వ్యక్తికే కోటి రూపాయల బీమాతో పాలసీ కావాలనుకుంటే ప్రీమియం రూ.19,470. మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్‌లో ప్రీమియం రూ.11,564 మాత్రమే. ఏజెంట్ లేకపోయినా సేవలు అలాగే... ఏజెంట్ల ద్వారానే బీమా కంపెనీల నుంచి పూర్తి స్థాయి సేవలు లభి స్తాయన్న అపోహ ఉంది. కానీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా కంపె నీలు అదే విధమైన సేవలు అందిస్తాయి. చిరునామా మారినా, లేక మరే ఇతర సమస్యలున్నా నేరుగా కంపెనీని ఆన్లైన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. చివరికి క్లెయిమ్‌లు కూడా ఆన్లైన్ ద్వా రానే దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ బీమా కంపెనీ సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఐఆర్డీఏకి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం బీమా మొదలు ఆన్లైన్ ద్వారా బీమా పథకం తీసుకున్న క్షణం నుంచే బీమా రక్షణ మొదలవుతుంది. ఒకవేళ మీ ఆరోగ్యం, వృత్తి, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా కొన్ని సందర్భాల్లో అదనపు వైద్య పరీక్షలను బీమా కంపెనీలు కోరతాయి. ఇలా వైద్య పరీక్షలో ఏమైనా విషయాలు బయటపడితే... ఆ మేరకు ప్రీమియం పెంచే అధికారం బీమా కంపెనీలకుంది. ఒకవేళ పెంచిన ప్రీమియం ధరలు నచ్చకపోతే పాలసీని రద్దు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి సమయంలో బీమా కంపెనీ వైద్య పరీక్షలకయిన వ్యయాన్ని తగ్గించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిస్తుంది. రెన్యువల్ మర్చిపోవద్దు... ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవడం చాలా సులభం. అయితే ఏటా దాన్ని రెన్యువల్ చేయటం మరిచిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పాలసీ గడువు తీరిపోతోంది, రెన్యువల్ చేసుకోండి అని గుర్తు చేయడానికి ఏజెంట్లెవరూ ఉండరు. రెన్యువల్ చేసుకోకపోతే... కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అపుడు వయసు పెరుగుతుంది కనక ఆ మేరకు ప్రీమియం కూడా పెరుగుతుంది. సాధారణంగా ఆన్లైన్ ప్లాన్స్‌లో కాలపరిమితి తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అదనంగా 15 రోజుల సమయాన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కానీ గ్రేస్ పీరియడ్ కోసం ఆగకుండా కాల పరిమితిలోగానే రెన్యువల్ చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్య విషయాలు దాచొద్దు.. ధూమపానం, గుట్కా వంటి అలవాట్లున్న వారికి ప్రీమియం ధరలు 25–35% అధికంగా ఉం టాయి. ప్రీమియం పెరుగుతుం దని ఇలాంటి విషయాలు దాచొద్దు. క్లెయిమ్ సందర్భంలో ఇలాంటివి బయటపడితే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆరోగ్యం, ఆహా ర అలవాట్ల గురించి పూర్తి సమాచారాన్నివ్వండి. తీసుకోవటం ఇలా.. ఇపుడు దాదాపు ప్రతి బీమా కంపెనీ ఆన్లైన్లో టర్మ్ పాలసీ అందిస్తోంది. ప్రీమియం రేట్లను పోల్చి చూడటానికి పాలసీ బజార్, పాలసీ లిట్మస్, అప్నా పైసా వంటి పలు వెబ్‌సైట్లున్నాయి. చెక్ చేసుకున్నాక నేరుగా సదరు బీమా కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అక్కడే టర్మ్ పాలసీని ఎంచుకుని అడిగిన వివరాలు నింపాలి. ప్రీమియం తక్కువగా ఉంది కదా అని ఏ కంపెనీ పడితే అది ఎంచుకోకూడదన్నది నిపుణుల సూచన. సదరు కంపెనీ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ఎంత శాతం ఉందో చూశాకే దాన్ని ఎంచుకోవటం మంచిదన్నది వారి సలహా. -
ఇక జీఎస్టీ శాఖ
► వస్తుసేవల పన్నుతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపం మార్పు ► కమిషనర్ హోదాలో మాత్రం మార్పులేదు ► కింది స్థాయి పోస్టులన్నింటికీ ప్రమోషన్ కేడర్లు ► సర్కిళ్లు, డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు ► ఒకటి రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తోంది. అసలు ఆ శాఖ పేరే మారిపోయి తెలంగాణ వస్తుసేవల పన్ను శాఖ (జీఎస్టీ శాఖ)గా మారిపోతోంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు కమిషనరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటికి ఆమోదం లభిస్తే శనివారమే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల హోదాల్లోనూ మార్పులు రానున్నాయి. కమిషనర్ హోదాలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ... తర్వాతి స్థాయి నుంచి కేడర్‌లో మార్పులు చేస్తున్నారు. శాఖ అదనపు కమిషనర్‌ను స్పెషల్ కమిషనర్‌గా పిలవనున్నారు. జాయింట్ కమిషనర్ నుంచి డీసీటీవోల వరకు పదోన్నతులు కల్పించి హోదా పెంచనున్నారు. కిందిస్థాయిలో ఉండే సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి (ఏసీటీవో)ని మాత్రం వస్తుసేవల పన్ను అధికారి (జీఎస్టీ అధికారి)గా పిలవనున్నారు. అయితే పేరు మార్చినా బాధ్యతల్లో ప్రస్తుతానికి మార్పు ఉండద ని.. బాధ్యతలకు ప్రత్యేక మార్గ దర్శకాలు విడుదలయ్యేం తవరకు అవే విధులను నిర్వహించాల్సి ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సర్కిళ్లు, డివిజన్లు కూడా పెంపు జీఎస్టీని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో ఉన్న సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యలో మార్పులు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను యథావిధిగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి కూడా ఫైలు వెళ్లింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటివరకు ఉన్న 91 సర్కిల్ కార్యాలయాలను 140కి పెంచనున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్లను 20కి పెంచుతున్నారు. ఈ పెంపు ద్వారా మొత్తం 850కి పైగా అదనపు పోస్టులు కూడా అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అర్ధరాత్రి నుంచే చెక్‌పోస్టుల ఎత్తివేత జీఎస్టీ అమలు నేపథ్యంలో శుక్రవార అర్ధరాత్రి నుంచే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 19 చెక్‌పోస్టు లు ఉన్నాయి. ఆ చెక్‌పోస్టులను మూసివేయాలని, అక్కడి సిబ్బందిని సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది కొరతను బట్టి వినియోగించుకోవాలని క్షేత్రస్థాయికి ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే చెక్‌పోస్టుల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను వెంటనే రికార్డు చేయాలని, వాటిని హైదరాబాద్‌కు పంపడంతో పాటు అక్కడి ఆస్తులను కాపాడేందుకు రోజుకొకరికి విధులు కేటాయించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు చెక్‌పో స్టుల్లో సిబ్బందిని ఉంచకూడదని, మొబైల్ బృందాల ద్వారా తనిఖీలు కూడా చేపట్టవద్దని ఆదేశించడం గమనార్హం. పన్ను రాయితీపై ప్రతిష్టంభన రాష్ట్రంలోని వెయ్యి పరిశ్రమలకు ఎఫెక్ట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలు వస్తువులు తయారు చేస్తే ఇక్కడే పన్ను కట్టేవి.. ఆ వస్తువులను వేరే రాష్ట్రంలో అమ్మినా పన్ను రాష్ట్రానికే వచ్చేది. ఇలా ఆదాయం వస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలూ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేవి. కానీ జీఎస్టీ అమల్లోకి వస్తుండడంతో పరిస్థితి మారిపోతోంది. రాష్ట్రంలో తయారైన వస్తువులను ఇతర రాష్ట్రంలో అమ్మితే.. పన్ను ఆదాయం ఆ రాష్ట్రాలకే వెళ్లిపోతుంది. వస్తువులు తయారైన రాష్ట్రానికి ఎటువంటి పన్ను ఆదాయం రాదు. ఆ పరిశ్రమలు జీఎస్టీని ఇక్కడే కట్టినా... కేంద్రం ఆ పన్నును తీసుకుని ఆయా వస్తువుల వినియోగం జరిగిన రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. దీంతో ఇప్పటికే పన్ను రాయితీలిచ్చిన పరిశ్రమలకు ‘ట్యాక్స్ డిఫర్ మెంట్ (పన్ను తిరిగి చెల్లింపు)’ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక తయారీ పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్ని వస్తువులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి, ఎన్ని మన రాష్ట్రంలో అమ్ముడుపోయాయనే దానిని లెక్కిం చి పన్ను రాయితీ కల్పించాలా? మొత్తం ఆ పరిశ్రమ కట్టిన పన్ను మొత్తాన్ని ఒప్పందం ప్రకారం మన రాష్ట్రమే చెల్లించాలా? లేక కేంద్రం జోక్యం చేసుకుని ఆ పన్ను లాభం పొందిన రాష్ట్రం నుంచి తిరిగి ఇప్పిస్తుందా? అన్న అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. 2005 నుంచి వెయ్యికిపైగా.. పరిశ్రమలను ఆకర్షించే ఆలోచనతో 2005 నుంచి 2017 వరకు రాష్ట్రంలో వెయ్యికిపైగా పరిశ్రమలకు అప్పటి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించా యి. కొన్నింటికి ట్యాక్స్ డిఫర్మెంట్ కూడా ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆయా పరిశ్రమల ద్వారా పూర్తి స్థాయి ఆదాయం మన రాష్ట్రానికి అందని నేపథ్యంలో.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
1 దేశం..పన్ను!
♦ జూలై 1 నుంచే జీఎస్టీ అమలు ♦ అంతా సిద్ధం చేశామంటున్న ప్రభుత్వం ♦ 17 పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను ♦ 0– 3– 5– 12– 18– 28 శాతాలతో ఆరు శ్లాబులు ♦ పన్నులేనివి ‘జీరోలోకి.. బంగారానికి మాత్రమే 3 శాతం ♦ మిగతావన్నీ ఇతర శ్లాబుల పరిధిలోకి లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ బయటే ♦ లగ్జరీ వాహనాలు, పలు ఉత్పత్తులపై గరిష్టంగా 15% సెస్సు పన్ను చెల్లింపులు, రిటర్నులన్నీ ఇక ఆన్లైన్లోనే.. ♦ పలు ఇబ్బందులున్నాయంటున్న వ్యాపార వర్గాలు పట్టుమని పది, పన్నెండు రోజులు.. వచ్చేనెల ఒకటో తారీఖు రాగానే దేశ పన్నుల ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా అభివర్ణిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లు మినహా.. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నులన్నీ దీంతో అంతర్థానమైపోతాయి. వాటన్నిటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఏ వస్తువుపై అయినా రకరకాల పన్నులుండవు. జీఎస్టీ మాత్రమే ఉంటుంది. 0 నుంచి 28 శాతం మధ్య ఐదు శ్లాబుల్లో ఉండే ఈ పన్నుకు.. సెస్సులు కలిపితే గరిష్టంగా 43 శాతం వరకూ అవుతుంది. అంటే ఏ వస్తువుపై అయినా 0–43 శాతం మధ్య జీఎస్టీ అమలవుతుంది. అసలు జీఎస్టీని ఎందుకు తెస్తున్నారు? అమలయ్యేదెలా? ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం సులువేనా? వ్యాపారులంతా దానిలో చేరేదెలా? జీఎస్టీ వస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా.. లేక పెరుగుతాయా? ఏయే వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏయే సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? పన్ను రాయితీలతో కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వడం సాధ్యమేనా.. అనే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానమే ఈ వారం సాక్షి ‘ఫోకస్’.. ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారుల వరకూ అన్ని దశల్లోనూ పన్నులున్నాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఈ పన్నులు మారుతుంటాయి. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక.. కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ పరిస్థితిని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకే జీఎస్టీని 122వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తెస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న 17 రకాల పన్నులను తొలగించి వాటి స్థానంలో జీఎస్టీని అమలు చేస్తారు. జీఎస్టీ అవసరమేంటి? ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదారులు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారుచేసి విక్రయించేటప్పుడు మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతున్నాయి. ఇవన్నీ కలసి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28 నుంచి 30 శాతం వరకూ అవుతున్నాయి. జీఎస్టీని తెస్తే ఈ రేట్లు తగ్గటంతో పాటు ధరల్లో తేడాలు కూడా తగ్గుతాయనేది ప్రభుత్వం ఆలోచన. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) ఏర్పాటైంది. దానిలో కేంద్రానికి 24.5 శాతం, ఢిల్లీ సహా రాష్ట్రాలకు 24.5 శాతం కలిపి 49 శాతం వాటా ఉంది. మిగతా 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. జీఎస్టీఎన్లో పన్ను, రిటర్నుల వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలి. ఏదీ భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా వెంటనే తెలిసిపోతుంది. జీఎస్టీలోనూ 3 రకాలు 1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ సీజీఎస్టీలో విలీనమవుతాయి. 2. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, లాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నులు ఎస్జీఎస్టీలో కలుస్తాయి. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి. పెరిగేవేమిటి.. తగ్గేవేమిటి? జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల విధానం సరళమవుతుందని, ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే తమపై పన్ను రేట్లు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి తాము మనగలగటం కష్టమని థీమ్ పార్కులు వంటి పలు రంగాల కం పెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎక్కువ వస్తువులపై పన్ను రేట్లు తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఏ వస్తువు ధరైనా తగ్గుతుందా.. పెరుగుతుందా? అనేది వాటిపై విధించే జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జీఎస్టీలో ఐదు శ్లాబుల్ని చేర్చారు. అందులో మొదటిది జీరో కాగా... మిగతా ఐదు శ్లాబులు 3, 5, 12, 18, 28 శాతాలుగా ఉన్నాయి. ఈ లెక్కన వివిధ సేవలు, వస్తువులపై జీఎస్టీ ప్రభావాన్ని పరిశీలిద్దాం.. స్టార్ హోటల్లో తింటే బాదుడే! రెస్టారెంట్లలో ఆహారంపై ప్రస్తుతమున్న మాదిరే పన్నులుం టాయి. ఇంకా చెప్పాలంటే 0.5 శాతం తగ్గుతుంది కూడా. రూ.50 లక్షల టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లలో బిల్లుపై 5 శాతం, నాన్ ఏసీ రెస్టారెంట్లలో 12 శాతం, ఏసీ–మద్యం అనుమతి ఉన్న రెస్టారెంట్లలో 18 శాతం పన్నుల్ని ఖరారు చేశారు. రూ.1,000 లోపు అద్దె ఉండే హోటళ్లు, లాడ్జిలను జీఎస్టీ నుంచి మినహాయించారు. రూ.1,000 నుంచి రూ.2,000 లోపు అద్దె ఉండే వాటిపై 12 శాతం, రూ.2,500–5,000 మధ్య అద్దె ఉండే వాటిపై 18 శాతం, రూ.5 వేలపైన అద్దె ఉండే వాటికి 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంటే 28 శాతం పరిధిలోకి వస్తాయి కనక స్టార్హోటల్లో ఫుడ్ బిల్లుకు కూడా అదే స్థాయి పన్ను బాదుడు ఉంటుంది. సినిమా టికెట్ల ధరలను పరిశీలిస్తే.. ప్రస్తుతం చలన చిత్రాలపై వినోద పన్ను 28 నుంచి 110 శాతం వరకూ ఉంది. జీఎస్టీలో రూ.100 లోపు సినిమా టికెట్లకు 18 శాతం, ఆపైన ధరలుండే టికెట్లకు 28 శాతం పన్నును ఖరారు చేశారు. ఫోను కొన్నా.. మాట్లాడినా చుక్కలే.. ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారై మన దేశానికి దిగుమతి అవుతున్న ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కలిపి 14–13 శాతంగా ఉన్నాయి. అదే విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని మన దేశంలో అసెంబ్లింగ్ చేస్తున్న ఫోన్లపై సీవీడీ, ఎక్సైజ్ కలిపి 2 శాతంతోపాటు స్థానిక వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే జీఎస్టీలో దిగుమతి చేసుకున్నా సరే, స్థానికంగా తయారైనా సరే 18 శాతం పన్ను వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతం రూ.10 వేల ఫోన్కుగాను పన్నులు కలిపి రూ.11,280 చెల్లిస్తుంటే.. జీఎస్టీ అమలు తర్వాత అదే ఫోన్ ధర రూ.11,800 అవుతుందన్నమాట. ప్రస్తుతం టెలికం రంగానికి 15 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను జీఎస్టీలో 18 శాతం పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం రూ.1,000 ఫోన్ బిల్లుపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్‌తో రూ.1,150 చెల్లిస్తుంటే.. జీఎస్టీ వచ్చాక రూ.1,180 చెల్లించాల్సి వస్తుంది. రెడిమేడ్ దుస్తులు తగ్గుతాయ్.. జీఎస్టీలో బ్రాండెడ్ దుస్తులకు 5 శాతం పన్ను ఖరా రు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఫ్యాషన్ దుస్తులపై ఎక్సైజ్, వ్యాట్ కలిపి 7.5 శాతం వరకూ పన్ను ఉంది. అంటే రూ.1,000 టీ–షర్ట్‌కు ప్రస్తుతం పన్నులు కలిపి రూ.1,075 చెల్లిస్తుం టే.. జీఎస్టీ అమలయ్యాక అదే టీ–షర్ట్ రూ.1,050కే లభిస్తుంది. రూ.1,000 లోపు ధరలుండే చీరలు, వస్త్రాలపై 5 శాతం, అంతకంటే ఖరీదైన వాటిపై 12 శాతం పన్నును విధిస్తున్నారు. టీవీలు తగ్గుతాయ్.. ఏసీలు పెరుగుతాయ్.. ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాలకు 24.2 నుంచి 27 శాతం పన్నులున్నాయి. జీఎస్టీలో వీటన్నింటినీ 28 శాతం పన్ను విభాగంలో చేర్చారు. అంటే 1 శాతం ధరలు పెరుగుతాయన్నమాట. టీవీలను మాత్రం 18 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం రూ.20 వేలు ఉండే ఆయా ఉత్పత్తులకు పన్నులు కలిపి రూ.24,900 చెల్లిస్తుంటే.. జీఎస్టీలో 18 శాతం పన్నుతో అదే ఉత్పత్తుల ధరలు రూ.23,600లకే లభ్యమవుతాయన్నమాట. బియ్యం, పప్పులు, నిత్యావసరాలు చవక! ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ (నిత్యావసరాలు విక్రయించే) కంపెనీలకు ఎక్సైజ్, వ్యాట్, ప్రవేశపన్నులు కలిపి 24–25 శాతంగా ఉన్నాయి. జీఎస్టీలో ఎఫ్ఎంసీజీలోని చాలా వరకు ఉత్పత్తులను 18 శాతం పరిధిలోకి తెచ్చారు. పైగా జీఎస్టీలో లాభదాయక నిరోధక నిబంధన ఉంది. అంటే ఏవైనా పన్ను ప్రయోజనాలొస్తే వాటిని ఆయా కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలి. దీంతో జీఎస్టీ అమలయ్యాక నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంది. బియ్యం, పాలు, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు, పప్పు దినుసులపై ప్రస్తుతం 5 శాతం వరకు పన్నులున్నాయి. వీటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. అయితే ఇవన్నీ ప్యాకేజింగ్ లేకుండా విడిగా అమ్మితేనే మినహాయింపు వర్తిస్తుంది. అదే ఈ ఉత్పత్తులను బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి అమ్మితే 5 శాతం పన్ను పడుతుంది. పంచదార, టీ, కాఫీ, వంటనూనెలపై ప్రస్తుతం 5 శాతం పన్నులు ఉన్నాయి. జీఎస్టీలోనూ ఇదే రేటుంటుంది. కాబట్టి ధరల్లో తేడా ఉండే అవకాశం తక్కువ. కేశ సంరక్షణ నూనెలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి వాటిపై ప్రస్తుతం 23–26 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 18 శాతం పన్నును విధించారు. వీటి ధరలు తగ్గే అవకాశముంది. శీతల, బలవర్ధక పానీయాలు, చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, షాంపూల వంటి వాటిపై ప్రస్తుతం 23–25 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 28 శాతం పన్నును విధించినందున ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం రూ.500 లోపు ధరలుండే చెప్పులపై 9.5 శాతం వరకు పన్నులున్నాయి. దీన్ని జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అయితే రూ.500 కన్నా ఎక్కువ ధర ఉండే చెప్పులపై 18 శాతం జీఎస్టీ విధించారు. గతంలో వీటిపై పన్నులు 23.1 నుంచి 29.58 శాతం వరకు ఉన్నాయి. అంటే వీటి ధరలూ తగ్గే అవకాశం ఉంది. పొగ పీలిస్తే జేబుకు చిల్లే.. సిగరెట్ కాల్చితేనే కాదు జీఎస్టీ తర్వాత వాటిని కొనాలన్నా జేబుకు హానికరమే. ఎందుకంటే జీఎస్టీలో సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను 28 శాతం పన్నుల శ్లాబులోకి తెచ్చారు. తునికాకుపై మాత్రం 18 శాతం పన్ను విధించారు. సిగరెట్ల మాదిరే బీడీలపై కూడా సెస్సును విధించలేదు. ప్రయాణ టికెట్ల ధరలు తగ్గుతాయి ప్రస్తుతం రైలు టికెట్లపై మినహా బస్సు, మెట్రో, సబర్బన్ వంటి ప్రజా రవాణా టికెట్లపై ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ లేదు. రైల్వే టికెట్లలోనూ దూర ప్రయాణ ఏసీ కోచ్ టికెట్లపైనే సర్వీస్ ట్యాక్స్ ఉంది. జీఎస్టీలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంబించారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్‌లపై 6 శాతంగా ఉన్న పన్నును జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అంటే ప్రైవేట్ క్యాబ్ సర్వీసు ధరలూ తగ్గుతాయి. విమానాల్లో ప్రస్తుతం ఎకానమీ క్లాసు టికెట్లపై 5.6–6 శాతంగా ఉన్న పన్నులను జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లపై పన్ను 9 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అంటే ఎకానమీ టికెట్లు కాస్త తగ్గి బిజినెస్ క్లాస్ ధరలు పెరిగే అవకాశముంది. లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి ప్రస్తుతం వాహన రంగానికి పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా కలిపి 32 నుంచి 55 శాతం వరకు పన్నులున్నాయి. అయితే జీఎస్టీలో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ట్రాక్టర్లు మినహా అన్ని రకాల వాహనాలకూ 28 శాతం పన్ను విధించారు. ప్రస్తుతం ఆల్టో, క్విడ్, సెలెరియో, బ్యాలెనో, పోలో, ఐ20 వంటి చిన్న కార్లపై 25–27.5 శాతం వరకు పన్నులున్నాయి. జీఎస్టీలో సెస్సుతో కలిపి 29 శాతానికి చేరింది. అంటే 1.5 నుంచి 2 శాతం పెరిగింది. అంటే చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరగొచ్చు. హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్ వంటి సెడాన్, ఎస్యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతమున్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు కలిపి 43 శాతంగా ఉంటే.. జీఎస్టీలోనూ 28 శాతం పన్ను, అదనంగా 15 శాతం సెస్సును విధించారు. మొత్తంగా 43 శాతం పన్ను రేటే ఉండనుంది. ప్రస్తుతం లగ్జరీ కార్లకు అంటే మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, వోల్వో వంటిì వాటికి ఎక్సైజ్, వ్యాట్, ఇన్ఫ్రా సెస్ కలిపి 55 శాతం వరకు పన్నులు ఉన్నాయి. జీఎస్టీలో వీటికి 28 శాతం+ అదనంగా 15 శాతం సెస్సు జోడించారు. అంటే 43 శాతం పన్ను ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతంతో పోలిస్తే 12 శాతం తక్కువ. దీంతో లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి కూడా. ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్ (5–5.5 శాతం), సీఎస్టీ (2 శాతం), విడిభాగాలు, పరికరాలపై సెంట్రల్ వ్యాట్ (12.5 శాతం)గా ఉంది. అయితే జీఎస్టీలో ట్రాక్టర్ల ఇంజిన్లు, ట్రాన్స్మిషన్లు, ఇరుసులు, టైర్లు, ట్యూబుల వంటి ప్రధాన విడిభాగాలకు 28 శాతం పన్ను... మిగతా విడిభాగాలకు 18 శాతం పన్ను నిర్ణయించారు. అంటే ఒక్కో ట్రాక్టర్‌పై రూ.25 వేల వరకు ధర పెరుగుతుందని అంచనా. బంగారం ధరలు స్వల్పంగా పెరగొచ్చు! దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బంగారానికి జీఎస్టీలో ప్రత్యేక పన్ను శ్లాబు కేటాయించారు. బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం బంగారంపై 1 శాతం వ్యాట్, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలిపి 2 శాతం పన్ను ఉంది. అంటే జీఎస్టీ ఒకశాతం ఎక్కువే ఉన్నందున స్వల్పంగా ధరలు పెరగొచ్చు. మన దేశం బంగారం కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నందున... 10 శాతం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పూ చేయలేదు. అంటే విదేశీ మార్కెట్లతో పోలిస్తే మన దేశంలో ఆభరణాల బంగారం (916 క్యారెట్స్) గ్రాముకు రూ.280–300 వరకు ఎక్కువే ఉంటుందన్నమాట. అయితే ఆభరణాల తయారీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించారు. దీంతో స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కలుగుతుంది. తొలిదేశం ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్. 1954లో దానిని అమలు చేసింది. ఇప్పటివరకు 140 దేశాల్లో జీఎస్టీ పన్ను విధానమే అమల్లో ఉంది. బ్రెజిల్, కెనడా వంటి దేశాల్లో ద్వంద్వ జీఎస్టీ విధానం ఉంది. ప్రస్తుతం మన దేశం కెనడా జీఎస్టీ అంటే ద్వంద్వ జీఎస్టీ పన్ను విధానాన్నే అమలులోకి తీసుకొస్తున్నాం. జీఎస్టీలో విలీనమయ్యే పరోక్ష పన్నులివీ.. పన్ను రకం ప్రస్తుత రేటు (శాతాల్లో) అమ్మకం పన్ను/వ్యాట్ 14.5 కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) 2–4 సేవా పన్ను 14.5 కస్టమ్స్ డ్యూటీ 11.90 ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ 5.5–10 ఎక్సైజ్ డ్యూటీ 12.36 డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15 వినోద పన్ను 15–20 స్వచ్ఛ భారత్ సెస్ 0.5 కృషి కల్యాణ్ సెస్ 0.5 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 2.5–4 జీఎస్టీలో కలవని పన్నులివే బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) ఎక్స్పోర్ట్ డ్యూటీ రోడ్డు మరియు పాసింజర్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ స్టాంప్/రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ లిక్కర్‌పై ఎక్సైజ్ పన్ను స్థానిక సంస్థల ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ (ఆల్కాహాల్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటూ విద్యుత్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు) -
సేవలపై 18% పన్ను!
► జీఎస్టీ మండలికి నివేదిస్తాం ► రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లో భాగంగా సేవలపై గరిష్టంగా 18 శాతం పన్ను వసూలు చేయవచ్చని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలికి నివేదిస్తామని, సమీక్ష అనంతరం సేవా పన్ను రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. 18శాతం ప్రతిపాదనకు జీఎస్టీ మండలి అంగీకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సేవా రంగంపై గరిష్టంగా 14 శాతం పన్ను విధిస్తుండగా.. అర శాతం చొప్పున స్వచ్ఛ భారత్, క్రిషి కల్యాణ్ పన్నుల్ని వసూలు చేస్తున్నారు. ప్రస్తుత గరిష్ట పన్ను 15 శాతాన్ని 18 శాతానికి పెంచితే కొన్ని సేవల ధరలు పెరగవచ్చు. జీఎస్టీకి ముందు కొనసాగినట్లే వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్ని సేవా పన్ను పరిధి నుంచి మినహాయించవచ్చని అధియా పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయింపు జాబితాలో ఉన్న సేవలపై ఎలాంటి పన్ను లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. విద్య, వైద్యం, మతపరమైన తీర్థయాత్రలు వంటి 60 సేవలకు సేవాపన్ను నుంచి మినహాయింపు కొనసాగుతోంది. వ్యవసాయదారులు తప్ప మిగతా అందరూ జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలని, వారి ఉత్పత్తులు సేవా పన్ను కిందకు వస్తాయా? లేదా? అనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి మినహాయింపుల జాబితా రూపొందించలేదని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను విధించకపోవచ్చని అధియా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం 15 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేస్తున్న రవాణా వంటి రంగాలపై సేవా పన్ను తక్కువ ఉండేలా ప్రయత్నిస్తామని, రవాణా రంగాన్ని 5 లేదా 12 శాతం పన్ను జాబితాలో చేర్చే అవకాశముందన్నారు. అలాగే అధిక శాతం శాతం వస్తువుల్ని సామాన్యుడికి ఇబ్బంది కలిగించకుండా తక్కువ పన్ను జాబితాలోనే చేర్చవచ్చని, కొన్ని వస్తువులపై అధిక పన్ను వసూలు చేయవచ్చని తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం జీఎస్టీకి సంబంధించిన నాలుగు సహాయక చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో జూలై 1 నుంచి దేశమంతా ఒకే పన్ను వసూలుకు మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రపతి ఆమోదించిన చట్టాల్లో కేంద్ర జీఎస్టీ చట్టం 2017, సమీకృత జీఎస్టీ చట్టం 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం)చట్టం–2017, కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ చట్టం 2017లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ బిల్లుల్ని మార్చి 29న లోక్‌సభ, ఏప్రిల్ 6న రాజ్యసభ ఆమోదించాయి. సీజీఎస్టీలో భాగంగా రాష్ట్ర పరిధిలో సరుకుల సరఫరా, సేవలపై పన్ను వసూలు చేస్తారు. ఇక సమీకృత జీఎస్టీలో.. రాష్ట్రాల మధ్య వస్తువుల సరఫరా, సేవలపై కేంద్రానికి పన్ను విధించే అవకాశముంటుంది. జీఎస్టీ అమలుతో ఏర్పడే రాష్ట్రాల రెవెన్యూ నష్టాల్ని జీఎస్టీ పరిహార చట్టం మేరకు భర్తీచేస్తారు . కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువుల సరఫరా, సేవలపై పన్నును వసూలు చేసేందుకు యూటీజీఎస్టీ అవకాశం కల్పిస్తుంది. కాగా మే 18, 19న జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఏఏ వస్తువులు ఏ పన్ను పరిధిలో ఉంచాలన్న అంశంపై చర్చిస్తారు. -
పన్ను చెల్లింపు డిమాండ్ కోసం చర్యలేవీ వద్దు
సేవాపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) 2010–2014 వరకు నిర్వహించిన వ్యాపార కార్యకలాపాలకు రూ.2వేల కోట్ల వరకు సేవా పన్ను చెల్లించాలంటూ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు కోసం చర్యలేవీ తీసుకో వద్దని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం సేవాపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రిన్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2010–14 మధ్య నిర్వహించిన వ్యాపార కార్యకలాపాలకు అన్ని పన్నులు, జరిమానాలు కలిపి రూ.2వేల కోట్ల వరకు సేవా పన్ను కింద చెల్లించాలంటూ గతేడాది నవంబర్‌లో సేవా పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రొసీడింగ్స్ జారీచేసే పరిధి ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేదన్నారు. తాము అంత పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. -
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల బాదుడు..
-
ఎస్బీఐ చార్జీల బాదుడు..
► ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి... ► కనీస బ్యాలన్స్ లేకుంటే ఇకపై పెనాల్టీలు ► నెలలో మూడు నగదు జమలే ఉచితం ► ఆపై ప్రతీ లావాదేవీపై రూ.50 వడ్డింపు న్యూఢిల్లీ: ఎస్బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ పద్ధతి గతంలోనూ ఉండేది. కాకపోతే ఐదేళ్ల నుంచి దీన్ని అమలు చేయడం లేదు. కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ నగదు నిల్వల వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. వీటితోపాటు ఏటీఎం సహా పలు ఇతర సేవల చార్జీలను కూడా ఎస్బీఐ సవరించింది. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20+సేవా రుసుంను బ్యాంకు నిర్ణయించింది. మూడు దాటితే బాదుడే సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సేవా రుసుం విధింపు ఉంటుంది. అయితే, ఈ చార్జీ కూడా కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తారు. మిగిలిన కరెంటు ఖాతాలపై చార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే, బ్యాంకు శాఖలో నగదు ఉపసంహరణల విషయాన్ని బ్యాంకు ప్రస్తావించలేదు. ఏటీఎం సేవలపై చార్జీలు ఇక నుంచి నెలలో ఎస్బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరించుకోగలరు. ఆపై సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి జరిపే ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. అలాగే, నెలలో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు సార్లు మాత్రమే నగదు ఉపసంహరణలు ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీకి రూ.20 వడ్డన ఉంటుంది. ఒకవేళ ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25వేలు ఉంటే సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీలపై చార్జీలు ఉండవు. రూ.లక్ష బ్యాలన్స్ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ లావాదేవీలు ఉచితం. ఏటీఎం మెషిన్లలో నగదు లేక లావాదేవీ తిరస్కరణకు గురైతే దానిపై కూడా రూ.20సేవా రుసుం విధించడం జరుగుతుంది. ఇతర చార్జీలు ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్ కార్డు లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్ఎస్డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. బ్యాంకులో లాకర్ తీసుకుని ఉంటే ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా సందర్శించేందుకు అనుమతి. ఆపై లాకర్‌ను తెరిచిన ప్రతిసారీ రూ.100+సేవా రుసుం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనంగా వార్షిక నిర్వహణ చార్జీలు ఎలానూ చెల్లించుకోవాలి. కరెంటు ఖాతాలపై చార్జీలు కరెంటు ఖాతాల్లో పవర్ ప్యాక్ రకం ఖాతాలకు ఎంఏబీ రూ.5,00,000. సగటున నెలలో ఈ మొత్తం ఉండకపోతే జరిమానా రూ.2,500+సేవా రుసుం విధిస్తారు. పవర్ గెయిన్ ఖాతాలకు ఎంఏబీ 2,00,000. ఇది విఫలమైతే రూ.1,500+సేవారుసుం జరిమానా విధింపు ఉంటుంది. పవర్ జ్యోతి ఖాతాలకు ఎంఏబీ రూ.50,000. ఈ మొత్తం ఉంచకపోతే రూ.1,000+సేవారుసుం వసూలు చేస్తారు. మిగిలిన అన్ని కరెంటు ఖాతాలకు ఎంఏబీ రూ.10,000 కాగా, నిర్వహణలో విఫలమైతే నెలకు రూ.500+సేవా రుసుం చెల్లించుకోవాలి. సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు బేసిక్ సేవింగ్స్ బ్యాంకు స్మాల్, జన్‌ధన్ యోజన ఖాతాలు మినహా అన్ని సేవింగ్స్ ఖాతాలపై నెలవారీ కనీస నగదు నిల్వ (ఎంఏబీ) నిర్వహణలో విఫలమైతే చార్జీలు ఇలా ఉన్నాయి. జరిమానాలకు అదనంగా సేవా రుసుం కూడా ఉంటుంది. ఖాతా మూసేయాలన్నా చార్జీయే సేవింగ్స్ ఖాతాను ప్రారంభించిన తర్వాత 14 రోజుల నుంచి ఆరు నెలలలోపు మూసేయదలిస్తే రూ.500 చార్జీ, ఆరు నెలల నుంచి ఏడాది లోపు మూసేస్తే రూ.1,000 చార్జీ+సేవారుసుం వసూలు చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. కరెంటు ఖాతాలపై మూసివేత చార్జీ రూ.1,000గా ఉంటుంది. -
ఎస్ బీఐ చార్జీల మోత
న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) సిద్ధమైంది. పెనాల్టీ, ఇతర చార్జీల పేరుతో ఖాతాదారులపై ఎడాపెడా భారం మోపనుంది. కనీస నిల్వ లేని ఖాతాదారులకు పెనాల్టీ విధించనుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ నిబంధనలను మళ్లీ తెస్తోంది. ఇక నుంచి నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ చేయగలరు. నాలుగో డిపాజిట్ నుంచి రూ. 50 సేవా పన్ను, సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ అలర్ట్‌లపై మూడు నెలలకు రూ.15 ఛార్జీ వసూలు చేస్తుంది. కొత్తగా అమల్లోకి తెచ్చిన వడ్డింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ ప్రకటించింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు కనీస నిల్వ నిబంధనను 2012లో ఎస్ బీఐ ఎత్తేసింది. మళ్లీ ఇప్పుడు పునరుద్ధరించింది. మెట్రోపాలిటన్ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ (రూ.5000) కంటే 75 శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో పాటు రూ.100 జరిమానా మినిమమ్ బ్యాలెన్స్ కన్నా అకౌంట్ లో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ ఛార్జితో కలిపి రూ.50 జరిమానా చెల్లించాలి ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జి ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జి బ్యాంకు ఖాతాలో రూ.25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఛార్జి పడకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఖాతాలో ఉండాలి. 1000 రూపాయల వరకు యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు -
నేను పన్ను ఎగొట్టలేదు: సానియా మిర్జా
సేవా పన్ను కట్టకుండా ఎగవేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ బ్రాండు అంబాసిడర్, టెన్నిస్ క్వీన్ సానియా మిర్జా ఖండించారు. తాను సర్వీసు పన్నును ఎగొట్టలేదని సానియా మిర్జా స్పష్టంచేశారు. సర్వీసు ట్యాక్స్ సక్రమంగా చెల్లించనందుకు విచారణ కోసం సానియా లేదా ఆమె చార్టెడ్ అకౌంటెండ్ కాని తమ ముందు హాజరుకావాలని సర్వీసు ట్యాక్స్ శాఖ అధికారులు సమన్లు జారీచేశారు. ఈ విషయంపై స్పందించిన సానియా మిర్జా తను పన్నును సక్రమంగానే చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయలు, ట్రైనింగ్ ప్రోత్సహకం కింద ఇచ్చినట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా ప్రతినిధి అదికారులకు సమర్పించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తాను అవి తీసుకోలేదని అధికార వర్గాలూ పేర్కొంటున్నాయి. 2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియాను బ్రాండు అంబాసిడర్ గా నియమించి, మేజర్ టోర్నమెంట్ల ప్రిపరేషన్ కోసం కోటి రూపాయలను అందించింది. ప్రస్తుతం సానియా మిర్జా ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. -
సానియాకు సమన్లు
జారీ చేసిన సర్వీస్‌ట్యాక్స్ అధికారులు ‘బ్రాండ్’పారితోషికంపై సేవ పన్ను బకాయి ఈ నెల 16న హాజరుకావాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చుట్టూ సర్వీస్ ట్యాక్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో తీసుకుంటున్న పారి తోషికానికి సేవా పన్ను చెల్లించాల్సిందేనని సర్వీస్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. సానియా మీర్జా ఏటా రూ.కోటి పారితోషికం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ పారితోషికం మొత్తంపై ఏటా 15 శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాలు నెరపిన సర్వీస్‌ట్యాక్స్ అధికారులు మంగళవారం సానియాకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా కానీ, అధికారిక ప్రతినిధి పంపడం ద్వారా కానీ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్‌లో హాజరుకావాలని స్పష్టం చేశారు. విచారణకు హాజరుకాని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ క్లిక్ చేయండి -
సినిమాలు, రెస్టారెంట్లలో తిండి మరింత ఖరీదు?
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నాలుగోసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కొన్ని వాతలు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా సేవాపన్నును మరింత పెంచే అవకాశం కనిపిస్తుండటంతో.. దాని ప్రభావం చాలా అంశాల మీద ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులలో సినిమాలు చూడటం, రెస్టారెంట్లలో ఆహారం తినడం, విమానాల్లో ప్రయాణించడం.. ఇలాంటివన్నీ కాస్త ఖరీదు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండు సెస్‌లతో కలిపి సేవాపన్ను 15 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇది మరో 0.5 నుంచి 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సేవాపన్ను అనేది కస్టమర్ల నుంచి సర్వీసు ప్రొవైడర్లు వసూలుచేసి.. మళ్లీ ప్రభుత్వానికి కట్టే పన్ను. ఈ పన్ను పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన. దీనివల్ల ఉద్యోగులకు ఆదాయపన్ను నుంచి మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశం కూడా కలుగుతుంది. ఇప్పటికి సేవాపన్నును రెండుసార్లు సవరించారు. 2015-16లో దీన్ని 12.36 నుంచి 14 శాతం చేశారు. ఆ తర్వాత స్వచ్ఛభారత్ సెస్ 0.5 శాతం దీనికి కలిసింది. 2016-17లో కృషి కళ్యాణ్ సెస్ మరో 0.5 శాతం కలవడంతో ఇప్పటికి అది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ఖాతాదారులందరి నుంచి ‘పాన్’ తీసుకోండి
బ్యాంకులను ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు ముకు తాడు వేసే చర్యలకు కేంద్రం నడుం బిగించింది. బ్యాంకు ఖాతాలన్నింటికీ పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. ఇందులోభాగంగా ఖాతాదారులందరి నుంచి ‘పర్మినెంట్ అకౌంట్ నంబర్’ (పాన్)ను తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. పాన్ లేనట్లయితే.. వారి నుంచి ఫారమ్–60ను తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన జన్ధన్తోపాటు జీరో బ్యాలెన్స్ ఖాతాలైన సాధారణ పొదుపు ఖాతాలకు వర్తించదు. జీఎస్టీలో నమోదుకు పాన్ తప్పనిసరి ప్రస్తుతం ఎక్సైజ్, సేవా పన్ను చెల్లిస్తున్నవారు జీఎస్టీ వ్యవస్థకు మారేందుకు పాన్ నంబర్ కలిగి ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) పేర్కొంది. పాన్ ఆధారంగానే జీఎస్టీ పన్ను గుర్తింపు నెంబరు జారీ చేస్తారని తెలిపింది. -
డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలపై కేంద్ర వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహాన్నందిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల లోపు లావాదేవీపై సర్వీస్ పన్నును రద్దు చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సేవల్లో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 2012 నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు నోటిఫికేషన్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా! ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది. కాగా నిన్న (బుధవారం)ఆన్లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కోచింగ్ సెంటర్లపై సర్వీస్ ట్యాక్స్
సాక్షి, సిటీబ్యూరో: నగరం కేంద్రంగా జోరుగా కొనసాగుతున్న విద్యా వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సేవల పన్ను విభాగం కన్నేసింది. ప్రధానంగా కోచింగ్ సెంటర్లపై వారు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎస్సార్‌నగర్‌లోని సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏపై దాడులు నిర్వహించారు. సదరు సంస్థ రూ.1.5 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు అనుమానిస్తున్న సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) అధికారులు తనిఖీల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంస్థపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధి ఎస్టీ అధికారులు సమన్లు జారీ చేయడం ద్వారా గురు లేదా శుక్రవారం యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. ‘కమర్షియల్’ అన్నీ ఎస్టీ పరిధిలోకి... వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ఏటా రిటర్న్స దాఖలు చేస్తూ, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తారుు. ఏటా రిటర్న్స దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. విద్యారంగానికి మినహాయిపు ఉన్నా... సాధారణంగా విద్యా రంగానికి సర్వీసు ట్యాక్స్ మినహయింపు ఉంది. అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు సాధారణ విద్య కాకుండా సీఏ, సీఎస్, ఐఐటీ, ఐఐఎం, సివిల్ సర్వీసెస్లకూ శిక్షణ ఇస్తుంటాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తుంటారుు. ఇది పూర్తిస్థారుు వాణిజ్య వ్యవహారని సర్వీసు ట్యాక్స్ విబాగం నిర్థారిస్తూ ఈ తరహా విద్యా బోధనకు మినహాయింపు ఉండదని స్పష్టం చేస్తోంది. వివిధ రకాలైన కోచింగ్స పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కార్యకలాపాలు నడుపుతున్న కోచింగ్ సెంటర్లన్నీ సర్వీసు ట్యాక్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా వ్యాపారంపై ఏటా 14 శాతం (సెస్‌లు అదనం) చొప్పున పన్ను చెల్లించాలని పేర్కొన్నారు. సీఎంఎస్‌కు కేంద్రీకృత రిజిస్ట్రేషన్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో దాదాపు ఎనిమిది శాఖలు నిర్వహిస్తున్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ సీఏ ఎస్సార్‌నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థ మూడేళ్ళ క్రితం సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద కేంద్రీకృత రిజిస్ట్రేషన్ చేరుుంచుకుంది. దీనిప్రకారం ప్రతి బ్రాంచ్ కార్యకలాపానికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్‌ను హైదరాబాద్‌లోని సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్న తర్వాతి నుంచి పన్ను చెల్లించక పోవడంతో సదరు సంస్థకు గతంలోనే ఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. సరైన స్పందన, సమాధానం లేకపోవడంతో తదుపరి చర్యలుగా బుధవారం సంస్థ కార్యాలయంపై దాడి చేసి రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఎంఎస్ యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదు. మరికొన్ని సంస్థల పైనా చర్యలకు సన్నాహాలు... ఈ తరహాలోనే విద్యా వ్యాపారం చేస్తున్న మరికొన్ని సంస్థల కార్యకలాపాల పైనా ఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిలో కొన్ని పన్ను చెల్లించట్లేదని, మరికొన్ని అసలు రిజిస్ట్రేషనే చేరుుంచుకోలేదని గుర్తించారు. వీటిపై వరుస దాడులు చేసేందుకు సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకారుుపడిన వారిని అవసరమైన అనుమతుల తర్వాత అరెస్టు చేసే అధికారం సైతం తమకు ఉందని సర్వీసు ట్యాక్స్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణైతే గరిష్టంగా ఏడేళ్ళ వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
పన్ను నియంత్రణపై జీఎస్టీలో ప్రతిష్టంభన
ఏ పన్ను ఎవరి నియంత్రణలో ఉండాలన్న దానిపై విభేదాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ల తాజా వివరాలకు రాష్ట్రాల పట్టు నవంబర్ 24, 25 తేదీల్లో తదుపరి సమావేశం న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ)లో ఏయో పన్ను చెల్లింపుదారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సభ్యుల మధ్య అంగీకారం కుదరలేదు. పన్ను రేట్లకు గురువారం నాటి భేటీలో కౌన్సిల్ ఏకగీవ్రంగా ఆమోదం తెలపగా... పన్ను నియంత్రణపై విభేదాలతో త్వరితగతిన జీఎస్టీ అమలుకు అడ్డంకులేర్పడ్డాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు సాధ్యం కాకపోవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ తరగతి పన్ను చెల్లింపుదారులు కేంద్రం పరిధిలో ఉండాలి? ఏ తరగతి పన్నులు రాష్ట్రాల నియంత్రణలో ఉండాలి? అన్నదానిపై కేంద్ర, రాష్ట్రాలు చెరోవాదన వినిపించాయి. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ చెల్లింపుదారులకు సంబంధించి తాజా వివరాలు అందుబాటులో లేకపోవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో నవంబర్ 9, 10 న జరగాల్సిన కౌన్సిల్ తదుపరి భేటీని రద్దు చేశారు. ఆ భేటీలో జీఎస్టీ ముసాయిదా చట్టంతో పాటు, ఇతర సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల్ని ఖరారు చేయాల్సి ఉంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు నవంబర్ 20న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమై... ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తారు. నవంబర్ 19న కూడా సమావేశమవుతాయని రాష్ట్రాల మంత్రులు తెలిపారు. వచ్చే భేటీలో డ్రాఫ్ట్ చట్టాలకు ఆమోదం తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నవంబర్ 24, 25 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిర్వహిస్తారు. ఆ భేటీలో పన్నులపై ద్వంద్వ నియంత్రణకు పరిష్కారంతో పాటు, ఏ పన్ను చెల్లింపుదారులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ), సీజీఎస్టీ(సెంట్రల్ జీఎస్టీ), ఎస్టీఎస్టీ(స్టేట్ జీఎస్టీ) ముసాయిదా చట్టాల్ని ఆమోదిస్తారు. భేటీకి ముందు జైట్లీ ఆశాభావం వ్యక్తం చేస్తూ... జీఎస్టీకి సంబంధించిన అన్ని విధివిధానాలు నవంబర్ 22లోపు పూర్తవుతాయని చెప్పారు. నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్ల్లమెంటు శీతాకాల భేటీలో సంబంధిత చట్టాలు ఆమోదం పొందుతాయన్నారు. హడావుడి నిర్ణయాలు వద్దు: రాష్ట్రాలు పన్నులపై ద్వంద్వ నియంత్రణ. ఇతర ఇబ్బం దులుంటే జీఎస్టీ అమలు ఆలస్యం అయ్యే అవకాశముందని సమావేశంలో పాల్గొన్న ఒక మంత్రి వెల్లడించారు. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని తాము కోరుకోవడం లేదని, సమాచారం మొత్తం అందాకే పన్నుల నియంత్రణపై తుది నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్‌పై తాజా వివరాలు అందుబాటులో లేవని, వాటి అందచేయాలంటూ కేంద్రాన్ని కోరామని మరో మంత్రి పేర్కొన్నారు. రూ. 1.5 కోట్ల కంటే తక్కువ సేవా పన్ను చెల్లింపులపై రాష్ట్రాలకు కూడా అధికారం ఉండాలని కోరారు. సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై విభేదాలు పన్నులపై ద్వంద్వ(కేంద్ర, రాష్ట్రాలు) నియంత్రణ సమస్య నివారిస్తూ... వేటిపై ఎవరికి అధికారం ఇవ్వాలన్న అంశంపై కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. 11 లక్షల సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై తమ నియంత్రణ ఉండాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా... కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్ల వరకూ ఉండే పన్ను ఖాతాల నియంత్రణ నుంచి రాష్ట్రాలు తప్పుకోవాలనేది కేంద్రం వాదన. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశంలో అంగీకారం కుదిరినా... అక్టోబర్ 19న నిర్వహించిన మూడో సమావేశంలో మాత్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. -
20 లక్షలు దాటితేనే జీఎస్టీ
ఏకాభిప్రాయంతో ఆమోదించిన జీఎస్టీ మండలి * కోటిన్నర టర్నోవర్ లోపు సంస్థలపై రాష్ట్రానికే నియంత్రణాధికారం * మినహాయింపు జాబితా 300 నుంచి 90కి కుదింపు * సర్వీస్ టాక్స్‌పై పూర్తి అధికారం కేంద్రానిదే న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై కీలకమైన ముందడుగు పడింది. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలు, వర్తకులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించనుంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి (కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు) రెండోరోజు భేటీలో తీవ్ర చర్చ అనంతరం కేంద్ర, రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాల్లో మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించినట్లు జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు ఆదాయమున్న సంస్థల వ్యవహారాలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని నిర్ణయించారు. అంతకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థల విషయంపై నిర్ణయం తీసుకోలేదు. జీఎస్టీ ప్రారంభ పరిమితి రూ. 25 లక్షలుండాలని కొందరు, 10 లక్షలుగా ఉండాలని మరికొందరు ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.5 లక్షలకే పరిమితి విధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీకి ఆదాయ పరిమితి, పాలనాపరమైన అధికారాలు, కీలకమైన జీఎస్టీ రేట్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. అయితే వీటిపై అక్టోబర్ 17-19 సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని.. శుక్రవారం నాటి సమావేశంలో అన్ని నిర్ణయాలపై ఏకాభిప్రాయం వచ్చిందని జైట్లీ చెప్పారు. రాష్ట్రాలకు మేలు చేసేలా.. ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ పరిహారం అందేలా నిబంధనలపైనా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రాలకు ఆదాయ పరిహారానికి 2015-16ను బేస్ ఇయర్‌గా పెట్టుకుని.. జీఎస్టీ ద్వారా నష్టం జరిగితే అంత మొత్తాన్ని కేంద్రం అందించనుంది. దీనిపై 3-4 ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినా తుది రూపు మాత్రం తర్వాతి సమావేశంలోనే రానుంది. కాగా, ప్రస్తుతం సర్వీస్ టాక్స్ చెల్లింపు నిమిత్తం నమోదు చేసుకున్న 11 లక్షల మంది వ్యాపారుల అసెస్మెంట్ వ్యవహారం కేంద్రం పరిధిలోనే ఉంటుంది. అయితే.. కొత్తగా సర్వీస్ టాక్స్ కోసం నమోదు చేసుకునే వారిని కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించనున్నారు. సెప్టెంబర్ 30న జరిగే సమావేశంలో జీఎస్టీ అమలు, మినహాయింపులపై పూర్తి స్పష్టత వస్తుందని జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 300 వస్తువులు, సేవలకు మినహాయింపు ఇవ్వాలని ముందు అనుకున్నా.. ఈ జాబితాను 90కి కుదించారు. చిరువ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఆదాయ పరిమితిని రూ. 20లక్షలుగా నిర్ణయించినట్లు పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. కాగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా పరిహారం విషయంలో కేంద్రం ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లు వెల్లడించాయి. -
ఓఎన్జీసీ విదేశ్కు6,100 కోట్ల పన్ను డిమాండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) విదేశీ సబ్సిడరీ ఓఎన్జీసీ విదేశ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.6,100 కోట్లకుపైగా సేవా పన్ను డిమాండ్‌ను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లోని 37 చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో ఓఎన్జీసీ విదేశ్కు వాటాలు ఉన్నాయి. అను బంధ సంస్థలు, బ్రాంచీలు, జాయింట్ వెంచర్ల రూపంలో ఈ వాటాలు కొనసాగుతున్నాయి. సంబంధిత సంస్థలు, బ్రాంచీలు, జేవీల కార్యకలాపాలకు సంబంధించే తాజా పన్ను నోటీస్ జారీ అయ్యింది. అయితే ఆయా మార్గాల ద్వారా పెట్టుబడులు సేవల పన్ను పరిధిలోనికి రావని ఓఎన్జీసీ విదేశ్ పేర్కొంటోంది. 2006 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి వరకూ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కు సంబంధించి రూ.2,816 కోట్లు, అటు తర్వాతి కాలాలకు సంబంధించి ఐదు నోటీసులకు సంబంధించి రూ.3,286 కోట్లు ఓఎన్జీసీ విదేశ్ చెల్లించాల్సి ఉందని సేవా పన్ను విభాగం వర్గాలు పేర్కొన్నాయి. -
జీఎస్టీ మండలికి కేబినెట్ ఆమోదం
-
జీఎస్టీ మండలికి కేబినెట్ ఆమోదం
ఈ నెల 22, 23 తేదీల్లో తొలి సమావేశం - ఐఐటీ, ఐఐఎంల్లో పరిశోధనల కోసం నూతన సంస్థ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసే పనిని వేగవంతం చేస్తూ.. జీఎస్టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి సచివాలయానికి కూడా ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్టీ మండలి నిర్ణయిస్తుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఈ మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యుడిగా కొనసాగుతారని, అయితే ఓటు హక్కు ఉండదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. రాష్ట్రాల రెవెన్యూ, వాణిజ్య పన్నుల మంత్రులు లేదా ఇతర మంత్రులైవరినైనా జీఎస్టీ మండలికి సిఫార్సు చేయొచ్చన్నారు. కాగా, విద్యాసంస్థల్లో నూతనఆవిష్కరణలకు ఊతమిచ్చేలా సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటీలు, ఐఐఎంల్లో పరిశోధన ఆధారిత వసతుల కల్పనకు ఈ సంస్థ రూ. 20 వేల కోట్ల నిధులిస్తుంది. 20 లక్షల టన్నులకు పప్పుదినుసుల నిల్వలు దేశంలో పప్పుదినుసుల నిల్వల్ని ప్రస్తుతమున్న 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై నియమించిన కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. -
జీఎస్టీపై ఎవరేమన్నారంటే..
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ‘‘ప్రస్తుతం 14.5 శాతం సేవా పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ 18 శాతం ఉండాలని.. 24 లేదా 25 శాతం దాకా ఉండాలని ప్రతిపాదనలు వస్తున్నా యి. పన్నును భారీగా పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు. జీఎస్టీ 18%గా ఉండాలని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 18 శాతమే ఖరారు చేస్తే మంచిది. 2001లో కెనడాలో జీఎస్టీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓట మిపాలై రెండు ఎంపీ సీట్లకు పరిమితమైంది. దాంతో తర్వాతి ప్రభుత్వాలు జీఎస్టీని 5 శాతానికి మించి పెంచకుండా జాగ్రత్తపడుతున్నాయి. తేనెటీగలు పువ్వులకు నొప్పి కలిగించకుండానే తేనెను స్వీకరించినట్లు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పన్నులు విధించాలని వేదవ్యాసుడు ఎప్పుడో సూచించాడు. పన్నులు ప్రజలకు బాధ కలిగించవద్దని 2 వేల ఏళ్ల కిందే గొప్ప ఆర్థికవేత్తగా పేరొందిన చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. జీఎస్టీ ద్వారా కార్లు, విలాస వస్తువుల ధరలు తగ్గుతాయంటున్నారు. కానీ ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి.. ధనికుల కోసం కాదు. పెట్రోల్, డీజిల్ రాష్ట్రాల పరిధిలో ఉంచినందున వాటిపై పన్నులు తగ్గించాలి. మద్యం, సిగరెట్లపై పన్నులు పెంచినా అభ్యంతరం లేదు. మొత్తంగా జీఎస్టీ బిల్లును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం..’’ - జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణల్లో మైలురాయి ‘‘దేశ ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ బిల్లు ఓ మైలురాయి. పన్నుల వసూళ్లలో అవినీతిని అరికట్టడానికి, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారవేత్తలు, ఇతర అన్ని వర్గాలకు.. సామాజిక, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వాలకూ ఇది ఉపయోగపడుతుంది. జీఎస్టీతో అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కపెట్టి అన్ని రాజకీయపక్షాలు ముందుకు రావడం అభినందనీయం..’’ - కిషన్‌రెడ్డి, బీజేపీ చిన్న పరిశ్రమలను కాపాడాలి ‘‘జీఎస్టీతో చిన్న పరిశ్రమల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాలి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ ధరలు తగ్గేలా చూడాలి. టీడీపీ తరఫున జీఎస్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చోటు కల్పించడం అభినందనీయం..’’ - సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా చూడాలి ‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తే నష్టం జరుగుతుంది. జీఎస్టీతో తెలంగాణకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి..’’ - సున్నం రాజయ్య, సీపీఎం ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలి ‘‘రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.25 శాతం నుంచి 3.5 శాతానికి పెంచే అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దానికి తక్షణమే కేంద్రం అనుమతిచ్చేలా ఒత్తిడి తేవాలి. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం..’’ - మౌజం ఖాన్, ఎంఐఎం టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ‘‘దేశ ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. జీఎస్టీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుం దని భావిస్తున్నాం..’’ - చెన్నమనేని రమేశ్, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ -
ముందుగానే శీతాకాల సమావేశాలు!
-
ముందుగానే శీతాకాల సమావేశాలు!
- నవంబర్ మొదట్లోనే నిర్వహించే యోచన - జీఎస్టీ ఆమోదమే ప్రభుత్వ లక్ష్యం సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభమవుతాయి. సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ), ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) బిల్లులు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందితే, నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారానికల్లా జీఎస్టీకి మార్గం సుగమం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. జీఎస్టీ కోసం పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారేందుకు 31 రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే పలు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా మిగిలిన శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే అవకాశాలున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
వేంకటేశ్వరునికే శఠగోపం...
- అక్రమ మార్గంగా డబ్బులు వసూలు కల్యాణ మండపం నిర్వాహకులు - పదినెలలుగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించని వైనం - నిబంధనలకు విరుద్దంగా పలు ఎగ్జిబిషన్ల ఏర్పాటు.. సాక్షి,సిటీబ్యూరో: కలియుగ దైవం వేంకటేశ్వరునికీ అక్రమార్కులు శఠగోపం పెట్టారు. హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఈ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ ఇటు టీటీడీ ఖజనాకు అటు భక్తుల జేబులకు చిల్లుపెడుతున్నారు. దీనిని నిరోధించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి మిన్నకుండిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలిలా.. తితిదే కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తోన్న ఓ సంస్థ ఆయా ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో స్టాల్ నుంచి రోజుకు రూ.1000 అద్దె వసూలు చేస్తోంది. ఇలా ఒక్కొ ఎగ్జిబిషన్లో 30నుంచి 40స్టాల్స్ ఉంటాయి ఇవి నెలలో సుమారు పక్షం రోజుల పాటు నడుస్తాయి. దీంతో ఆయా స్టాళ్ల నిర్వాహకుల నుంచి నెలకు రూ.5 నుంచి 6 లక్షలు వసూలు చేయడంతోపాటు ఈ అక్రమార్జనలో టీటీడీ అధికారులకు సైతం మామూళ్లు ముట్టజెబుతుండడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆలయాలు, వాటికి అనుసంధానంగా కల్యాణమండపాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ అంతా టీటీడీ నుంచే కొనసాగుతుంది. నిబంధనల ప్రకారం కల్యాణ మండపాలను ఆలయానికి సంబంధించిన అధికారులే నిర్వహించాలి. అయితే హిమాయత్‌నగర్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్రమ మార్గంలో లక్షలు వెచ్చించి పై స్థాయిలో పైరవీలు నడిపి ఎస్.వైష్ణవి’ లెసైన్స్ పేరుతో ఓ వ్యక్తి రూ.63.14 లక్షలు చెల్లించి కల్యాణ మండప నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని పలు ఎగ్జిబిషన్లకు అద్దెకిస్తూ పెట్టిన పెట్టుబడికి నాలుగురెట్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సేవాపన్నుకూ ఎగనామమే..! వైష్ణవి పేరుతో 2015అక్టోబర్ 22వ తేదీన టిటిడి లెసైన్సును మంజూరు చేసింది. అయితే కల్యాణ మండపంను నిర్వహిస్తున్నందుకు గాను టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి నెలా సేవాపన్ను చెల్లించాల్సి ఉంది. పది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఈ పన్ను చెల్లించలేదు. టిటిడి అధికారులు లెసైన్సుదారులను ప్రశ్నిస్తే తన పేరుపై లెసైన్సు నంబర్ ఉంది కాబట్టి నేను కట్టాల్సిన అవసరం లేదని మొండికేయడం గమనార్హం. ఇద్దరి మధ్య వైరంతో దేవుని ఖాతాలో జమ కావాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబులు నింపుతోందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇంజినీరింగ్ అధికారి ఏమంటున్నారంటే... టిటిడి కల్యాణ మండపంలో బహిరంగంగా జరుగుతోన్న ఈ అవినీతిభాగోతంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.చంద్రశేఖర్‌ను..సాక్షి’ ప్రశ్నించగా అడ్డగోలుగా వసూలు చేస్తున్న విషయం తమ దష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించే విషయంలో ఉన్నత అధికారులు సైతం కఠినంగా ఉన్నారన్నారు. -
రియల్టీకి జీఎస్టీ ఏం తెస్తోంది?
స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? సర్వీస్ ట్యాక్స్లాగే అందుబాటు ఇళ్లకు జీఎస్టీని మినహాయించాలి ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం దీనికంటే జీఎస్టీ రేటు తక్కువుంటేనే స్థిరాస్తి రంగానికి లాభం వస్తు సేవలను చట్టం (జీఎస్టీ)కి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగం మీద జీఎస్టీ ప్రభావం ఎంత వరకుంటుంది? ధరలేమైనా తగ్గే అవకాశముందా? అందుబాటు ఇళ్ల పరిస్థితేంటి? వంటి అంశాలపై పలువురు స్థిరాస్తి నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది. హైదరాబాద్: ఐటీ రంగం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగం స్థిరాస్తి రంగమే. స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 7.8 శాతం వరకుంది. అలాంటి రంగంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, సవాళ్లు జీఎస్టీ అమలుతో సమసిపోతాయి కూడా. జీఎస్టీ ప్రయోజనం స్థిరాస్తి రంగంపై దీర్ఘకాలంలో ఉంటుంది. ఏకీకృత పన్ను వ్యవస్థలో పారదర్శకత వస్తుందనడంలోనూ ఎలాంటి సందేహం అక్కర్లేదు. జీఎస్టీ రేటును ఎంతనేది నిర్ణయించకుండానే నిర్మాణ రంగానికి లాభం చేకూరతుందనడం మాత్రం సరైంది కాదనేది నిపుణుల అభిప్రాయం. 27-33 శాతం పన్నులే.. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు స్థలాలు, ప్రాపర్టీలు, ఇతర నిర్మాణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి వివిధ రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా సేవల విలువ, వస్తువులు, ముడి పదార్థాల విలువ, భూమి విలువ అనే మూడు రకాలుగా ఉంటాయి. ఆయా పన్నులు విస్తీర్ణాన్ని, స్థలాన్ని, భవనాల ఎత్తును బట్టి కూడా మారుతుంటాయి. ‘‘ఇందులో వ్యాట్, సీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీలే కాకుండా నిర్మాణ అనుమతుల కోసం స్థానిక సంస్థల ఫీజులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, నాలా చార్జీ, చేంజ్ ఆఫ్ ల్యాండ్, లేబర్ సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇంపాక్ట్ ఫీ.. వంటి బోలెడు చార్జీలున్నాయి. వీటన్నింటినీ కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం వరకు పన్నులే ఉంటాయని’’ భారత స్థిరాస్తి బిల్డర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి చెప్పారు. అంటే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌లో మూడో వంతు పన్నుల రూపంలోనేపోతున్నాయన్నమాట. అయితే ఇప్పుడొస్తున్న జీఎస్టీ పరిధిలో సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీలు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన పన్నులు యథావిధే అన్నమాటేగా. ఈ పన్నులే స్థిరాస్తి రంగానికి భారంగా మారుతున్నాయి. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలూ పెరుగుతున్నాయి. ఫలితంగా స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండట్లేదు. ఇందులో వేటికీ మినహాయింపునివ్వకుండా జీఎస్టీని అమలు చేస్తే నిర్మాణ రంగానికి ఒరిగే ప్రయోజనమేమీలేదని రెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రయోజనం అప్పుడే.. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుల శాతం కంటే జీఎస్టీ రేటు తక్కువగా ఉంటేనే డెవలపర్లకు, కస్టమర్లకు ఇద్దరికీ లాభం. అంటే ప్రస్తుతం ముడి పదార్థాల మీద చెల్లిస్తున్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎకై ్సజ్ డ్యూటీల కంటే జీఎస్టీ రేటు తక్కువగా ఉండాలి. అప్పుడే నిర్మాణ రంగానికి ప్రయోజనం. లేకపోతే ఆ భారాన్ని కూడా కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కళిశెట్టి నాయుడు చెప్పారు. నిర్మాణ రంగం సిమెంట్, స్టీల్ వంటి సుమారు 250కి పైగా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. ఆయా రంగాలు చెల్లిస్తున్న రకరకాల పన్నుల భారం అంతిమంగా ఉత్పత్తుల ధరలపై పడుతున్నాయి. కానీ, ఇప్పుడు జీఎస్టీతో ఆ భారం ఉండదు కనక.. ఆ తగ్గింపు ధరలకూ చేరుతుంది. ఫలితంగా డెవలపర్లకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరుగుతుంది. అందుబాటు ఇళ్లకు మినహాయింపునిస్తేనే.. ‘‘గతంలోనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు 2016ను తీసుకొచ్చింది కేంద్రం. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు అమలులోకి రావాలంటే మరో ఏడాదైనా సమయం పడుతుంది. ఈ తరుణంలో జీఎస్టీ పేరిట మరో బిల్లు రావటం నిర్మాణ రంగానికి మంచిదే. అయితే ప్రస్తుతం ఎలాగైతే అఫడబుల్ హౌజింగ్‌కు సర్వీస్ ట్యాక్స్‌ను మినహాయింపునిచ్చారో.. అలాగే జీఎస్టీని కూడా మినహాయింపునివ్వాలి. లేకపోతే అందుబాటు ఇళ్లకు గిరాకీ ఉండదు. కేంద్రం తీసుకొచ్చిన ‘హౌజింగ్ ఫర్ ఆల్-2022’ పథకానికి పెద్దగా ప్రయోజనం ఉండదని’’ శేఖర్ రెడ్డి వివరించా రు. ప్రస్తుతం స్థిరాస్తి కొనుగోలుదారులకు భారమయ్యేది స్టాంప్ డ్యూటీ దగ్గరే. అందుకే దీన్ని జీఎస్టీలో మిళితం చేయాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించాం. కానీ, పట్టించుకోలేదన్నారు. ధరలు తగ్గుతాయా? స్థిరాస్తి ధరలు తగ్గుతాయా లేదా అనేది జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అయితే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లపై జీఎస్టీ ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లించేసి ఉంటారు. అయితే నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు మాత్రం జీఎస్టీ లబ్ధి చేకూరుతుంది. అదెలాగంటే.. సిమెంట్, స్టీలు, రంగులు, శానిటరీ వంటి నిర్మాణ సామాగ్రిపై చెల్లించే వివిధ రకరకాల పన్నుల భారం డెవలపర్లకుండదు. దీంతో నిర్మాణ వ్యయమూ తగ్గుతుంది. ఫలితంగా స్థిరాస్తి ధరలూ తగ్గుతాయి. కానీ, రకరకాల కారణాలతో డెవలపర్లు ఆ తగ్గింపును కొనుగోలుదారులకు చేరవేర్చరనేది కొనుగోలుదారుల వాదన. వాణిజ్య ప్రాజెక్ట్‌లకు చెల్లించే అధిక పన్నుల భారం తగ్గి.. వాణిజ్య ప్రాజెక్ట్‌లు లీజులు, అద్దెలూ పెరిగే అవకాశముంది. -
రాష్ర్ట ఆదాయానికి స్టార్ హోటల్స్ గండి
సాక్షి, సిటీబ్యూరో: హోటల్లో ఆహారం తిన్నందుకు కస్టమర్ నుంచి వసూలు చేస్తున్న సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) ప్రభుత్వానికి చేర డం లేదు. ఇలా పన్ను కట్టని ప్రముఖ రెస్టారెంట్లు నగరంలో చాలానే ఉన్నాయి. ఇవి చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.100 కోట్లకు పైనే. మరికొన్ని సంస్థలైతే కనీసం ఈ విభాగం వద్ద రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. ఈ అంశాలను సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం తీవ్రంగా పరిగణించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇలాంటి హోటళ్లపై సేవల పన్ను (ఎస్టీ) విభాగం చర్యలకు సిద్ధమైంది. ఆయా సంస్థల జాబితా సిద్ధం చేసిన అధికారులు దాడులకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల్లో ‘అర్హులైన’ వారిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. కమర్షియల్ సేవలన్నీ ‘ఎస్టీ’ పరిధిలోకి.. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్ ఇచ్చే బిల్లులో వస్తువు విలువకు అదనంగా ‘సర్వీసు ట్యాక్స్’ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. కానీ చాలా సంస్థలు అందుకు దూరంగా ఉంటున్నాయి. రెస్టారెంట్స్‌కు 5.6 శాతం పన్ను సాధారణంగా వాణిజ్య సేవలు చేసేవారు విక్రయించే వస్తు విలువకు అదనంగా 14 శాతం (సెస్‌తో 15 శాతం) సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అయితే రెస్టారెంట్స్‌లో ఆహారం, పానీయాలు సరఫరా చేస్తుండడం, వాటి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటికి సర్వీస్ ట్యాక్స్ 5.6 శాతంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు జంట నగరాల్లోని 1500 రెస్టారెంట్లు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు వార్షిక రిటర్న్స్ దాఖలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని రెస్టారెంట్ల ఆర్థిక లెక్కలు పక్కాగా లేవని, వినియోగదారుడి నుంచి వసూలు చేసిన సర్వీస్ ట్యాక్స్ మొత్తాన్ని ఎస్టీ విభాగానికి విభాగానికి చెల్లించట్లేదని అధికారులు గుర్తించారు. మరికొన్ని రెస్టారెంట్లు కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని తేల్చారు. ‘ఏసీ’ ఉంటే ‘ఎస్టీ’ వర్తింపు సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్ ఎస్టీ పరిధిలోకి రాదు. కేవలం ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) సదుపాయం ఉన్నవే సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఏసీ రెస్టారెంట్‌లోని నాన్–ఏసీ భాగంలో కూర్చుని ఆహారం స్వీకరించినవారి నుంచి సైతం సర్వీసు ట్యాక్స్ వసూలు చేయవచ్చు. నగరంలో ఉన్న ఆయా రెస్టారెంట్లు ఏటా సరైన రిటర్న్స్ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. ఆయా యాజమాన్యాలకు చెందిన ఆదాయ పన్ను రిటర్న్్సతో పాటు బ్యాంక్ లావాదేవీలను సేకరించి విశ్లేషించింది. తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో ఎస్టీ విభాగం ‘వాంటెడ్’ జాబితాలను రూపొందించింది. ‘పరిమితి’ దాటితే జైలుకే... వీటిలో ఇప్పటికే బంజారాహిల్స్, పంజగుట్టల్లో ఉన్న రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌పై సర్వీస్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడలో ఉన్న మరో మూడు ప్రముఖ రెస్టారెంట్స్ లావాదేవీలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. భారీ బకాయిదారులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో వీరి జాబితాను సిద్ధం చేసిన విభాగం అధికారులు ఆయా సంస్థలు, వ్యక్తులకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.2 కోట్లకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్–బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారం కూడా సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో సమన్లకు స్పందించని వారిపై వరుస దాడలు చేయడంతో పాటు అరెస్టులు చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి రెస్టారెంట్స్‌పై సర్వీస్ ట్యాక్స్ విభాగం వరుస దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
బార్ల పాలసీ వాయిదా!
- సర్కార్‌కు ఆబ్కారీ శాఖ సిఫారసు... త్వరలో ఉత్తర్వులు - సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ప్రయత్నాల్లో భాగంగానే వాయిదా సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి అమల్లోకి రానున్న‘2016-17 బార్ల పాలసీ’ నెలరోజుల పాటు వాయిదా పడనుంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు పొందే చర్యల్లో భాగంగా బార్ల పాలసీని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న బార్ల లెసైన్సులను మరో నెలరోజుల పాటు రెన్యువల్ చే యాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ప్రభుత్వానికి సోమవారం సిఫారసు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావలసి ఉంది. లెసైన్సు ఫీజుల మీద పన్ను భారంతోనే!: కేంద్ర ప్రభుత్వ నూతన సర్వీస్‌ట్యాక్స్ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగే ఎలాంటి సేవకైనా కేంద్రానికి 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో బార్ల పాలసీని ప్రకటిస్తే లెసైన్సు ఫీజుల రూపంలో వసూలు చేసే వందల కోట్ల రూపాయల నుంచి కేంద్రానికి 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ వర్తించకుండా ఎక్సైజ్ చట్టంలోనే మార్పులు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బార్ల పాలసీని ప్రకటించి నష్టపోకూడదని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా గత శనివారం ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను వివరణ కోరుతూ లేఖ రాశారు. బార్ల లెసైన్సు ఫీజులు, బార్ల కొత్త పాలసీకి సంబంధించి ఏంచేయాలన్న విషయమై తగిన సిఫారసులు పంపాలని కోరారు. ఈ మేరకు సోమవారం కమిషనర్ చంద్రవదన్ టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్‌రెడ్డితో కలసి అజయ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొనసాగుతున్న 804 బార్ల లెసైన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ రెన్యువల్ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఫీజులను పన్నులుగా మార్చేందుకు కసరత్తు: సర్కార్‌కు భారీగా ఆదాయాన్నిచ్చే ఆబ్కారీ శాఖను పన్నుభారం నుంచి కాపాడేందుకు ఆబ్కారీ చట్టానికే మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులను పన్నులుగా మారుస్తూ కొత్త చట్టం రూపొందించే పనిలో ఉన్నారు. జూలై నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఆగస్టు నుంచి కొత్త బార్ల పాలసీ అమలులోకి రానుంది. -
ఆబ్కారీ శాఖకు సేవాపన్ను దెబ్బ!
- రూ.492 కోట్లు కేంద్రం ఖాతాలోకి - జూన్ 1 నుంచి అమల్లోకొచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనలు సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఈనెల నుంచి అమలులోకి వచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెడుతున్నాయి. కేంద్రం 2015 నాటి బడ్జెట్లో సర్వీస్ ట్యాక్స్ పరిధిని పెంచి.. స్థాని క ప్రభుత్వాలు, సంస్థల ద్వారా సాగే అన్ని సేవలకు అన్వయించింది. ఈ నిబంధనలు 2016 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు ఫీజులు చెల్లించి పొందే పలు సేవలపై 14 శాతం పన్నుతో పాటు 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్, 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్‌లతో కలిపి 15 శాతం చెల్లించాలి. ఈ పరి ణామం ఆబ్కారీ శాఖపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆబ్కారీ శాఖ 2016-17 అంచనాల ప్రకారం వివిధ రకాల ఫీజుల కింద రూ. 3,279 కోట్లు సమకూరనుండగా, ఈ మొత్తం పై సర్వీస్ ట్యాక్స్, సెస్సుల రూపంలో కేంద్రానికి రూ.492 కోట్లు జమచేయాల్సి ఉంటుంది. ఫీజులన్నీ పన్ను పరిధిలోకే... ఈనెల నుంచి అమలులోకి వచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనల మేరకు... సేవలు అందిస్తూ వసూలు చేసే ఫీజులన్నీ పన్ను పరిధిలోకే వస్తాయి. రాష్ట్రంలో నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, మైన్స్, స్థానిక సంస్థలు తదితర శాఖల్లో సాగే కాంట్రాక్టు పనులకు చేసే చెల్లింపులు, వసూలు చేసే ఫీజులకు ‘రివర్స్ చార్జ్’ కింద సేవలు పొందేవారు కేంద్రానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో వసూలయ్యే ఫీజులన్నీ సేవల పరిధిలోకి రానున్నాయి. తద్వారా ఎక్సైజ్ శాఖకు 2016-17లో వ్యాట్ పోగా రూ.4,533 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్ను పరిధిలోకి రాని డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, ఇతర పన్నులు రూ. 1,254 కోట్లు పోగా, రూ. 3,279 కోట్లకు 15 శాతం పన్ను కింద రూ. 492 కోట్లు కేంద్రానికి చెల్లించాలి. ఢిల్లీలో ప్రయత్నాలు..: జూన్ ఒకటో తేదీ నుంచి 15 శాతం సర్వీస్‌ట్యాక్స్ అమలులోకి రావడంతో ఉన్నతాధికారులు భారం తప్పించుకునే మార్గాలపై దృష్టిపెట్టారు. కొద్దిరోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపారు. ఇ.వై. అనే ట్యాక్స్ కన్సల్టెన్సీ కంపెనీతో సమావేశమై సేవాపన్ను మినహాయింపునకు సలహాలు కోరారు. ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులను పన్ను రూపంలోకి తీసుకువస్తే సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉందని ఆ కంపెనీ చెప్పినట్లు సమాచారం. సేవా పన్ను పరిధిలోకి వచ్చే ఫీజులు.. డిస్టిలరీ లెసైన్స్ ఫీజు, హోల్‌సేల్ లెసైన్స్ ఫీజు, రిటైల్ లెసైన్సు ఫీజు, ప్రివిలేజ్ ఫీజు, బార్లు, క్లబ్బుల లెసైన్సు ఫీజు, బ్రాండ్ రిజిస్ట్రేషన్, అప్రూవల్ ఫీజు. తెలంగాణ, ఏపీలకే అధిక భారం ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆబ్కారీ శాఖలే భారీ మొత్తంలో సేవా పన్ను చెల్లించాల్సి వస్తోంది. 2015 కేంద్ర బడ్జెట్లోనే సర్వీస్ ట్యాక్స్ నిబంధనలకు సవరణలు చేసి ఆమోదించగా, 2016 వరకు ఈ రెండు రాష్ట్రాల పెద్దలు పట్టించుకోలేదు. కానీ కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్సైజ్ శాఖలోని ఫీజులను అడిషనల్ డ్యూటీలు, పన్నుల రూపంలోకి మార్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాతపద్ధతిలోనే కొనసాగుతుండడంతో తెలంగాణ రూ. 492 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 519 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం
రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు. -
పన్నుల పెంపు.. ధరలపై ఒత్తిడి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో సర్వీసు పన్నులు దాదాపు 25శాతం పెరిగాయట. ఆర్థికసంవత్సరం 2016లో దాదాపు రూ.2.1లక్షల కోట్లు సేకరించినట్టు అంచనా. అయితే ఈ పన్నుల పెరుగుదల కారణంగానే రిటైల్ ధరల పెరుగుదలపై ఒత్తిడి తీవ్రతమవుతుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిడి, కార్లు, మొబైల్ ఫోన్లపై వేసే ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కంటే ఈ సర్వీసు పన్నులు ఎక్కువగా ఉన్నాయట. 2015 ఏప్రిల్ లో ప్రభుత్వం సేకరించిన 12.3 శాతం పన్నులు 2015 మే వరకు 14శాతానికి పెరిగాయని తెలుస్తోంది. రెస్టారెంట్లు, పెట్రోలు పంపులు, మల్టీ ఫ్లెక్సిల్స్ లాంటి వాటిపై వేసే పన్నులు సర్వీసు టాక్స్ ల కిందకు వస్తాయి. పీవీఆర్ భారత్ లో కలిగిఉన్న 500 మల్టీప్లెక్సిల్స్ పై రూ.1,750 కోట్ల అమ్మకాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ.40కోట్లు సర్వీసు పన్నులు చెల్లించారట. అయితే 2014 ఆర్థికసంవత్సరంలో ఈ పన్నుల మొత్తం కేవలం రూ.7.3కోట్లు మాత్రమే. అయితే కేవలం పన్నుల రేట్లు పెంచడం ద్వారానే ఈ మొత్తం పెరగడం లేదని, పన్నుల ఎగవేతపై ప్రభుత్వం తీసుకునే చర్యలు సర్వీసు పన్నుల కలెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.. అయితే పన్నుల రేట్ల పెంపు, టాక్స్ బేస్ పెరగడం కూడా పన్నుల కలెక్షన్ కు సహాయపడుతుందని తెలిపారు. టెక్నాలజీ సహాయంతో సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ పన్నుల ఎగవేతదారులను గుర్తించడం ప్రారంభించింది. దీంతో ఎగవేతదారులను నిరోధించగలిగామని సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. -
31 లోపు ఎక్సైజ్ సుంకం, సేవాపన్ను చెల్లించాలి
విజయవాడ బ్యూరో: కేంద్ర ఎక్సైజ్, సర్వీసు ట్యాక్సుల పరిధిలో ఉన్న సంస్థలు, తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సిన 2015-16 ఆర్థిక సంవత్సరపు ఎక్సైజ్ సుంకాలు, సేవాల పన్నులను ఈ నెల 31లోగా చెల్లించాలని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి. నాగేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) ముందస్తు సేవా పన్నులు చెల్లించువారు కూడా ఈ నెల 31లోగానే జమ చేసి సహకరించాలన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పన్నులు చెల్లించని వారి నుంచి వడ్డీలు, అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఈ-పేమెంటు పద్ధతిలో చెల్లించే వారికి కూడా 31నే ఆఖరు తేదీగా పేర్కొన్నారు. శాఖకు సంబంధించిన పాత బకాయిలు, వడ్డీలు, కేసులకు సంబంధించిన పెనాల్టీలను కూడా నెలాఖరులోగా చెల్లించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం గుంటూరు ఫోన్ 0863-2321554, విజయవాడ ఫోన్0866-2573672 లలో సంప్రదించాలని నాగేంద్రరావు కోరారు. -
ఏదీ మీ ‘సర్వీస్’?
బొగ్గు సరఫరా సంస్థపై సర్వీస్ ట్యాక్స్ దాడులు సిటీబ్యూరో: నగరం కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రముఖ బొగ్గు సరఫరా సంస్థపై సర్వీస్ ట్యాక్స్ విభాగం సోమవారం దాడులు చేసింది. ఆ సంస్థకు చెందిన రెండు కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ప్రధాన కార్యాలయం ఉన్న ఓ కార్పొరేట్ సంస్థ బొగ్గు సరఫరా వ్యాపారంలో ఉంది. సిమెంట్, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న 35 పేరున్న ప్రైవేట్ సంస్థలతో పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకూ వీరు బొగ్గును సరఫరా చేస్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన... ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆ సంస్థలు ఈ మొత్తాన్ని సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. బొగ్గును సేకరించి, సరఫరా చేస్తున్న ఈ సంస్థ సైతం వాణిజ్య అవసరాలకు సేవలు అందిస్తున్నట్లేనని సర్వీస్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. ఈ తరహా వ్యాపారంపై ఏటా 12.36 శాతం (ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 14 శాతం) పన్నును ఆ సంస్థ తన క్లైంట్స్ నుంచి వసూలు చేసి... ఆ మొత్తాన్ని సర్వీస్ ట్యాక్స్ విభాగానికి జమ చేయాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు సక్రమంగా లేవని సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సంస్థకు చెందిన సోమాజిగూడ, బంజారాహిల్స్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. లావాదేవీలకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నామని... వాటి ఆధారంగా సర్వీస్‌ట్యాక్స్ బకాయిలు లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
‘సాఫ్ట్’ రంగంపై ‘సేవా’ కన్ను
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సేవల పన్ను విభాగం కన్నేసింది. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల నుంచి పొందుతున్న సర్వీసులకు సంబంధించి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఆదాయపు పన్ను శాఖకు ఆయా కంపెనీలు సమర్పించిన వార్షిక నివేదికల్ని పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ లోతుగా ఆరా తీస్తోంది. రివర్స్ చార్జ్ మెకానిజం ప్రకారం లెక్కలేస్తున్న అధికారులు అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రూ.వందల కోట్లు బకాయిపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. త్వరలోనే కొన్ని సంస్థలకు తాఖీదులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాణిజ్య సేవలపై 14 శాతం పన్ను... వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. ఈ పన్ను గత ఆర్థిక సంవత్సరం వరకు 12.36 శాతం ఉండగా... ఈ ఏడాది నుంచి 14 శాతానికి పెరిగింది. హైదరాబాద్, సైబరాబాదుల్లో అనేక స్థానిక, మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా దేశవిదేశాల్లోని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వివిధ రకాలైన సేవలు అందించడం (సర్వీస్ ఎక్స్పోర్ట్) ద్వారా వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రివర్స్ చార్జ్ మెకానిజం వర్తిస్తుందని... దేశంలో ఉన్న సంస్థ విదేశాల్లో ఉన్న కంపెనీల నుంచి వాణిజ్య అవసరాలకు సేవలు పొందితే... సేవల పన్నును విదేశీ సంస్థ చెల్లించాలి. అయితే ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాని నేపథ్యంలోనే సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రివర్స్ చార్జ్ మెకానిజం వర్తింపజేస్తుంది. దీనిప్రకారం విదేశీ సంస్థ నుంచి సేవలు పొందే దేశీయ సంస్థే సేవా పన్ను మొత్తాన్ని తాను చేస్తున్న చెల్లింపుల నుంచి మినహాయించి, దాన్ని సర్వీస్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్కు జమ చేయడం కచ్చితం చేశారు. దీని విధానం ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు సేవల పన్ను పరిధిలోకి వస్తాయని కమిషనరేట్ గుర్తించింది. ‘గ్రేటర్’లో ఉన్న సంస్థల జాబితాను సేకరించిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు అధ్యయనం ప్రారంభించారు. తాఖీదులు ఇవ్వడానికి సన్నాహాలు... కొన్ని కంపెనీల ఐటీ రిటర్స్న్ను పరిశీలించిన అధికారులు రివర్స్ చార్జ్ మెకానిజం పద్ధతిలో రూ.వందల కోట్లు సర్వీసు ట్యాక్స్ బకాయి ఉన్నట్లు గుర్తించారు. వీటికి పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాఖీదులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.50 లక్షల కంటే ఎక్కువ సర్వీసు ట్యాక్స్ బకాయి ఉన్న సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడానికి, అనుమతులతో అరెస్టు చేయడానికి సేవలపన్ను విభాగానికి అధికారం ఉంది. ఈ విషయాన్నీ తాఖీదుల్లో కంపెనీల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో సర్వీస్ ట్యాక్స్‌పై సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను వసూళ్లలో ఎదరవుతున్న న్యాయపరమైన అడ్డంకులపై అవగాహన కల్పించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగే ఈ అవగాహనా సదస్సులో కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్‌ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్‌తో పాటు ఈ రంగానికి చెందిన ఇతర టెక్నికల్ స్పీకర్లు పాల్గొంటున్నట్లు ఐసీఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సదస్సులో పాల్గొనే సీఎంఏ మెంబర్స్ రూ. 800, ఇతర కార్పొరేట్ ప్రతినిధులు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. -
రేపటి నుంచే ‘సేవల’ బాదుడు!
14 శాతానికి చేరనున్న సేవా పన్ను * మరిన్ని సేవలు దీని పరిధిలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా చెల్లిస్తున్న సర్వీసు ట్యాక్స్(సేవా పన్ను) సోమవారం నుంచి మరింత పెరుగుతోంది. 12 శాతంగా ఉన్న ఈ ట్యాక్స్‌ను ఇక నుంచి 14 శాతానికి పెంచుతున్నారు. పెపైచ్చు వినోద రంగానికి సంబంధించిన కొన్ని సేవలతో పాటు ఇప్పటిదాకా సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రాని పలు సేవల్ని సోమవారం నుంచి దీని పరిధిలోకి తెస్తున్నారు. హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలకూ జూన్ 1 నుంచీ అదనపు భారం పడబోతోంది. సేవల పన్ను 12.36 శాతం (విద్యా సెస్సు కూడా కలిపి) నుంచి 14 శాతానికి పెరుగుతుండటమే దీనికి కారణం. దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచి ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవలి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ భారమే: పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడే అవకాశాలున్నాయి. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగం తాజా పరిస్థితి పట్ల ఆందోళన చెందుతోంది. సేవల పన్ను పెంపు వల్ల నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి అసలే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణరంగం కుదేలవుతుందని రియల్టీ సంస్థలు అంటున్నాయి. ప్రతి ఒక్కరిపై ఏదో రకంగా సేవల పన్ను పెంపు భారం పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సామాన్యునికిది పెను భారమనడంలో సందేహం లేదు. ప్రభుత్వానికి లాభమెంత?.. సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపుతో ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ. 2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40వేల కోట్లు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట. ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు చార్జీలు అరశాతం పెంపు కొత్త సేవా పన్ను అమల్లోకి రానుండడంతో జూన్ 1 నుంచి ఏసీ క్లాస్, ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణ చార్జీలు 0.5 శాతం పెరగనున్నాయి. సరుకు రవాణా చార్జీలూ 0.5 శాతం పెరగనున్నాయి. ఏసీ క్లాస్ టికెట్ రూ.వెయ్యి దాటితే రూ. 10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
-
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం ...........శ్రీరంగం కామేష్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది. టీడీపీ నుంచి అద్దె వసూలు చేస్తున్న ట్రస్ట్ 1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ ఆధీనంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (బంజారాహిల్స్)ను వీరే నిర్వహిస్తున్నారు. ఇందులోని 35 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో నెలకు రూ.10.5 లక్షల చొప్పున టీడీపీకి అద్దెకు ఇచ్చారు. వాణిజ్య అవసరాలకు తమ స్థలాలు, భవనాలను అద్దెకు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు.. అద్దెకు ఉంటున్న వారి నుంచి నిర్ణీత అద్దెతో పాటు అదనంగా 12.36 శాతం (ఈ బడ్జెట్లో దీన్ని 14 శాతానికి పెంచారు) చొప్పున సర్వీసు ట్యాక్స్‌ను వసూలు చేసి.. ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎకై్సజ్‌కు చెల్లించాలి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అలా చేయకుండా 2014 వరకు కార్యకలాపాలు సాగించింది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి: గత సాధారణ ఎన్నికల అనంతరం.. టీడీపీకి వచ్చిన విరాళాలు, ఆ పార్టీ చేసిన ఖర్చులపై ఈడీ దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో టీడీపీ-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య ఉన్న అద్దె చెల్లింపు ఒప్పందం, ట్రస్ట్ సేవా పన్ను చెల్లించకపోవడం వెలుగులోకి వచ్చా యి. ఈ విషయాన్ని ఈడీ జాయింట్ డెరైక్టర్ కేఎస్‌వీవీ ప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 23న సర్వీస్ ట్యాక్స్ విభాగానికి రహస్య లేఖ (ఎఫ్ నెం. టి-3/44/హెచ్‌జెడ్0/2011/2350) ద్వారా తెలియజేశారు. దీం తో సర్వీస్ ట్యాక్స్ విభాగం గత ఏడాది అక్టోబర్‌లో ట్రస్టీలకు నోటీసు జారీ చేసింది. దీంతో.. అద్దె స్వీకరిస్తున్నప్పటికీ అప్పటివరకు సర్వీస్ ట్యాక్స్ విభాగంలో రిజిస్టర్ చేసుకోని ట్రస్ట్.. వెనువెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసింది. అరెస్టు తప్పించుకునేందుకు ట్రస్ట్ ప్రతినిధులు సదరు డిపార్ట్మెంట్ను సంప్రదించినప్పుడు అద్దె ఒప్పంద పత్రం లో ఎక్కడా సర్వీస్ ట్యాక్స్ ప్రస్తావన లేకపోవడం, ఒప్పందం కమ్ వాల్యూ (చెల్లించిన అద్దెలోనే సేవల పన్ను కూడా కలిపి ఉండటం) విధానంలో ఉందని నిర్ధారించిన అధికారులు.. అద్దె ద్వారా వచ్చే ఆదాయం లో 10.3 శాతం (కమ్ వాల్యూ విధానంలో 12.36% కాకుండా 10.3% వసూలు చేస్తారు) చొప్పున సేవా పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ విధంగా 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ.70 లక్షల వరకు కట్టాలని మరో నోటీసు జారీ చేశారు. రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని అరెస్టు చేసే అధికారం ఉంటుందని తెలుసుకున్న ట్రస్టీలు.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ట్రస్ట్ నుంచి స్పందన లేకపోవడంతో సర్వీస్ ట్యా క్స్ అధికారులు.. ఇటీవల తుది తాఖీదులు సైతం జారీ చేశారు. సరైన స్పందన రానిపక్షంలో ట్రస్ట్ భవన్‌పై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కొన్ని చౌక.. మరికొన్ని ప్రియం
నేటి నుంచి అమల్లోకి సేవా పన్ను ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బడ్జెట్లో పేర్కొన్న కొన్ని సేవా పన్ను ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుండటంతో మ్యూజియాల, జంతు ప్రదర్శన శాలల, జాతీయ పార్కుల, జంతు సంరక్షణ శాలల ప్రవేశ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. వీటి కి సేవా పన్ను మినహాయింపు ఇచ్చారు. వీటితోపాటు వరిష్ట పెన్షన్ బీమా యోజన, అంబులెన్స్ సర్వీసులు, కూరగాయల, పండ్ల రిటైల్ ప్యాకింగ్ వంటి వాటిపైన కూడా సేవా పన్ను విధించలేదు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల ధరలు మాత్రం పెరగనున్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న 40 శాతం సేవా పన్ను నేటి నుంచి 60 శాతానికి పెరుగుతుంది. సేవాపన్ను కిందకు మ్యూచువల్,చిట్ ఫండ్స్ సేవలు ఇకపై మ్యూచువల్ ఫండ్స్ సేవలు, లాటరీ టికెట్ల మార్కెటింగ్, డిపార్ట్మెంట్ల పబ్లిక్ టెలిఫోన్లు, ఎయిర్‌పోర్ట్స్, హాస్పిటల్స్ ఉచిత టెలిఫోన్ కాల్స్ సేవా పన్ను కిందకు రానున్నాయి. చిట్ ఫండ్స్‌కు సంబంధించిన లావాదేవీలకూ సేవా పన్ను వర్తించనుంది. ప్రభుత్వానికి సంబంధించిన చారిత్రక కట్టడాల, నీటిపారుదల పనులు, తాగు నీటి సరఫరా, మురికి నీటి శుద్ధి నిర్వహణ వంటి వివిధ నిర్మాణాత్మక సేవలకు ఏప్రిల్ 1 నుంచి సేవా పన్ను మినహాయింపు ఉంటుంది. జానపద, శాస్త్రీయ కళాకారులు అందించే సేవల విలువ రూ. లక్షకు తక్కువగా ఉంటే వాటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. రైలు, రోడ్డు మార్గాలలో రవాణా చేసే ఆహార పదార్థాలకు (బియ్యం, పప్పు ధాన్యాలు, పాలు, ఉప్పు మాత్రమే) పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు అందించే నిర్మాణ సర్వీసులకు కల్పిస్తున్న పన్ను మినహాయింపులు ఇకపై ఉండవు. -
వదిలేదెంత.. మిగిలేదెంత?
న్యూఢిల్లీ: 2015-16 బడ్జెట్లో వేతన జీవులను ఉస్సూరుమనిపించిన విత్తమంత్రి జైట్లీ... జనం జేబుకు మాత్రం బాగానే చిల్లుపేట్టేశారు. సేవల పన్ను పెంపు ద్వారా దండిగా ఖజానాను నింపుకోనున్నారు. అయితే, మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కోసం దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపులు, మినహాయింపులు ఇచ్చారు. కొన్ని సేవలను సర్వీసు పన్ను పరిధి నుంచి తప్పించడం కూడా కంటితుడుపుకిందే లెక్క. మొత్తంమీద ఈ బడ్జెట్లో జనాలకు ఒరిగేది గోరంత... వదిలేది కొండంత అన్నది తేటతెల్లమైంది. ఇవి పెరుగుతాయ్... వాణిజ్య వాహనాలు(పూర్తిగా తయారై దిగుమతి చేసుకున్నవి) ఎందుకంటే: దిగుమతి సుంకం 10% నుంచి 40%కి పెంపు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, మద్యం. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతం మేర పెంచారు. ఆల్కహాల్ ఉత్పత్తిపైనా సర్వీసు పన్ను విధింపు. రెస్టారెంట్లు-హోటళ్ల బిల్లులు, విమాన ప్రయాణం, బ్యూటీపార్లర్లు, స్పా సేవలు,. కేబుల్-డీటీహెచ్ సేవలు, ఫోన్ బిల్లులు, లాటరీ టికెట్లు, చిట్‌ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఫీజులు, బీమా ప్రీమియం. అమ్యూజ్మెంట్ పార్కులు, సంగీత కార్యక్రమాల టిక్కెట్లు. ఎందుకంటే: సేవల పన్నును 12.36% నుంచి(విద్యా సెస్సుతో కలిపి) 14 శాతానికి పెంచడం, కొన్నింటిని ఈ పన్ను పరిధిలోకి తీసుకురావడం. సిమెంటు, ప్లాస్టిక్ బ్యాగులు ఎందుకంటే: సిమెంటుపై ఎక్సైజ్ సుంకం టన్నుకు రూ.1,000 చొప్పున, ప్లాస్టిక్ బ్యాగులపై 12% నుంచి 15 శాతానికి పెంచడం సుగంధ పానీయాలు, ప్యాకేజ్డ్ తాగునీరు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12% నుంచి 18 శాతానికి పెంపు. దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 6% నుంచి 12.5 శాతానికి పెంపు. ఇవి తగ్గుతాయ్... ప్యాకేజ్డ్ పండ్లు, కూరగాయలు. ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు. మ్యూజియంలు, జూ-వన్యప్రాణి సంరక్షణ (జాతీయ పార్కులు) కేంద్రాల సందర్శన. ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు. దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు. ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానళ్లు, ఎల్ఈడీ బల్బులు-లైట్లు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. అంబులెన్స్, అంబులెన్సు సర్వీసులు. ఎందుకంటే: సేవల పన్ను నుంచి మినహాయింపు తోలు పాదరక్షలు(రూ.1,000 కంటే ఎక్కువ ధర) ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. అగర్బత్తీలు, పేస్ మేకర్లు. ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు. రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్లు. మైక్రోవేవ్ ఓవెన్లు. ఎందుకంటే: విడిభాగాలు, పరికరాలపై దిగుమతి సుంకంలో కోత. -
రూ. లక్ష దాటితే పన్ను కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: జానపద కళాకారులనూ సేవా పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. థియేటర్, వివిధ జానపద, సంగీత, నృత్య తదితర కళాకారులు తమ ఒక్క ప్రదర్శనకు లక్షకు మించి తీసుకుంటే, వారందరు వచ్చే ఏప్రిల్ నుంచి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కళాకారులకు సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంది. -
సేవా పన్నుల మోత
- 14 శాతానికి సర్వీస్ ట్యాక్స్ పెంపు న్యూఢిల్లీ: వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సేవా పన్నుల పెంపు ద్వారా అందరిపైనా మరింత భారం మోపారు. ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, విద్యా సెస్సును కలిపి మొత్తం రౌండ్ ఫిగరు 14 శాతం చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్లలో తిన్నా, హోటళ్లలో ఉన్నా, విమాన ప్రయాణాలు చేసినా, బ్యూటీ పార్లర్లకెళ్లినా మరింత అధికంగా చెల్లించాల్సి రానుంది. ఇక కేబుల్.. డీటీహెచ్ సేవలు, కొరియర్ సర్వీసులు, క్రెడిట్..డెబిట్ కార్డు సంబంధిత సేవలు, దుస్తుల డ్రై క్లీనింగ్ మొదలైనవి కూడా భారం కానున్నాయి. మరోవైపు, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్, బీమా సేవలతో పాటు ఇతరుల నుంచి పొందే చాలా మటుకు సర్వీసులు ప్రియం కానున్నాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ప్రీ కూలింగ్, రిటైల్ ప్యాకింగ్, లేబులింగ్ మొదలైన వాటిని సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడంతో ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, కూరగాయల రేట్లు కొంత తగ్గనున్నాయి. పేషెంట్లకు అందించే అంబులెన్స్ సర్వీసులను సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, మ్యూజియాలు, జూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి సందర్శకులకు కూడా సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, అమ్యూజ్మెంట్ పార్కులు.. థీమ్ పార్కులు లాంటి వాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవడంతో వీటిని సందర్శించడం మరికాస్త ఖరీదైన వ్యవహారం కానుంది. లాటరీ టికెట్లను సేవా పన్ను పరిధిలోకి చేర్చడంతో ఇకపై వీటి ధరలు పెరగనున్నాయి. ధూమపాన ప్రియులకు వాత..: ఎప్పటిలాగానే ఈ బడ్జెట్లో కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు వాత తప్పలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు ఆర్థిక మంత్రి. 65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుండే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 25 శాతం మేర, మిగతా వాటిపై 15 శాతం మేర పెంచారు. ఇక ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ. 1,000కి పెంచడంతో సిమెంటు రేట్లు మరింత పెరగనున్నాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు మొదలైన వాటిపైనా సుంకాన్ని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. అలాగే ఫ్లేవర్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ సైతం మరింత ప్రియం అవుతాయి. ఫోన్ బిల్లులూ భారం..: సర్వీస్ ట్యాక్స్ పెంపు భారాన్ని టెలికం కంపెనీలు వినియోగదారులకు బదలాయించనుండటంతో ఇకపై ఫోన్ బిల్లులూ భారం కానున్నాయి. దీనివల్ల బిల్లులు అరశాతం మేర పెరగవచ్చని జీఎస్ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. కొంత ఊరట..: దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పైనా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయి. వివిధ పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్ల ధరలు తగ్గనున్నాయి. అగర్‌బత్తీలపై సుంకాన్ని ఎత్తేయడంతో చవకగా లభించనున్నాయి. -
అచ్చే దిన్ అంటూనే వాతలు..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ...అచ్చే దిన్ అంటూనే అందరికీ వాతలు పెట్టారు. 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచారు. ఈ అదనపు వాతతో ప్రభుత్వానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు సమకూరతాయి. పెరిగిన సర్వీస్ టాక్స్‌తో అన్ని సేవలు ఇక మరింత ప్రియం కానుంది. ఇక వేతన జీవులు ఎంతగానో ఎదురుచూసిన ఆదాయ పన్ను మినహాయింపు జోలికి ఆర్థిక మంత్రి పోలేదు. అయితే ఉద్యోగులకిచ్చే ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ను ఎనిమిది వందల నుంచి 16 వందలకు పెంచడం కాసింత ఊరటగా చెప్పుకోవచ్చు. జన్‌ధన్ యోజన పథకం విజయవంతం కావడంతో... కొత్తగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పేరుతో పేదలకు బీమా పథకాన్ని అమల్లోకి తేనున్నారు. ఏడాదికి 12 రూపాయల ప్రీమియం కడితే రెండు లక్షల రూపాయల కవరేజ్ ఈ పథకంలో ఇవ్వనున్నారు. అటల్ పెన్షన్ పేరుతో పేదలు, అణగారిన వర్గాలకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు. మరో వైపు కార్పొరేట్లకు పెద్ద పీట వేశారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వచ్చే నాలుగేళ్ల వరకు ఇది అమల్లో ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశీయంగా నల్లధనాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇక ఎప్పటిలాగానే సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. అలాగే వెయ్యి రూపాయలలోపు పాదరక్షల ధరలు తగ్గనున్నాయి. -
సినీ తారల ‘పన్ను’పోటు
-
కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నులను మార్చొద్దు..
బడ్జెట్లో యథాతథంగానే కొనసాగించాలి: సీఐఐ న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలతో పాటు సర్వీస్ పన్నును యథాతథంగా కొనసాగించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సర్వీస్ పన్ను, ఎక్సైజ్ సుంకాలు 12 శాతం చొప్పున ఉండగా.. కస్టమ్స్ సుంకం 10 శాతంగా అమలవుతోంది. తయారీ రంగం ఇంకా మందగమనంలోనే ఉందని.. మరోపక్క, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతమవ్వాలంటే ఈ సుంకాలు, పన్నులను పెంచకూడదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ నెల 28న మోదీ సర్కారు తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని సీఐఐ కోరింది. ఆదాయ తటస్థ రేటు(ఆర్ఎన్ఆర్)పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, జీఎస్టీ ముసాయిదా బిల్లు రూపకల్పనలో పరిశ్రమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా బెనర్జీ పేర్కొన్నారు. సీఐఐ విజ్ఞప్తుల్లో ఇతర ముఖ్యాంశాలివీ.. తయారీ రంగంలో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్నందున దీనికి గతంలో ఇచ్చిన సుంకాల తగ్గింపు చర్యలు చాలా అవసరం. 2014 ఫిబ్రవరిలో తయారీ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో భాగంగా ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించడం తెలిసిందే. అయితే, దీన్ని గత డిసెంబర్లో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆటోమోటివ్ విడిభాగాల పరిశ్రమకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. వాహన పరిశ్రమ కంటే ఈ విభాగంలో సుంకం అధికంగా ఉండటంవల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్(ఏపీఐ), ఫ్లై యాష్ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో పాటు పలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కస్టమ్స్ సుంకాన్ని ఇప్పుడున్న 10 శాతంగానే కొనసాగించాలి. దీని గరిష్టస్థాయిల్లో తగ్గింపులు చేయొద్దు. దీనివల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రతికూలంగా పరిణమిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా మలేసియా, థాయ్‌లాండ్, ఆసియాన్ ఇతరత్రా దేశాల నుంచి దిగుమతయ్యే చాలావరకూ ఉత్పత్తులపై తక్కువ కస్టమ్స్ సుంకాన్ని వర్తింపజేయాల్సి వస్తోంది. కొన్నిరకాల మెటల్ స్క్రాప్‌లపై అమల్లో ఉన్న 4 శాతం ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ(ఎస్ఏడీ)కి మినహాయింపునివ్వాలి. మరోపక్క, యంత్రపరికరాల దిగుమతితో సంబంధం ఉన్న అన్ని ప్రాజెక్టులపై ఎస్ఏడీని విధించాలి. ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ), కోకింక్ కోల్, వైన్, ఎయిర్ కండిషనర్స్ విడిభాగాలు, భద్రత(సేఫ్టీ) పరికరాల వంటి పలు కీలక ఉత్పత్తుల దిగుమతిపై సుంకాన్ని తగ్గించాలి. -
పాడి పశువుల బీమా.. రైతుకు ధీమా
పాడిరైతుల ప్రయోజనాలతో పాటు పాల ఉత్పత్తి పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించి రైతన్నకు ధీమా కల్పించింది. ప్రీమియం చెల్లింపును బట్టి పాడి రైతులకు కూడా ప్రమాద బీమా రక్షణ కల్పించింది. ఈ ఏడాది మార్చి 31లోపు ప్రీమియం చెల్లించిన వారికి బీమా వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. - కరీంనగర్‌అగ్రికల్చర్ బీమా ఇలా : ఏడాది లేదా మూడు సంవత్సరాలకు బీమా చేసుకునే అవకాశముంది. పశువు విలువ రూ.10వేలు ఉంటే బీమా ప్రీమియం రూ.790 చెల్లించాలి. ప్రభుత్వ రాయితీ రూ.395, సర్వీస్ ట్యాక్స్ రూ.90, రైతు వాటా రూ.455 చెల్లిస్తే మూడేళ్ల పాటు పశువుకు బీమా వర్తిస్తుంది. దీనికి అదనంగా రూ.50 ప్రీమియం కడితే రైతుకు మూడేళ్ల పాటు రూ.లక్ష బీమా వర్తిస్తుంది. ఉమ్మడి ప్రభుత్వం పశుబీమా పథకానికి క్రమేణా మంగళం పాడింది. గతేడాది నుంచి పశువులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. వేలాది రూపాయల విలువ గల పశువులు చనిపోతే రైతుకు తీవ్ర నష్టం కలిగింది. ఆర్థిక స్థోమత లేని రైతులు పాడి పశువుల పెంపకంపై వెనుకడుగు వేస్తుండడంతో క్రమంగా పశు సంతతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాడిరంగాన్ని అభివృద్ధి చేసే దిశలో పశువుల బీమాను పునరుద్దరించింది. జిల్లాలో పాడిపశువుల సంఖ్య 2.25 లక్షలు ఉండగా అందులో పాలిచ్చే పాడి పశువులు 1.50 లక్షల వరకు ఉన్నాయి. 2007-2009 వరకు అమల్లో ఉన్న పశువుల బీమాకు నిబంధనల ప్రకారం ఒక్క పాడిపశువుకు రూ.2100 ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. బీమా చేసిన పశువు ఆకస్మికంగా లేదా ప్రమాద ంతో మృతి చెందితే రూ.50వేలు పరిహారం అందించేవారు. ఒకసారి ప్రీమియం కడితే మూడేళ్ల పాటు బీమా వర్తించేది. 2011లో రైతు చెల్లించాల్సిన ప్రీమియం రూ.3 వేలకు పెంచి పరిహారాన్ని రూ.30 వేలకు కుదించడంతో రైతులు నిరాశ చెందారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పశుబీమా పథకం రైతులకు అనుకూలంగా ఉంది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో పశుబీమా కల్పించడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో పశువు విలువ రూ.10-60వేల వరకు పేర్కొంటూ రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి వెసులుబాటు కల్పించారు. నిబంధనలు అనుకూలం... తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశుబీమా పథకంలో నిబంధనలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పథకంలో ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాలకు బీమా చేసుకునే అవకాశముంది. పశువు విలువ రూ.10 వేలు ఉంటే బీమా ప్రీమియం మొత్తం రూ.790 చెల్లించాలి. ప్రభుత్వ రాయితీ రూ.395 వర్తిస్తుంది. సర్వీస్ ట్యాక్స్ రూ.90 గా నిర్ణయించారు. ఇందులో రైతు వాటా రూ.455 చెల్లిస్తే మూడేళ్ల పాటు పశువుకు బీమా వర్తిస్తుంది. దీనికి అదనంగా రూ.50 ప్రీమియం కడితే సంబంధిత రైతుకు సైతం మూడేళ్ల పాటు రూ.లక్ష బీమా సౌకర్యం కల్పించారు. ఇదే నిష్పత్తిలో పశువు విలువ రూ.60 వే ల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. దీంతో పాటు ఈ పథకంలో రైతుకు మరికొన్ని సౌకర్యాలు ఉన్నాయి. పశువు మృతి చెందిన తర్వాత సంబంధిత పశువైద్యాధికారిని సమాచారమిస్తే ఆయన పోస్టుమార్టం నిర్వహించి మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. గతంలో పోస్టుమార్టం అనంతరం బీమా కంపెనీ ప్రతినిధి వచ్చి ధ్రువీకరిస్తేనే బీమా పరిహారం అందేది. ఇప్పుడు దానిని తొలగించారు. పశువు చనిపోతే నెలరోజుల్లోపు రైతుకు పరిహారం అందుతుంది. బీమా ప్రీమియం చెల్లించిన 30 రోజుల తర్వాత నుంచి బీమా సౌకర్యం అమల్లోకి వస్తుంది. పశువుకు చెల్లించే ప్రీమియంతో పాటు రూ.20 అదనంగా చెల్లిస్తే సంబంధిత రైతుకు ఏడాదిపాటు రూ.లక్ష ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.50 అదనంగా చెల్లిస్తే రైతుకు మూడేళ్ల పాటు రూ.లక్ష వరకు ప్రమాదబీమా వర్తిస్తుంది. బీమా డబ్బులు నేరుగా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నేరుగా పరిహారం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పశుబీమా పథకంలో బీమా చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే పరిహారం చేరుతుంది. జిల్లాలో 2.25 లక్షల వరకు పాడి పశువులున్నాయి. పశుబీమా పథకంలో ప్రీమియం బట్టి పాడి రైతులకు ప్రమాదబీమా రక్షణ కల్పించారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. - డాక్టర్ రాంచందర్, పశుసంవర్దక శాఖ జేడీ -
రూ.536 కోట్లు చెల్లించండి
బీసీసీఐకి సర్వీస్ ట్యాక్స్ శాఖ డిమాండ్ న్యూఢిల్లీ: సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) శాఖ నుంచి బీసీసీఐకి గట్టి షాకే తగిలింది. గత పదేళ్ల కాలం నుంచి రాయల్టీ, మీడియా హక్కుల ద్వారా గడిస్తున్న ఆదాయంపై బీసీసీఐ దాదాపు రూ.536 కోట్లు చెల్లించాలని ఎస్టీ శాఖ డిమాండ్ చేసింది. 2004-05 నుంచి బోర్డుకు ఇప్పటిదాకా ఇదే విషయమై 19 షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 2004-05 నుంచి 2012-13 మధ్య కాలంలో రూ. 536.13 కోట్లు చెల్లించాలని పన్నుల అధికారుల నుంచి 19 షోకాజ్, డిమాండ్ నోటీసులు అందుకున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
టీటీడీలో ఆగనున్న రూ.100 కోట్ల పనులు
సాక్షి, తిరుమల: టీటీడీలో జరుగుతున్న సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులు ఆగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన సర్వీస్ ట్యాక్స్‌ను టీటీడీ భరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 27 నుంచి పనులు నిలిపివేయనున్నట్టు కాంట్రాక్టర్లు ప్రకటించారు. టీటీడీలో సుమారు 150 మంది కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. తిరుమలతో పాటు దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు టీటీడీ కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పనుల్లో సుమారు 4 శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర నిబంధన ఉంది. టీటీడీలో సర్వీస్ ట్యాక్స్ వివాదం 2007 నుంచి కొనసాగుతోంది. దీనిపై పలుమార్లు కాంట్రాక్టర్లకు, టీటీడీకి మధ్య చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు. రైల్వే, ఇరిగేషన్, ఆర్అండ్బీ తరహాలోనే తమకు మినహాయింపు ఇప్పించాలని, లేనిపక్షంలో ఆ సర్వీసుట్యాక్స్‌ను టీటీడీనే భరించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్షల్లో సర్వీసు ట్యాక్స్‌లు చెల్లించాలంటూ కొందరు కాంట్రాక్టర్లకు నోటీసులు అందాయి. ఇందులో భాగంగా ఈనెల 27 నుంచి టీటీడీ పరిధిలో అన్ని రకాల పనులు నిలిపివేస్తున్నట్టు కాంట్రాక్టర్ల సంఘం నేత టి.నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. -
ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె సైరన్
ఒంగోలు వన్‌టౌన్: ఆర్టీసీలో హైర్ బస్సుల సమ్మె సైరన్ మోగింది. అద్దె బస్సుల యజమానుల సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులన్నీ నిలిపివేసి సమ్మె చేస్తామని ఏపీ స్టేట్ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌కు ఈ నెల 8న సమ్మె నోటీస్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల యజమానులను కనీసం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులన్నింటినీ నిలిపివేసి నిరసన తెలపాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఒంగోలు రీజియన్ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి అద్దె బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి.మల్లేశ్వరరావు తెలిపారు. దీర్ఘకాలంగా అద్దె బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సర్వీస్ ట్యాక్స్ చెల్లింపు సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పటికీ సర్వీస్ ట్యాక్స్ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో తమ వద్ద నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేస్తూ ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించడం లేదన్నారు. బస్సులకు చెల్లించాల్సిన అద్దె చార్జీలు ప్రతినెల 10, 25 తేదీల్లో ఇవ్వాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీంతో బస్సుల యజమానులు అప్పుల్లో కూరుకుపోయి వ్యాపారం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2007, 2008, 2009 నోటిఫికేషన్ మేరకు బస్సు యజమానులకు ఇవ్వాల్సిన వేతన సవరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. డీజిల్ పెరిగినప్పుడల్లా ధరలు పెంచకపోవడంతో నష్టపోతున్నామని చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనపు ట్రిప్పులు తిప్పినప్పుడు వాటికి ఎటువంటి అనుమతి లేకుండా ఆ బిల్లులోనే రేటు తగ్గించకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు సంస్థ అధికారులకు సంబంధం లేకుండా గతంలో లాగా తామే నిర్ణయం తీసుకొని సంస్థకు ఎటువంటి అప్రతిష్ట రాకుండా చూడగలమన్నారు. వ్యాట్ట్యాక్స్కు సంబంధించి రాష్ర్టం మొత్తం మీద ఉన్న అద్దె బస్సులన్నింటి కీ ఒకే ట్యాన్ నంబర్ తీసుకొని ఆర్టీసీ యాజమాన్యమే ఆ ట్యాక్స్ చెల్లించాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అద్దె బస్సులన్నింటినీ ఒకే ఇన్య్సూరెన్స్ పాలసీ తీసుకొని చెల్లిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలయ్యేనా ?
ఢిల్లీలో నేడు 14వ ఆర్థిక సంఘంతో ఆర్థికమంత్రుల భేటీ హక్కు కోల్పోతామంటున్న రాష్ట్రాలు హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను ల విధానం తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కసరత్తు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న సర్వీస్టాక్స్, సేల్స్టాక్స్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కేంద్రం ద్వారానే ‘సరుకు, సేవా పన్ను (జీఎస్టీ)’ను దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జీఎస్టీ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలే వ్యతిరేకించినందున ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను నయానో, భయానో ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మోడీ హయాంలో గత జూలై 3న, ఆగస్టు 20న అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్రం సమావేశమైంది. మూడోవిడతగా బుధవారం నాడు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఢిల్లీలో ఆర్థికమంత్రుల సాధికారిక కమిటీ సమావేశమవుతోంది. సమావేశంలో జీఎస్టీపై కీలక నిర్ణ యం తీసుకోవాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రాల వ్యతిరేకతకు కారణం ఇదే.. అమ్మకం పన్నుల విధింపు అధికారం రాజ్యాం గం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించింది. దీని ప్రకారం వస్తు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు అమ్మకం పన్నులు ఆయా రాష్ట్రాలే నిర్ణయించి విధిస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సీఎస్టీ (కేంద్ర అమ్మకపు పన్ను) 2004 వరకు 4 శాతం ఉండేది. దీనిలో వాటా మాత్రమే కేంద్రానికి దక్కేది. 2005లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను కేంద్రం తీసుకొచ్చిన తర్వాత సీఎస్టీ 2 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వ్యాట్ ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరింది. వ్యాట్ వల్ల కోల్పోయిన నష్టాన్ని పూడుస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో జీఎస్టీని తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్రాల సహాయ నిరాకరణ వల్ల అమలు కాలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడానికి ముందుకొస్తోంది. జీఎస్టీ వల్ల ఏం జరగబోతుంది..? ► సేవా రంగంలో పన్నులు వేసే అధికారం రా ష్ట్రాలకు సంక్రమిస్తుంది. వాణిజ్య, వ్యాపార పన్నుల అధికారం కేంద్రం చేతిలోకి వె ళ్తుంది. ► దేశమంతా ఒకే పన్నుల విధానం అమలు. ► రాష్ట్రాల మధ్య పన్నుల రేట్లలో ఉన్న తేడాలు తొలగిపోతాయి. ► దేశమంతా సింగిల్మార్కెట్గా మారుతుంది. ► విదేశీ మార్కెట్లో దేశానికి ప్రాధాన్యం పెరుగుతుంది. ► వ్యాట్ వల్ల ధరలు దేశవ్యాప్తంగా ఏకీకృతమయినట్టే పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వస్తుంది. ► అదే సమయంలో ఒకే వ్యాపారి/ ఉత్పత్తిదారుడుపై కేంద్రం, రాష్ట్రం పెత్తనం(డ్యుయల్ కంట్రోల్) ఉంటుంది. ► చట్టాన్ని అమలుపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య వివాదాలు ఏర్పడే ఆస్కారం. ► జీఎస్టీ అమలైతే రాష్ట్రాల పన్నుల విధానంలో సమూల మార్పులకు అవకాశం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వీర్యం. ► రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖల్లోని ఉద్యోగుల హోదాల్లో మార్పులకు అవకాశం. జీఎస్టీ పరిహారానికి రాజ్యాంగబద్ధత కల్పించాలి: యనమల వస్తు అమ్మకం పన్ను (జీఎస్టీ) అమలు చేయ డంలో అభ్యంతరం లేదని, అయితే వ్యాట్‌కు బ దులు జీఎస్టీని అమల్లోకి తేవడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో తగ్గుదలను కేంద్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. జీఎస్టీ అమలుపై కేంద్ర సాధికారిక కమిటీ బుధవారం ఢిల్లీల్లో నిర్వహించే సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరు కానున్నారు. జీఎస్టీ రాజ్యాంగబద్ధత కల్పించాలని మంత్రి యనమల సాధికారిక కమిటీకి స్పష్టం చేయనున్నారు. జీఎస్టీ అమలైతే... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పేరుతో ఏకీకృత పన్నుల విధానం అమలైతే దేశంలో అన్నిరాష్ట్రాల్లో ఒకే పన్నుల విధానం అమలులోకి వస్తుంది. రాష్ట్రాలు సొంతగా పన్నులు విధించే హక్కును కోల్పోతాయి. దీంతో సేవాపన్నుల విధానాన్ని కేంద్రం రాష్ట్రాలకు దఖలు పరిచేందుకు సిద్ధమైంది. గుజరాత్ రాష్ట్ర ఆర్థికమంత్రి గత నెల 20న జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో జీఎస్టీ విధానంపై పెదవి విరిచారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌పై కేంద్రం పన్నుల పెత్తనాన్ని తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు గతంలో వ్యాట్‌నే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా తమ హక్కులను కేంద్రం హరిస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. జీఎస్టీ అమలైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటనే అనుమానాన్ని సగం రాష్ట్రాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమకు రాజకీయ హామీలు కాకుండా చట్టపరమైన హామీ కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. -
తిరుమలలో సేవా పన్నుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందిస్తున్న సేవలపై కేంద్రం పన్ను (సర్వీస్ ట్యాక్స్) విధించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. అంతేకాదు.. ఈలోగా టీటీడీ పాలకమండలిపై ఎలాంటి బలవంతపు చర్యలకూ దిగరాదని న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగానికి నోటీసు జారీ చేసింది. దీనిపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. టీటీడీ సేవలపై సర్వీస్ ట్యాక్స్ విధించడానికి సంబంధించిన ఆర్థిక చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ పాలకమండలి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారించింది. టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్, శ్రీధర్ పోతరాజులు వాదించారు. తిరుమలకు వచ్చే యూత్రికులకు తామందించే సేవలపై పన్ను విధించేందుకు వీలు కల్పిస్తున్న, రాజ్యాంగంలోని 14వ అధికరణానికి విరుద్ధమైనదిగా పేర్కొనబడుతున్న ఆర్ధిక చట్టం 1994లోని నిబంధనలను రద్దు చేయూలని వారు అభ్యర్థించారు. ఈ నిబంధనలు చెల్లనివి, చట్టవిరుద్ధమైనవే కాకుండా రాజ్యాంగ విరుద్ధమైనవని వారు పేర్కొన్నారు. 25, 26, 27 అధికరణాలు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి అని కోర్టు దృష్టికి తెచ్చారు. అధికరణం 26.. మతపరమైన వ్యవహారాల నిర్వహణకు తగిన స్వేచ్ఛను అనుమతిస్తోందని, అధికరణం 27.. ఏదైనా ప్రత్యేకమైన మతాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా పన్నుల చెల్లింపులో స్వేచ్ఛను ప్రసాదిస్తోందని టీటీడీ వాదించింది. -
‘ఉచిత విద్యుత్’ రైతులకు షాక్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: 2004లో ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందిన రైతుల నుంచి సేవా పన్ను వసూలు చేయకూడదని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతినెలా చెల్లించాల్సిన రూ.20 సర్వీసు చార్జీ నుంచి రైతులకు ఊరట లభించింది. ఈ పన్ను శాశ్వతంగా మాఫీ అవుతుంద నుకున్న అన్నదాతలపై ప్రస్తుత సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోంది. పాత చార్జీల బకాయిలను రూపంలో గణిస్తూ వసూళ్లకు తెగబడుతోంది. నెలవారీగా ఇంటికొచ్చే బిల్లులతో పాటే వ్యవసాయ కనెక్షన్‌కు సంబంధించిన సేవా పన్నును జతచేస్తూ రైతులను ఏమారుస్తోంది. ఒక్కొక్కరికి సగటున రూ.1200 నుంచి రూ.2 వేలు అదనంగా బాదేస్తూ బిల్లులు దంచేస్తుండడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. బిల్లులు చెల్లించని కర్షకుల స్టార్లర్లు, మోటార్లు ఎత్తుకెళుతూ మానసికంగా వేధిస్తోంది. ఇటీవల మంచాల మండలం ఆరుట్ల, వికారాబాద్ మండలం గొట్టిముక్కులలో విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసింది. 83వేల మందిపై మోత గత నాలుగేళ్లుగా కరువుతో అల్లాడిన రైతాంగం.. ఈయేడు వరదలతో సతమతమైంది. ఈ క్రమంలోనే ఈసారి కురిసిన వర్షాలకు భవిష్యత్‌పై రైతులకు ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే రబీకి సిద్ధమవుతున్న అన్నదాతలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో సర్వీసు చార్జీల పేరిట దండయాత్రలు సాగిస్తోంది. బకాయిలు చెల్లించకపోతే మొదటగా ఇంటి కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. ఆపై స్టార్టర్లు మోటార్లు ఎత్తుకెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంబంధిత వ్యవసాయ కనెక్షన్లను తొలగిస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా 82,244 మంది రైతులు ఈ స్కీం పరిధిలో చేరారు. ఉచిత విద్యుత్ క నెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయదారుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. దీంతో రైతాంగం సర్వీసు చార్జీ వ్యవహారాన్ని మరిచిపోయింది. ఈ నేపథ్యంలో చార్జీని 2011లో రూ.30కి పెంచుతూ ఇంధన శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా సర్వీసు చార్జీలు చెల్లించాలంటూ రైతులకు బిల్లులు పంపింది. 2004 నుంచి ఇప్పటివరకు మొత్తాన్ని లెక్కగట్టి మరీ రైతులకు బిల్లుల చిట్టాను జారీ చేస్తోంది. ఇంటికి వ చ్చే కరెంట్ బిల్లులోనే దీన్ని కూడా జమ చేసి పంపుతోంది. సకాలంలో స్పందించి బిల్లులు కడితే సరేసరి.. లేకపోతే ఒకట్రెండు రోజుల్లోనే తమ ప్రతాపాన్ని చూపుతోంది. రూ.20 కోట్ల భారం..! గత తొమ్మిదేళ్లుగా ఉచిత విద్యుత్ పొందుతున్న 83వేల మంది రైతులపై తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రూ.20 కోట్ల భారం పడనుంది. అన్నదాతలపై కాఠిన్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రస్తుత కిరణ్ సర్కారు వ్యవహరిస్తుండడంతో రైతాంగం లబోదిబోమంటోంది. వరుస కరువుతో అల మటించిన తమకు ఈయేడే వాతావరణం అనుకూలించడంతో కాస్తో కూస్తో పంటలు పండుతాయనే ఆశలపై తాజాగా ట్రాన్స్‌కో నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోతున్నారు. తొమ్మిదేళ్ల బకాయిలను ఇప్పుడు మోపడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్వీస్ టాక్స్ ఎగ్గొడితే కఠిన చర్యలు
-
సేవాపన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందనీ, ఇవాళ కాకపోయినా రేపైనా సేవా పన్ను చెల్లించాల్సిందేననీ, దీన్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం హెచ్చరించారు. ఇవాళ్టికి తప్పించుకోగలరు, మహా అయితే ఒక నెలా లేదా ఇంకో సంవత్సరం ఉండగలరు, ఆ తర్వాతైనా సేవా పన్ను పరిధిలోకి రావాల్సిందేనన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద సేవా పన్ను ప్రోత్సాహక పథకం (వీసీఈఎస్)పై అవగాహన పెంచేందుకు బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 నుంచి ఇప్పటి వరకు సేవా పన్ను చెల్లించనివారు ఎటువంటి పెనాల్టీలు లేకుండా కట్టడానికి ఇదొక చక్కటి అవకాశామని, ఇలా స్వచ్ఛందంగా ప్రకటించిన వారిపై ఎటువంటి వేధింపులు, కేసులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. డిసెంబర్ 31లోగా వీసీఈఎస్ కింద నమోదు చేసుకొని ఎలాంటి పెనాల్టీలు, అధిక రుసుములు లేకుండా పాత బకాయిలను కిస్తీలలో చెల్లించుకునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోంది. చెల్లించాల్సిన మొత్తంలో సగం డిసెంబర్ 31లోగా మిగిలిన మొత్తం జూన్ 30లోగా ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించవచ్చన్నారు. అదే వడ్డీతో అయితే డిసెంబర్ 31, 2014 వరకు గడువు ఉంది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు 9,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో కేవలం 107 కేసులు మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టామని దీన్ని అందరూ వినియోగించుకోవాలని చిదంబరం పేర్కొన్నారు. సేవా పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా ఉన్న 15 మందిపై న్యాయపరంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సేవా పన్నుకింద 17 లక్షల మంది అసెస్సీలు నమోదై ఉంటే అందులో కేవలం ఏడు లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు చిదంబరం పేర్కొన్నారు. -
సేవాపన్ను బకాయిలు చెల్లించండి: చిదంబరం
హైదరాబాద్: పన్ను ఎగవేతదారులు ఈ నెల 31లోగా 50 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. సేవాపన్ను అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 17లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 7 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. 2007 అక్టోబరు నుంచి 2012 డిసెంబర్ 31 వరకు బకాయిపడిన సేవాపన్ను చెల్లించాలని కోరారు. బకాయిపడిన సేవాపన్నులో 50 శాతం ఈ నెల 31లోగా చెల్లించి, మిగిన 50 శాతం జూన్ 30లోగా చెల్లించాలని తెలిపారు. -
సేవా పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు పి. చిదంబరం
చెన్నై: సేవా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి గురించి ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా పన్ను ఎగవేత ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పది మంది అరెస్టయ్యారని చిదంబరం తెలిపారు. సర్వీస్ ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉండే కన్సల్టెన్సీ, ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని ఆయన చెప్పారు. కొన్ని నగరాల్లో ఇది తీవ్ర స్థాయిలో ఉండటాన్ని తాను గమనించినట్లు చిదంబరం చెప్పారు. ఉదాహరణకు చెన్నైలో కాంట్రాక్టు సర్వీసులు, అడ్వర్టైజ్మెంట్, ఐటీ, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో ఇలాంటి ధోరణి కనిపించిందన్నారు. స్వచ్ఛందంగా సేవా పన్ను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీసీఈఎస్ పథకంపై పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు చెప్పారు. రూ. 50 లక్షలకు మించి ఎగవేసిన వారిపై మాత్రం అరెస్టు అస్త్రం ప్రయోగిస్తున్నామని, ఇది చిన్న మొత్తం కాదని ఆయన తెలిపారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి గురించి తమ దగ్గర వివరాలు లేవనుకోరాదని, తమ దగ్గర పుంఖానుపుంఖాలుగా సమాచారం ఉందని చెప్పారు. అయితే, శాఖాపరమైన పరిమితుల వల్లే అందరిపై తక్షణ చర్యలు సాధ్యపడటం లేదు తప్ప అంతిమంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని చిదంబరం హెచ్చరించారు. -
పన్నుల చెల్లింపులో భారత్ పూర్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్నుశాఖల ఆధ్వర్యంలో చెన్నైలో ని రాణీసీతై హాలులో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం శనివారం జరిగిం ది. ఈ సందర్భంగా చిదంబరం ప్రసంగించారు. పదిహేడు ఏళ్లుగా కేంద్రం సేవా పన్నును వసూలు చేస్తోందన్నారు. తాము స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తామంటూ తొలుత 17 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే 7 లక్షల మంది మాత్రమే తమ మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. మిగిలిన 10 లక్షల మంది పన్ను ఎగవేతకు దారులను వెతుక్కున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరు 31వ లోపు 100 శాతం పన్ను వసూళ్లకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. అలాగని ఎవరినీ భయపెట్టడమో, జరిమానాలు విధించడమోతమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని వెల్లడించా రు. అందరి లెక్కలు, పాన్‌కార్డు నెంబర్లు తమ వద్ద ఉన్నందున పన్ను చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పన్ను చెల్లింపులో ప్రపంచంలోనే భారత్ చివరి స్థానంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి కేంద్రం దాడులు జరపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే ఆర్థికశాఖలో తగినంత మంది అధికారులు లేకపోవడం, వాహనాల కొరత వల్ల దాడులకు పూనుకోకుండా స్వచ్ఛంద చెల్లింపులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పది మంది పన్ను ఎగవేతదారులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు చిదంబరం తెలి పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జేడీశీలం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.1,27,897 కోట్లు వివాదాలతో ఆగిపోయిన రాబడి!
న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో అప్పీళ్లు, వివాదాల కారణంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌ల రూపంలోని రాబడి వాస్తవరూపం దాల్చలేదని కాగ్ నివేదిక ఒకటి ఈ విషయం స్పష్టం చేసింది. మొత్తం రూ.1,27,897.39 కోట్ల పెండింగ్ రాబడిలో సర్వీసు ట్యాక్స్ పద్దులో రూ.73,274.74 కోట్లు ఉండగా, 54,172.65 కోట్లు ఎక్సైజ్ సుంకం కింద ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం కేసులు వివిధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులోని రూ.15,663.69 కోట్ల (29%) మొత్తానికి సంబంధించిన కేసులు ఆ సంస్థ అధీకృత అధికారుల వద్ద ఉన్నాయి. ఇక 53% రాబడికి సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉండగా, మిగతా మొత్తానికి అప్పీళ్ల కమిషనర్లు, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. -
సేవా పన్ను ఎగవేతపై నెట్4 ఇండియా ఎండీ అరెస్టు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 9 కోట్ల సేవా పన్నును జమ చేయలేదన్న ఆరోపణలపై నెట్4 ఇండియా ఎండీ జస్జీత్ సింగ్ సాహ్నిని సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. తదుపరి ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సేవా పన్ను ఎగవేత కు సంబంధించి జరిగిన అరెస్టుల్లో ఈ ఉదంతం మూడవది. ఇంతక్రితం రూ. 79 లక్షల సర్వీస్ ట్యాక్స్‌కి సంబంధించి కోల్‌కతాలో ఒకరు, రూ. 1.96 కోట్ల పన్నుకి సంబంధించి ముంబైలో ఒకరు అరెస్టయ్యారు. -
సేవా పన్ను పథకంపై రాష్ట్రవ్యాప్త సదస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సేవా పన్నులను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంపై (వీసీఈఎస్) పన్నుల విభాగం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలు ఉన్నాయని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ బి.బి. ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది మేలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పట్నుంచి హైదరాబాద్ జోన్లో ఇప్పటిదాకా 100 దాకా దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా వచ్చే సేవా పన్ను మొత్తం సుమారు రూ. 30 కోట్లు ఉండగలదని ఆయన వివరించారు. డిసెంబర్ ఆఖరు దాకా ఈ పథకానికి గడువు ఉన్నందున అప్పటికి వీసీఈఎస్ ద్వారా రూ. 200-300 కోట్ల దాకా వసూలు కావొచ్చని పేర్కొన్నారు. వీసీఈఎస్పై పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు, ఈ పథకాన్ని వ్యాపార వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యురాలు (బడ్జెట్ విభాగం) షీలా సాంగ్వాన్ తెలిపారు. వీసీఈఎస్ గడువును మరింత పొడిగించడం గానీ, దీనికి సవరణలు చేయడంగానీ ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. 2013-14లో వసూలయ్యే మొత్తం సేవా పన్నులో వీసీఈఎస్ ద్వారా వచ్చే వాటా సుమారు 10 శాతంగా ఉంటందని అంచనాలు ఉన్నట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర తెలిపారు. -
సేవా పన్ను కట్టకుంటే కఠిన చర్యలే: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని సేవా పన్ను ఎగవేతదారులు సత్వరమే చెల్లింపులు జరపాలని లేని పక్షంలో కఠిన శిక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఎగవేతదారులుగా ముద్రపడిన వారు తమపై పడిన మచ్చను తొలగించుకోవడానికి ఇది సరైన సమయమని ఆయన చెప్పారు. స్వచ్ఛంద అనువర్తన ప్రోత్సాహక పథకంపై (వీసీఈఎస్) అవగాహన కార్యక్రమాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా కొనసాగుతాయి. ఈ పథకాన్ని ఉపయోగించుకుని, సేవా పన్ను ఎగవేతదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, చెల్లింపులు జరపాలని చిదంబరం సూచించారు. ట్యాక్స్ ఫైల్ చేయని/చేయడం ఆపేసిన దాదాపు 10 లక్షల మంది కూడా ఎగవేతదారుల కిందకే వస్తారని, వారికి సైతం శిక్షలు తప్పవ న్నారు.ఏడేళ్ల దాకా జైలు శిక్ష..: నగదుపరమైన జరిమానాతో పాటు కఠిన శిక్షలు వేసేందుకు సర్వీస్ ట్యాక్స్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని చిదంబరం చెప్పారు. రూ. 50 లక్షల పైగా సేవా పన్ను వసూలు చేసి, ఖజానాకు జమచేయని వారికి ఏడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే కోల్‌కతాలో ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు.