Central Bank of India
-
బీమా రంగంలోకి సెంట్రల్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్బీఐ నుంచి అనుమతిని పొందింది. జనరాలి గ్రూప్‌తో భాగస్వామ్య ప్రాతిపదికన బీమాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం భాగస్వామ్య సంస్థ(జేవీ)కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఐసీఎల్), ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎఫ్జీఐఎల్ఐసీఎల్)లలో వాటాల కొనుగోలుకి సెంట్రల్ బ్యాంక్‌ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అక్టోబర్‌లోనే అనుమతించింది.రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్)కు చెందిన జీవిత, సాధారణ బీమా వెంచర్లో వాటా కొనుగోలుకి ఈ ఏడాది ఆగస్ట్‌లో విజయవంత బిడ్డర్‌గా ఎంపికైనట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొన్న సంగతి తెలిసిందే.. -
రూ.10 నాణేలు చట్టబద్ధమైనవి
సుల్తాన్‌బజార్: పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవి. వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ సూచించారు. గురువారం కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ప్రజలకు, వినియోగదారులకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు రూ.10 నాణేల వాడకంపై విస్తృత అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లుబాటవుతున్నాయన్నారు.పది రూపాయల నాణేలు అన్ని చోట్లా తీసుకోవచ్చు.. అనే పోస్టర్లను రద్దీ ప్రాంతాల్లో, ప్రజా రవాణా ప్రాంతాల్లో ప్రజల అవగాహన కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. రూ.10 నాణేల వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. రూ.10 కరెన్సీ నోట్లు త్వరగా చిరిగిపోవడం, వాటి ముద్రణ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నాణేలను రిజర్వ్ బ్యాంక్ తీసుకువచి్చందన్నారు. ఇప్పటికైనా ప్రజలు రూ.10 నాణేల వాడకాన్ని ఉపయోగించాలన్నారు. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
సెంట్రల్ బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 458 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 279 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,524 కోట్ల నుంచి రూ. 7,636 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,285 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.16 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం4.39 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 0.22 శాతం తగ్గి 13.76 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 32.40 వద్ద ముగిసింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
30 నుంచి ఆ రెండు బ్యాంకుల సమ్మె
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు డిమాండ్ల సాధనలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సమ్మెకు దిగనున్నాయి. ఒప్పందాలకు విరుద్ధంగా అధికారులు, సిబ్బందికి బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నారు. అలాగే, ఔట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఈ నెల 30న సమ్మెకు దిగనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అటెండర్ స్థాయి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడాన్ని సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. (చదవండి: రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు) -
బ్యాంకును మోసగించారని సీబీఐ కేసు నమోదు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను రూ.61.71 కోట్ల మేర మోసంచేసిన కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నెల్లూరులో ఆయన నివాసంతోపాటు మరో రెండుచోట్ల సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ పేరిట తప్పుడు పత్రాలు సమర్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి 2017, 2018ల్లో రూ.65.50 కోట్ల రుణం తీసుకున్నారు. 2018లో బ్యాంకు ఆ ఖాతాను నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80 లక్షల రుణం చెల్లించారు. అప్పటికే ఆయన తన ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు తరలించినట్టు బ్యాంకు గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు టర్నోవర్ పత్రాలు చూపించి రుణం తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
భారత్ స్పందన మారాలి
న్యూఢిల్లీ: ధరల ఒత్తిళ్లకు తగ్గట్టు భారత సెంట్రల్ బ్యాంకు తన విధానాన్ని మార్చుకోవాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా సరఫరా చైన్‌లో ఏర్పడిన అవరోధాల ఫలితంగా ధరల ఒత్తిళ్లకు భారత్ సన్నద్ధం కావాలన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యం అయితే అది ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు లక్ష్యాలకు విఘాతమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఆర్బీఐ కట్టుబడి ఉండాలన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలని.. మరీ అయితే 2 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చంటూ ఆర్బీఐకి కేంద్ర సర్కారు ఎప్పుడో నిర్ధేశించిన లక్ష్యాన్ని రాజన్ పరోక్షంగా ప్రస్తావించారు. కరోనా సంక్షోభంలోనూ రేట్లను పెంచకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ఆర్బీఐ చక్కని పాత్రనే పోషించినట్టు చెప్పారు. ‘‘అన్ని సెంట్రల్ బ్యాంకుల మాదిరే మనం కూడా ముందుకు వచ్చి నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. పాత విధానం ఇప్పటికీ పనిచేస్తుందా? అని ప్రశ్నించుకోవడంతోపాటు అవసరమైతే మార్పులు చేసుకోవాలి’’ అని రాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ ఎగువ పరిమితి స్థాయి 6 శాతాన్ని రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో మించిపోవడంతో రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ మంటలు తాత్కాలికమేనా? అన్న ప్రశ్నకు రాజన్ బదులిస్తూ.. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణానికి తాజా ఒత్తిళ్లు అదనంగా పేర్కొన్నారు. యుద్ధ ప్రభావాలను కూడా కలిపి చూస్తే మరింతగా పెరిగిపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వృద్ధిపై ఆందోళన..? భారత్ వృద్ధి పథంపై ఆందోళనగా ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘2014 తర్వాత నుంచి కనిష్ట చమురు ధరల వల్ల భారత్ లాభపడింది. కానీ ఇప్పుడు తిరిగి చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన వృద్ధి పనితీరు కొంత కాలంగా బలహీనంగా ఉందన్నది వాస్తవం. 2016 డీమోనిటైజేషన్ తర్వాత నుంచి బలమైన రికవరీ లేదు. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు అనే మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంతో జాగ్రత్తగా వీటిని నిర్వహించాల్సి ఉంటుంది’’ అని రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కీలక బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పొద్దు: ఆర్బీఐ ముంబై: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ నంబర్లు వంటి కీలకమైన గోప్యనీయ బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. ప్రజా ప్రయోజనార్థం ఆర్థిక మోసాల తీరుతెన్నులపై ’బి(ఎ)వేర్’ పేరిట రూపొందించిన బుక్‌లెట్‌లో ఈ విషయాలు వివరించింది. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సాధనాలతో అంతగా పరిచయం లేని సామాన్యులను మోసగించేందుకు నేరగాళ్లు కొంగొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని సూచించింది. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదు కాగా, తన నియంత్రణలోని సంస్థలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదని ఆర్బీఐ ప్రకటన ఒకటి స్పష్టం చేసింది. ఈ మేరకు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొంది. నియంత్రిత సంస్థలపై ఫిర్యాదులు, విచారణకు ఎటువంటి ఫీజులూ చెల్లించనక్కర్లేదని పేర్కొంది. జ్టి్టpట:// ఠీఠీఠీ.టbజీ.ౌటజ.జీn కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ను (సీఎంఎస్) పోర్టల్ ప్రజా ఫిర్యాదులకు వినియోగించుకోవచ్చని తెలిపింది. -
బ్యాంకులకు 15,000 కోట్ల అదనపు మూలధనం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బలహీనంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్రం రూ. 15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. ఇందులో సింహభాగాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైనవి దక్కించుకోనున్నాయి. గత ఏడాది వడ్డీ రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం లభించనుంది. సదరు బాండ్ల వేల్యుయేషన్‌ను.. ముఖ విలువ కంటే తక్కువగా లెక్క గట్టారంటూ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. దీనితో, నిధులు సమకూర్చుకున్నప్పటికీ ఆయా బ్యాంకుల టియర్ 1 మూలధన నిల్వలు.. నిర్దేశిత స్థాయికన్నా తక్కువగానే ఉన్నాయని ఆర్బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పీఎస్బీలకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లను సవరించిన ఆ రెండు బ్యాంకులు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) రెపో రేటు(4 శాతం), రివర్స్ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ మానిటరరీ పాలసీ ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసీఓ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎఫ్డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు 2.75% నుంచి 5.15% మధ్య ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు యుకో బ్యాంక్ యుకో బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో డిపాజిట్ చేసే ఎఫ్డీలపై ఇతర సిటిజన్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 0.50 బేసిసి పాయింట్స్ అధికంగా పొందనున్నారు. యుకో బ్యాంక్ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు (చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం!) -
భారీగా పెరిగిన సెంట్రల్ బ్యాంకు లాభం
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది మంచి పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 55 శాతం పెరిగి రూ.250 కోట్లుగా నమోదైంది. బ్యాంకు ఆదాయం రూ.6,503 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెంట్రల్ బ్యాంకు రూ.161 కోట్ల లాభాన్ని, రూ.6,762 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.21 శాతం నుంచి 3.36 శాతానికి మెరుగుపడింది. బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను పరిశీలిస్తే.. నికర ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) సెప్టెంబర్ త్రైమాసికం చివరికి 4.51 శాతానికి క్షీణించాయి. స్థూల ఎన్పీఏలు సైతం 15.52 శాతానికి దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర ఎన్పీఏలు 5.60 శాతంగా, స్థూల ఎన్పీఏలు 17.36 శాతంగా ఉన్నాయి. డిపాజిట్ వ్యయాలు 4.45 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు, కంటింజెన్సీలకు (ఊహించని వాటి కోసం) రూ.1,048 కోట్లను పక్కన పెట్టింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.5,12,094 కోట్లకు, డిపాజిట్లు రూ.3,36,500 కోట్లకు వృద్ధి చెందాయి. బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంకు షేరు 5 శాతం లాభంతో రూ.23,60 వద్ద ముగిసింది. (చదవండి: దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!) -
సెంట్రల్ బ్యాంకుకు టోకరా.. మరో భారీ ‘రుణ’ కుంభకోణం
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్న బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబుల బండారం బట్టబయలవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శ్రీలక్ష్మి కాట్‌సిన్‌తోపాటు ఆ సంస్థ చైర్మన్ కమ్ ఎండీ మాతా ప్రసాద్ అగర్వాల్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి వీరు భారీగా రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బ్యాంకుల కన్సార్టియంకు రూ.6,833 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది సీబీఐ దర్యాప్తు చేస్తున్న బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా నోయిడా, రూర్కీ, కాన్పూర్, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సీబీఐ అధికారులు ‘శ్రీలక్ష్మి కాట్సిన్’ చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్‌తోపాటు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శారదా అగర్వాల్, డిప్యూటీ ఎండీ దేవస్ నారాయణ్ గుప్తాను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాంకును మోసగించినట్లు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆరోపించింది. తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారని, ఇలా చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తేల్చిచెప్పింది. రుణం కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, అబద్ధాలు చెప్పారని పేర్కొంది. వస్త్ర వ్యాపారం చేసే శ్రీలక్ష్మి కాట్సిన్ సంస్థ తమ వద్ద అధికంగా నిల్వలు ఉన్నట్లు బ్యాంకులకు ఫోర్జరీ రికార్డులు సమర్పించింది. రూ.7,926 కోట్లకు పైగా రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా బ్యాంకులను దగా చేసిన హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ట్రాయ్(ఇండియా) లిమిటెడ్‌పై గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్, కోట్లల్లో నికర లాభం
ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 206 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 135 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,349 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, క్యూ1లో ఆదాయం రూ. 6,727 కోట్ల నుంచి రూ. 6,246 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు గత క్యూ1 స్థాయిలో రూ. 2,135 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 18.10 శాతం నుంచి 15.92 శాతానికి, నికర ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గాయి. బుధవారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు సుమారు 1.4 శాతం క్షీణించి రూ. 24.45 వద్ద ముగిశాయి. -
బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ
న్యూఢిల్లీ: త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోందని.. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చన్నారు. ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీబీడీసీ ఫలించే దశలో ఉందంటూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ప్రారంభించినట్టు చెప్పారు. సౌర్వభౌమ మద్దతు లేని పలు వర్చువల్ కరెన్సీల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సీబీడీసీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అత్యున్నతస్థాయి అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. విధానాలు, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన తర్వాత సీబీడీసీని డిజిటల్ రూపీగా ప్రవేశపెట్టే విషయమై సిఫారసులు, సూచనలను ఈ కమిటీ తెలియజేయనుంది. -
వీటి పనితీరు ఎలా ఉందో? తయారీ, సేవల రంగాలపై ఆర్బీఐ కన్ను!
ముంబై:తయారీ, సేవల రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం రెండు కీలక సర్వేలను ఆవిష్కరించింది. క్లుప్తంగా వీటిని పరిశీలిస్తే...తయారీ రంగం పనితీరును మదింపు చేయడానికి త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పారిశ్రామిక అవుట్‌లుక్ సర్వే (ఐఓఎస్) ప్రారంభమైంది. ►సేవలు, మౌలిక రంగాలకు సంబంధించి ప్రస్తుత త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పనితీరును తెలుసుకునేందుకు సేవలు, మౌలికరంగ అవుట్‌లుక్ సర్వే (ఎస్‌ఐఓఎస్)ను ఆర్బీఐ ప్రారంభమైంది. ► సేవలు, తయారీ, మౌలిక రంగాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో ఏ విధంగా పనితీరును కనబరుస్తున్నాయి?, వ్యాపార సెంటిమెంట్ ఎలా ఉంది?, డిమాండ్, ఫైనాన్షియల్, ఉపాధి అవకాశాలు, ధరల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) పరిస్థితిపై ఒక అంచనాలకు వస్తుంది. ► కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో సేవలు, తయారీ, మౌలిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ►భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ)లో సేవల రంగం వాటా దాదాపు 55 శాతంకాగా, తయారీ రంగం వాటా దాదాపు 15 శాతం. చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా -
వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్!
కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతి రాష్ట్రం వ్యాక్సిన్ వేసుకోవాలి అవగాహన కలిపిస్తున్నాయి. అలాగే, వ్యాక్సిన్ వేసుకున్న వారికి పలు స్వచ్చంద సంస్థలు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బ్యాంకులు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలను ప్రోత్సాహిస్తున్నాయి. పరిమిత కాలానికి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కనీసం ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వినియోగదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 999 రోజుల పాటు 30 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అధిక రేటును అందించనున్నట్లు యుకో బ్యాంక్ తెలిపింది. "టీకా డ్రైవ్‌లను ప్రోత్సహించడానికి మా వంతు సహాయం చేస్తున్నాము. మేము UCOVAXI-999 పేరిట ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చాము. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది" అని ఒక బ్యాంకు అధికారిని చెప్పారు. అలాగే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవలే ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ అనే ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ కింద టీకాలు వేసుకుంటే వినియోగదారులకు 25 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకం 1,111 రోజుల మెచ్యూరిటీని కలిగి ఉంది. ఇది పరిమిత కాలానికి వర్తిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న సీనియర్ సిటిజన్లకైతే అదనంగా మరో 25 బేసిస్ పాయింట్లు కలిపి మొత్తం 50 బేసిస్ పాయింట్లు లేదా 0.50శాతం వడ్డీ ఇవ్వనుంది. చదవండి: డెలివరీ బాక్స్ ఓపెన్ చూసి షాక్ అయిన మహిళ? -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్స్‌పై 6.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌బజార్ తెలిపిన సమాచారం ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీరేటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతంగా వడ్డీరేటు ఉంది. భారతదేశం, విదేశాలలో ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలు తీసుకునే వారికి సెక్షన్ 80ఈ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ కోసం, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నట్లయితే చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రెండు బెనిఫిట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావిస్తే.. లేదంటే విదేశాల్లో చదివించాలని భావిస్తే.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించబడుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. "ప్రైవేటీకరణ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్ ఎంటర్ప్రైస్ పాలసీ స్పష్టంగా చెబుతోంది. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వ బ్యాంకులను విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు. ప్రైవేటీకరించే బ్యాంకుల ప్రతి సిబ్బంది వేతనాలు, పింఛన్లు వంటి ప్రయోజనాలను తాము రక్షిస్తామని" సీతారామన్ అన్నారు. నేడు దేశవ్యాప్తంగా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు సమ్మె వల్ల మూతపడ్డాయి. రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ కోసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఈ సమ్మె ప్రారంభమైంది. 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పెట్టుబడులను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. పీఎస్బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. చదవండి: హోమ్‌లోన్ తీసుకునేముందు ఇవి గమనించండి! కరోనా కాలంలో ఎగుమతుల జోరు -
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల విరాళం 11.90 కోట్లు...
న్యూఢిల్లీ: కరోనాపై పోరు బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.11.90 కోట్ల విరాళం ఇవ్వనున్నారు. దాదాపు 29,600 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సింఫనీ సహాయం..: కాగా కోవిడ్–19పై పోరాటంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 ఎయిర్ కూలర్లను సరఫరా చేయాలని ప్రముఖ ఎయిర్ కూలింగ్ కంపెనీ సింఫనీ నిర్ణయించింది. ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, ఇతర హెల్త్‌కేర్ సెంటర్లలో ఈ ఎయిర్ కూలర్లను గుజరాత్ ఆరోగ్యశాఖ వినియోగించనుంది. -
ప్రముఖ బ్యాంకులో భారీ కుంభకోణం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ బ్యాంకులో అతనో అప్రయిజర్... ఆ బ్యాంకులో బంగారంపై రుణం కావాలంటే ఆ అప్రయిజర్ ఖాతాదారుడు తెచ్చింది అసలైన బంగారమే అంటూ రాజముద్ర వేయాలి. అప్రయిజర్ అలా వేయకుంటే అది అసలైన బంగారం అయినా ఆ బ్యాంకు ఖాతాదారుడికి రుణం ప్రాణం పోయినా ఇవ్వదు. బ్యాంకుకు అంతటి నమ్మకస్తుడుగా ఉండాల్సిన ఆ అప్రయిజర్ బ్యాంకు అధికారులు నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవు తన మెదడుకు పని చెప్పాడు. అధికారులను డుమ్మి కొట్టించేందుకు పదునైన పథకం రచించాడు. అందుకోసం నమ్మకమైన పరిచయస్తులతో పాటు దూరం బంధువులను కలుపుకున్నాడు. వారికి తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని అదే బ్యాంకులో వారి పేరు మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకున్నాడు. ఆలస్యంగానైనా విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు పెట్టి అధికారుల ఎదుట గొల్లుమన్నారు. అనంతరం పోలీసులను కలసి జరిగిన మోసంపై మూకుమ్మడిగా ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంకులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడుతున్న పోలీసులు మచిలీపట్నంకు చెందిన ప్రసాద్ సెంట్రల్ బ్యాంకులో అప్రయిజర్‌గా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న ప్రసాద్ కొంత కాలంగా తన బంధువులు, పరిచయస్తులతో నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. బంగారం ఒరిజనలా డూప్లికేటా అనేది తేల్చే బాధ్యత ప్రసాద్‌దే కావడంతో బ్యాంకు అధికారుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ప్రసాద్ కొంతకాలంగా ఇదే తరహాలో బ్యాంకులో నకలీ బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్లలో రుణాలు తీసుకుంటూ వచ్చాడు. సంతకాలు పెట్టిన బంధువులు, పరిచయస్తులకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుండగా ప్రసాద్ వారికి మీ రుణాలు తీరిపోయాయి అంటూ చెప్పుకుంటూ రావడంతో పాటు వారి అవసరాలకు అడ్డుపడుతూ నోరు మెదపకుండా చేసుకుంటూ వస్తున్నాడు. బ్యాంకు నోటీసులు అధికం కావడంతో అనుమానం వచ్చిన కొంత మంది బ్యాంకు అధికారులతో వాదనకు దిగారు. దీంతో అసలు విషయం బయటికి పొక్కడంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుల్లోని కొందరు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బందరు డీయస్పీ మహబూబ్‌బాషా, సీఐ వెంకటనారాయణలు బ్యాంకుకు వెళ్ళి మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ పై అధికారులతో మాట్లాడిన అనంతరం ఆడిట్ వ్యవహారం ముగిశాక ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో పోలీసులు బ్యాంకు నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు కోట్లలో కుంభకోణం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి వాస్తవ అవాస్తవాలు నిర్ధారించటం జరుగుతుందని చిలకలపూడి సీఐ వెంకటనారాయణ తెలిపారు. -
మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: ముఖ్యమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు బ్యాంక్ మోసం కేసులో సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే రతుల్ పూరి అరెస్టు నేపథ్యంలో తన మేనల్లుడి వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వాటాదారుడి కానని కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక చర్య అని, ఈ విషయంలో కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని రతుల్ పూరి అరెస్టుపై ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: సీఎం మేనల్లుడికి ఈడీ షాక్ కాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రతుల్ పూరిని మూడు ప్రధాన కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి రతుల్ పూరిని విడిగా విచారిస్తున్నారు. అంతేకాక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంగా అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన తర్వాత అతడిని నిందితుడుగా అరెస్టు చేశారు. ఈ మేరకు పూరీని కస్టడీలోకి (అదుపులో) తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మరోవైపు రతుల్ పురి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. -
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ4లో మరింత కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2017 18) క్యూ4లో రూ. 2,114 కోట్లుగా ఉన్నాయి. మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల క్యూ4లో నికర నష్టాలు భారీగా పెరిగాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాల ప్రకటన సందర్భంగా తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,301 కోట్ల నుంచి రూ.6,621 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యం బ్యాంకు షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. -
సెంట్రల్‌బ్యాంక్, ఐఓబీ రేటింగ్ పెంపు
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ–3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది. గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్‌కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.3,810 కోట్లు సమకూరాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించింది. -
సెంట్రల్ బ్యాంక్‌కు రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని బ్యాంక్ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ బాటలోనే పలు పీఎస్‌బీలు.. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిధులు సమీకరిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నామని ఇటీవలే సిండికేట్ బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే రూ.500 కోట్లు సమీకరించింది. అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్నాయి. కాగా రూ.200 కోట్ల నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 శాతం వరకూ లాభపడి రూ.36.05 వద్ద ముగిసింది. -
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు 924 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.924 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఏడాది క్యూ2లో ఈ నికర నష్టాలు రూ.750 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలియజేసింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలు మరింతగా పెరగడంతో ఈ క్యూ2లో నికర నష్టాలు పెరిగాయని వెల్లడించింది. అయితే ఈ క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.1,522 కోట్లతో పోలిస్తే ఈ సారి తగ్గినట్లే లెక్క. మరింత క్షీణించిన రుణ నాణ్యత గత క్యూ2లో రూ.6,166 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.5,685 కోట్లకు తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వడ్డీ ఆదాయం రూ.6,166 కోట్ల నుంచి రూ.5,685 కోట్లకు తగ్గింది. బ్యాంక్ రుణ నాణ్యత మరింతగా క్షీణించింది. గత క్యూ2లో రూ.31,641 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.37,411 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం రూ.15,900 కోట్ల నుంచి రూ.15,794 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 17.27 శాతం నుంచి 21.48 శాతానికి, నికర మొండి బకాయిలు 9.53 శాతం నుంచి 10.36 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మొండి బకాయిలు ఒకింత మెరుగయ్యాయని బ్యాంకు పేర్కొంది. మొండి బకాయలు పెరిగినా, వాటికి కేటాయింపులను తగ్గించామని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు గత క్యూ2లో రూ.1,792 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,649 కోట్లకు తగ్గాయి. అయితే మొత్తం కేటాయింపులు మాత్రం రూ.1,962 కోట్ల నుంచి రూ.1,983 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 58.58 శాతం నుంచి 67.74 శాతానికి పెరిగిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 1.2 శాతం నష్టంతో రూ.30.85 వద్ద ముగిసింది. -
కోరిక తీరిస్తే రుణం ఇస్తా..
బుల్దానా: రుణం మంజూరు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళారైతును బ్యాంక్ మేనేజర్ కోరారు. ఈ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని దతాలా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు పంట రుణం కోసం ఈ నెల 18వ తేదీన స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజేశ్ హివాసేను సంప్రదించారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన మేనేజర్, ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకుని తనతో ‘టచ్’లో ఉండాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారు. 22వ తేదీన బ్యాంక్ ప్యూన్ మనోజ్ చవాన్ ఆమెకు ఫోన్ చేసి.. మేనేజర్ కోరిక తీరిస్తే రుణం ఎక్కువ మంజూరవుతుందంటూ మాట్లాడాడు. అయితే, ఆ మహిళ వీరిద్దరి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ సంభాషణలతో కలిపి ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్‌తోపాటు ప్యూను వారిని చూసి పరారయ్యారు. అయితే, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వందలాది మంది బ్యాంకుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బ్యాంక్ మేనేజర్‌తోపాటు ప్యూన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మేనేజర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును జిల్లా కలెక్టర్ నిరుపమా దాంగే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.