
దేశంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని రంగాలలో విధానాలను సవరించాలని యోచిస్తోంది. తద్వారా మరిన్ని ఎఫ్‌డీఐలకు దారి చూపాలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు.
ఈ బాటలో వివిధ ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, పారిశ్రామిక సహచర సంస్థలు, అడ్వయిజరీ, న్యాయ సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థలు, వెంచర్స్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ తదితరాలతో అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా దేశీయంగా మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకునేందుకు అభిప్రాయాలు, సూచనలకు ఆహ్వానం పలికింది.
వెరసి వివిధ శాఖలు, విభాగాలతో చర్చలు పూర్తిచేసినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. దీంతో విభిన్న సమస్యలపై సలహాలు, సూచనలు అందుకున్నట్లు తెలియజేశారు. అయితే ఇంతవరకూ ఏ అంశాలపైనా తుది నిర్ణయాలకు రాలేదని తెలియజేశారు. నిబంధనలు, విధానాలను సరళతరం చేయడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించారు. కాగా.. ఏఏ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందీ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment