సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది మంచి పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 55 శాతం పెరిగి రూ.250 కోట్లుగా నమోదైంది. బ్యాంకు ఆదాయం రూ.6,503 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెంట్రల్ బ్యాంకు రూ.161 కోట్ల లాభాన్ని, రూ.6,762 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.21 శాతం నుంచి 3.36 శాతానికి మెరుగుపడింది.
బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను పరిశీలిస్తే.. నికర ఎన్‌పీఏలు (వసూలు కాని రుణాలు) సెప్టెంబర్ త్రైమాసికం చివరికి 4.51 శాతానికి క్షీణించాయి. స్థూల ఎన్‌పీఏలు సైతం 15.52 శాతానికి దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర ఎన్‌పీఏలు 5.60 శాతంగా, స్థూల ఎన్‌పీఏలు 17.36 శాతంగా ఉన్నాయి. డిపాజిట్ వ్యయాలు 4.45 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏలకు కేటాయింపులు, కంటింజెన్సీలకు (ఊహించని వాటి కోసం) రూ.1,048 కోట్లను పక్కన పెట్టింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.5,12,094 కోట్లకు, డిపాజిట్లు రూ.3,36,500 కోట్లకు వృద్ధి చెందాయి. బీఎస్‌ఈలో సెంట్రల్ బ్యాంకు షేరు 5 శాతం లాభంతో రూ.23,60 వద్ద ముగిసింది.
(చదవండి: దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!)
Comments
Please login to add a commentAdd a comment