న్యూఢిల్లీ: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస రుణరేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్ బేస్ రేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేటును 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.95 శాతానికి తగ్గింది. సిండికేట్ బ్యాంక్ రుణ రేటు పావుశాతం తగ్గి 10 శాతానికి చేరింది.
బీఓబీ, ఓబీసీ డిపాజిట్ రేట్ల కోత: కాగా రుణ రేటు కోతకు సంకేతంగా భావించే డిపాజిట్ రేట్ల కోత నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) తీసుకున్నాయి. కొన్ని డిపాజిట్లపై తగ్గించిన తాజా వడ్డీ రేటు జూన్ 8 నుంచి అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి.
సెంట్రల్, సిండికేట్ బ్యాంకుల బేస్ రేటు కోత
Published Sat, Jun 6 2015 12:22 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM
Advertisement
Advertisement