ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయత్రైమాసిక ఫలితాలు బుధవారం ప్రకటించింది. క్యూ2లో ఐటీసీ 10 శాతం ఎగిసిన నికర లాభాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో సిగరెట్ అమ్మకం అదాయంలో కూడా ఆశ్చర్యకరమైన వృధ్ధిని నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే రూ.7963 కోట్లతో పోలిస్తే రూ. 8,528కోట్లను తాకినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర లాభాలను రూ. 2,500 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.2,262కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన సంస్థ రూ.13,616 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రూ.12,611కోట్లతో పోలిస్తే ఇది 8 (7.97)శాతం పుంజుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం ఎగసి రూ. 3630 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.9 శాతానికి నామమాత్రంగా బలపడ్డాయి. దీంతో మార్కెట్లో ఐటీసీ షేర్ ధర స్వల్ప లాభంతో ముగిసింది.
ఐటీసీ సిగరెట్ అమ్మకాలు పెరిగాయ్
Published Wed, Oct 26 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement