Syndicate Bank
-
సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో జరిగిన రూ.209 కోట్ల మోసం కేసులో వ్యాపారవేత్త అనూప్ బర్తియా, బ్యాంక్ మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఆదర్శ్ మన్చందన్, చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) భరత్‌సహా మరో 15 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. జైపూర్ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించింది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు, ఇన్వాయిస్లు, వర్క్ ఆర్డర్లని వినియోగించి మొత్తం 118 రుణ అకౌంట్లకు రూ.209 కోట్ల నిధులను మళ్లించినట్లు సీబీఐ ఆరోపణ. 118 అకౌంట్లలో గృహ రుణ అకౌంట్లు, టర్మ్‌లోన్ అకౌంట్లు ఉన్నాయని ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. కమర్షియల్ ప్రాపర్టీల కొనుగోళ్లు, గృహ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్‌లు, వర్కింగ్ క్యాపిటల్ టర్మ్లోన్ల పేరుతో అధికారులు కుమ్మక్కై జైపూర్‌లోని మిరోడ్ బ్రాంచ్, మాళవ్య నగర్ బ్రాంచ్, ఉదయ్ పూర్ బ్రాంచీల నుంచి భారీ రుణాలను 118 అకౌంట్లకు మళ్లించినట్లు ప్రధాన ఆరోపణ. -
ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి
సీండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు 1 జూలై 2021 నుంచి నిలిపివేయనున్నట్లు కెనరా బ్యాంక్ తన వినియోగదారులకు తెలియజేసింది. సీండికేట్ బ్యాంక్ వినియోగదారులు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్లను జూన్ 30లోగా అప్డేట్ చేసుకోవాలని కోరింది. "సీండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌తో విలీనం చేసిన తర్వాత SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఈ-సీండికేట్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు మార్చారు. అందుకే SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఐఎఫ్ఎస్సీ కోడ్లను 01.07.2021 నుంచి నిలిపివేయనున్నట్లు" కెనరా బ్యాంక్ తెలిపింది. "నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ఐఎమ్పీఎస్ లావాదేవీల కోసం "CNRB"తో ప్రారంభమయ్యే క్రొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లను మాత్రమే ఉపయోగించాలని వినియోగదారులకు కోరింది. ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఎందుకు మారుస్తున్నారు? మెగా విలీన ప్రక్రియలో భాగంగా10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ విలీనం ఏప్రిల్ 2020లో అమల్లోకి రాగా ఐఎఫ్ఎస్సీ, ఎమ్ఐసీఆర్ కోడ్లను 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1, 2021 నుంచి నవీకరిస్తున్నారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ అంటే ఏమిటి? ఐఎఫ్ఎస్సీ(ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎమ్పీఎస్ ద్వారా జరిగే ఆన్లైన్ ఫండ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేశారు. 1 ఏప్రిల్ 2019 నుంచి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. అందుకే ఈ ఖాతాదారుల ఐఎఫ్ఎస్సీ, ఎమ్ఐసీఆర్ కోడ్లు మారుతాయి. అయితే, ఈ బ్యాంకులు ఇంకా తన వినియోగదారులకు తెలియజేయలేదు. చదవండి: భారత్ లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్? -
ఏదైనా కొత్త పేరు కావాలి
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ఆయా బ్యాంకులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకుకు కొత్త పేరేదైనా పెట్టాలని, కొత్తగా బ్రాండింగ్ చేయాలని కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు సిండికేట్ బ్యాంక్ కూడా విలీన సంస్థకు కొత్త పేరు పెట్టాలంటూ కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది. కొన్నాళ్ల క్రితమే రెండు బ్యాంకుల విలీనంతో భారీ సంస్థగా ఆవిర్భవించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తరహా అనుభవం పునరావృతం కాకూడదని తాజాగా విలీనం కాబోయే బ్యాంకులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీవోబీలో విజయా, దేనా బ్యాంకు విలీనం తర్వాత.. మూడింటి లోగోలను కలిపి ఒక లోగోను తయారు చేశారు. దీనికి పవర్ ఆఫ్ 3 అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది. అయితే, ఇందులో మిగతా రెండు బ్యాంకుల కన్నా బీవోబీ లోగో ప్రముఖంగా కనిపిస్తుంటుంది. దీంతో, ఈసారి మాత్రం ఈ తరహా బ్రాండింగ్ వద్దని కొత్తగా విలీనం కాబోయే (నాన్–యాంకర్) బ్యాంకులు కోరుతున్నాయి. ‘విలీనంతో ఏర్పడే బ్యాంకు పేరు.. మూడు బ్యాంకుల అస్తిత్వాన్ని తెలియపర్చే విధంగా పేరు ఉండాలి. దానికి తగ్గట్టే ఏదైనా కొత్త పేరు పెట్టాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం’ అని యునైటెడ్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో తమ బ్యాంకు గుర్తింపు కూడా ఉండాలని తామూ కోరుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కొత్త బ్రాండ్ సులువేనా.. ప్రస్తుతం పీఎన్బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ విలీన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిటీ.. కొత్తగా బ్రాండింగ్పైనా కసరత్తు చేస్తోంది. విలీన బ్యాంకుకు తగిన పేరును సూచించేందుకు బ్రాండింగ్ ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. అయితే, విలీన బ్యాంకుకు కొత్త పేరు పెట్టాలన్న డిమాండ్‌తో విభేదిస్తున్న బ్యాంకులూ ఉన్నాయి. అలహాబాద్ బ్యాంక్ వీటిలో ఒకటి. ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న పేర్లను పూర్తిగా మార్చేయడం వల్ల బ్రాండ్ రీకాల్ విలువ దెబ్బతినవచ్చని అలహాబాద్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నాయి. ఇక, విలీన సంస్థ పేరు మార్చాలంటూ నాన్–యాంకర్ బ్యాంకులు కోరుతున్నా.. అదంత సులువైన వ్యవహారం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి పార్లమెంటు ఆమోదం కావాల్సి ఉంటుందని, గెజిట్ నోటిఫికేషన్ అవసరమని పేర్కొన్నాయి. ఇందుకు చాలా సమయం పట్టేస్తుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. విలీనమయ్యే బ్యాంకులివే.. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు.. యాంకర్ బ్యాంకులుగా వ్యవహరించనున్నాయి. మిగతావి నాన్–యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడం ద్వారా దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కానుంది. అలాగే, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం కానుంది. ఇక, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కలుస్తాయి. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. -
హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం
సాక్షి, హైదరాబాద్ : ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఫలక్‌నుమాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నుమాలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో నలుగురు దుండగులు చోరీకి యత్నించారు. చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను మొబిన్, సాజిద్, షేక్ ఖాసీంగా గుర్తించారు. దుండగులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేశారు. -
మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ
సాక్షి, ముంబై: రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి రూపాయలు, సిండికేట్ బ్యాంకుకు రూ. 75 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ( సోమవారం, అక్టోబర్ 14) ఉత్తర్వు లు జారీ చేసింది. ఆస్తి వర్గీకరణ, మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్‌కు కోటి రూపాయలు, మోసాల వర్గీకరణ , రిపోర్టింగ్‌పై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు సిండికేట్ బ్యాంక్‌కు రూ .75 లక్షల ద్రవ్య జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిండికేటు గాళ్లు..!
సాక్షి, నిజామాబాద్ : ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్‌బ్యాంకులో అధికారులు, సిబ్బంది కలిసి పంట రుణాల పేరుతో ఏకంగా రూ. 2.5 కోట్లు మేరకు లూటీ చేశారు. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి, నిరక్షరాస్యులైన ఖాతాదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట రుణాల పేరుతో దండుకున్నారు. ఈ క్రమంలో పహాణీలు, వన్బిలును కూడా ఆన్లైన్లో జిమ్మిక్కులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జరిగిన కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూడడంతో బ్యాంకు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న సిండికేట్ బ్యాంకు పరిధిలో ఎడపల్లితో పాటు, అంబం, యర్తి, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, ఎంఎస్సీ ఫారం, జైతాపూర్, జంలం తదితర గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులు, అమాయకులను మభ్యపెట్టి వారి పేర్లతో ఈ బ్యాంకులో ఖాతాలను తెరిచారు. వీరికి భూములు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఆన్లైన్లో ఉండే పట్టాదారుపాసుపుస్తకాలు, వన్‌బీ, పహాణీల విషయంలోనూ జిమ్మిక్కులకు పాల్పడ్డారు. వారి పేరున పంట రుణం మంజూరు చేసి, ఆ మొత్తాన్ని దండుకున్నారు. ఇలా 64 మంది అమాయక రైతుల పేర్లు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 64 మంది పేర సుమారు రూ. 2.5 కోట్లకు మించి లూటీ చేసినట్లు భావిస్తున్నారు. ఖాతాలు తెరిచిన వారికి నామమాత్రం కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు. వెలుగు చూసిందిలా.. బోగస్ పంట రుణం పొందిన ఓ మహిళ గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఈ సంఘానికి రుణం మంజూరు కావడం లేదు. ఎందుకని బ్యాంకులో సంఘం సభ్యులు ఆరా తీస్తే.. సదరు సభ్యురాలి పేరిట పంట రుణం బకాయిలున్నాయని, అందుకే సంఘానికి రుణం మంజూరు చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. గుంట భూమి కూడా లేని, రేకుల ఇంటిలో నివాసముంటున్న ఆ మహిళకు మూడున్నర ఎకరాల భూమే లేదని సంఘంలోని మిగతా సభ్యులు బ్యాంకు అధికారులకు చెప్పారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆందోళనలో బాధితులు.. తమ పేర్లతో రూ. లక్షల్లో పంట రుణాలు తీసుకున్నట్లు తేలడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు రూ. పది, రూ. 20 వేలు ఇచ్చి మిగతా మొత్తాన్ని వాళ్లే దండుకున్నారని కొందరు బాధితులు చెబుతున్నట్లు సమాచారం. తమ పేర్లతో జారీ అయిన రూ. లక్షల్లో రుణాలను మేము ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ‘సిండికేట్’ ? బ్యాంకు ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బదిలీపై వెళ్లిన బ్యాంకు మేనేజర్, ఫీల్డ్అసిస్టెంట్లే కుంభకోణంలో కీలక సూత్రదారులనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో కొందరు దళారులను నియమించుకుని దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుంభకోణం వెలుగు చూడడంతోనే అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ బదిలీల తర్వాత కూడా అక్రమాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉన్నతాధికారుల అంతర్గత విచారణ రుణాల పేరుతో రూ. కోట్లలో కుంభకోణంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టా రు. గత రెండు, మూడేళ్లుగా ఎవరెవరికి రుణా లు మంజూరు చేశారు.. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు సరైనవేనా.. వంటి అంశాలపై రికార్డులను పరిశీలించారు. ఈవిషయమై ‘సాక్షి’ ప్రతినిధి బ్యాంకు రీజినల్ మేనేజర్ రేణుకను ఫోన్లో సంప్రదించగా విచారణ జరుగుతోందని తెలిపారు. పంట రుణాల మంజూరులో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నట్లు గుర్తించామని, బ్యాం కు ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇచ్చామన్నారు. ఎంత మొత్తంలో అవకతవకలు జరిగా యనే అంశంపై ఆమె సమాధానం దాటవేశారు. రైతులు, ప్రజాప్రతినిధుల ఆందోళన ఎడపల్లి(బోధన్): ఎడపల్లిలోని సిండికేట్ బ్యాంకు వద్ద సోమవారం పలువురు ఖాతా దారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బినామీ వ్యక్తుల పేర్ల మీద దాదాపు రూ. 2 కోట్ల రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. గతంలో పనిచేసిన బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ దిలీప్‌లు ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులో గతంలో పనిచేసిన మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు, మండల కేంద్రంలోని మీసేవలో పనిచేసే ఒడ్డేపల్లికి చెందిన ఒక వ్యక్తి ముగ్గురు కలిసి ఈ కుంభకోనానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. మీసేవలో పనిచేసే వ్యక్తి నకిలీ భూ పహాణీలు సృష్టించగా వాటిసహాయంతో బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి, బినామీ వ్యక్తుల పేర కాజేశారని వాపోయారు. సోమవారం ప్రస్తుతం బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్‌ను జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ రజిత, ఎంపీపీ కోడెంగల శ్రీనివాస్, ఎడపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్యయాదవ్, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శులు అబ్దుల్ వాహెబ్‌బారీ, ఎస్సై రామునాయుడు, మల్కారెడ్డిలతో పాలు పలువురు రైతులు, ప్రశ్నించగా బినామీ పేర్లమీద రుణాలు మంజూరైన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ విషయమై గతంలో విచారణ చేపట్టారని ఈ సందర్భంగా గతంలో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ మట్ట శ్రీనివాస్, పీల్డ్ ఆఫీసర్ దిలీప్‌లను ఇక్కడి నుంచి బదిలీచేసినట్లు ఆయన వివరించారు. ఎంత మేర నిధులు దుర్వినియోగమైన విషయం తనకు తెలియదన్నారు. సబ్సిడీ విషయం నాకు చెప్పలేదు నేను మైనారిటీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటే నాకు రూ. 50 వేల సబ్సిడీ వచ్చింది. గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్ నాకు ఇచ్చిన లక్ష రూపాయల రుణానికి ఏడాదిగా వడ్డీ కట్టించుకున్నాడు. సబ్సిడీ వచ్చిన విషయాన్ని నాకు చెప్పకుండా నాతో వడ్డీ కట్టించుకొని నాకు నష్టం చేశాడు. – ఆసీస్, ఏఆర్పీ, క్యాంపు పాత లోన్ చెల్లించమంటున్నారు మా గ్రూప్ సభ్యురాలి పేరుమీద గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్ లక్షా 92 వేల రూపాయల వ్యవసాయ రుణం మంజూరైంది. ఆమెకు వ్యవసాయ భూమి లేకపోయినా రుణం మంజూరైనట్లు బ్యాంకులో ఉంది. ప్రస్తుతం మా గ్రూప్‌కు రుణం ఇవ్వాలని బ్యాంకు వెళ్తే విజయ అనే మహిళ రుణం తీసుకుందని, అది చెల్లిస్తేనే మిగతా వారికి రుణం మంజూరు చేస్తామని చెబుతున్నారు. – లత, భవాని గ్రూప్ సభ్యులు, ఏఆర్పీ క్యాంప్ -
కేటులలో ఈ సిండి‘కేటు’ రూటే సెపరేటు..!
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మాజీ మేనేజర్ చేతివాటం కారణంగా రూ. 2.22 కోట్లు అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల గుట్టు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులు తెరవెనుక ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా బయటకు వస్తారా లేక మేనేజర్ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు పరిశీలించి వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చిన్న సంతకంలో తేడా వస్తేనే బ్యాంకు అధికారులు పైసా డబ్బు ఇవ్వరు. అలాంటిది ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్‌బాబు తన అధికారాన్ని ఉపయోగించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బ్యాంకును దళారులకు నిలయంగా చేసుకుని వారి సహకారంతో అడ్డదిడ్డంగా తనకు అనుకూలమైన వారికి రుణాలు ఇప్పించారు. దుకాణాలు లేక పోయినా వారు దొంగ బిల్లులు పెట్టినా , సాగుభూమి లేక పోయినా వ్యవసాయ రుణాలు ఇవ్వడం. ఇలా ముద్రరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రుణాల్లో దొంగ పాసుపుస్తకాలు, దొంగ 1బీలు తీసుకు రావడం వెనుక వీఆర్ఓల పాత్రపై చర్చ జరుగుతోంది. వ్యవసాయ రుణాలు ఎలా ఇస్తారు వ్యవసాయ రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా పాస్‌పుస్తకం తోపాటు 1బీ, ఆ రైతు ఆధార్‌కార్డు తీసుకు రావాలి. వాటిని పరిశీలించిన ఫీల్డ్ ఆఫీసర్ ఆన్లైన్లో 1బీ ని పరిశీలించిన తరువాత ఫైల్‌ను మేనేజర్‌కు పంపిస్తారు. ఆయన పరిశీలించిన తరువాత రైతుకు బ్యాంకు రుణం అందిస్తారు. అయితే బ్యాంకు అధికారులు అలాంటి నిబంధనలు అమలు చేయకుండానే రుణాలు మంజూరు చేశారు. ఇలా సుమారు 60కి పైగా వ్యవసాయ రుణాలను బ్యాంకు ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఎలా వచ్చాయి..? సాధారణంగా పాసు పుస్తకాలు ఒక్క రెవెన్యూ అధికారుల ద్వారానే వస్తాయి. అలాగే 1బీ కావాలంటే రెవెన్యూ కార్యాలయం లేక మీసేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు. కానీ అవి దళారుల చేతికి ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది దొంగ పాసు పుస్తకాలను తయారు చేయడంలో సిద్ధహస్తులుగా ఉన్నట్లు సమాచారం. గతంలో దొంగ పాసుపుస్తకాలపై అప్పటి జాయింట్ కలెక్టర్ శ్వేతాకు పలువురు ఫిర్యాదు చేశారు. ఆమె బదిలీతో విచారణ అటకెక్కింది. నేడు అదే వ్యక్తులు బ్యాంకు దళారీలకు పాసుపుస్తకాలు అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే బోగస్ 1బీ తయారీలో మీసేవా కేంద్రంలోని వారిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనకు తెలియకుండా రుణాలు కొందరు వ్యక్తులకు సెంటు భూమిలేక పోయినా బ్యాంకులో వ్యవసాయ రుణాలు పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారికి బ్యాంకు నోటీసులు రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండానే మన పేరుతో దొంగ ఆధార్ కార్డులు, 1బీ, పాసు పుస్తకాలు పెట్టి దొంగ సంతకాలతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు రూ. 20వేలు రుణం తీసుకుంటే వారి పేరుతో రూ. లక్ష లేక రూ.2లక్షలు రుణం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేయడం లాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రుణం తీసుకునే వ్యక్తి అకౌంట్లో నుంచి కాకుండా అంత పెద్ద మొత్తంలో అతనికి తెలియకుండా ఎలా డబ్బు తీశారన్నది అనేక అనుమానాలకు దారితీస్తోంది. రెండేళ్లుగా బ్యాంకర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు బ్యాంకులో అనేక అక్రమాలు 2015–16లో జరిగితే 2019 ఫిబ్రవరి 5న పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. అంటే సుమారు రెండేళ్ల పాటు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించలేదు. అలాగే 2016–17, 18 ఏడాదిల్లో బ్యాంక్ ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్లో ఆడిటర్లు అక్రమాలను గుర్తించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ గుర్తించి ఉంటే ఉన్నతాధికారులు చర్యలకు ఎందుకు ఉపక్రమించలేదు. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. సమగ్ర విచారణ చేస్తున్నాం: సీఐ కంబగిరి రాముడు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేస్తున్నాం. అక్రమాలకు కారకులైన ఎవ్వరిని వదలం. దొంగ పాసుపుస్తకాలు మొదలు దుకాణాలు లేకుండానే ముద్ర రుణాలు తీసుకోవడం ఇలా అన్ని విషయాలను లోతుగా విచారిస్తున్నాం. -
సిండి‘కేటు’కు సంకెళ్లు
బ్యాంకు రుణం తీసుకోవాలంటే సామాన్యుడికి కష్టమే. ఒకవేళ ఒప్పుకున్నా రుణం మంజూరుకు సవాలక్ష నిబంధనలతో కాలయాపన చేస్తారు. మరి బ్యాంకు మేనేజర్ స్వయంగా తలచుకుంటే .. రూల్స్ గీల్స్ ఏవీ అడ్డురావు. అనుకున్న వారికి అనుకున్నంతా ఇస్తారు. డాక్యుమెంట్లు, కీలక పత్రాలు ఎలాంటివైనా ఓకే అంటారు. ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మేనేజర్ అచ్చం అలాగే చేశారు. చేతివాటం ప్రదర్శించి రుణాలు మంజూరు చేశారు. తరువాత వచ్చిన మేనేజర్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. రెండేళ్లుగా దీనిపై సాగుతున్న విచారణ తాజాగా కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సాక్షి, ఖాజీపేట: ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో గతంలో జరిగిన రుణాల గోల్‌మాల్‌పై విచారణ కొలిక్కి వచ్చింది. ఇక్కడ మేనేజర్‌గా జయంత్ బాబు 2014 జూన్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకును దళారీలకు కేంద్రంగా మార్చారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు ఇలా ఒకటేమిటి అన్నీ దళారుల మధ్యవర్తిత్వంతోనే జరిగాయి. రుణం మంజూరుకు బేరం కుదర్చుకుని డబ్బు ముట్టిన తరువాత దళారీలు చెప్పినట్లు రుణాలు ఇచ్చేవారనే అభియోగముంది. అలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి. తరువాత అక్కడ నుంచి ఆయన బదిలీపై వెళ్లిపోయారు. సిక్ గ్రూపులకు రుణాలు చివరకు డ్వాక్రా గ్రూపు సంఘాలను బ్యాంకు మేనేజరు వదలలేదు. 7నుంచి 9సంవత్సరాలుగా సిక్ అయిన గ్రూపులపై ఆయన దృష్టి సారించారు. పూర్తి వివరాలు సంబంధిత యానిమేటర్ ద్వారా తెలుసుకున్నారు. డిఎల్, లక్ష్మిప్రసన్న, యువదర్శిని, గణేష్గ్రూపులు సిండికేట్ బ్యాంకులో ఏడేళ్లుగా రుణాలు చెల్లించక సిక్ గ్రూపులుగా ఉన్నాయి. ఈ గ్రూపుల యానిమేటర్, మేనేజర్ ఒక ఒప్పందానికి వచ్చి బకాయి రుణాన్ని చెల్లించి గ్రూపు సభ్యులకు తెలియకుండానే క్షణాల్లో వారికి రుణం మంజూరు చేశారు. మంజూరైన గ్రూపులకు పొదుపు డబ్బు లేక పోయినా కొత్తగా మంజూరు చేసిన రుణం పొదుపు గ్రూపు అకౌంట్లో ఉంచి మిగిలిన సొమ్ము డ్రా చేశారు. ఆ విధంగా నాలుగు గ్రూపులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. డీఎల్ గ్రూపులో కొందరు సభ్యులు చనిపోయారు. మిగిలిన చాలా మంది సభ్యులు స్థానికంగా లేరు. వారిపేరున బినామీలను పెట్టి ఫోర్జరీ సంతాలు చేసి తప్పుడు డ్యాక్యుమెంట్లు ఇచ్చి రుణాలు మంజూరు చేసి స్వాహా చేశారు. లక్ష్మి ప్రసన్న గ్రూపులో కూడా రూ.5 లక్షలు రుణం మంజూరు చేసి డ్రా చేశారు. అలా డ్రా చేశారని తెలియడంతో తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించారు. తనకు మట్టి అంటకూడదని గూపు సభ్యుల సహకారం తీసుకున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తానని చెప్పి కొత్తగా గ్రూపు సభ్యులు రుణం తీసుకున్నట్లు సంతకాలు చేయించి రుణాలను మంజూరు చేసినట్లు తెసింది. గణేష్ గ్రూపు సభ్యులు ఈ వ్యవహరంపై అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఫిర్యాదు డ్వాక్రా గ్రూపుల రుణాల్లో అక్రమాలు జరిగిన మాట నిజమేనని గతంలోనే వెలుగు అధికారులు గుర్తించారు. అప్పటి వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ధనుంజయ్ బ్యాంకు మేనేజర్‌పై ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో యానిమేటర్ కాంతమ్మకు సంబంధముందని తొలగించారు. తరువాత టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి ఆమెను యానిమేటర్‌గా కొనసాగించారు. డ్వాక్రా గ్రూపు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ 2017మార్చిలో సిండికేట్ బ్యాంకులో స్వాహా పర్వం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. అప్పటి లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘనాధరెడ్డి ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ఆయన గుర్తించారు. అప్పడు స్థానిక టీడీపీ నాయకుల జోక్యంతో కేసు బయటకు రాకుండా తొక్కిపట్టారు. తరువాత వచ్చిన బ్యాంకు మేనేజర్లు ఈ అక్రమాల జోలికి వెళ్లకుండా మిన్నకుండి పోయారు. దీంతో విచారణ రెండేళ్లుగా సాగుతూనే వచ్చింది. మేనేజరుపై ఫిర్యాదు మేనేజరు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికారులు కేసు నమోదుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటి బ్యాంకు మేనేజర్ లీలాప్రతాప్ పోలీసులకు ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.22 కోట్ల రుణాల మంజూరులో మేనేజరు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేశారని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు ఇచ్చారని, అధికారాలను దుర్విని యోగం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సీఐ కంబగిరి రాముడు వేగవంతం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఆయన విచారణను వేగవంతం చేశారు. వెంకటసుబ్బయ్య, కాంతమ్మ, బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్ బాబులను విచారించారు. ముగ్గురు అరెస్టు ఖాజీపేట : సిండికేట్ బ్యాంక్‌లో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ మాజీ మేనేజర్ జయంత్ బాబు శనివారం అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లయ్య అనే కీలక నిందుతుడు పరారీలో ఉన్నాడని మైదుకూరు రూరల్ సిఐ కంబగిరాముడు, ఖాజీపేట ఎస్ఐ రోషన్లు తెలిపారు. జయంత్ మేనేజర్‌గా పనిచేసిన కాలంలో దళారులను పెట్టుకుని బ్యాంకును అడ్డంగా దోచాడని తేలిందన్నారు. విచారించి ఖాజీపేట యానిమేటర్ కాంతమ్మ.. మీసాల వెంకటసుబ్బయ్యలను కూడా అరెస్టు చేశామన్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు దొంగ వెబ్‌ల్యాండ్, డాక్యుమెంట్లను సృష్టించిన ఎల్లయ్య పరారీలో ఉన్నాడు. త్వరలో పూర్తి విచారణ జరిపి రూ.2.22 కోట్లు రుణాల రికవరీ చేయాల్సి ఉందని తెల్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు. -
ఎస్బీఐ లైఫ్–సిండికేట్ బ్యాంక్ జట్టు
బెంగళూరు: సిండికేట్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంక్అష్యూరెన్స్ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్ ప్లానిం గ్ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పం దం కుదు ర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ మృత్యుంజయ్ మహాపాత్ర, ఎస్బీఐ లైఫ్ సీఈఓ, ఎమ్డీ సంజీవ్ నౌతియాల్ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్ బ్యాంక్ తన బ్రాంచ్‌ల ద్వారా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన పాలసీలను విక్రయిస్తుంది. ఎసాప్స్ ద్వారా రూ.500 కోట్లు... ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ఎసాప్స్) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేసి రూ.500 కోట్లు సమీకరించనున్నామని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. -
సెంట్రల్ బ్యాంక్‌కు రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని బ్యాంక్ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ బాటలోనే పలు పీఎస్‌బీలు.. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిధులు సమీకరిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నామని ఇటీవలే సిండికేట్ బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే రూ.500 కోట్లు సమీకరించింది. అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్నాయి. కాగా రూ.200 కోట్ల నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 శాతం వరకూ లాభపడి రూ.36.05 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్ఆర్ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్లు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కాగా ఓవర్‌నైట్ (8.30), నెల (8.35), ఆరు నెలలు (8.60), ఏడాది (8.80) రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఓబీసీ కూడా... పలు కాలపరిమితులకు సంబంధించి ఓబీసీ కూడా ఎంసీఎల్ఆర్ను 0.10 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. గురువారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిటైల్ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పేర్కొనే ఏడాది కాలపరిమితి రుణరేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలలు (8.70 శాతం), మూడు నెలలు (8.50 శాతం), నెల (8.45 శాతం) రుణ రేట్లు కూడా 0.10 శాతం పెరిగాయి. ఓవర్‌నైట్‌కు సంబంధించి రుణ రేటు 8.30 శాతానికి పెరిగింది. -
బ్యాంకులో తాకట్టు బంగారం మాయం
ప్రకాశం, నర్శింగోలు (సింగరాయకొండ): జరుగుమల్లి మండలం నర్శింగోలు సిండికేట్ బ్యాంకు బ్రాంచిలో బంగారం మాయమైందన్న ఆరోపణలు రావడం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు కోటి రూపాయల విలువైన బంగారం మాయమైందన్న ప్రచారం జరుగుతోంది. బ్రాంచి పరిధిలోని సుమారు 8 గ్రామాలకు చెందిన 27 మంది ఖాతాదారులకు చెందిన బంగారం కనిపించడం లేదు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఆ బ్యాంకు ఉన్నతాధికారులు సైతం వారికి సహకరిస్తున్నారన్న ప్రచారంతో మిగిలిన ఖాతాదారులు బ్యాంకులోని బంగారం విడిపించుకునేందుకు పోటీపడుతున్నారు. అంతేగాక బ్యాంకులో పెట్టిన బంగారం స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారేమోనన్న అనుమానంతో అనుభవం ఉన్న వారిని రప్పించుకుని మరీ బంగారం పరిశీలించుకుని విడిపించుకుంటున్నారు. 27 మంది ఖాతాదారులబంగారం మాయం బ్యాంకులో తాకట్టు పెట్టిన 27 మందికి చెందిన సుమారు కోటికిపైగా విలువైన బంగారం మాయమైనట్లు ఇటీవల బ్యాంకులో జరిగిన ఆడిటింగ్‌లో బయటపడినట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా దావగూడూరు, నర్శింగోలు, అగ్రహారం, పైడిపాడు, సతుకుపాడు, రెడ్డిపాలెం, అక్కచెరువుపాలెం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖాతాదారుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 18వ తేదీన బంగారం తాకట్టు పెట్టి 52 వేల రుణం తీసుకున్న పి.సుశీల..బ్యాంకులో అవకతవకలు జరిగాయని తెలిసి బయట 2 రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ బ్యాంకులో నగలు విడిపించుకుంది. బ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఒక్కరిపై కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేయలేదని, దీన్ని బట్టి బ్యాంకు అధికారుల మనోగతం అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ సోమశేఖర్ కూడా తెలిపారు. నర్శింగోలు టు కందుకూరు నర్శింగోలు బ్రాంచిలో తాకట్టు పెట్టిన ఖాతాదారుల బంగారం కందుకూరులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంకులో బంగారం తనిఖీ చేసే వ్యక్తితో పాటు సదరు బ్రాంచిలో పనిచేసిన ముగ్గురు మేనేజర్ల హస్త ఉన్నట్లు తెలుస్తోంది. 2013 నుంచి బంగారం మాయమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బంగారం తాకట్టు పెట్టిన సంవత్సరం తర్వాత ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నోటీసు ఇస్తారు. తాకట్టు నగలకు డబ్బులు చెల్లించండి.. లేకుంటే ఖాతా రెన్యువల్ చేసుకోండని సమాచారం ఇస్తారు. ఏళ్లు దాటినా అటువంటి నోటీసులు రాలేదని ఖాతాదారులు చెబుతున్నారు. అంతేగాక కొత్తగా వచ్చిన అధికారులు నకిలీ బంగారం పెట్టారని, వెంటనే డబ్బులు చెల్లించాలని ఖాతాదారులపై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు లాడ్జిలో సమావేశం బ్రాంచిలో అవకతవకలకు పాల్పడిని బ్రాంచి మేనేజర్లు, జిల్లా అధికారి ఇటీవల ఒంగోలులోని ఓ లాడ్జిలో సమావేశమై ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి సమస్య పరిష్కరించాలని తీర్మానించారని ఖాతాదారులు చర్చించుకుంటున్నారు. ఆ ప్రకారం ఖాతాదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల సహకారం బ్యాంకులో బంగారం తనిఖీ చేసే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి అధికార పార్టీ నాయకులు సహకరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతనికి వారే భద్రత కల్పిస్తున్నారని, ఈ కేసు నుంచి అతడిని బయట పడేసేందుకు ఖాతాదారులతో మాట్లాడి ఫిర్యాదు చేయకుండా ప్రయత్నిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. -
మరింత పెరిగిన సిండికేట్ బ్యాంకు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సిండికేట్ బ్యాంకు నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత విస్తృతం అయ్యాయి. రూ.1,282 కోట్ల నష్టాన్ని బ్యాంకు ఈ కాలంలో చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.263 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం రూ.5,637 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,171 కోట్లు. వడ్డీ ఆదాయం రూ.5,484 కోట్ల నుంచి రూ.5,257 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, ఆర్బీఐ వద్ద, ఇతర ఇంటర్ బ్యాంకు వేదికల వద్దనున్న నిధులపై వడ్డీ ఆదాయంలోనూ గణనీయమైన తగ్గుదల ఉంది. ఆస్తుల నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్పీఏలు ఈ ఏడాది జూన్ నాటికి 12.59 శాతానికి (రూ.26,361 కోట్లు) పెరిగిపోయాయి. గతేడాది ఇదే కాలం నాటికి 9.96% (రూ.20,183 కోట్లు) ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలోనూ 11.53 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్పీఏలు 6.27% (రూ.12,188 కోట్లు) నుంచి 6.64%(రూ.13,010 కోట్లు)కి పెరిగాయి. ఎన్పీఏలు పెరగడంతో వీటి కోసం బ్యాంకు జూన్ త్రైమాసికంలో రూ.1,774 కోట్లు పక్కన పెట్టడం నష్టాలకు దారితీసింది. -
బిల్లు కట్టకుండానే ‘టోల్’ దాటవచ్చు
సాక్షి బెంగళూరు: ఇక నుంచి టోల్ ప్లాజాల్లో వాహనదారులు బిల్లు కట్టేందుకు ఆగాల్సిన పని లేదు. ఈమేరకు నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), సిండికేట్ బ్యాంక్ సంయుక్తంగా కొత్త పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాయి. వాహనదారులు ముందుగానే ప్రీపెయిడ్కు సంబంధించిన చిప్‌లు కొనుగోలు చేసి వాటిని సిండికేట్ బ్యాంకు ఖాతా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ చిప్‌ను వాహనాల అద్దానికి బిగించి ఉండాలి. రేడియో ఫౌనఃపున్యం ద్వారా ఆ వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్లిపోవచ్చు. అదేవిధంగా ఖాతా నుంచి నేరుగా ఆ చిప్‌కు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం అన్ని సిండికేట్ బ్యాంకుల్లో అందుబాటులో ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని బ్యాంకుల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వస్తుందన్నారు. -
సిండికేట్ బ్యాంక్ నష్టాలు రూ.2,195 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.2,195 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.104 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరగడంతో ఆ మేరకు కేటాయింపులు కూడా పెంచడమే ఈ భారీ నష్టాలకు కారణమని బ్యాంక్ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కూడా భారీగానే నికర నష్టాలు, రూ.870 కోట్ల మేర వచ్చాయని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు 3 రెట్లకు పైగా పెరిగాయి. ఈ కేటాయింపులు రూ.1,193 కోట్ల నుంచి రూ.3,545 కోట్లకు ఎగిశాయి. మొత్తం ఆదాయం రూ.6,913 కోట్ల నుంచి రూ.6,046 కోట్లకు తగ్గింది. పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2016–17లో రూ.359 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,223 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.26,461 కోట్ల నుంచి రూ.24,582 కోట్లకు తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 8.50 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 11.53%కి, నికర మొండి బకాయిలు 5.21% నుంచి 6.28%కి ఎగిశాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.50 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
-
ఏటీఎంలో రూ.17 లక్షలు చోరీ
-
ఏటీఎంలో రూ.20 లక్షలు చోరీ
ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో గురువారం వేకువజామున చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి రూ. 20 లక్షలు దోచుకెళ్ళినట్లు అధికారులు వెల్లడించారు. చోరీ సమయంలో సీసీ కెమెరా పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. -
చిప్‌కు భయపడి చిల్లర దొంగిలించారు!
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఓ బ్యాంక్‌ను కొల్లగొట్టి, 12 గంటల్లో పట్టుబడిన దొంగలు.. పోలీసులకు పెద్ద షాకే ఇచ్చారు. కేవలం చిల్లరను మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్లారన్న ప్రశ్నకు విస్తుపోయే సమాధానమిచ్చారు. ముఖర్జీ నగర్‌లోని సిండికేట్ బ్యాంకులో ఈ నెల 22న సుమారు రూ.2.3 లక్షల నగదు దోపిడీ జరిగింది. కిటికీ గుండా ప్రవేశించిన ముగ్గురు దుండగులు డబ్బును ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే... దొంగలు ఒక్క నోటు కూడా ముట్టుకోలేదు. 46 పాలిథీన్ సంచుల్లో నిల్వ ఉంచిన 5, 10 రూపాయల నాణేలను మాత్రమే తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. నాణేలను మాత్రమే ఎందుకు దొంగతనం చేశారని అడిగితే... పెద్ద నోట్లను దొంగతనం చేస్తే అందులో ఉన్న చిప్‌ల సాయంతో దొరికిపోతామనే భయంతోనే ముట్టుకోలేదని సమాధానమిచ్చారు. రెండు వేల నోట్లలో ఉన్న చిప్‌ల ద్వారా జీపీఎస్ సాయంతో తాము ఎక్కడున్నా పోలీసులు సులువుగా పట్టేసుకుంటారనే వాటి జోలికి వెళ్లలేదట. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ.140 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.104 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఈ బ్యాంక్‌కు రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కేటాయింపులు తగ్గడం, ఇతర ఆదాయం అధికంగా రావడంతో మొండి బకాయిలు పెరిగినా, బ్యాంక్ నికర లాభం సాధించిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.6,525 కోట్ల నుంచి రూ.6,913 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,462 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.1,861 కోట్లకు, ఇతర ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.842 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు తెలియజేసింది. స్థూల మొండి బకాయిలు 6.7 శాతం నుంచి 8.5 శాతానికి, నికర మొండి బకాయిలు 4.48 శాతం నుంచి 5.21 శాతానికి పెరిగాయి. పన్నులు, మొండి బకాయిలు, ఇతరాలకు కేటాయింపులు రూ.2,383 కోట్ల నుంచి రూ.1,268 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.1,643 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.359 కోట్ల నికర లాభం వచ్చింది. ఇక బ్యాంక్ ఎండీగా మల్విన్ ఓస్వాల్డ్ రెగోను ప్రభుత్వం నియమించింది. అరుణ్ శ్రీవాత్సవ స్థానంలో ఆయన ఈ ఏడాది జూలై 1 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. -
వేలానికి జీవీకే గ్రూప్ ‘సెజ్’
► సిద్ధమైన సిండికేట్ బ్యాంకు ► రూ.175 కోట్లు బాకీపడ్డ కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ షాకిచ్చింది. రుణ రికవరీలో భాగంగా తమిళనాడులో 2,500 ఎకరాల్లో విస్తరించిన జీవీకే పెరంబలూరు సెజ్ స్థలాన్ని వేలానికి పెట్టింది. సిండికేట్ బ్యాంకుకు గ్రూప్ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.175.08 కోట్లు బాకీ పడింది. సర్ఫేసీ యాక్ట్–2002 కింద రికవరీ కోసం బ్యాంకు ఈ మేరకు గురువారం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. రిజర్వ్ ప్రైస్ రూ.257 కోట్లుగా ఉంది. జనవరి 6న తొలిసారి నిర్వహించిన వేలానికి స్పందన రాలేదు. దీంతో మరోసారి మార్చి 27న ఈ–వేలానికి బ్యాంకు సిద్ధమైంది. 2015 డిసెంబరులో రూ.156.76 కోట్ల బాకీ చెల్లించాలంటూ నోటీసు ఇచ్చిన తర్వాత 2016 సెప్టెంబరు నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.8.9 కోట్లు మాత్రమే సిండికేట్ బ్యాంకుకు చెల్లించింది. మరో రెండు బ్యాంకులు సైతం.. సిండికేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు సైతం ఇదే సెజ్ స్థలంపై జీవీకే గ్రూప్ కంపెనీలకు రుణాలను మంజూరు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు రూ.1,078 కోట్లు అప్పు ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.205 కోట్లు రుణం అందించింది. కాగా, 2016 మార్చి నాటికి జీవీకే గ్రూప్ రుణ భారం రూ.32,290 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీ 2015–16లో కన్సాలిడేటెడ్ నిర్వహణ ఆదాయం రూ.4,164 కోట్లపై రూ.1,212 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వాటాల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ చర్య ఇబ్బందికర పరిణామమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చెల్లిస్తామంటున్నారే తప్ప.. బాకీ విషయమై బ్యాంకుతో చర్చిస్తున్నామని జీవీకే అంటోంది. మొత్తం బాకీని కొన్ని వారాల్లో చెల్లిస్తామని మరీ చెబుతోంది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు తోసిపుచ్చారు. కంపెనీ ప్రతినిధులు బ్యాంకుతో చర్చిస్తున్నట్టు తనకు సమాచారం లేదని సిండికేట్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. బాకీ చెల్లించే ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించారు. మొదటిసారి వేలం నోటీసు ఇచ్చినప్పుడు కూడా బాకీ తిరిగి చెల్లిస్తామని కంపెనీ చెప్పిందేగానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లేవీ చేయలేదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సెజ్ స్థలాన్ని ఒకే యూనిట్‌గా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుకు రావాల్సిన మొత్తాన్ని స్వీకరిస్తాం. ఇతర రుణదాతలకు చెల్లించేందుకు వీలుగా మిగిలిన వేలం సొమ్మును కంపెనీకి ఇస్తాం అని ఆయన వివరించారు. -
సిండికేట్ బ్యాంక్ వద్ద మహిళ హల్చల్
బ్యాంక్ ప్రవేశ ద్వారానికి తాళం వేసిన వైనం పోలీసుల రంగ ప్రవేశంతో కథ సుఖాంతం పగిడ్యాల: స్థానిక సిండికేట్ బ్యాంక్ ప్రవేశ ద్వారానికి ఓ మహిళ తాళం వేసి అరగంటకుపైగా లావాదేవీలు నిలిచిపోయేలా చేసిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెస్త శేషమ్మకు స్థానిక సిండికేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. తన ఖాతాకు పాస్టర్లు రూ.2 లక్షలు జమ చేశారని వాటిని విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయితే చివరకు తాళం వేసి అక్కడి నుంచి ఉడాయించింది. ఘటనపై బ్యాంకు సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ బ్యాంక్ వద్దకు చేరుకుని ఖాతాదారులతో తాళం పగులగొట్టించాడు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులను బ్యాంక్ అధికారులు ఎందుకు తీస్తున్నారని తమ అనుమతి తీసుకోకుండా ఫొటోలు తీయడం సరికాదని వారించే ప్రయత్నం చేశారు. శేషమ్మకు మానసిక స్థిమితం లేదని, అందుకే తాళం వేసిందన్నారు. ఆమె ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇస్తామని, ఆమె ఖాతాలో ఎవనై డబ్బు జమ చేయలేదని, పత్రికల్లో రాయొద్దని బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నరసింహులు, మేనేజర్ వెంకటరాముడులు కోరడం గమనార్హం. తర్వాత బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించకుండా ఏఎస్ఐ అబ్దుల్అజీజ్ బందోబస్తుకు కానిస్టేబుల్‌ను నియమించారు. -
నకిలీ పాస్ పుస్తకాలతో టోకరా
నేరేడుచర్ల : నకిలీ పాస్ పుస్తకాలతో కొందరు రైతులు బ్యాంకు అధికారులకు టోకరా ఇచ్చి రూ.8.72 లక్షల రుణం పొందారు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సిండికేట్ బ్యాంకులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. చిల్లేపల్లి సిండికేట్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధి బూర్గులతండాకు చెందిన మాలోతు గోవింద్, సైదా, భద్రమ్మ, దేవోజు, రకిలీ, ధర్మల పేర్లతో వారి సర్వే , పాస్‌బుక్ నంబర్లతో నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించారు. వాస్తవంగా ఉన్న యజమాని స్థానంలో గుర్తు తెలియని వ్యక్తుల ఫొటోలు అంటించి ఆధార్‌కార్డులను సైతం వారి పేర్లతో నకిలీవి తయారు చేశారు. పక్కా ప్రణాళికతో.. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అధికారులను పక్కా ప్రణాళికతో మోసగించారు. గత ఏడాది నూతనంగా ప్రారంభించిన చిల్లేపల్లి సిండికేట్ బ్యాంకులో మోసగాళ్లు రోజుకు ఇద్దరి పేరిట మొత్తం మూడు విడతలుగా 8.72 లక్షల రుణం పొందారు. బ్యాం కు నిబంధనల ప్రకారం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్, ఆన్లైన్ పహాణీ, అధార్ కార్డు సరిపోవడంతో అధికారులు రుణాలు మంజూరు చేశారు. చివరగా మాలోతు పాచ్యా పేరుతో బ్యాంకు శాఖ అవంతీపురంలో అప్పటికే లోన్ ఉన్నట్లు గుర్తించి ఎస్బీ ఎకౌంట్లో ఉన్న రూ.1.20 లక్షలను డ్రా చేయకుండా ఖాతాను నిలుపుదల చేశారు. అనుమానంతో గ్రామానికి చెందిన పాస్‌బుక్‌లపై రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా బ్యాంకును మోసగించినట్లు గుర్తించామని మేనేజర్ రాజేశ్వర్ తెలిపారు. నకిలీపాస్ పుస్తకాలు సష్టించి రు ణాలు పొందినట్లు నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌లో, తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 94 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.94 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.120 కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.6,188 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 6 శాతం వృద్ధితో రూ.6,554 కోట్లకు పెరిగిందని తెలిపింది. పన్ను వ్యయాలు రూ.174 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 4.61 శాతం నుంచి 8.69 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 5.63 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ ధర 3.3 శాతం నష్టపోయి రూ.67 వద్ద ముగిసింది. -
దరఖాస్తు చేశారా?
సిండికేట్ బ్యాంక్‌లో అటెండెంట్, స్వీపర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జనవరి 25 సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27 ఎస్బీఐలో పార్ట్‌టైమ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 2 ఎన్డీఏ అండ్ ఎన్ఏ (1) ఎగ్జామ్ దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10 -
నగదు పోరాటంలో అలసి...
శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు మృతి నరసన్నపేట: బ్యాంకుల వద్ద నగదుకోసం అగచాట్లు పడుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారుకు చెందిన జగన్నాథం(60) తన కుమారుడు గోవిందరావు హైదరాబాద్ నుంచి తన పేరిట పంపిన నగదును తీసుకోడానికి రెండు రోజులుగా తిలారు నుంచి నరసన్నపేట బ్యాంకుకు వస్తున్నాడు. ఈ ఆవేదనలో శనివారం ఇంటికి వెళ్లిపోవడానికి బస్సు కోసం నరసన్న పేట బస్సు కాంప్లెక్స్‌కు వచ్చిన ఆయన అక్కడే చనిపోయాడు.బ్యాంకు నుంచి నగదు అందకపోవడం, పాడి రైతులకు డబ్బులు చెల్లించలేకపోవడంతో ఆందోళన చెంది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన బొజ్జా నాగమునిరెడ్డి(44) అనే పాలకేంద్ర ం నిర్వాహకుడు మృతిచెందాడు. అతను ఉల్లగల్లులోని సిండికేట్ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఆవేదనతో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. -
నగదు మార్పిడి కేసులో క్లర్క్ అరెస్టు
పరారీలో క్యాషియర్ హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి గుర్తింపు కార్డూ ఇవ్వకుండానే రద్దరుున పెద్ద నోట్లను జమ చేసి కొత్త నోట్లు తీసుకెళ్లిన బ్యాంకు క్లర్క్‌ను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ ఏసీిపీ వేణుగోపాలరావు వివరాలు వెల్లడించారు. చిక్కడపల్లి బాపూనగర్‌కు చెందిన వంగాల మల్లేశ్ (56) చైతన్యపురి కమలానగర్‌లోని సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తన వద్దవున్న రూ.6 లక్షల విలువగల రద్దరుున పెద్దనోట్లను ఈ నెల 12న బ్యాంక్‌కు తీసుకొచ్చాడు. ఎటువంటి గుర్తింపుకార్డు ఇవ్వకుండానే క్యాషియర్ రాధిక సహాయంతో రూ.6 లక్షలకు సరిపడా రూ.2వేల నోట్లను తీసుకెళ్లాడు. రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసేందుకు నిబంధనలున్నప్పటికీ... ఒకేసారి రూ.6 లక్షలు మార్చుకోవడంతో గుర్తించిన బ్యాంకు మేనేజర్ నర్సయ్య ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరినీ సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు పొక్కడంతో రూ.5.4 లక్షలను మల్లేశ్ తిరిగి బ్యాంకులో జమచేశాడు. కాగా, నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి రెండు రూ.2 వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో జమచేసిన రూ.5.4 లక్షలు పోనూ మిగిలిన మొత్తం ఖర్చరుునట్లు మల్లేశ్ విచారణలో తెలిపాడు. మార్పిడి చేసిన డబ్బు మల్లేశ్దా... లేక వేరెవరిదైనానా అనేది విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. అతడికి సహకరించిన క్యాషియర్ రాధిక పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. ఆ వార్తల్లో నిజం లేదు... రద్దరుున నోట్ల మార్పిడి విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఏసీపీ సూచించారు. వివాహ వేడుకలుంటే... పెళ్లి పత్రిక చూపించి ఎస్పీ అనుమతితో రూ.5 లక్షలు డ్రా చేసుకోవచ్చన్న వార్తలు వాస్తవం కాదన్నారు. అలాగే మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో పాతనోట్లను ఈ నెల 24 వరకు తప్పనిసరిగా తీసుకోవాలని, నిరాకరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రిటైల్ రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి
సాక్షి, అమరావతి: పండుగలను దృష్టిలో పెట్టుకొని రిటైల్ రుణాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. వచ్చే డిసెంబర్ వరకు రిటైల్ రుణాలను అదనంగా 0.25 శాతం తగ్గింపు ధరలకే అందిస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, తెలంగాణ హెడ్) ఎస్.పి.శర్మ తెలిపారు. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను వసూలు చేయడం లేదన్నారు. మరోవైపు ఎంఎస్ఎంఈ రుణాలు, కాసా ఖాతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కార్లపై ఆన్‌రోడ్ ధరలో 95 శాతం వరకు రుణాన్ని సిండికేట్ బ్యాంక్ అందిస్తోందన్నారు. శుక్రవారం విజయవాడ రీజియన్ సమీక్షకు వచ్చిన శర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని తరలిరావడంతో ఇక్కడి విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్తగా 10 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ రీజియన్‌లో 79 శాఖలను సిండికేట్ బ్యాంక్ కలిగి వుంది. ఎన్పీఏలను తగ్గించుకోవడానికి చేపట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వచ్చినట్లు శర్మ తెలిపారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన 45 ఎన్పీఏ ఖాతాలను ఈ స్కీం కింద పరిష్కరించినట్లు తెలిపారు. మరో రూ. 10 కోట్ల ఎన్పీఏలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ రీజియన్‌లో సిండికేట్ బ్యాంక్‌కు రూ. 135 కోట్ల ఎన్పీఏలున్నాయి. -
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను 9-9.35% రేంజ్లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్ఆర్ను నిర్ణయించామని వివరించింది. ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ 9.05-9.6% రేంజ్లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్ఆర్ 9.3-9.75% రేంజ్లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ.79 కోట్లు
ఆదాయం రూ.6,419 కోట్లు న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.79 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.302 కోట్ల నికర లాభం సాధించామని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. జైపూర్ రీజియన్‌కు చెందిన మూడు బ్యాంక్ శాఖల్లో జరిగిన మోసం కారణంగా ఈ మూడు శాఖల లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోందని, పెద్ద మొత్తాన్ని రద్దు చేసినందున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. మొత్తం ఆదాయం గత క్యూ1లో రూ.6,323 కోట్లుగానూ, ఈ క్యూ1లో రూ. 6,419 కోట్లుగానూ నమోదైందని పేర్కొంది. గత క్యూ1లో 3.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి, అలాగే 2.36 శాతంగా ఉన్న నికర మొండిబకాయిలు 5.04 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయ వ్యాపారం రూ.4.72 లక్షల కోట్ల నుంచి రూ.4.68 లక్షల కోట్లకు, అలాగే అంతర్జాతీయ డిపాజిట్లు రూ.2.69 లక్షల కోట్ల నుంచి రూ.2.63 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. బీఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ.77 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ
ఈ నెల 26న ఏజీఎం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని, మొత్తం బ్యాంక్ మూలధనంలో ప్రభుత్వ వాటా 51 %కి తగ్గకుండా ఉండేలా ఈ నిధులు సమీకరిస్తామని వివరించింది. -
సిండికేట్ బ్యాంక్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు, ఇతర అంశాలకు కేటాయింపులు మూడు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌కు రూ.417 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.120 కోట్ల నికర నష్టం వచ్చిందని తెలిపింది. 2014-15 క్యూ4లో రూ.715 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2015-16 క్యూ4లో రూ.2,412 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,599 కోట్ల నుంచి రూ.6,525 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ 4.7 శాతం ఎగసి రూ.66.5 వద్ద ముగిసింది. -
సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మంగళవారం సీబీఐ అధికారులు ఢిల్లీ, జైపూర్, ఉదయ్ పూర్ లలో దాడులు చేశారు. సిండికేట్ బ్యాంకు కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం పది ప్రాంతంలో తనిఖీలు చేసినట్టు సీబీఐ ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ తెలిపారు. -
సిండికేట్ బ్యాంక్ కు కేటాయింపుల భారం
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.120 కోట్ల నికర నష్టం వచ్చింది. పన్నులు, ఇతర కేటాయింపులు అధికంగా ఉండటంతో క్యూ3లో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.305 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలియజేసింది. గత క్యూ3లో రూ.5,922 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ3లో రూ. 6,188 కోట్లుగా ఉంది. కేటాయింపులు రూ.290 కోట్ల నుంచి రూ.875 కోట్లకు పెరిగాయని, స్థూల మొండి బకాయిలు 3.6 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండి బకాయిలు 2.38 శాతం నుంచి 3.04 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సిండికేట్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 5.1 శాతం క్షీణించి రూ.70 వద్ద ముగిసింది. -
గుంతకల్లులో దోపిడీ దొంగల బీభత్సం
గుంతకల్లు: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆవరణలోని ఏటీఎంలోకి ప్రవేశించి క్యాష్ బాక్స్ ను తెరిచేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మానిటర్ ను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. -
సిండికేట్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వ రంగ బ్యాంకుగా మంచి పేరున్న సిండికేట్ బ్యాంకు 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ సమాచారం... డిప్యూటీ జనరల్ మేనేజర్(లా) వయసు: కనీసం 40 ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్లు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ‘లా’లో గ్రాడ్యుయేట్/ఇంటెగ్రేటెడ్ లా కోర్సు గ్రాడ్యుయేట్. పని అనుభవం: కనీసం పదకొండేళ్ల పని అనుభవం ఉండాలి. అందులో మూడేళ్లు ఏదైనా కోర్టులో ఇండిపెండెంట్‌గా పనిచేసి ఉండాలి. దీంతో పాటు 8 ఏళ్లు ఏదైనా కమర్షియల్ బ్యాంకులో లా ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి. అందులో మూడేళ్లు చీఫ్ మేనేజర్ లేదా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసి ఉండాలి. పోస్టుల వివరాలు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎకానమిస్ట్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 సంవత్సరాలు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మానిటరీ/ఫైనాన్షియల్ ఎకనమిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌తో ఎకనామిక్స్‌లో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కనీసం 5 ఏళ్లు ఎకనమిక్ రీసెర్చ్‌పై పనిచేసి ఉండాలి, ఫైనాన్షియల్ మార్కెట్/డొమెస్టిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లోని క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌లో సామర్థ్యం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(స్టాటిస్టీషియన్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో స్టాటిస్టిక్స్/అప్లైడ్ టిస్టిక్స్/ఎకనోమెట్రిక్స్లలో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి. పని అనుభవం: కనీసం 3 నుంచి 5 ఏళ్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులో/ ఎకనోమెట్రిక్ టెక్నిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో పని అనుభవం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కంపెనీ సెక్రటరీ(ఏసీఎస్) ఉత్తీర్ణులై, లా డిగ్రీ ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) మెంబర్ అయి ఉండాలి.పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకులో కంపెనీ సెక్రటరీగా కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. సర్టిఫైడ్ బ్యాంకింగ్ కంప్లయన్స్ ప్రొఫెషనల్ కోర్సు, ఐఐబీఎఫ్‌లో ఉత్తీర్ణత ఉండాలి. మేనేజర్ (లా) వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు. విద్యార్హత: ఎల్ఎల్బీ డిగ్రీ ఉండాలి.పని అనుభవం: బార్/జ్యుడీషియల్ సర్వీస్‌లో రెండేళ్ల పని అనుభవం లేదా ఏదైన ప్రముఖ కమర్షియల్ బ్యాంకులో లీగల్ డిపార్ట్మెంట్లో లా ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి. మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు. పని అనుభవం: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కనీసం 5 ఏళ్లు కమిషన్డ్ ఆఫీసర్లుగా పనిచేసి ఉండాలి లేదా ఏఎస్పీ/డీఎస్పీ హోదాతో 5 ఏళ్లు పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం/కనీసం 5 ఏళ్లు పారా మిలిటరీ ఫోర్స్‌లో పనిచేసి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్స్ వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు. విద్యార్హత: చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం: బ్యాంకులో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-సివిల్) వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-ఎలక్ట్రికల్) వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉండాలి.గమనిక: అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేలు(జేఎంజీ/ఎస్) కింద ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ అభ్యర్థులకు ఒకేడాది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఏ ప్రదేశంలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ: జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేల్ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్, సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుగుణంగా రాతపరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష: ఆన్లైన్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. అంశం {పశ్నలు మార్కులు రీజనింగ్ 50 25 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 పోస్టుకు సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 100 ఇంగ్లిష్ 50 25 మొత్తం 200 200 గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ: అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల సాధనలో అభ్యర్థి చొరవ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసే నైపుణ్యాలను పరీక్షించేందుకు గ్రూప్ డిస్క షన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. పీఐ/జీడీ ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే తుది ఎంపికకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50. దరఖాస్తు ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. ముఖ్య తేదీలు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015. పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై. వెబ్సైట్: www.syndicatebank.in -
సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జీఎంగా ఎం.ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సిండికేట్ బ్యాంక్ శాఖల ఇన్చార్జ్గా ఎం.ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ రీజనల్ మేనేజర్‌గా ఉన్న ప్రసాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 7 రీజనల్ ఆఫీసులు, 550 శాఖలకు ఇన్చార్జ్గా ప్రసాద్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. -
సెక్యూరిటీ లేకపోవడం వల్లే.. బ్యాంకు దోపిడీ యత్నం
రేణిగుంట సీఆర్ఎస్ సిండికేట్ బ్యాంకును పరిశీలించిన అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి రేణిగుంట : రేణిగుంట సీఆర్ఎస్ సమీపంలో ఉన్న సిండికేట్ బ్యాంకు దోపిడీకి దుండగులు శనివారం రాత్రి యత్నించారు. సెక్యూరిటీ లేకపోవడం వల్లే దుండగు లు ఇనుప రాడ్లతో బ్యాంకు గేటు తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల సీసీ కెమెరాను ధ్వం సం చేశారు. హైసెక్యూరిటీ లాక్డ్ బీరువాలను పగులగొట్టేందుకు ప్రయత్నిం చినా, అవి ఓపెన్ కాకపోవడంతో పారి పోయారు. బ్యాంకు గేటు తెరిచి ఉండటాన్ని ఆదివారం ఉదయం ఓ సీఆర్ఎస్ ఉద్యోగి గమనించి, సీఆర్ఎస్ సెక్యూరిటీ అధికారి ద్వారా రేణిగుంట పోలీసులకు సమాచారమిచ్చారు. అర్బన్ సీఐ బాలయ్య, ఎస్ఐలు రఫీ,మధుసూదన్ , అనంతరం అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, క్రైమ్ ఏఎస్పీ మల్లారెడ్డి, రేణిగుం ట డీఎస్పీ నంజుండప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రోశిరెడ్డిని అర్బన్ ఎస్పీ విచారించారు. నగదు, బంగారు నగలు సేఫ్ అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి సమక్షంలో బ్యాంకులోని హైసెక్యూరిటీ లాక్డ్ లాకర్లను తెరిపించారు. అందులో ఉంచిన రూ.4,5 లక్షల నగదు భద్రంగా ఉండ టంతో పోలీసు, బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరో లాకర్ లోని సుమారు రూ.4 కోట్లు విలువ చేసే బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాం కు మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ఆ లాకర్‌ను ఓపెన్ చేయడం కుదరలేదని పోలీసు అధికారులు చెప్పారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణుల బృందం ఆ ధారాలు సేకరించింది. పోలీసు జాగి లం సంఘటనా స్థలం నుంచి స్థానిక జెడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలోని తెలుగుగంగ వాటర్ సంప్ ప్రాంతంలో ఆగింది. దుండగులు బ్యాంకు పక్కనే ఉన్న తపాలా బాక్సు వద్ద పడేసి వెళ్లిన తాళాలను స్వాధీనం చేసుకున్నారు. -
సిండికేట్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
రేణిగుంట (చిత్తూరు) : సిండికేట్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం చేసింది ఓ దొంగల ముఠా. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని సీఆర్ఎస్ నగర్లో ఉన్న సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో శనివారం రాత్రి జరిగింది. కాలనీలో ఉన్న సిండికేట్ బ్యాంక్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన కొందరు గుర్తుతెలియని దుండగులు ముందుగా సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ తాళాలను ధ్వంసం చేయడానికి విఫలయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో.. బ్యాంక్ సామాగ్రిని చిందరవందర చేశారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్లూస్‌టీంతో సహా రంగంలోకి దిగారు. కాగా.. ఈ బ్యాంకులో అధిక మొత్తంలో బంగారు ఖాతాలు ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాంకు అధికారులు వచ్చే వరకు నష్టం విలువ ఎంతో స్పష్టత రాదని పోలీసులు అంటున్నారు. -
ఏపీ మంత్రి గారు చాలా బిజీ..!
గుంటూరు : అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి (29) ఆత్మహత్య ఘటనపై స్పందించడానికి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరాకరించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆయన నివాసం వద్ద మంత్రి స్పందన కోసం 'సాక్షి' మీడియా ప్రతినిధి రెండు గంటలకు పైగా వేసి చూసినా ముఖం చాటేశారు. మంత్రి ప్రత్తిపాటి నివాసం వద్ద చాలా సమయం ఎదురుచూసిన తర్వాత మంత్రి బిజీగా ఉన్నారంటూ చెప్పిన ఆయన పీఏ, గన్‌మన్ లు సాక్షి' ప్రతినిధిని పంపించేశారు. బ్యాంకు మేనేజర్ ఒత్తిళ్లు భరించలేక ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో రైతు కోదండరామిరెడ్డి పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఉద్యోగం రాక చివరకు వ్యవసాయమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఆ యువరైతు చదివింది ఎంబీఏ కావడం గమనార్హం. -
బ్యాంకు అధికారులపై రైతుల ఆగ్రహం!
-
జూన్9న సిండికేట్ బ్యాంక్ అదాలత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన ఖాతాలను పరిష్కరించుకోవడానికి సిండికేట్ బ్యాంక్ జూన్ తొమ్మిదిన అదాలత్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో ఈ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని, ఒకేసారి చెల్లించడం ద్వారా (వన్‌టైమ్ సెటిలిమెంట్ )ఎన్పీఏ ఖాతాలను వదిలించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, వ్యాపార, వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ రుణాలున్న ఎన్పీఏ ఖాతాదారులు ఈ అదాలత్‌లో పాల్గొని వన్‌టైమ్ సెటిలిమెంట్ కింద వడ్డీ రాయితీని పొందచ్చని బ్యాంకు తెలిపింది. -
సెంట్రల్, సిండికేట్ బ్యాంకుల బేస్ రేటు కోత
న్యూఢిల్లీ: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస రుణరేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్ బేస్ రేటును తగ్గించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేటును 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.95 శాతానికి తగ్గింది. సిండికేట్ బ్యాంక్ రుణ రేటు పావుశాతం తగ్గి 10 శాతానికి చేరింది. బీఓబీ, ఓబీసీ డిపాజిట్ రేట్ల కోత: కాగా రుణ రేటు కోతకు సంకేతంగా భావించే డిపాజిట్ రేట్ల కోత నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) తీసుకున్నాయి. కొన్ని డిపాజిట్లపై తగ్గించిన తాజా వడ్డీ రేటు జూన్ 8 నుంచి అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి. -
ఖాతాలలో నగదు మాయం:స్పందించని బ్యాంకు
-
ఖాతాలలో నగదు మాయం:స్పందించని సిండికేట్ బ్యాంకు
హైదరాబాద్: సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంకు బ్రాంచ్‌లో ఖాతాదారులు దాచుకున్న డబ్బు మాయం అయింది. మొత్తం 22 మంది ఖాతాదారులకు చెందిన 10 లక్షల 73వేల రూపాయలు మాయం అయ్యాయి. తాము దాచుకున్న డబ్బు తమకు ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు యాజమాన్యం నుంచి స్పందనలేదు. ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. జరిగిన మోసానికి తమకేలాంటి సంబంధంలేదని బ్యాంకు యాజమాన్యం చెబుతోంది. -
సిండికేట్ బ్యాంక్ లాభంపై ఎన్పీఏల ఎఫెక్ట్..!
బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంక్ గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15) మార్చితో ముగిసిన చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శనివారం ప్రకటించింది. 2013- 14 మార్చి క్వార్టర్‌తో పోల్చితే బ్యాంక్ నికర లాభం 2 శాతం పెరిగింది. ఈ మొత్తం రూ.409 కోట్ల నుంచి రూ. 417 కోట్లకు పెరిగినట్లు ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ టీకే శ్రీవాస్తవ తెలిపారు. మొండి బకాయిల (ఎన్పీఏ)కు అధిక మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) జరపాల్సి రావడంతో 4వ త్రైమాసికంలో స్వల్ప స్థాయి లాభాలకే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.5,357 కోట్ల నుంచి రూ.6,599 కోట్లకు ఎగసింది. స్థూల ఎన్పీఏల పరిమాణం రుణాల్లో 2.62 శాతం నుంచి 3.13 శాతానికి ఎగసింది. నికర ఎన్పీఏలు సైతం 1.56 శాతం నుంచి 1.90 శాతానికి చేరాయి. మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే నికర లాభం 11 శాతం క్షీణించింది. ఈ పరిమాణం రూ.1,711 కోట్ల నుంచి రూ.1,523 కోట్లకు పడింది. ఆదాయం రూ.19,945 కోట్ల నుంచి రూ.23,725 కోట్లకు చేరింది. తుది డివిడెండ్‌ను 47%గా బ్యాంక్ బోర్డ్ ప్రతిపాదన. -
చిన్న సంస్థలకు రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ చిన్న మధ్య తరహా కంపెనీల రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) రంగానికి రుణాలను త్వరితగతిన మంజూరు చేయడానికి ఖాతాదారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని 45 శాఖల నుంచి వచ్చిన రూ. 250 కోట్ల విలువైన 72 రుణాలను మంజూరు చేసింది.ఈ సమావేశంలో సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ టి.కె.శ్రీవాత్సవ పాల్గొన్నారు. గత నవంబర్ నుంచి డాక్టర్లు, టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్, మార్బుల్ ట్రేడింగ్, మహిళా వ్యాపారస్తుల కోసం ప్రత్యేక పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
33 శాతం తగ్గిన సిండికేట్ నికరలాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభంలో 33 శాతం క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 470 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 316 కోట్లకు తగ్గింది. పెరిగిన నిరర్థక ఆస్తులకు అదనంగా రూ. 220 కోట్లు ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయడంతో లాభం తగ్గడానికి ప్రధాన కారణంగా సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు రూ. 4,472 కోట్ల నుంచి రూ. 6,049 కోట్లకు పెరిగాయి. ఇందులో ఎనిమిది అకౌంట్లకు సంబంధించి రూ. 800 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ ఆలస్యం కావడంతో ఈ త్రైమాసికంలో ఎన్పీఏలుగా చూపించడం జరిగిందని, ఈ మొత్తం తృతీయ త్రైమాసికంలో తగ్గుతాయన్నారు. ప్రస్తుతం 3.43%గా ఉన్న స్థూల ఎన్పీఏలను మార్చినాటికి 3%కి పరిమితం చేయాలనేది లక్ష్యమని తెలిపారు. రూ.4.75 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం ఈ మార్చి నాటికి వ్యాపారం రూ. 4.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో వ్యాపారం 20 శాతం వృద్ధితో రూ. 4.15 లక్షల కోట్లకు చేరిందన్నారు. నికర వడ్డీ ఆదాయం స్థిరంగా 2,774 కోట్లుగా ఉండగా, ఇతర ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.893 కోట్లుగా నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 531 శాఖల ద్వారా రూ. 38,095 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేశామని, మార్చినాటికి ఈ మొత్తం రూ. 50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. డిసెంబర్‌లోగా 1,600 కోట్ల సమీకరణ వ్యాపార విస్తరణకు వివిధ మార్గాల ద్వారా రూ. 3,250 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్‌లోగా రూ.1,600 కోట్లు సేకరించనున్నట్లు ఆంజనేయ ప్రసాద్ వెల్లడించారు. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్(క్యూఐపీ) ద్వారా రూ. 1,100 కోట్ల సమీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఇది కాకుండా టైర్2 బాండ్స్ ద్వారా రూ.1,150 కోట్లు, టైర్ 1 బ్యాండ్స్ జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గతేడాది సుమారు 4,000 మంది సిబ్బందిని నియమించుకోగా.. ఈ ఏడాది మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రసాద్ తెలిపారు. -
ఉద్యోగాలు
సిండికేట్ బ్యాంక్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, నొయిడాలోని ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా అందిస్తున్న ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు’లో ప్రవేశాలకు సిండికేట్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్) పోస్టులకు ఎంపిక చేస్తారు. ఖాళీల సంఖ్య: 400 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్ టెస్టు), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 18 ఆన్లైన్ టెస్టు తేది: డిసెంబరు 27 వెబ్సైట్: www.syndicatebank.in -
రైతు రుణాలు మింగిన నకిలీలు
నెల్లికుదురు : రైతుకు బ్యాంకు రుణం కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం.. మీ సేవా ద్వారా తీసిన పహనీ నకల్, ఓటరు ఐడీ కార్డు తదితరాలు తప్పనిసరి ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్నా కొర్రీలు పెడుతూ బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకునే బ్యాంకు అధికారులు.. సెంట్ భూమి లేనివారికి కూడా లక్షలాది రూపాయల రుణాలిచ్చారు. కేవలం తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు తహసీల్దార్, వీఆర్వో రాసిస్తే ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం మంజూరు చేశారు. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఇలా ఏకంగా సుమారు 480 మంది బినామీలకు రుణాలిచ్చారు. దళారులు, రెవె న్యూ, బ్యాంకు అధికారులు కుమ్మక్కయి కోట్లు కొల్లగొట్టారు. మహబూబాబాద్ మండలం అమనగల్ సిండికేట్ బ్యాంకు కేంద్రంగా సాగిన ఈ దందా నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం, ఆలేరు, బంజర గ్రామా ల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమనగల్ సిండికేట్ బ్యాంకు అధికారు లు నర్సింహులగూడెం ఆలేరు, బంజర గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకేగాక మరికొన్ని గ్రామాలకు కలిపి 1830 మందికి సుమారు రూ.14 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇటీవల ఈ జాబితా కూడా విడుదల చేశారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనల ప్రకారం రైతులకు రుణా లు మంజూరు చేయాలంటే పట్టాదారు పాసుపుస్తకాలు, మీ సేవా ద్వారా పొందిన పహనీ నకల్, రైతుల వివరాలు సక్రమంగా ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసుకున్న రైతు భూమిని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించాకే రుణం మంజూరు చేస్తారు. కానీ అమనగల్ సిండికేట్ బ్యాంకులో ఆ డాక్యుమెంట్లేవి లేకుం డానే ఇక్కడ రుణాలు మంజూరు చేశారు. దళారుల ప్రమేయంతో భూమి లేని వ్యక్తుల పేరిట రుణాలిచ్చారు. తెల్లకాగితంపై ఫలానా వ్యక్తికి ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి ఉన్నదని వీఆర్వో, తహసీల్దార్ రాసిచ్చి, సంతకాలు పెట్టి, ముద్రలు వేస్తేచాలు.. అప్పటి సిండికేట్ బ్యాంకు మేనేజర్ పులిపాక కృపాకర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మంజూరు చేశారు. ఇలా కేవలం వీఆర్వో, తహసీల్దార్ ధ్రువీకరించిన కాగితాల ఆధారంగా బంజర, ఆలేరు, నర్సింహులగూడెం గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కలిసి సుమారు 480 మంది భూమి లేని వ్యక్తులకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రుణాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా నెల్లికుదురు తహసీల్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు అనుమానాలున్నాయి. వెలుగు చూసిందిలా.. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి సెప్టెంబ ర్ 5న చదివి వినిపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. బంజర గ్రామంలో 310 మంది రుణాలు తీసుకున్నట్లు జాబితా ఉండ గా.. కేవలం 56 మంది పేర్లనే బ్యాంకు అధికారులు గ్రామసభకు పంపారు. మిగతాపేర్లను నర్సింహులగూడెం గ్రామ జాబితాలోకి మార్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. గ్రామసభ నిర్వహించిన బంజర సర్పంచ్ నెలకుర్తి వెంకట్‌రెడ్డి గ్రామస్తుల సమక్షంలో తమ గ్రామంలో రుణాలు తీసుకున్న వారి మొత్తం జాబితాను తమకివ్వాలని తీర్మా నం చేసి గ్రామ ప్రత్యేక అధికారి ఆర్ఐ లచ్చునాయక్ అందజేశారు. అయినా రెవె న్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నెల్లికుదు రు తహసీల్దార్ తోట వెంకట నాగరాజును వివరణ కోరగా.. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా అసలు మంజూరైన రుణాలను భూమి లేని రైతులైనా తీసుకున్నా రా ? లేదంటే దళారులు, అధికారులే బినామీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేశారా ? అనేది ఉన్నతాధికారులు విచారణ చేపడితేనే వెలుగు చూసే అవకాశముంది. -
నమ్మించి మోసం చేస్తారా?
గుత్తి/గుత్తి రూరల్/ బుక్కపట్నం : రుణ మాఫీకి షరతులు విధించడంపై డ్వాక్రా మహిళలు కన్నెర్రజేశారు. మాట తప్పితే తమ ఉసురు కొట్టుకుని పోతారంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. నమ్మించి నిండా ముంచారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుత్తి, బుక్కపట్నం మండల కేంద్రాల్లో సోమవారం డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలు దాదాపు 400 మంది గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. బ్యాంకు సీనియర్ మేనేజర్ రెజితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు వద్ద నుంచి ఎస్బీఐ, రాజీవ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీతో వెళ్లి గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ‘రుణ మాఫీ’ హామీని నమ్మి ఆయన్ను అందలం ఎక్కించడంతో పాటు బ్యాంకులకు కంతుల చెల్లింపు ఆపేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఆలస్యం కావడంతో తమ పొదుపు ఖాతాల్లోని సొమ్మును తమ ప్రమేయం లేకుండానే కంతులకు జమ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడా కాసేపు ధర్నా చేశారు. పైసా కూడా తాము చెల్లించేది లేదని, రుణాలన్నీ షరతులు లేకుండా మాఫీ చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. తొలుత ఇందిరక్రాంతి పథం (ఐకేపీ), తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించి, అక్కడే కాసేపు ధర్నా చేశారు. రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదని, ఇప్పుడు అపరాధపు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. రుణ మాఫీ చేయకుండా.. బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. వీరి ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి బ్యాళ్ల అంజి మద్దతు తెలిపారు. -
ఆదాయపు పన్ను 29 బ్యాంకుల శాఖల్లో చెల్లించొచ్చు
ముంబై: భారీ క్యూలలో వేచిచూడడాన్ని నివారించడానికి ఆదాయ పన్ను(ఐటీ)ను ముందుగానే చెల్లించాల్సిందిగా ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరింది. ‘ఐటీ చెల్లింపుల స్వీకరణకు 29 ఏజెన్సీ బ్యాంకులకు అనుమతి ఇచ్చాం. ఆర్బీఐలో లేదా ఈ బ్యాంకుల శాఖల్లో ఐటీ బకాయిలను ముందుగానే చెల్లించండి...’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచిం చింది. ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చని తెలిపింది. ప్రతి సెప్టెంబర్ చివర్లో ఐటీ చెల్లించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారనీ, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రశీదులు ఇవ్వడం కష్టసాధ్యంగా మారిందనీ పేర్కొంది. ఐటీ చెల్లింపుల స్వీకరణకు ఆర్బీఐ అనుమతించిన బ్యాంకుల్లో అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓబీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ తదితర బ్యాంకులు ఉన్నాయి. ఎంపికచేసిన శాఖలు లేదా ఆయా బ్యాంకులు ఆఫర్ చేసే ఆన్లైన్ చెల్లింపు సదుపాయం ద్వారా పన్ను చెల్లించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ పోస్టర్ విడుదల... కేవైసీ నిబంధనల గురించి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఒక నోట్‌ను, పోస్టర్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీలుగా కేవైసీ నిబంధనలను ఇటీవల సరళతరం చేశామనీ, ఆ వివరాలు ప్రజలకు తెలపడమే పోస్టర్ ఉద్దేశమనీ పేర్కొంది. కాగా, బ్యాంకుల్లో మోసాల నివారణకు నిరంతర నిఘా పెడతామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ తెలిపారు. -
రెండుగా పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీ పోస్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల్లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) పోస్టును విభజించేందుకు ఆర్థిక శాఖ సమాయత్తమవుతోంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల్లో అవినీతి కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా సీఎండీ పోస్టును విడగొట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి జీఎస్ సంధూ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వీలుగా యాజమాన్యాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత వారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ దిశగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భూషణ్ స్టీల్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌ల రుణ పరిమితి పెంచేందుకుగాను రూ.50 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్కే జైన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), దేనా బ్యాంకుల్లో రూ.436 కోట్ల విలువైన కస్టమర్ల ఫిక్సిడ్ డిపాజిట్ నిధులు దుర్వినియోగమైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌పై ఆర్థిక శాఖ ఫోరెన్సిక్ ఆడిట్‌కు కూడా ఆదేశించింది. ఇదివరకే ఆర్బీఐ సిఫార్సు..: కాగా, సీఎండీ పోస్టును విడగొట్టాల్సిందిగా గతంలోనే ఆర్థిక శాఖకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సూచించడం గమనార్హం. చాలాసందర్భాల్లో డెరైక్టర్ల బోర్డులో సీఎండీలు పెత్తనం చలాయిస్తున్నారని.. బోర్డుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఈ పోస్టును విభజించాల్సిందేనని ఆర్బీఐ అభిప్రాయపడింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా సీఎండీ ఉంటున్నారు. ఇక దేశీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో మాత్రం అత్యున్నత స్థానంలో చైర్మన్ ఉండగా.. మరో నలుగురు ఎండీలు వివిధ ఎగ్జిక్యూటివ్ పాత్రలను పోషిస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం చైర్మన్, ఎండీ పోస్టులు వేర్వేరుగా ఉన్నాయి. -
మోసకారి బ్యాంక్‌మిత్ర అరెస్టు
పెరుగుతున్న బాధిత గ్రూపులు రూ.10నుంచి 12 లక్షలు స్వాహా నూజివీడు రూరల్ : డ్వాక్రా మహిళల సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసిన బ్యాంక్మిత్రను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పల్లెర్లమూడి పంచాయతీ శివారు రాట్నాలగూడెంకు చెందిన పోలుకొండ ఇందిరా అలియాస్ షేక్ మస్తాన్‌బీ ఐదేళ్లుగా పల్లెర్లమూడి సిండికేట్ బ్యాంక్‌లో బ్యాంక్‌మిత్రగా పనిచేస్తుంది. గ్రామంలోని 10 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తీసుకున్న రుణాల సొమ్మును బ్యాంక్‌లో జమ చేసేందుకు 2012 నుంచి డబ్బు వసూలు చేస్తుంది. అయితే డ్వాక్రా మహిళల నుంచి తీసుకున్న నగదును పూర్తిగా బ్యాంకులో జమచేయకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇందిరమ్మ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ అవసరాల నిమిత్తం తమ సంఘం లావాదేవీలను తెలపాలని 13వతేదీన బ్యాంకు అధికారులను కోరారు. దీంతో బ్యాంకు సిబ్బంది వారి లావాదేవీలను పరిశీలించి రూ.3.50లక్షలు రుణం చెల్లించాల్సి ఉందని తెలుపుతూ బ్యాంకు స్టేట్మెంట్లను అందించారు. దీంతో ఖంగుతిన్న సంఘం సభ్యులు తమ చెల్లింపు వివరాలను పరిశీలించుకున్నారు. 2012 జనవరిలో రూ.3.30 లక్షల రుణాన్ని పొంది నెలకు రూ.12,600 చొప్పున 23నెలలకుగానూ రూ.2,89,800 చెల్లించగా బ్యాంకు ఖాతాలో మాత్రం ఆ మొత్తం జమ కాలేదని సంఘం అధ్యక్షురాలు నత్తా అన్నామణి, సభ్యులు గుర్తించారు. బ్యాంకుమిత్ర తమను మోసం చేసిందని గమనించిన సంఘం సభ్యులు 16వతేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రూ. 1.85 లక్షలు బ్యాంక్‌మిత్ర కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన రూరల్ ఎస్ఐ శుక్రవారం ఆమెను అరెస్టు చేశారు. ఇందిరమ్మ స్వయం సహాయక సంఘంతో పాటు మరికొన్ని గ్రూపుల సభ్యులు సైతం ఫిర్యాదు చేశారని, అయితే విచారణ చేయాల్సి ఉందన్నారు. తీసుకున్న రుణంలో కొంతసొమ్ము మాఫీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి నుంచి డ్వాక్రా మహిళలు రుణాన్ని చెల్లించకపోయినప్పటికీ వాటితో కలిపి ఫిర్యాదు చేస్తున్నారని తమ విచారణలో గుర్తించామని చెప్పారు. గ్రామంలోని మిగిలిన సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకుమిత్ర సుమారు రూ.10 నుంచి 12లక్షల వరకు స్వాహాచేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
సిండికేట్ బ్యాంక్ సీఎండీ అరెస్ట్
-
తనయుడి చూపు కోసం ఆ తండ్రి....
రుద్రవరం: తనయుడి చూపు కోసం ఆ తండ్రి తపిస్తున్నాడు. తన కుమారుడు సజీవంగా తిరిగివస్తాడో లేదోననే ఆందోళనతో మంచం పట్టాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే. వీరితోపాటు కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ కుమారుడు ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయ చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ.. నాగిశెట్టి కుటుంబాన్ని పోషించుకొనేవాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం వెన్నునొప్పి రావడంతో ఆపరేషన్ చేయించుకొనేందుకు, అలాగే కుమారుని చదువు కోసం రూ. 2 లక్షల మేర అప్పు చేశాడు. ప్రస్తుతం ఆలమూరు సిండికేట్ బ్యాంక్‌లో రూ. 80 వేలు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 1.20 లక్షల అప్పు ఉంది. ఈయన కుమారుడు ప్రహ్లాదుడు ఆర్థిక సమస్యలతో ఎంబీఏ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాదులో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి (ప్రహ్లాదుడి సమీప బంధువు.. మామ అవుతాడు)ని ఆశ్రయించాడు. ట్రావెల్ బస్సుతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. కుమారుడు గల్లంతైన విషయం ఒకవైపు.. అప్పుల బాధ మరో వైపు బాధిస్తుండడంతో పెద్ద నాగిశెట్టి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మంచం దిగలేని స్థితిలో ఉన్నాడు. భార్య వృద్ధురాలు కావడంతో ఆయన ఆలనాపాలనా కుమార్తె లక్ష్మీదేవి చూస్తోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఒక విద్యార్థి శవం లభ్యమైనట్లు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆమె చెప్పారు. గల్లంతైన 24 మంది విద్యార్థులతోపాటు టూర్ కో ఆపరేటర్‌గా ప్రహ్లాదుడి పేరు నమోదు చేశారన్నారు. కంటికి రెప్పలా కాపాడే కుమారుడు లేనప్పుడు తమకు ఈ జీవితం ఎందుకని.. ఉన్న పొలం అమ్మి అప్పులు చెల్లించి విషం తీసుకుంటామని ప్రహ్లాదుడి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. ప్రహ్లాదుడి బంధువులు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి, తల్లిదండ్రుల ఆవేదనను వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కలెక్టర్‌కు ఫైల్ రూపంలో అందించారు. వెంటనే కలెక్టర్.. నంద్యాల ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వీరికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. -
ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం
విస్సన్నపేట, న్యూస్‌లైన్ : స్థానిక సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో నగదు అపహరణకు విఫలయత్నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. సిండికేట్ బ్యాం క్కు చెందిన ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓ వ్యక్తి గుర్తుపట్టడానికి వీలులేని విధంగా తలకు షర్టు చుట్టుకుని చొరబ డ్డాడు. ఏటీఎంను గునపంతో పొడవగా ముందు భాగంలో ఉన్న ఫైబర్ డూమ్ ఊడిపోయింది. తరువాత అందులో నుంచి నగదు దొంగిలిం చలేక దుండగుడు వెనుదిరిగాడు. శనివారం విధులకు హాజరైన సిబ్బంది ఈ ఘటనను గుర్తించి బ్రాంచ్ మేనేజర్ రమాకాంతరావుకు చెప్పారు. ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్ క్లూస్‌టీంను రప్పించి ఘ టనాస్థలిలో ఆధారాలు సేకరించారు. ఈ ఘ టనలో నగదు అపహరణకు గురవలేదని ఎస్సై తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి, చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. కాగా, గ్రామంలోని మెయిన్ సెం టర్లో రోడ్డు పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగిందని తెలియడంతో స్థాని కులు భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఈ ఘటన జరిగి ఉం టుందని వారు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వి ద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు. -
2,500 కోట్ల రుణ రికవరీ లక్ష్యం
సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆంజనేయ ప్రసాద్ * ఎన్పీఏలను 2% తగ్గిస్తాం * ఈ ఏడాది రూ.2,650 కోట్ల మూలధనం అవసరం * రాష్ట్రంలో కొత్తగా 100 శాఖలు, వైజాగ్‌లో రీజనల్ కార్యాలయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీగా పెరుగుతున్న నిరర్థక ఆస్తులను తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేయడానికి ‘స్టార్ట్’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, రూ.5 లక్షలోపు బకాయిలపై వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) అధికారాలను బ్యాంకు మేనేజర్లకే అప్పచెపుతున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. రూ. 10 లక్షల లోపు ఉన్న నిరర్థక ఆస్తులను స్టార్ట్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. గతేడాది రూ.1,800 కోట్లు మొండి బకాయిలను వసూలు చేయగా, అది ఈ ఏడాది రూ.2,500 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి స్థూల ఎన్‌పీఏని రెండు శాతం దిగువకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. మార్చి నాటికి సిండికేట్ బ్యాంక్ స్థూల ఎన్పీఏ 2.62 శాతం, నికర ఎన్పీఏ 1.56 శాతంగా ఉన్నాయి. రూ.2,650 కోట్లు కావాలి : ఈ ఏడాది వ్యాపారంలో 20 నుంచి 22 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రూ.3.88 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం వచ్చే మార్చి నాటికి రూ.4.79 లక్షల కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ.2,650 కోట్ల మూలధనం అవసరమవుతుందని తెలిపారు. డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి తక్కువ వడ్డీరేట్లకు విదేశీ బాండ్లను సేకరించనున్నామని, ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రూ.2,100 కోట్లు సేకరించనున్నామన్నారు. 100 శాఖలు : ఈ ఏడాది దేశా వ్యాప్తంగా 350 కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో 100 శాఖలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర విభజన జరుగుతుండటంతో విశాఖపట్నంలో ఈ ఏడాదిలోగా ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని, వచ్చే ఏడాది తెలంగాణాలో మరో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది రాష్ర్టంలో శాఖల సంఖ్యను 500 నుంచి 600కి పెంచడంతోపాటు, వ్యాపార పరిమాణాన్ని రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 409 కోట్లు షేరుకి రూ. 3 డివిడెండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ సిండికేట్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 409 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 592 కోట్లతో పోలిస్తే ఇది 31% తక్కువ. ప్రధానంగా నికర మొండిబకాయిలకు(ఎన్పీఏలు) కేటాయింపులు పెరగడం ప్రభావం చూపినట్లు బ్యాంక్ చైర్మన్ సుధీర్ కుమార్ జైన్ చెప్పారు. అంతేకాకుండా గత క్వార్టర్లో రూ. 114 కోట్లమేర మ్యాట్ క్రెడిట్ అదనంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఎన్పీఏ కేటాయింపులు రూ. 160 కోట్ల నుంచి రూ. 331 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 7% పుంజుకుని రూ. 1,433 కోట్లను తాకగా, బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,781 కోట్ల నుంచి రూ. 5,357 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.97% నుంచి 2.79%కు తగ్గాయి. ఎన్పీఏలు 0.76% నుంచి 1.56%కు పెరిగాయి.పూర్తి ఏడాదికి..: పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం దాదాపు 15% క్షీణించి రూ. 1,711 కోట్లకు పరిమితంకాగా, అంతక్రితం రూ. 2,004 కోట్లను ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,295 కోట్ల నుంచి రూ. 19,945 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 99 వద్ద ముగిసింది. -
4 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఈడీ ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ ఆఖరు నాటికి ఇది రూ. 3.52 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడున్న 3,145 శాఖల సంఖ్యను 3,250కి పెంచుకోనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనూ ప్రస్తుతం 462 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మంగళవారం ఇక్కడ విలేకరులతో ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ వ్యాపారం సుమారు రూ. 32,500 కోట్లుగా ఉందని, ఇది రూ.34,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే వెల్లడించిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రస్తావిస్తూ.. బ్యాంకింగ్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తాము మెరుగైన పనితీరునే సాధించ గలిగామని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. కొత్త శాఖల ద్వారా కరెంటుసేవింగ్స్ అకౌంట్లు ఖాతాలను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లుతెలిపారు. తద్వారా ప్రస్తుతం 30.82 శాతంగా ఉన్న కాసా నిష్పత్తిని .. 31శాతానికి పెంచుకోగలమని ఆయన చెప్పారు. మొండి బకాయిల కట్టడిపై దృష్టి.. డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా ఎల్ఐసీ పాలసీలు విక్రయించడం ద్వారా రూ. 3 కోట్ల పైగా కమీషన్ లభించిందన్నారు. ఇక, మొండి బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే వీటి కట్టడి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణ.. ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్ల మేర మూలధనం సమకూర్చిందని.. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (కిప్) ఇష్యూ ద్వారా మరో రూ. 200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం ఉందని ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. సిండ్ దిశ డిపాజిట్ పథకం.. కొత్తగా సిండ్ దిశ పేరుతో ఈ నెల 6 నుంచి డిపాజిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. 444 రోజుల వ్యవధికి గాను 9.25 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్స్‌కి 9.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరిమిత కాల డిపాజిట్ పథకం కింద సుమారు నెల రోజుల వ్యవధిలో రూ. 10,000 కోట్ల దాకా సమీకరించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. గరిష్టంగా రూ. 10 కోట్ల దాకా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్) పి. రాజారెడ్డి పేర్కొన్నారు. -
కేంద్రానికి సిండికేట్ బ్యాంక్ షేర్లు
మూలధనంగా కేంద్రం సమకూర్చిన రూ.200 కోట్ల మొత్తానికి గాను, కేంద్రానికి షేర్లు జారీ చేయాలన్న ప్రతిపాదనను మణిపాల్‌లో జరిగిన సిండికేట్ బ్యాంక్ వాటాదార్ల అత్యవసర సమావేశం (ఈజీఎం) ఆమోదించింది. దీని ప్రకారం రూ.10 ముఖ విలువ గలిగిన ఒక్కో షేర్‌ను రూ.88.36 ధరకు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ పద్దతిలో కేంద్రానికి బ్యాంకు జారీ చేస్తుంది. ఇప్పుడున్న షేర్లకు అదనంగా 2,26,34,676 షేర్ల కేటాయింపులు జరుగుతాయి. కాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేర్‌కు రూ.2.50 చొప్పున (25శాతం) మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ జనవరి 21. -
నమ్మకంగా నొక్కేశారు..!
రైతుల నమ్మకాన్ని ఆ బ్యాంకు నీరుగార్చింది. పంట రుణాల వసూళ్లలో తిరకాసు ప్రదర్శిస్తోంది. నోరున్నోళ్లకు మాత్రమే న్యాయం చేస్తోంది. పంటల బీమా ప్రీమియం పేరుతో చేతివాటం చూపింది. అడిగినోళ్లకు మాత్రమే చెల్లింపులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్న సిండికేట్ బ్యాంకు వైనమిది... సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో దాదాపు 3వేల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చారు. ఇంతకాలం బ్యాంకర్లు సూచించిన మొత్తం చెల్లిస్తూ రుణాలను ఖాతాదారులు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చారు. అయితే వడ్డీలేని పంట రుణాలతో రైతులకు నమ్మలేని నిజం బహిర్గతమైంది. ప్రీమియం పేరుతో అధిక మొత్తం వసూళ్లు చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే కిమ్మనకుండా వారి నుంచి తీసుకున్న అధిక మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇలాంటి బాగోతం నడుస్తోంది? ఎంత మొత్తాన్ని బ్యాంకు యంత్రాంగం రైతుల నుంచి దండుకుంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం రైతుల మదిలో తొలుస్తున్నాయి. కాగా ఇదే బ్యాంకులో నిక్కచ్చిగా నిలదీసిన ఖాతాదారుల నుంచి మాత్రం ఎంత మొత్తం చెల్లించాలో అంతే తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు నల్లబల్లెకు చెందిన జి.పవన్ కుమార్‌రెడ్డి పేరును ఉదహరిస్తున్నారు.రూ.1లక్ష సిండికేట్ బ్యాంకులో పంట రుణం తీసుకుంటే రెన్యువల్లో రూ.1,03,500 మాత్రమే చెల్లించినట్లు సమాచారం. వడ్డీ లేని రుణాలు కావడంతోనే.. వడ్డీ లేని పంట రుణాలు ప్రవేశపెట్టడంతో బ్యాంకు అసలు స్వరూపం బహిర్గతమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి సిండికేట్ బ్యాంకుతో ఆర్థిక పరమైన ప్రత్యక్ష లావాదేవీలను ఆ ప్రాంతం వారు నిర్వహిస్తున్నారు. లక్ష చెల్లిస్తే వడ్డీలేని రుణం కారణంగా రెన్యువల్లో పంటల బీమా ప్రీమియం, సర్వీసు ట్యాక్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆమేరకే వసూళ్లు చేస్తున్నామంటూ ముద్దనూరు సిండికేట్ బ్యాంకు ఖాతాదారులను నమ్మబలికింది. బ్యాంకర్లు చెప్పిన మేరకు మాత్రమే చెల్లింపులు చేస్తూ వచ్చారు. అయితే ప్రీమియం చెల్లింపుల్లో తేడాను గుర్తించడంతో అసలు విషయం బహిర్గతమైంది. 3.5శాతం మాత్రమే ప్రీమియం వసూలు చేయాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో వసూలు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రశ్నించిన వారికి మాత్రం ఎవరెవరి దగ్గర అధిక మొత్తం తీసుకున్నామో వారందరికీ వెనక్కి ఇచ్చేస్తామని ఆ బ్యాంకు యంత్రాంగం చెప్పుకొస్తోంది. అయితే రైతులు మాత్రం ప్రస్తుతం గుర్తించినందున వెనక్కు ఇస్తామంటున్నారు. గతంలో కూడా ఇలాగే వసూలు చేశారు కదా.. వాటి మాటేమిటి అంటుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆర్బీఐ నిబంధనలు సైతం... ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.25 వేలు లోపు పంట రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ చార్జీలు( సర్వీసు చార్జీ ) వసూలు చేయకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకర్లు వాటిని అమలు పర్చి మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంది. అయితే ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో రూ.25వేల లోపు రుణాలకు కూడా సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో అతి కొద్దిమందికి మినహా అధిక శాతం మంది నుంచి ప్రీమియం చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన లక్షలాది రూపాయలు స్వాహాకు గురైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ తతంగాన్ని ఛేదించాల్సిన లీడ్ బ్యాంకు కూడా మెతక ైవె ఖరి అవలంబిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ నాగసుబ్బారెడ్డి దృష్టికి సాక్షి ప్రతినిధి తీసుకెళ్లగా రైతుల నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. అలా ఎందుకు వసూలు చేశారన్నదానిపై విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. -
257 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
దాదాపు నెల రోజుల తరువాత గురువారం దేశీయ ఫండ్స్ నికర పెట్టుబడిదారులుగా నిలవడంతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడింది. దీనికితోడు కొద్ది రోజులుగా జోరు తగ్గించిన ఎఫ్ఐఐలు కూడా కొనుగోళ్లవైపు మళ్లడం ఇందుకు దోహదం చేసింది. ఈ బాటలో శుక్రవారం ఎఫ్ఐఐలు ఇటీవలలేని విధంగా రూ. 745 కోట్లను ఇన్వెస్ట్ చేయడంతో ఇండెక్స్‌లకు జోష్ వచ్చింది. వెరసి సెన్సెక్స్ 257 పాయింట్లు పుంజుకుని 20,792 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 84 పాయింట్లు ఎగసి 6,176 వద్ద స్థిరపడింది. దీంతో మూడు వారాల తరువాత మళ్లీ మార్కెట్లు వారం మొత్తానికి (3%) లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 574 పాయింట్లు జమ చేసుకుంది. కాగా, శుక్రవారం సాయంత్రం విడుదలకానున్న జూలై-సెప్టెంబర్(క్యూ2) జీడీపీ గణాంకాలపై ఇన్వెస్టర్లలో అంచనాలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. పలువురు ఆర్థికవేత్తలు జీడీపీ 4.5%పైగా వృద్ధి సాధించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. బ్యాంకింగ్ జోరు బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, బ్యాంకెక్స్ 2.2% పుంజుకుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, రియల్టీ 1.5%పైగా లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్‌లో సెసా స్టెరిలైట్ 4.5% దూసుకెళ్లగా, భెల్, ఎస్బీఐ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎల్అండ్టీ 3.5-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు సెన్సెక్స్‌లో నాలుగు షేర్లు నామమాత్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఎంఅండ్ఎం 1.3% క్షీణించింది. జూబిలెంట్ 10%అప్ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 1% బలపడగా, స్కిజోఫ్రెనియా తదితర మానసిక వ్యాధుల చికిత్సకు వినియోగించే సెరోక్వెల్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో జూబిలెంట్ లైఫ్ షేరు దాదాపు 10% జంప్ చేసింది. ఈ బాటలో ఎస్ఆర్ఎఫ్, జేబీఎఫ్, ఎడ్యుకాంప్, ఆన్‌మొబైల్, జేపీ, సద్భావ్, స్పైస్‌జెట్, ఎన్ఎండీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్, సిండికేట్ బ్యాంక్, పీఎఫ్సీ, వీఐపీ 20-5% మధ్య లాభపడ్డాయి. అయితే క్యూ2లో భారీ నష్టాల కారణంగా శ్రీ గణేశ్ జ్యువెలరీ 10% పతనమైంది. ట్రేడైన షేర్లలో 1,461 పుంజుకోగా, 1,032 డీలాపడ్డాయి. -
సిండికేట్ బ్యాంక్ విస్తరణ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇందుకోసం కొత్తగా రెండు రీజనల్ ఆఫీసులతోపాటు, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీసును(ఎఫ్‌ఎంజీవో) ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెల నవంబర్ 1 నుంచి ఒంగోలు రీజనల్ ఆఫీసు, ఎఫ్‌ఎంజీవో ఆఫీసు అందుబాటులోకి వస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం ఆఫీసును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కొత్త కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిండికేట్ బ్యాంకును లోకల్ బ్యాంక్ స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 459 శాఖలు ఉండటమే కాకుండా ఐదు జిల్లాల్లో ప్రధాన బ్యాంక్ హోదాను కలిగి ఉన్నామని, వచ్చే మార్చిలోగా మరో 40 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే గతేడాది రూ.30,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఈ ఏడాది రూ.40,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్ళలో 2,500 మంది ఆఫీసర్లు, 2,300 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మూలధనం కేటాయించిందని, అవసరమైతే క్యూఐపీ, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,500 కోట్లు సమకూర్చుకోవడానికి అనుమతులున్నాయన్నారు. ప్రస్తుతానికి డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్లు మారే అవకాశాలు లేవన్నారు. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ.470 కోట్లు
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ. 470 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం(రూ.463.37 కోట్లు)తో పోల్చితే 1.4 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ సీఎండీ ఎస్.కె. జైన్ సోమవారం తెలిపారు. అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం స్వల్పంగానే వృద్ధి చెందిందని వివరించారు. గత క్యూ2లో రూ.318 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.341 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 3.26 శాతం నుంచి 2.89 శాతానికి తగ్గిందని, మొత్తం ఆదాయం రూ. 4,546 కోట్ల నుంచి రూ.4,850 కోట్లకు పెరిగిందని తెలిపారు. క్విప్ విధానంలో రూ.1,500 కోట్ల నిధులు సమీకరించడానికి బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. -
పొదుపుతోనే అభివృద్ధి
కడపసిటీ, న్యూస్‌లైన్: ప్రజలు పొదుపు చేయడం ద్వారానే అభివృద్ధి పథంలో పయనించగలరని సిండికేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ప్రసాద్‌రావు తెలిపారు. నగర శివార్లలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం సిండికేట్ బ్యాంక్ 88వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార ఈ సందర్భంగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రజలు పొదుపు చేస్తూనే తమవంతు రుణాలు కూడా పొందవచ్చన్నారు. స్విస్ట్ ఛెర్మైన్ రాజోలు వీరారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సెక్యూరిటీ లేకున్నా రుణాలు అందించాలని కోరారు. మాజీ జెడ్పీ వైస్‌ఛెర్మైన్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలు విరివిగా రుణాలు పొందగలుగుతున్నారన్నారు. సిండికేట్ బ్యాంక్ ఏజీఎం నాగమల్లేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డి, రవిశంకర్, రాంప్రసాద్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్విస్ట్ విద్యార్థులు రక్తదానం చేశారు. -
ఈ ఏడాది దూకుడు లేనట్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది వ్యాపారంలో దూకుడుగా వెళ్లరాదని ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదని, వృద్ధిరేటు తిరిగి గాడిలో పడేదాకా వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.3.34 లక్షల కోట్లుగా కాగా అది ఈ సంవత్సరం రూ.3.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలతోపాటు సుమారుగా 1,500 ఏటిఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్‌కి 3,004 శాఖలు, 1,350 ఏటిఎంలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది 1,500 మంది ఆఫీసర్లను, 1,400 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ చర్యల వల్ల లిక్విడిటీపై స్వల్పంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు. ఈ సంవత్సరం రూ.1,830 కోట్ల మూలధనం సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జైన్ చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల వ్యాపారాల్లో పెద్దగా మార్పులొస్తొయని భావించడం లేదన్నారు. కాని ఈ వివాదాలు సద్దుమణిగితే మాత్రం ఆగిపోయిన పెట్టుబడులు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున రావచ్చన్నారు.