సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.200 కోట్లు | Central Bank to raise 200 crore via employee stock purchase plan | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.200 కోట్లు

Published Sat, Dec 29 2018 3:53 AM | Last Updated on Sat, Dec 29 2018 3:53 AM

Central Bank to raise  200 crore via employee stock purchase plan - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్‌) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్‌ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది.  

ఈ బాటలోనే పలు పీఎస్‌బీలు.. 
ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిధులు సమీకరిస్తున్నాయి. ఈ స్కీమ్‌ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నామని ఇటీవలే సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఇప్పటికే రూ.500 కోట్లు సమీకరించింది. అలహాబాద్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్నాయి. కాగా రూ.200 కోట్ల నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1 శాతం వరకూ లాభపడి రూ.36.05 వద్ద ముగిసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement