రిలయన్స్ జియో 4జీ ఫోన్లు రూ. 2,999 లకు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ గురువారం ఉచిత వాయిస్ కాల్స్, చౌకగా డేటా ఛార్జీలు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర వరాలతోపాటు జియో 4జీ ఎల్ వైఎఫ్ వాయిస్ కాలింగ్ స్మార్ట్ ఫోన్లను పరిచయం చేశారు. దేశంలోని దిగువ వర్గాల ప్రజలు కూడా నాణ్యమైన 4జీ సేవలను అందుకోవాలన్న ఉద్దేశంతోనే కేవలం రూ. 2,999కి సూపర్ అఫర్డబుల్ 4జీ ఎల్టీఈ ఫోన్ ను అందించాలని నిర్ణయించామని ఆయన ప్రకటించారు. ఎల్ వై ఎఫ్ ఫ్లేమ్ 3 ఫ్లేమ్4, ఫ్లేమ్ 5, ఫ్లేమ్ 6 పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు.
అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం
4-అంగుళాల డబ్ల్యు బీజీఏ డిస్ ప్లే, (480 ×800 పిక్సెల్
డ్యూయల్ సిమ్ స్లాట్, 512 ఎంబి ర్యామ్
4 జీబీ స్టోరేజీ, 512 ఎంబీ ర్యామ్,
32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ,
3ఎంపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉండగా,
ఫ్లేమ్ 3, 5 లో మాత్రం 5 ఎంపీ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
ఫ్లేమ్ 3, 4, 5, 6 ఫోన్లు డ్యుయల్ సిమ్ సౌకర్యం కూడా ఉంది.
తక్కువ ధర ఫోన్లు అందుబాటులోకి వస్తే, ఫీచర్ ఫోన్లను వాడుతున్న కోట్లాది మంది యూజర్లు స్మార్ట్ ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతారని అభిప్రాయపడ్డ ఆయన, తాము విక్రయిస్తున్న ఫోన్లలో 70 శాతం వరకూ 4జీ కంపాటబిలిటీ ఉన్నవేనని వివరించారు. రిలయన్స్ జియో పండుగలు, పబ్లిక్ హాలిడేస్ తదితర ప్రముఖ రోజుల్లో 'బ్లాకౌట్'ను ప్రకటించబోదని, సిగ్నల్స్ బిజీగా ఉండే రోజుల్లో ధరలను పెంచబోదని ఆయన ప్రకటించారు. ఎంత అధిక డేటాను వాడుతుంటే, అంత తక్కువ ధరకు డేటా లభిస్తుందని అన్నారు. కాగా దాదాపు 20 మొబైల్ బ్రాండ్లతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్, మైక్రోమాక్స్, ఎల్జీ లాంటి మొబైల్స్ లో ఈ జియో సిమ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.