Rs 2
-
‘పాలమూరు’లో రూ.2 వేల కోట్ల అవినీతి
బీజేపీ నేత నాగం కొందుర్గు (షాద్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం అంతా అవినీతిమయంగా మారిం దని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం పద్మారం గ్రామపంచాయతీ లక్ష్మీదేవిపల్లిలో ప్రాజెక్టు నిర్మించనున్న స్థలాన్ని ఆయన పరిశీలించా రు. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారంలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఆరోపణలు నిజం కాకుంటే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన ప్రేమ లక్ష్మీదేవిపల్లిపై ఎందుకు చూపడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయన్నారు. -
సెప్టెంబర్‌లో ఐపీవోల జాతర!!
♦ పబ్లిక్ ఇష్యూకి రానున్న నాలుగు కంపెనీలు ♦ రూ. 2,500 కోట్ల సమీకరణ ∙ ♦ లిస్టులో మ్యాట్రిమోనీడాట్‌కామ్ కూడా న్యూఢిల్లీ: మెరుగుపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఊతంతో ఇటీవలి కాలంలో కంపెనీలు మళ్లీ ఐపీవోల బాట పట్టాయి. సెప్టెంబర్‌లో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. రూ. 2,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఆన్లైన్ వివాహ సేవల సంస్థ మ్యాట్రిమోనీడాట్‌కామ్, భారత్ రోడ్ నెట్వర్క్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ కెపాసిటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నాలుగూ వచ్చే నెల ఐపీవోకి రాబోతున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిధులను ప్రధానంగా విస్తరణ ప్రణాళికలకోసం, రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈసారి మెరుగే..: గతేడాది మొత్తం 26 కంపెనీలు మొత్తం రూ. 26,000 కోట్లు సమీకరించాయి. ఐపీవోలకి సంబంధించి ఆరేళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఐపీవో విభాగం గతేడాది కన్నా మెరుగ్గానే ఉండగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ .. మార్కెట్లో బులిష్ సెంటిమెంట్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు ఇరవైకి పైగా కంపెనీలు సెబీకి ఐపీవో ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 17 కంపెనీలు ఇనీషియల్ షేర్ సేల్ ఆఫర్ల ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాయి. ఇందులో బీఎస్ఈ, అవెన్యూ సూపర్‌మార్ట్స్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఎరిస్ లైఫ్‌సైన్సెస్, కొచిన్ షిప్‌యార్డ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఐపీవోల వివరాలు.. 1. భారత్ రోడ్ నెట్వర్క్ శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈ సంస్థ ఐపీవో సెప్టెంబర్ 6–8 మధ్యలో రానుంది. రూ. 10 ముఖవిలువ చేసే 29.30 లక్షల ఈక్విటీ షేర్లను ఈ సందర్భంగా విక్రయించనున్నారు. రూ. 1,200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. 2. డిక్సన్ టెక్నాలజీస్.. సుమారు రూ. 600–650 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షేర్ హోల్డర్లు 37,53,739 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా మరో రూ. 60 కోట్ల విలువ చేసే షేర్లను ఐపీవోలో జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 6న మొదలై 8తో ముగియనుంది. 3. మ్యాట్రిమోనీడాట్‌కామ్.. భారత్‌మ్యాట్రిమోనీ బ్రాండ్ కింద ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక సేవలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 350 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద 37,67,254 షేర్లను, కొత్తగా రూ. 130 కోట్లు విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. 4. కెపాసిటీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.400 కోట్లు సమీకరించవచ్చని అంచనా. -
మరోసారి కరెన్సీ రద్దుపై కేంద్రమంత్రి వివరణ!
రూ. 2వేల నోట్లు రద్దు చేస్తారని ప్రచారం తాజాగా స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి గంగ్వర్ న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2వేల నోట్లను త్వరలోనే రద్దు చేయబోతున్నారని సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వర్ స్పందించారు. రూ. 2వేల నోట్లను రద్దు చేస్తున్న సమాచారమేదీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. త్వరలోనే రూ. 200 నోట్లు చెలామణిలోకి రానున్నట్టు వెల్లడించారు. 'రూ. రెండువేల నోట్లను రద్దు చేసే వార్తలేవీ లేవు' అని గంగ్వర్ 'ఐఏఎన్ఎస్' వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 'రూ. 2వేల నోట్ల ముద్రణను తగ్గించడం అనేది వేరే అంశం. కానీ, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ధ్రువీకరించాల్సి ఉంది. రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ స్పష్టత ఇస్తుంది' అని ఆయన తెలిపారు. రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రూ. 2వేల నోట్లను రద్దు చేయబోతున్నారంటూ ప్రతిపక్షాలు ఈ నెల 26న పార్లమెంటులో లేవనెత్తిన సంగతి తెలిసిందే. అయినా, ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
రూ.2000 నోటుపై ప్రభుత్వం స్పందించింది
న్యూఢిల్లీ : రూ.2000 నోటును రద్దు చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు కేంద్రప్రభుత్వం చెక్ పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. అంతేకాక త్వరలోనే కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ''రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే వార్తలేమీ లేవు'' అని గంగ్వార్ చెప్పారు. కొత్త రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి ధృవీకరణ రావాల్సి ఉందన్నారు. రూ.2000 నోట్లపై సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపివేసిందని తెలిసింది. జూలై 26న ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణను కూడా డిమాండ్ చేశాయి. డీమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చిన కొత్త రూ.2000 నోటును రద్దు చేస్తున్నారా? అందుకే ప్రింటిగ్ ఆపివేశారా? అంటూ నిలదీశాయి. కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆర్థికమంత్రి ఎలాంటి సమాధానమివ్వలేదు. కొత్త రూ.2000 నోటును లీగల్ టెండర్ లాగా కొనసాగిస్తూ చలామణిని పరిమితం చేస్తుందని, కానీ రద్దు చేసే అవకాశం లేదని ఓ వైపు ఇండస్ట్రి నిపుణులు కూడా చెప్పారు. కొత్త రూ.200 నోటును ప్రవేశపెట్టి, మార్కెట్లో నెలకొన్న చిన్న నోట్ల సమస్యకు చెక్ పెడుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.200 నోటు ప్రింటింగ్ మొదలైందని, వీటిని త్వరలోనే చలామణిలోకి తీసుకొస్తామని గంగ్వార్ శుక్రవారం కూడా చెప్పార. ఈ కొత్త రూ.200 నోటుతో చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ను పెంచుతామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ఈ నోటును ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. -
తగ్గిన హెచ్డీఎఫ్సీ నికరలాభం
క్యూ1లో రూ.2,734 కోట్లు... న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో...గతేడాది ఇదేకాలంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించి రూ. 2,797 కోట్ల నుంచి రూ. 2,734 కోట్లకు తగ్గింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ. 13,531 కోట్ల నుంచి రూ. 14,463 కోట్లకు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన హెచ్డీఎఫ్సీ నికరలాభం రూ. 1,871 కోట్ల నుంచి రూ. 1,556 కోట్లకు పడిపోయింది. స్టాండెలోన్ నికరలాభాన్ని గతేడాది జూన్ క్వార్టర్‌తో పోల్చిచూడరాదని, ఆ క్వార్టర్లో హెచ్డీఎఫ్సీ ఈర్గో జనరల్ షేర్లను విక్రయించడంతో రూ. 275 కోట్ల వన్‌టైమ్ ప్రత్యేక కేటాయింపును లాభనష్టాల ఖాతాలో చూపించినట్లు హెచ్డీఎఫ్సీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. తాజా త్రైమాసికంలో కంపెనీ స్టాండెలోన్ ఆదాయం రూ. 8,393 కోట్ల నుంచి రూ. 8,142 కోట్లకు తగ్గింది. ముగిసిన త్రైమాసికంలో వ్యక్తిగత రుణ పంపిణీలు 21 శాతం వృద్ధిచెందాయని, 2017 జూన్ 30నాటికి తమ మొత్తం లోన్ బుక్ రూ. 2.66 లక్షల కోట్ల నుంచి రూ. 3.13 లక్షల కోట్లకు చేరిందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం స్థూల మొండి బకాయిలు రూ. 3,513 కోట్లని (1.12 శాతం) కంపెనీ ప్రకటన పేర్కొంది. -
మరోసారి కరెన్సీ బ్యాన్?
రూ.2000 నోట్ల రద్దుపై ఊహాగానాలు మరోసారి నోట్ల రద్దును కేంద్రప్రభుత్వం చేపట్టబోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రూ.2000 నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు చాలామంది నుంచి అభిప్రాయాలు వెల్లువెత్తుతుండటంతో, ఈ విషయం పార్లమెంట్ వరకు వెళ్లింది. కొత్త రూ.2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ విపక్షాలు సైతం బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రశ్నలు సంధించాయి. కానీ ఆయన మాత్రం ఎలాంటి స్పందన లేకుండా, కనీసం దీనిపై ఓ క్లారిటీ కూడా ఇవ్వలేదు. అంటే మరోసారి కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టడానికి సిద్దమవుతుందని టాక్. ఇటీవల రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆపివేసింది. అసలు కొత్త రూ.2000 నోట్లు బ్యాంకులకు కొత్తగా ఏమీ తీసుకురావడం లేదు. చలామణిలో ఉన్న నోట్లే బ్యాంకుల వద్దకు వస్తున్నట్టు బ్యాంకు అధికారులు సైతం చెబుతున్నారు. అంతేకాక రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ ఆపివేసిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐదు నెలల క్రితం నుంచే ఈ ప్రింటింగ్‌ను ఆపివేసిందట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక కొత్త రూ.2000 నోట్లను ముద్రించడకూడదని కూడా నిర్ణయించిందట. రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసి, కొత్తగా రూ.200 నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేస్తుందని తెలిపాయి. దీంతో మరో రౌండ్ డీమానిటైజేషన్‌ను ప్రభుత్వం చేపట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. రూ.200 నోట్లను చలామణిలోకి తెస్తుండటంతో పాటు, కొత్త రూ.500 నోట్లు మార్కెట్లో లభ్యమవుతుండటంతో రూ.2000 నోట్లు రద్దు చేసిన అంత పెద్ద ప్రభావమేమీ ఉండదని తెలుస్తోంది. ఈ ప్రభావం బ్లాక్‌మనీ రూపంలో రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారికే ఎక్కువ ప్రమాదమని పలువురంటున్నారు. నవంబర్ నెల మొదట్లో ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ.1000, రూ.500 అన్నీ నిరూపయోగంగా మారిపోయాయి. ఈ రద్దు అనంతరం కొత్తగా రూ.2000 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్కువగా రూ.2000 నోట్లనే ఆర్బీఐ చలామణిలోకి తేవడంతో, చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఈ ఇక్కట్లను తీర్చడానికి ఆర్బీఐ కొత్త రూ.200 నోట్లు తీసుకొస్తోంది. -
కేంద్రంపై రాష్ట్రాల ఒత్తిడి
-
రూ.2,000 నోట్లను రద్దుచేయం: జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను వెనక్కి తీసుకునే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో చెప్పారు. గత డిసెంబర్ 10 నాటికి ఆర్బీఐ కరెన్సీ చెస్టుల్లోకి తిరిగొచ్చిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ. 12.44 లక్షల కోట్లని వెల్లడించారు. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని ఆర్బీఐ వద్ద ఉన్న నగదు నిల్వలతో సరిపోల్చి, నకిలీ నోట్లు, అకౌంటింగ్ దోషాలు, డబుల్ కౌంట్లు లాంటి వాటిని తొలగించిన తరువాతే తుది గణాంకాలు తెలుస్తాయని వివరించారు. మార్చి 3 నాటికి చెలామణిలో ఉన్న నగదు విలువ రూ.12 లక్షల కోట్లని వెల్లడించారు. -
రూ.2 వేల నోటుపై వివరణ ఇచ్చిన జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త రూ.2వేల నోటుపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీవివరణ ఇచ్చారు. రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు. డీమానిటైజేషన్ తరువాత తీసుకొచ్చిన రూ .2 వేల నోటును ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన లేదని లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో జైట్లీ తెలిపారు. అలాగే రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత రూ 12.44 లక్షల కోట్ల (డిసెంబర్ 10, 2016 నాటికి) మొత్తం పాతనోట్లు బ్యాంకులకు చేరినట్టు లోక్‌సభలో చెప్పారు. మార్చి 3, 2017 నాటికి మొత్తం చలామణీలో వున్న కరెన్సీ విలువ రూ.12 లక్షలకోట్లుగా ఉండగా, జనవరి 27 నాటికి రూ.9.921 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. అయితే ఈ వివరాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని, అకౌంటింగ్ లో తప్పులు, డబుల్ కౌంటింగ్ తదితర కారణాల రీత్యా పూర్తివివరాలు ఇంకా అందాల్సి ఉందన్నారు. అనినీతిని, నల్లధనం, నకీలి కరెన్సీ, టెర్రరిజాన్ని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపట్టిందని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. డీమానిటైజేషన్ కాలంలో నగదు విత్ డ్రా లపై కొన్ని నిబంధనలు విధించినా, ఆ తర్వాత క్రమంగా వాటిని తొలగించామని జైట్లీ చెప్పారు. -
స్మార్ట్ ఫోన్ ధరలు దిగిరానున్నాయ్!
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.2000 కంటే కిందకి దిగిరానున్నాయ్. డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవ్వాలంటే రెండు వేలకే స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావాల్సి ఉందని భారత్ పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం వెంటనే ఆ చర్యలకు సిద్దమైంది. స్మార్ట్‌ఫోన్ ధరలు కచ్చితంగా రూ.2,000 కంటే తక్కువగా ఉండేలా వినియోగదారుల ముందుకు రావాలని స్థానిక హ్యాండ్సెట్ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్థిక లావాదేవీలను మరింత మందికి అందించాలని అభిప్రాయపడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్‌లు లభ్యం కానంత వరకు నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల నీతి ఆయోగ్ నిర్వహించిన భేటీలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అందించవచ్చని పేర్కొనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థలు, శాంసంగ్, ఆపిల్ లాంటి బహుళ జాతీయ దిగ్గజాలు ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు. 20 నుంచి 25 మిలియన్ల స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేలా హ్యాండ్సెట్ కంపెనీలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే ఆ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తోసిపుచ్చినట్టు ఇద్దరు అధికారులు పేర్కొన్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్, మంచి నైపుణ్యతతో తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం తమకు సవాళ్లేనని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం 3జీ స్మార్ట్ఫోన్లు రూ.2500 మధ్యలో లభ్యమవుతున్నప్పటికీ, 4జీ ఫోన్లు కొంచెం ధరెక్కువగానే పలుకుతున్నాయి. పెద్ద నోట్ల రద్దయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. -
కొత్త పెద్ద నోట్లను క్రమంగా ఉపసంహరించాలి
చెన్నై: ఎకానమీలో నగదు పరిమాణాన్ని తగ్గించే దిశగా.. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,000, రూ. 500 నోట్లను కొన్నాళ్ల తర్వాత క్రమంగా ఉపసంహరించాలని కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి ఎంఆర్ శివరామన్ సూచించారు. నగదు–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి 13 శాతం స్థాయిలో ఉండటం సరికాదని, ఇన్నాళ్లూ ఆర్బీఐ పాటించిన నగదు ఎకానమీ విధానాలను ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో నగదు–జీడీపీ నిష్పత్తిని 7 శాతానికి తగ్గించే క్రమంలో కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లను క్రమంగా ఉపసంహరిస్తామని, కేవలం రూ.100 అంతకన్నా తక్కువ విలువ గల నోట్లే చలామణీలో ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని శివరామన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో విఫలమైన కేంద్రం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వసించి క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్స్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు సాధనాల వినియోగం గణనీయంగానే ఉంటుంది కనుక పట్టణ ప్రాంతాల్లో నగదు సరఫరాను తగ్గించి.. గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలని శివరామన్ తెలిపారు. -
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
-
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన సెర్చింగ్ ఆపరేషన్‌లో దాదాపు రూ.3000 కోట్లు వెలుగులోకి వచ్చినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. దానిలో రూ.79 కోట్లు కొత్త కరెన్సీ రూ.2000 నోట్లు కాగ, మిగతా రూ.2,600 కోట్లు లెక్కలో చూపనివని తెలిసింది. పట్టుబడిన నగదులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో పట్టుబడింది. చెన్నై వ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా రూ.140 కోట్లు పట్టుబడినట్టు తెలిసింది. నగదుతో పాటు రూ.52 కోట్ల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంటి ప్రాంగణంలో జరిపిన తాజా తనిఖీలో రూ.14 కోట్ల నగదు పట్టుబడింది. గత అక్టోబర్‌లో లెక్కలో చూపని నగదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయపు వెల్లడి పథకం కింద ఆ లాయరే దాదాపు రూ.125 కోట్లను తను లెక్కలో చూపని నగదుగా ప్రకటించారు. రెండు వారాల క్రితం అతని బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేసిన ఐటీ అధికారులు అకౌంట్ నుంచి లెక్కల్లో చూపని రూ.19 కోట్లను సీజ్ చేశారు. ఐటీ అధికారుల దాడులతో బుధవారం పుణేలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఒక వ్యక్తికి సంబంధించిన 15 లాకర్స్ వివరాలను వెల్లడించింది. ఆ 15 లాకర్స్‌లో రూ.9.85 కోట్ల నగదు ఉందని, వాటిలో రూ.8 కోట్లు కొత్త రూ.2000 కరెన్సీ నోట్లని, మిగతావి రూ.100 నోట్లని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. గత నెలకు సంబంధించిన బ్యాంకు రికార్డులు, సీసీటీవీ పరిశీలించిన బ్యాంకు అధికారులకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద పెద్ద బ్యాగులతో బయటికి వెళ్లడం, లోపలికి రావడం దానిలో రికార్డు అయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులపై సీరియస్ అయిన ఐటీ శాఖ, విచారణ చేపట్టింది. మొత్తంగా పుణే వ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రూ.10.80 కోట్ల నగదు పట్టుబడింది. వాటిలో రూ.8.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లున్నాయని ఐటీ అధికారులు తెలిపారు.. -
డెబిట్,కెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలపై కేంద్ర వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహాన్నందిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల లోపు లావాదేవీపై సర్వీస్ పన్నును రద్దు చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సేవల్లో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 2012 నాటి సర్వీస్ టాక్స్ నోటిఫికేషన్ ను మార్చనున్నట్టు తెలిపాయి. ఈ మేరకు నోటిఫికేషన్ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. నగదుకొరతతో ఇబ్బందులు పడుతూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడుతున్నవారికి ఇది మరింత ప్రయోజకరంగా వుంటుందని అంచనా! ముంబైలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి రావడానికి కొంతసమయం పడుతుందని ఆర్ బీఐ తేల్చి చెప్పింది. కాగా నిన్న (బుధవారం)ఆన్లైన్ లావాదేవీలు జరిపేవారికి ఆర్ బీఐ కొత్త నిబంధనలు విధించింది. ఇకపై రూ.2000 రూపాయల చెల్లింపుల్లో ఎలాంటి ఓటీపీ( వన్ టైమ్ పాస్వర్డ్) అవసరంలేదని ఆర్బీఐ తేల్చేసింది. వన్ టైమ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ద్వారా కార్డుహోల్డర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
మొహాలీలో నకిలీ కొత్త నోట్ల కలకలం
-
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్
-
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ షాక్ తగిలింది. ఫ్లిప్ కార్ట్ కు చెందిన మార్కెట్ యూనిట్, ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. బెంగుళూరు ఆధారిత ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ ప్రయివేట్ లిమిటెడ్ 2016మార్చి31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను 110శాతం మేర నష్టపోయింది. రెండింతల నష్టాన్ని నమోదు చేసింది. సుమారు రూ 2,306 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ 1,096 కోట్లగా ఉంది. ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ లో 99.74 శాతా వాటా కలిగి ఉంది. దీంతో దేశంలో నెంబర్ వన్ స్థానంకోసం మరో దిగ్గజ కంపెనీ అమెజాన్ తో హోరాహోరీగా పోరాడుతున్న ఫ్లిప్ కార్ట్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే గత ఏడాది అమ్మకాల్లో 153 శాతం వృద్ధితో రూ.1952కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ ఫ్లిప్ కార్ట్ మొత్తం వృద్ధి ఫ్లాట్ గానే ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు అక్టోబర్‌లో దీపావళి అమ్మకాలు సమయంలో అమెజాన్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది ఫ్లిప్ కార్ట్. అమెజాన్ తో పోలిస్తే 0.5 మిలియన్ యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. ముఖ్యంగా ఫ్యాషన్ యూనిట్లు మింత్రా, జబాంగ్ అమ్మకాలు ఎక్కువ నమోదు కావడం విశేషం. కాగా ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. టాప్ మేనేజ్మెంట్ మార్పులు, సంస్థ నిర్మాణంలో సంస్కరణల నేపథ్యంలో లాభదాయకత పై దృష్టి కోల్పోతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఫ్లిప్ కార్ట్ ..ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్, సింగ పూర్ లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ప్లేస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది. -
మరోసారి సత్తా చాటిన మారుతి
న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతి సుజుకి క్యూ2 నికర లాభాలు భారీగా జంప్ చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించి ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు తో ముగిసిన క్యూ 2 లో నికర లాభాలు 60.18 శాతం వృద్ధితో రూ 2,398 కోట్లను ఆర్జించింది. గత జూలై-సెప్టెంబర్ కాలంలో,రూ 1,497 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 29.28 శాతం పుంజుకుని రూ. 20,297 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 15,699.7 కోట్లగా ఉంది. ఇతర ఆదాయం రూ. 474 కోట్ల నుంచి రెట్టింపై రూ. 813 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా) 35 శాతం జంప్‌చేసి రూ. 3037 కోట్లుగా నమోదు చేసింది ఇబిటా మార్జిన్లు 14.3 శాతం నుంచి 14.96 శాతానికి బలపడినట్టు మారుతి సుజుకి ఇండియా బీఎస్ఈకి తెలిపింది. మొత్తం 4,18,470 వాహనాల విక్రయంతో 18.4 శాతం పెరుగుదలను సాధించినట్టు తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారి నాటి మార్కెట్ లో మారుతి సుజుకి షేర్లు రూ 5,932 వద్చద రిత్రాత్మక గరిష్టాన్ని నమోదుచేసింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 0.87 శాతం క్షీణించి రూ. 5,818 వద్ద వద్ద ట్రేడవుతున్నాయి. -
ఐటీసీ సిగరెట్ అమ్మకాలు పెరిగాయ్
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయత్రైమాసిక ఫలితాలు బుధవారం ప్రకటించింది. క్యూ2లో ఐటీసీ 10 శాతం ఎగిసిన నికర లాభాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో సిగరెట్ అమ్మకం అదాయంలో కూడా ఆశ్చర్యకరమైన వృధ్ధిని నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే రూ.7963 కోట్లతో పోలిస్తే రూ. 8,528కోట్లను తాకినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర లాభాలను రూ. 2,500 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.2,262కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన సంస్థ రూ.13,616 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రూ.12,611కోట్లతో పోలిస్తే ఇది 8 (7.97)శాతం పుంజుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం ఎగసి రూ. 3630 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.9 శాతానికి నామమాత్రంగా బలపడ్డాయి. దీంతో మార్కెట్లో ఐటీసీ షేర్ ధర స్వల్ప లాభంతో ముగిసింది. -
అతి భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. ఒకటికాదు రెండు కాదు రూ.2000 కోట్ల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని భూతల, ఆకాశమార్గంలో తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశం మయన్మార్ నుంచి భూతల మార్గం ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్ లోకి అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు.. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారని డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పటివరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగ్లింగ్ చేశారని, దాని విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు ఛేధించినవాటిల్లో అతి భారీ దందా ఇదేనని తెలిపారు. గుట్టురట్టైందిలా.. కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు గొంకను కదల్చగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 'విలువైన సరుకు'లను తనిఖీ చేసిన అధికారులు రూ.3.1 కోట్ల విలువచేసే10 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర సరుకులు అక్రమంగా రవాణాచేశారు. కాగా, కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. విమాన సిబ్బంది హస్తం? ఇంత భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నా విమానాశ్రయ, విమాన సిబ్బందికి ఇంతైనా అనుమానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని, ఈ వ్యవహారంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు, ఆ మేరకు వారిని త్వరలోనే ప్రశ్నిస్తామని డీఆర్ఐ అధికారులు చెప్పారు. -
రిలయన్స్ జియో 4జీ ఫోన్లు రూ. 2,999 లకు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ గురువారం ఉచిత వాయిస్ కాల్స్, చౌకగా డేటా ఛార్జీలు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర వరాలతోపాటు జియో 4జీ ఎల్ వైఎఫ్ వాయిస్ కాలింగ్ స్మార్ట్ ఫోన్లను పరిచయం చేశారు. దేశంలోని దిగువ వర్గాల ప్రజలు కూడా నాణ్యమైన 4జీ సేవలను అందుకోవాలన్న ఉద్దేశంతోనే కేవలం రూ. 2,999కి సూపర్ అఫర్డబుల్ 4జీ ఎల్టీఈ ఫోన్ ను అందించాలని నిర్ణయించామని ఆయన ప్రకటించారు. ఎల్ వై ఎఫ్ ఫ్లేమ్ 3 ఫ్లేమ్4, ఫ్లేమ్ 5, ఫ్లేమ్ 6 పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు. అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం 4-అంగుళాల డబ్ల్యు బీజీఏ డిస్ ప్లే, (480 ×800 పిక్సెల్ డ్యూయల్ సిమ్ స్లాట్, 512 ఎంబి ర్యామ్ 4 జీబీ స్టోరేజీ, 512 ఎంబీ ర్యామ్, 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ, 3ఎంపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉండగా, ఫ్లేమ్ 3, 5 లో మాత్రం 5 ఎంపీ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఫ్లేమ్ 3, 4, 5, 6 ఫోన్లు డ్యుయల్ సిమ్ సౌకర్యం కూడా ఉంది. తక్కువ ధర ఫోన్లు అందుబాటులోకి వస్తే, ఫీచర్ ఫోన్లను వాడుతున్న కోట్లాది మంది యూజర్లు స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతారని అభిప్రాయపడ్డ ఆయన, తాము విక్రయిస్తున్న ఫోన్లలో 70 శాతం వరకూ 4జీ కంపాటబిలిటీ ఉన్నవేనని వివరించారు. రిలయన్స్ జియో పండుగలు, పబ్లిక్ హాలిడేస్ తదితర ప్రముఖ రోజుల్లో 'బ్లాకౌట్'ను ప్రకటించబోదని, సిగ్నల్స్ బిజీగా ఉండే రోజుల్లో ధరలను పెంచబోదని ఆయన ప్రకటించారు. ఎంత అధిక డేటాను వాడుతుంటే, అంత తక్కువ ధరకు డేటా లభిస్తుందని అన్నారు. కాగా దాదాపు 20 మొబైల్ బ్రాండ్లతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్, మైక్రోమాక్స్, ఎల్జీ లాంటి మొబైల్స్ లో ఈ జియో సిమ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్
జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ పిక్చర్స్ సొంతంచేసుకుంది. రూ.2600 కోట్లకు స్పోర్ట్ బ్రాండ్కాస్టింగ్ బిజినెస్‌లను సోనీ పిక్చర్స్‌కు విక్రయించేందుకు టెలివిజన్ దిగ్గజం సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదించింది. సోనీతో కుదుర్చుకున్న ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుంది. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి టెన్ స్పోర్ట్స్‌ను సుభాష చంద్ర కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీన్ని సోనీ పిక్చర్స్‌కు విక్రయించారు. మరో నాలుగు, ఐదు నెలల్లో ఈ డీల్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ డీల్‌తో 21వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారత్‌లో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని వెల్లడవుతోంది. గత కొంతకాలంగా టెన్ స్పోర్ట్స్‌ను విక్రయించాలని జీ ఎంటర్టైన్మెంట్ పావులు కదిపిందని, నష్టాల్లో కొనసాగుతున్న స్పోర్ట్స్ వ్యాపారాలను వదిలించుకోవడానికి ప్రయత్నించిందని జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. సోనీ, స్టార్ రెండు భారత్‌లో తిరుగులేని ఛానల్స్ అని, ఈ డీల్ సోనీకి ఎంతో సహకరించనుందని డఫ్, ఫిల్స్స్ వాల్యుయేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా తెలిపారు. ఈ డీల్ అటు జీ ఎంటర్టైన్మెంట్కి, ఇటు సోనీకి లబ్ది చేకూరుస్తుందని స్పోర్ట్స్ బ్రాండ్కాస్టింగ్కు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ సోనీ కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జిస్తోంది. -
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్?
ముంబై: సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో జీ టీవికి చెందిన టెన్ స్పోర్ట్స్ ను సొంతం చేసుకోనుంది. టెలివిజన్ మొఘల్ సుభాస్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెఇఈల్)కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దాదాపు రూ.2000కోట్ల రూపాయలకుసోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా దీన్ని కొనుగోలు చేయనున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి దీన్ని సుభాష చంద్ర కొనుగోలు చేశారు. రెండు నెలలక్రితం ప్రారంభమైన చర్చలు, రెండు వారాల క్రితం మరింత వేగమయ్యాయని దీంతో ఇది ఒక కొలిక్కి వచ్చాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మరో రెండు మూడువారాల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై సోనీ ప్రతినిధిని సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. ఇది పాలసీకి సంబంధించిన అంశమంటూ ఊహాగానాలపై వివరించాడానికి వ్యతిరేకించారు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిహిర్ మోడీ. కాగా మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 21 వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారతదేశంలో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
అంచనాలను అధిగమించిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభాలను 26.80శాతం పెంచుకుని, రూ.2,796.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.2,204 కోట్లగా ఉన్నాయి. రూ.11,397.29 కోట్లగా ఉన్న మొత్తం ఆదాయాలు రూ.13,516.99 కోట్లకు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయలు(వడ్డీ ఆదాయాలకు, వడ్డీ చెల్లింపులకు తేడా) సైతం 9శాతం ఎగిసి, ఏడాది బేసిస్‌తో రూ.2,229.15 కోట్లగా నమోదైనట్టు తెలిపింది. జూన్ క్వార్టర్ ముగిసేనాటికి ఈ ఫైనాన్స్ కంపెనీ లోన్ బుక్ కూడా రూ.2.65 కోట్లకు పెరిగి, గతేడాది కంటే 14.92శాతం ఎగిసినట్టు హెచ్డీఎఫ్సీ తన ఫలితాల్లో ప్రకటించింది. ఈ త్రైమాసిక కాలంలో మొత్తం రూ.5,108 కోట్ల రుణాలను కార్పొరేషన్ అమ్మినట్టు, దానిలో రూ.3,296 కోట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విక్రయించినట్టు వెల్లడించింది. 12.3 కోట్ల హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్సూ కంపెనీ ఈక్విటీ షేర్లను తన పార్టనర్ ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీకి అమ్మినట్టు, దానివల్ల రూ.921.61 కోట్ల ప్రీ-టాక్స్ లబ్దిని పొందినట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉన్నట్టు, స్థూల నిరర్ధక ఆస్తులు 0.75 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ సేర్లు 1.48 శాతానికి ఎగిసి, రూ.1,398గా నమోదయ్యాయి. -
జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్టీఐఎల్ ఢమాల్
జిగ్నేశ్ షా ప్రమోటడ్ కంపెనీ ఫైనాన్సియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) ఆస్తుల అటాచ్ మెంట్ తో, ఆ కంపెనీ కౌంటర్లో షేర్ల అమ్మకం ఊపందుకుంది.ఎఫ్టీఐఎల్ షేరు దాదాపు 17.5 శాతం క్షీణించి, 52 కనిష్టానికి దిగజారింది. ప్రస్తుతం షేరు ధర రూ.70.65గా నమోదవుతోంది. తాజాగా ముంబై ఆర్థిక నేరాల విభాగం ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు చెందిన రూ.2,000 కోట్ల స్థిరాస్తులను స్వాధీన పరుచుకుంది. కంపెనీ బ్యాంకు బ్యాలన్స్ ను ఆర్థిక నేరాల విభాగం అటాచ్ చేసింది. ఎఫ్టీఐఎల్ కు చెందిన అన్ని కార్యాలయాలను ఈ విభాగం స్వాధీనం చేసుకుంటోంది. జిగ్నేశ్ షా అరెస్టు నేపథ్యంలో దిగజారిన షేర్ల పతనం, ఆయన కంపెనీ ఆస్తుల అటాచ్ మెంట్ తో మరింత కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడుల చెల్లింపుల్లో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్ జిగ్నేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. రూ.5,600 కోట్ల ఇన్వెస్టర్ల మనీకి నష్టంవాటిల్లేలా చేశారని, ఈ కుంభకోణ పరిశోధనకు ఆయన సరిగ్గా సహకరించనందున షాను అరెస్టు చేశామని ఈడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జిగ్నేశ్ షాపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్టీఐఎల్ లో దాదాపు 63వేల మంది షేర్ హోల్డర్స్, 1,000మంది ఉద్యోగులున్నారు. షేర్ హోల్డర్స్, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని చట్టపరమైన నివారణలు తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు ఎన్ఎస్ఈఎల్ సబ్సిడరీ. -
ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ , జపాన్ ఔషధ సంస్థ డైచీ శ్యాంకో వివాదంలో ర్యాన్ బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు, సర్దార్ సోదరులకు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాజీ యజమానులైన మల్వీందర్, శివిందర సింగ్ లకు భారీ జరిమానా విధించింది. ఆర్బిట్రేషన్ ఆఫ్ సింగపూర్ కోర్టు రూ 2,600 కోట్ల జరిమానా విధించింది. జపనీస్ ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి నిజాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2008లో ఇద్దరు సర్దార్జీ సోదరులు ర్యాన్‌బాక్సీ లో తమ వాటా 34 శాతాన్ని, దైచీ శ్యాంకో కు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించడం వివాదానికి దారి తీసింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాల నేపథ్యంలో 2013 మే లో డైచీ ఆధ్వర్యంలోని రాన్‌బాక్సీ లాబరేటరీస్ అమెరికా ప్రభుత్వం మోపిన మోసం కేసుకు సుమారు 500 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పుకుంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ర్యాన్‌బాక్సీ ఔషధాలు నాణ్యమైనవి కావని నాసిరం మందులను తయారు చేస్తోందని తేల్చడంతో ఈ పరిణామం చేటు చేసుకుంది. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాలు సుమారు 30 వరకు ప్రమాణాలు పాటించడంలేదని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ తేల్చి చెప్పింది. ఈ ఔషధాలను అమెరికా మార్కెట్లో రద్దు చేసింది. తమ సంస్థ నష్టాలకు, అమెరికా కోర్టు జరిమానాకు పరిహారం చెల్లించాల్సిందిగా దాయిచీ 2013లో సింగపూర్ లో మధ్యవర్తిత్వ కేసు దాఖలు చేసింది. భారతీయ ప్రమోటర్లు అవాస్తవాలతో తమను వంచించారని పేర్కొంది. కాగా వాస్తవానికి ర్యాన్‌బాక్సీ గుట్టును రట్టు చేసింది మాత్రం కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి దినేశ్ ఠాకూర్. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాల నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని... కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఇది తెలుసునని... ఠాకూర్ ఆరోపించారు.ర్యాన్‌బాక్సీకి చెందిన శాస్త్రవేత్తలకు పనికిరానివి... చౌకగా దొరికే ముడిపదార్థాలను వినియోగించి ఔషధాలను తయారు చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశించేవారని ఆరోపించారు. అమెరికా ఔషధ నియంత్రణా సంస్థను ర్యాన్‌బాక్సీ ఎలా మోసం చేసి తమ ఔషధాలను ఎలా ఆమోదించుకుందో ఠాకూర్ వివరాలతో సహా బహిర్గతం చేశారు. సంస్థ ఉద్యోగులే కంపెనీ అసలు గుట్టురట్టు చేయడంతో డొంకంతా కదిలింది. అయితే ఇప్పటికే కంపెనీనుంచి బయటికి వచ్చిన సివిందర్ మోహన్ సింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక సంస్థ రాధా సాబి బియాస్ లో చేరారు. అటు రాన్ బ్యాక్సీని కొనుగోలు చేసిన జపాన్ సంస్థ డైచీ శాంక్యోను 2014లో సన్ ఫార్మా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రూ.2500 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్?
తిరుమల: 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ప్రతిపాదిత బడ్జెట్ రూ.2500 కోట్లతో సిద్ధమవుతోంది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రూ.2,401 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఖరారు చేశారు. తాజా బడ్జెట్ మరో వంద కోట్ల దాకా పెరిగే అవకాశాలున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాబడి అంచనాలు, ఖర్చుల ప్రతిపాదనలను విభాగాల వారీగా లెక్కలు వేయడంలో ఆర్థిక నిపుణుల బృందం నిమగ్నమై ఉంది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పన, ధార్మిక సంస్థ ఉద్యోగుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం టీటీడీకి సాధికారిక మండలి (స్పెసిఫైడ్ అథారిటీ) ఉంది. బడ్జెట్ సమావేశం ఈనెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా 2010-2011లో టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.1,338 కోట్లు, 2011-2012లో రూ.1,661 కోట్లు, 2012-2013లో రూ.2,010 కోట్లు, 2013-2014లో రూ.2,248 కోట్లతో బడ్జెట్ ఖరారు చేశారు. -
రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు కొర్రీలు వేయకుండా పని చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో శవివారం సాయంత్రం జరిగిన డీసీసీ సమీక్ష సమావేశంలో రూ. 2700 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ముందుగావివిధ పథకాలపై సమీక్షించారు. ఖాతాలు తెరిచేందుకు పదేపదే తిప్పుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అకౌం ట్ తెరిచేలా చర్యలు తీసుకోవాలనిఆర్బీఐ ఏజీఎంను కలెక్టర్ కోరారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సుమారు మూడు నెల లుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని, ఆ లోటును త్వరగా భర్తీ చేయవలసిన అవసరం ఉందని సూచించారు. గత ఏడాది వ్యవసాయ రుణాలను అందించడంలోను, ఇతర పథకాల అమలులోను లక్ష్యం చేరుకోలేకపోయామని, ఈ ఏడాది లక్ష్యా న్ని అధిగమించేలా పని చేయాలని తెలిపారు. ఈ ఏడాది రుణ ప్రణాళిక రూ. 2,700 కోట్లలో ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించిన వాటికి రూ. 2,468 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వాటిలో పంట రుణాల కోసం రూ.1220 కోట్లు, కౌవులు రైతుల పంట రుణా ల కోసం రూ. 240 కోట్లు, టెర్మ్లోన్లకు రూ. 200 కోట్లు కలిపి వ్యవసాయ రంగానికి రూ.1,660 కోట్ల మేర రుణం ఇవ్వాలని ప్రణా ళికలో నిర్థేశించినట్టు తెలిపారు. ఇతర ప్రాధాన్యతా సెక్టారులైన గృహ నిర్మాణం, విద్య, స్వయం సహాయక లింకేజీల కోసం రూ.528 కోట్లను, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 280 కోట్లను కేటాయించామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రుణ ప్రణా ళికలో 72.18 శాతాన్ని అదనంగా కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, వాటికి లభించే రాయితీలపై రైతులకు మండల స్థాయి సమావేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల సహకారం అంతంతమాత్రంగానే ఉందని పలు శాఖల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. మండలాల, పథకాల వారీగా పెండింగ్ ఉన్న యూనిట్ల వివరాల తో లీడ్ బ్యాంక్ మేనేజర్‌కి బ్యాంకర్లు లేఖ పూర్వకంగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యాంకర్ల గైర్హాజరుపై ఆగ్రహం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశానికి సగం మంది బ్యాంకు అధికారులు గైర్హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత బ్యాంకులకు లీడ్ బ్యాంక్ మేనేజర్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. సమావేశానికి ప్రభుత్వ అధికారుల ంతా హాజరుకాగా, బ్యాంకు అధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, అను కూలమైన సమయానికే సమావేశం నిర్వహించామని అయినప్పటికీ హాజరుకాలేదని, ఇది వారి పనితీరుకు అర్ధం పడుతుందని తెలి పారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ షైనీ, డీఆర్డీఏ పీడీ జ్యోతి, లీడ్ బ్యాంచ్ మేనేజర్ శివబాబు, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.