waive
-
టూరిస్టులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్‌లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం
చండీగఢ్: ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ. వారి ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేసి.. వారికి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తానని ప్రకటించారు. సోమవారం లూథియానాలోని గిల్ చౌక్ ప్రాంతంలోని ధాన్యం మార్కెట్‌కు వెళ్తున్న చన్నీ.. మార్గ మధ్యంలో తన వాహనాన్ని ఆపి.. ఆటోడ్రైవర్లతో భేటీ అయ్యాడు. వారితో పాటు చెక్కమీద కూర్చుని.. టీ తాగి.. వారి సమస్యలను విన్నారు సీఎం చన్నీ. ఈ సందర్భంగా సీఎం చన్నీ మాట్లాడుతూ.. ప్రారంభంలో రాజకీయాల్లోకి రాకముందు తాను ఆటో డ్రైవర్‌గా పని చేశానని తెలిపాడు. వారి నిజమైన డిమాండ్లను సానుభూతితో పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆటోల మీద ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేస్తానని ప్రకటించాడు. అంతేకాక అధికారుల వేధింపులను అరికట్టేందుకు త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తానని ప్రకటించారు. (చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!) ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నియమానలు పాటించాలని సీఎం చన్నీ సూచించాడు. ఇక రోడ్డు మీద ఆటో రిక్షాలు నడపడానికి ప్రత్యేకంగా పసుపు గీత గీసి స్థలాన్ని కేటాయించాలని కోరిన ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని చన్నీ అంగీకరించాడు. ఈ పర్యటనలో చన్నీతో పాటు సిద్ధూ, మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, ఎమ్మెల్యేలు కుల్దీప్ సింగ్ వైద్, సంజయ్ తల్వార్, లఖ్బీర్ సింగ్ లఖా కూడా ఉన్నారు. (చదవండి: పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం) అయితే చన్నీ చర్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. త్వరలోనే కేజ్రీవాల్ పంజాబ్ ఆటో డ్రైవర్లతో ఆటో సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికి ముందే చన్నీ వారితో భేటీ అయ్యి.. చలాన్లు రద్దు చేస్తానని ప్రకటించి.. కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. చదవండి: రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్ -
కోవిడ్ విజృంభణ: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్‌ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్లు కొనుగోలుకు అవకాశం కల్పించింది. #Unite2FightCorona It is clarified that Govt of India’s procurement price for both #COVID19 vaccines remains Rs 150 per dose. GOI procured doses will continue to be provided TOTALLY FREE to States.@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @DDNewslive @PIB_India @mygovindia https://t.co/W6SKPAnAXw — Ministry of Health (@MoHFW_INDIA) April 24, 2021 వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. వ్యాక్సిన్, ఆక్సిజన్ దాని సంబంధిత పరికరాలపై పన్ను మాఫీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు నెలల పాటు కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆక్సిజన్ తయారు చేసే పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటం.. ఆక్సిజన్ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆక్సిజన్ సరఫరాను మెరుగు పర్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్, దాని సంబంధిత పరికరాలు, కోవిడ్ వ్యాక్సిన్లపై కస్టమ్స్ పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. At the high-level meeting, key decisions of waiving customs duty on oxygen and oxygen related equipment & COVID-19 vaccines were taken. https://t.co/TgorIafqw6 — Narendra Modi (@narendramodi) April 24, 2021 చదవండి: కరోనా సెకండ్‌వేవ్: ప్రజలకు కేంద్రం తీపికబురు! -
‘తీరా’ కోసం రూ. 6 కోట్లు మాఫీ చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తీరా కామత్.. ఈ చిన్నారి గుర్తుందా.. ‘స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపంతో పుట్టింది. పాపను బ్రతికించుకోవాలంటే జీనీ థెరపీ తప్పని సరైంది. మన దేశంలో ఈ చికిత్స లేదు. అమెరికా నుంచి 16 కోట్ల రూపాయల విలువైన ‘జోల్జెన్స్మా’ అనే ప్రత్యేక ఇంజెక్షన్ తెప్పిస్తే కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. జీవితాంతం కష్టపడినా.. తీరా తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని సమకూర్చలేరు. ఈ క్రమంలో తమ బిడ్డను ఆదుకోవాల్సిందిగా కోరుతూ.. ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. దేవుడి దయ వల్ల అనుకున్న మొత్తాన్ని జమ చేశారు. భారీ మొత్తంలో ట్యాక్స్ డబ్బు జమ అయ్యింది.. ఇక ఇంజక్షన్ తెప్పించడమే తరువాయి అనుకుంటుండగా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి అమెరికా నుంచి తెప్పించే ఈ ఇంజక్షన్‌ను మనం దిగుమతి చేసుకోవాలంటే జీఎస్టీ, దిగుమతి సుంకం అన్ని కలిపి 6.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇంజక్షన్‌కు అవసరమ్యే మొత్తాన్నే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చారు. అలాంటిది ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించలేమని ‘తీరా’ తల్లిదండ్రులు వాపోయారు. ట్యాక్స్ తగ్గించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మానవతా దృక్పథంతో ఇంజక్షన్‌పై అన్ని రకాల పన్నులను మాఫీ చేసింది. మోదీపై ప్రశంసలు... ఈ విషయాన్ని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'చిన్నారి తీరా కామత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించి జోల్జెన్స్మా డ్రగ్‌పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో చికిత్స చిన్నారి తీరాకు ప్రస్తుతం ముంబైలోని ఎస్ఆర్సీసీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక కండరాల క్షీణత వల్ల తలెత్తే సమస్యలతో ఈ చిన్నారి బాధపడుతోంది. ఇప్పటికే తీరా ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే వెంటిలేటర్‌పై ఎక్కువ కాలం ఉంచితే ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో చిన్నారికి వీలైనంత త్వరగా ఆ ఇంజెక్షన్ అందించాల్సి ఉంది. జోల్జెన్స్మా ద్వారా ఆ చిన్నారిలో బలహీనంగా ఉన్న కండరాలు మళ్ళీ మెదడు నుండి సంకేతాలను పొందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: ఈ పాప బ్రతకాలంటే 16 కోట్లు కావాలి -
మారటోరియం : భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' మాఫీ చేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాంకులపై ప్రభావం చూపుతుందంటూ వడ్డీ మాఫీ చేయడానికి నిరాకరించిన కేంద్రం, తాజా నిర్ణయంతో పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట కల్పించనుంది. దీనిపై తదుపరి వాదనలు సోమవారం జరగనున్నాయి. ఆరు నెలల మారటోరియం కాలం (మార్చి1- ఆగస్టు 31)లో వడ్డీని వదులుకునే భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)లతో పాటు, వ్యక్తిగత, విద్య, గృహ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో మొదలైన చిన్నరుణగ్రహీతలకు ఈ మినహాయింపు భారీ ఉపశమనం లభించనుంది. తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ అమలు కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకోవడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై 6 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్డౌన్ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆర్బీఐ వెనక దాక్కుంటారా, వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానమే అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. -
హోం లోన్లు: ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ గ్రహీతకు శుభవార్త అందించింది. మార్చి 31, 2018లోపు ఇంటి రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతోపాటు వేరే బ్యాంకుల్లో ఇంటి రుణం తీసుకున్నవారు కూడా మార్చి 31లోపు ఎస్బీఐకు మారినట్లయితే వారికి కూడా 100శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి31తో ఈ ఆర్థికసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే గతంలో ప్రకటించినట్లుగానే ఇన్ని రోజులుగా వినియోగిస్తున్న ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుకు సంబంధించిన చెక్‌బుక్‌లు 31-03-2018 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త చెక్‌బుక్స్‌ను మాత్రమే అనుమతిస్తామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని గుర్తించి వినియోగదారులు కొత్త చెక్‌బుక్కుల కోసం తమ దగ్గర్లోని ఎస్బీఐ బ్యాంకులను సంప్రదించాలని పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లలో సగటు నెలవారీ మొత్తాలను నిల్వ చేయకపోతే విధించే చార్జీలను కూడా తగ్గించింది. పట్టాణాల్లో నెలకు రూ.50 ఉన్న చార్జీలను రూ.15కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.40 ఉన్నచార్జీలను రూ.10కు (జీఎస్టీని కలుపుకుని)తగ్గించారు. తగ్గించిన ఈ చార్జీలు 11-04-2018నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. -
మొబైల్ ఉత్పత్తి దారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: మొబైల్ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనివ్వనుంది. మొబైల్ విడిభాగాల దిగుమతులపై బ్యాంకు గ్యారంటీని ఉపసంహరించే వైపుగా ఆలోచిస్తోందట. ఈ మేరకు బ్యాంకు హామీ నిబంధనలను సరళతరం చేయనుందని అధికారిక వర్గాల సమాచారం. స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్స హించే దిశగా ఈ చర్యలు తీసుకోనుంది. తద్వారా మొబైల్ హ్యాండ్సెట్ మేకర్స్ కొంత ఉపశమనం పొందనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ అంశంపై గత వారం ఉమ్మడి సమావేశం నిర్వహించారు. తమ పెట్టుబడులు మొత్తం బ్యాంక్ గ్యారంటీ కింద చిక్కుకుపోవడంపై మొబైల్ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఐజీసీఆర్ (ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎట్ కాన్సెషనల్ రేట్) దృష్టికి వెడతామని హామీ పీఎంఏ వర్గాలు హామీ ఇచ్చాయి. కనీసం మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలకు ఈ హామీలను ఎత్తివేయాల్సిందిగా సూచిస్తామని తెలిపాయి. దేశంలో మొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆటంకాలపై పిరిశ్రమ పెద్దలు, అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిది పీటీఐకి వివరించారు. ఈ వార్తలపై సెల్యులర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మంహాంద్రో సంప్రదించగా పీఏంఓ కార్యాలయంపై మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ అధికారులకు, పరిశ్రమ ప్రతినిధులకు మధ్య సమన్వయంగా ఎలక్ట్రానిక్స్, ఐటిమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ 2019 నాటికి దేశంలో 500మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 40శాతం విజయం సాధించిందని పంకజ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మొబైల్ ఉత్పత్తిదారుల ఆదాయరక్షణతోపాటు, పరిశ్రమకు మార్గం మరింత సుగమవుతుందని వ్యాఖ్యానించారు. కాగా కంపెనీలు చెల్లిస్తున్న బ్యాంకు గ్యారంటీ నిధులు రూ. 29వేల కోట్లుగా ఉన్నాయి. -
మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
-
మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై: అన్నదాతల ఆక్రందనలు హైకోర్టును కదలించాయి. 23 రోజులుగా దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా మద్రాస్ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సహకార సంఘాల నుంచి కర్షకులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది. ఐదు ఎకరాల వరకు పంట భూములు కలిగిన రైతుల రుణాలు మాఫీ చేయాలని సూచించింది. హైకోర్టు తీర్పుపై అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 23 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు. -
డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలపై కేంద్ర వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహాన్నందిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల లోపు లావాదేవీపై సర్వీస్ పన్నును రద్దు చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సేవల్లో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 2012 నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు నోటిఫికేషన్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా! ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది. కాగా నిన్న (బుధవారం)ఆన్లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలి
ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఐ నాయకుడు నారాయణ కోరారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ రైతుల రుణమాఫీపై కేసీఆర్ కాలపరిమితి విధించటం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోవడమేనని అన్నారు. వ్యవసాయ రుణాలతో సహా అన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్, ఉద్యోగుల పంపిణీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.