Q2 net profit rises
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
నైకా దూకుడు కళ్లు చెదిరేలా లాభం, ఏకంగా 330 శాతం జూమ్
న్యూఢిల్లీ: బ్యూటీ, ఫ్యాషన్ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 5.2 కోట్లను తాకింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 330శాతం ఎక్కువ కావడం విశేషం. నైకా బ్రాండు కంపెనీ గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 1.2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 1,231 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 885 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ కాలంలో స్థూల వ్యాపార విలువ(జీఎంవీ) 45 శాతం జంప్‌చేసి రూ. 2,346 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో నైకా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం బలపడి రూ. 1,180 వద్ద ముగిసింది. అయితే బుధవారం మాత్రం లాభాలను కోల్పోయి స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. -
భారీగా పెరిగిన సెంట్రల్ బ్యాంకు లాభం
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది మంచి పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 55 శాతం పెరిగి రూ.250 కోట్లుగా నమోదైంది. బ్యాంకు ఆదాయం రూ.6,503 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెంట్రల్ బ్యాంకు రూ.161 కోట్ల లాభాన్ని, రూ.6,762 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.21 శాతం నుంచి 3.36 శాతానికి మెరుగుపడింది. బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను పరిశీలిస్తే.. నికర ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) సెప్టెంబర్ త్రైమాసికం చివరికి 4.51 శాతానికి క్షీణించాయి. స్థూల ఎన్పీఏలు సైతం 15.52 శాతానికి దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర ఎన్పీఏలు 5.60 శాతంగా, స్థూల ఎన్పీఏలు 17.36 శాతంగా ఉన్నాయి. డిపాజిట్ వ్యయాలు 4.45 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు, కంటింజెన్సీలకు (ఊహించని వాటి కోసం) రూ.1,048 కోట్లను పక్కన పెట్టింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.5,12,094 కోట్లకు, డిపాజిట్లు రూ.3,36,500 కోట్లకు వృద్ధి చెందాయి. బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంకు షేరు 5 శాతం లాభంతో రూ.23,60 వద్ద ముగిసింది. (చదవండి: దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!) -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.10,749 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. గృహ్ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 18 శాతం రుణ వృద్ధి...: పన్ను భారం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో రూ.6 కోట్లుగా ఉన్న డివిడెండ్ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి రూ.1,074 కోట్లకు పెరిగింది. 18% రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.3,078 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉంది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29% నుంచి స్వల్పంగా 1.33%కి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది. స్టాండ్అలోన్ లాభం...61 శాతం అప్.... స్టాండ్అలోన్ పరంగా నికర లాభం రూ.2,467 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.3,962 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.11,257 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,494 కోట్లకు పెరిగింది. గృహ్ ఫైనాన్స్ కంపెనీని బంధన్ బ్యాంక్‌కు విక్రయించడం వల్ల రూ.1,627 కోట్ల పన్నుకు ముందు లాభాలు వచ్చాయని తెలిపింది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ 2.4 శాతం లాభంతో రూ.2,181 వద్ద ముగిసింది. -
ఐటీసీ సిగరెట్ అమ్మకాలు పెరిగాయ్
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయత్రైమాసిక ఫలితాలు బుధవారం ప్రకటించింది. క్యూ2లో ఐటీసీ 10 శాతం ఎగిసిన నికర లాభాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో సిగరెట్ అమ్మకం అదాయంలో కూడా ఆశ్చర్యకరమైన వృధ్ధిని నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే రూ.7963 కోట్లతో పోలిస్తే రూ. 8,528కోట్లను తాకినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర లాభాలను రూ. 2,500 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.2,262కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన సంస్థ రూ.13,616 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రూ.12,611కోట్లతో పోలిస్తే ఇది 8 (7.97)శాతం పుంజుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం ఎగసి రూ. 3630 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.9 శాతానికి నామమాత్రంగా బలపడ్డాయి. దీంతో మార్కెట్లో ఐటీసీ షేర్ ధర స్వల్ప లాభంతో ముగిసింది.