ముంబై: పీఎస్‌యూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతిని పొందింది. జనరాలి గ్రూప్‌తో భాగస్వామ్య ప్రాతిపదికన బీమాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం భాగస్వామ్య సంస్థ(జేవీ)కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్‌జీఐఐసీఎల్), ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్‌జీఐఎల్‌ఐసీఎల్)లలో వాటాల కొనుగోలుకి సెంట్రల్ బ్యాంక్‌ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అక్టోబర్‌లోనే అనుమతించింది.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్‌ఎంటర్‌ప్రైజెస్(ఎఫ్‌ఈఎల్)కు చెందిన జీవిత, సాధారణ బీమా వెంచర్‌లో వాటా కొనుగోలుకి ఈ ఏడాది ఆగస్ట్‌లో విజయవంత బిడ్డర్‌గా ఎంపికైనట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్న సంగతి తెలిసిందే..
Comments
Please login to add a commentAdd a comment