
చిన్న సంస్థలకు రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ చిన్న మధ్య తరహా కంపెనీల రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) రంగానికి రుణాలను త్వరితగతిన మంజూరు చేయడానికి ఖాతాదారులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని 45 శాఖల నుంచి వచ్చిన రూ. 250 కోట్ల విలువైన 72 రుణాలను మంజూరు చేసింది.ఈ సమావేశంలో సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ టి.కె.శ్రీవాత్సవ పాల్గొన్నారు.
గత నవంబర్ నుంచి డాక్టర్లు, టెక్స్‌టైల్స్, ట్రాన్స్‌పోర్ట్, మార్బుల్ ట్రేడింగ్, మహిళా వ్యాపారస్తుల కోసం ప్రత్యేక పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.