రేణిగుంట (చిత్తూరు) : సిండికేట్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం చేసింది ఓ దొంగల ముఠా. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని సీఆర్‌ఎస్ నగర్‌లో ఉన్న సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో శనివారం రాత్రి జరిగింది. కాలనీలో ఉన్న సిండికేట్ బ్యాంక్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన కొందరు గుర్తుతెలియని దుండగులు ముందుగా సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ తాళాలను ధ్వంసం చేయడానికి విఫలయత్నం చేశారు.
అది సాధ్యం కాకపోవడంతో.. బ్యాంక్ సామాగ్రిని చిందరవందర చేశారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్లూస్‌టీంతో సహా రంగంలోకి దిగారు. కాగా.. ఈ బ్యాంకులో అధిక మొత్తంలో బంగారు ఖాతాలు ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాంకు అధికారులు వచ్చే వరకు నష్టం విలువ ఎంతో స్పష్టత రాదని పోలీసులు అంటున్నారు.
సిండికేట్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
Published Sun, Aug 2 2015 8:44 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement