సిండికేట్ బ్యాంక్కు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు, ఇతర అంశాలకు కేటాయింపులు మూడు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌కు రూ.417 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది.
ఇక గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.120 కోట్ల నికర నష్టం వచ్చిందని తెలిపింది. 2014-15 క్యూ4లో రూ.715 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2015-16 క్యూ4లో రూ.2,412 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,599 కోట్ల నుంచి రూ.6,525 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ 4.7 శాతం ఎగసి రూ.66.5 వద్ద ముగిసింది.