ఓఎన్జీసీ విదేశ్కు6,100 కోట్ల పన్ను డిమాండ్ | ONGC Videsh slapped with service tax demand of Rs 6,100 crore | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ విదేశ్కు6,100 కోట్ల పన్ను డిమాండ్

Published Wed, Sep 21 2016 12:48 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ఓఎన్జీసీ విదేశ్కు6,100 కోట్ల పన్ను డిమాండ్ - Sakshi

ఓఎన్జీసీ విదేశ్కు6,100 కోట్ల పన్ను డిమాండ్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) విదేశీ సబ్సిడరీ ఓఎన్‌జీసీ విదేశ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.6,100 కోట్లకుపైగా సేవా పన్ను డిమాండ్‌ను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లోని 37 చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో ఓఎన్‌జీసీ విదేశ్‌కు వాటాలు ఉన్నాయి.  అను బంధ సంస్థలు, బ్రాంచీలు, జాయింట్ వెంచర్ల రూపంలో ఈ వాటాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత సంస్థలు, బ్రాంచీలు, జేవీల కార్యకలాపాలకు సంబంధించే తాజా పన్ను నోటీస్ జారీ అయ్యింది. అయితే ఆయా మార్గాల ద్వారా పెట్టుబడులు సేవల పన్ను పరిధిలోనికి రావని ఓఎన్‌జీసీ విదేశ్ పేర్కొంటోంది. 2006 ఏప్రిల్ 1 నుంచి 2014 మార్చి వరకూ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌కు సంబంధించి రూ.2,816 కోట్లు, అటు తర్వాతి కాలాలకు సంబంధించి ఐదు నోటీసులకు సంబంధించి రూ.3,286 కోట్లు ఓఎన్‌జీసీ విదేశ్ చెల్లించాల్సి ఉందని సేవా పన్ను విభాగం వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement