
కేంద్రానికి సిండికేట్ బ్యాంక్ షేర్లు
మూలధనంగా కేంద్రం సమకూర్చిన రూ.200 కోట్ల మొత్తానికి గాను, కేంద్రానికి షేర్లు జారీ చేయాలన్న ప్రతిపాదనను మణిపాల్‌లో జరిగిన సిండికేట్ బ్యాంక్ వాటాదార్ల అత్యవసర సమావేశం (ఈజీఎం) ఆమోదించింది. దీని ప్రకారం రూ.10 ముఖ విలువ గలిగిన ఒక్కో షేర్‌ను రూ.88.36 ధరకు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ పద్దతిలో కేంద్రానికి బ్యాంకు జారీ చేస్తుంది.
ఇప్పుడున్న షేర్లకు అదనంగా 2,26,34,676 షేర్ల కేటాయింపులు జరుగుతాయి. కాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేర్‌కు రూ.2.50 చొప్పున (25శాతం) మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ జనవరి 21.