సీండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు 1 జూలై 2021 నుంచి నిలిపివేయనున్నట్లు కెనరా బ్యాంక్ తన వినియోగదారులకు తెలియజేసింది. సీండికేట్ బ్యాంక్ వినియోగదారులు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను జూన్ 30లోగా అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. "సీండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌తో విలీనం చేసిన తర్వాత SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఈ-సీండికేట్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మార్చారు. అందుకే SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను 01.07.2021 నుంచి నిలిపివేయనున్నట్లు" కెనరా బ్యాంక్ తెలిపింది. "నెఫ్ట్/ ఆర్‌టీజీఎస్/ఐఎమ్‌పీఎస్ లావాదేవీల కోసం "CNRB"తో ప్రారంభమయ్యే క్రొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను మాత్రమే ఉపయోగించాలని వినియోగదారులకు కోరింది.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ఎందుకు మారుస్తున్నారు?
మెగా విలీన ప్రక్రియలో భాగంగా10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ విలీనం ఏప్రిల్ 2020లో అమల్లోకి రాగా ఐఎఫ్ఎస్‌సీ, ఎమ్ఐసీఆర్ కోడ్‌లను 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1, 2021 నుంచి నవీకరిస్తున్నారు.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అంటే ఏమిటి?
ఐఎఫ్ఎస్‌సీ(ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎమ్‌పీఎస్ ద్వారా జరిగే ఆన్‌లైన్ ఫండ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేశారు. 1 ఏప్రిల్ 2019 నుంచి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. అందుకే ఈ ఖాతాదారుల ఐఎఫ్ఎస్‌సీ, ఎమ్ఐసీఆర్ కోడ్‌లు మారుతాయి. అయితే, ఈ బ్యాంకులు ఇంకా తన వినియోగదారులకు తెలియజేయలేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment