సాక్షి, చిత్తూరు: రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై శనివారం తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల నుంచి చెక్‌పోస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకొంటుండగా పట్టుకున్నారు. చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. చెక్‌పోస్టు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఎంత డబ్బు పట్టుబడింది పూర్తి వివరాలు తెలియరాలేదు. రేణిగుంట చెక్‌పోస్టు సిబ్బందిపై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment