
హైదరాబాద్‌లో సర్వీస్ ట్యాక్స్‌పై సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేవా పన్ను వసూళ్లలో ఎదరవుతున్న న్యాయపరమైన అడ్డంకులపై అవగాహన కల్పించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగే ఈ అవగాహనా సదస్సులో కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్‌ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్‌తో పాటు ఈ రంగానికి చెందిన ఇతర టెక్నికల్ స్పీకర్లు పాల్గొంటున్నట్లు ఐసీఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సదస్సులో పాల్గొనే సీఎంఏ మెంబర్స్ రూ. 800, ఇతర కార్పొరేట్ ప్రతినిధులు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.