గుంతకల్లు: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆవరణలోని ఏటీఎంలోకి ప్రవేశించి క్యాష్ బాక్స్ ను తెరిచేందుకు దుండగులు ప్రయత్నించారు.
అయితే అది సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మానిటర్ ను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.