ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారత్‌లో తమ ఉత్పత్తులను ఎలా పడితే అలా భారత్ మార్కెట్‌లోకి తీసుకురావడం కుదరదు. భారత్‌లో ఏఐ ఉత్పత్తులు ప్రారంభించే ముందు ప్రభుత్వ ఆమోదం పొందటం తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
"తమ ఏఐ మోడల్స్‌ను ల్యాబ్ నుండి నేరుగా మార్కెట్‌కి తీసుకెళ్లడంలో మరింత క్రమశిక్షణతో ఉండటానికి ఇది సహాయపడుతుంది. డిస్‌క్లెయిమర్లు, కాపలా వ్యవస్థ ఉండాల్సిందే. తద్వారా వినియోగదారుకు ఏది నమ్మదగనిదో తెలుస్తుంది" అని మంత్రి అన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని, దీనికి సంబంధించిన తీసుకున్న చర్యలు, ప్రస్తుత స్థితిపై 15 రోజుల్లోగా నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ఆదేశాలు ఫిబ్రవరి 29న జారీ అయినట్లు మనీకంట్రోల్ నివేదిక తెలిపింది.
ఏదైనా తప్పుడు సమాచారం లేదా డీప్‌ఫేక్ సృష్టికర్తను గుర్తించడానికి ఏఐ రూపొందించిన కంటెంట్‌ను శాశ్వత ప్రత్యేకమైన మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్‌తో లేబుల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎర్రర్‌కు గురయ్యే మోడల్‌ను అమలు చేయాలనుకుంటే, దానిని టెస్టింగ్‌లో ఉన్నట్లు లేబుల్ చేయాలి. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇది ఎర్రర్-ప్రోన్ ప్లాట్‌ఫారమ్ అని పేర్కొంటూ యూజర్ నిర్ధారణ, సమ్మతిని స్పష్టంగా తీసుకోవాలని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment