సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ | Syndicate Bank to raise up to Rs 1700 cr from public offer | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ

Published Thu, Jun 9 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ

సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ

ఈ నెల 26న ఏజీఎం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్‌బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు  సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని, మొత్తం బ్యాంక్ మూలధనంలో ప్రభుత్వ వాటా 51 %కి తగ్గకుండా ఉండేలా ఈ నిధులు సమీకరిస్తామని వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement