డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త! | Govt to waive service tax on card transactions up to Rs 2,000 | Sakshi
Sakshi News home page

డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!

Published Thu, Dec 8 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు  శుభవార్త!

డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!

న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలపై కేంద్ర వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెబిట్,  క్రెడిట్ కార్డుల  వినియోగానికి  ప్రోత్సాహాన్నందిస్తూ నిర్ణయం తీసుకుంది.   రెండు వేల లోపు  లావాదేవీపై సర్వీస్ పన్నును రద్దు చేసింది.  క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సేవల్లో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 2012  నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు నోటిఫికేషన్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా!

ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త  రూ.500  నోట్లను అందుబాటులోకి రావడానికి  కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది.

కాగా  నిన్న (బుధవారం)ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ  కొత్త నిబంధనలు విధించింది.  ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్‌వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement