ATM robbey
-
విమానాల్లో ప్రయాణం.. ఏటీఎం నుంచి డ్రా.. కానీ, లెక్కల్లో తేడా రాదు
సాక్షి, చెన్నై : ఎస్బీఐ డిపాజిట్ మిషన్‌లో నగదు తస్కరించిన హైటెక్ ముఠా కోటక్ బ్యాంక్ డిపాజిట్ మెషిన్లలో డిపాజిట్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యుడిని హర్యానాలో ఆదివారం అరెస్టు చేశారు. ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హైటెక్ చేతివాటం ప్రదర్శించిన విషయం గత వారం చెన్నైలో వెలుగు చూసింది. ఏటీఎంలలో చాకచక్యంగా నగదు డ్రా చేసినట్టుగా చేసి, సెన్సార్లను పనిచేయనివ్వకుండా ఆ నగదు మళ్లీ లోనికి వెళ్లినట్టుగా లెక్కల్లో సూచించేలా హెటెక్ చేతివాటం ప్రదర్శించారు. దీనిపై ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందం ఢిల్లీ, హర్యానాల్లో తిష్ట వేసి ఈ ముఠా కోసం గాలిస్తోంది. తొలుత సమీర్ అనే యువకుడిని అరెస్టు చేసి చెన్నైకి తీసుకొచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న అతడు ఇచ్చిన సమాచారంతో వీరేందర్ అనే యువకుడిని ఆదివారం అరెస్టు చేసి తరమణి స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. విమానాల్లో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి వెళ్లడమేకాకుండా డిపాజిట్ మెషిన్లు ఉన్న ఏటీఎంలను గూగుల్ మ్యాప్ ఆధారంగా గుర్తించినట్టు తేలింది. ఈ క్రమంలో వారు వలసరవాక్కం సమీపంలోని లాడ్జిలో అద్దెకు దిగి అద్దె బైక్‌లో తిరుగుతూ మూడు నాలుగు రోజుల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు గుర్తించారు. ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.80 లక్షలు చోరీ చేసి తరమణిలోని కోటక్ బ్యాంక్ డిపాజిట్ మెషిన్ ద్వారా తన తల్లి పేరిట ఉన్న ఖాతాలోకి సమీర్ డిపాజిట్ చేయడం గమనార్హం. ఇతడి వద్ద నుంచి పలు బ్యాంక్‌లకు చెందిన ఏటీఎం కార్డుల్ని పోలీసులు సీజ్ చేశారు. అలాగే మూడు ఖాతాల్ని స్తంభింపజేశారు. ఈ ముఠా రాకెట్ అతి పెద్దదని, హర్యానా కేంద్రంగా పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య -
ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి
న్యూ ఢిల్లీ: కోతి చోరీకి పాల్పడింది. అయితే ఈసారి ఆహార పదార్థాలనో ఎత్తుకెళ్లలేదు. ఏకంగా బ్యాంకు ఏటీఎమ్ మీదే దాని కన్ను పడింది. ఇంకేముందీ ఎవరూ లేని సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎమ్ గదిలోకి చొరబడింది. వెంటనే దానికి తోచిన ప్లాన్‌ను అమల్లో పెట్టింది. ఏటీఎమ్‌ను పట్టుకుని వేలాడుతూ, తిరుగుతూ కుప్పిగంతులేసింది. కోతి దెబ్బకు ఏటీఎమ్ ముందు భాగం తెరుచుకుంది. ప్లాన్ సక్సెస్ అయినట్టుందంటూ హుషారుగా అందులోకి తొంగి చూసిన వానరానికి ఒక్క నోటు కూడా కనిపించలేదు. దీంతో తన శ్రమంతా వృథా అయిందని భావించిన కోతి విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చేతుల్లేకి కోతికి అరటి పండు తినిపించిన పోలీసు) ఈ అరుదైన ఏటీఎమ్ చోరీ ఢిల్లీలో చోటు చేసుకుంది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. దోపిడీ ప్రధానాంశంగా తిరిగే పాపులర్ వెబ్ సిరీస్ "మనీ హేస్ట్"తో పోలుస్తూ కోతిని "మంకీ హేస్ట్" అని పిలుస్తున్నారు. కొందరేమో కోతి దొంగతనం కామెడీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. "అసలే మందు రేట్లు మండిపోతున్నాయి. ఓ బాటిల్ కొనుక్కునేందుకు డబ్బుల్లేక, అది దొంగతనానికి ప్రయత్నించి ఉంటుంద"ని ఓ మందుబాబు దానిపై జాలి చూపించాడు. కొందరు మాత్రం అది నిజంగా దొంగ కోతేనేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చోరీ చేయడంపై శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎమ్ మీదకు వదిలినట్టున్నారని అభిప్రాయపడుతున్నారు. (కోతులకు కరోనా సోకితే అంతే) -
హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం
సాక్షి, హైదరాబాద్ : ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఫలక్‌నుమాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నుమాలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో నలుగురు దుండగులు చోరీకి యత్నించారు. చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను మొబిన్, సాజిద్, షేక్ ఖాసీంగా గుర్తించారు. దుండగులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేశారు. -
ఏటీఎం చోరీకి యత్నం..
-
ఏటీఎం చోరీకి యత్నం.. యువకుడికి దేహశుద్ధి
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని చండూర్ మండలం ఘట్టుప్పల్‌లో ఏటీఎంలోని నగదు చోరికి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఓ యువకుడు. గడ్డపారతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేస్తుండగా గ్రామస్తులు చూసి పోలీసులకు పట్టించారు. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వాయులపల్లి గ్రామానికి చెందిన జలందర్ ఘట్టుప్పల్లోని ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నాడు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గడ్డపార, సుత్తె, కొడవలితో ఏటీఎం మిషన్ వద్దకు వచ్చాడు. ఆయుధాలతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాడు. శబ్దం రావడంతో పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఏటీఎం వద్దకు వెళ్లి చూశారు. దొంగతనానికి పాల్పడుతున్న జలందర్‌ను చూసిన యువకులు గ్రామస్తులకు ఫోన్ చేసిన విషయం చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి జలందర్‌ను బంధించారు. గ్రామస్తులను చూసి బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన జలందర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జలందర్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
చిన్నారి ఛాతీపై తుపాకీ పెట్టి మరీ...
ఇండోర్ : చిన్నారి ఛాతీపై తుపాకీ ఎక్కుపెట్టి ఓ వ్యక్తి దోపిడీకి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏటీఎమ్ సెంటర్లోకి ముసుగుతో ప్రవేశించిన ఓ వ్యక్తి.. డబ్బులు డ్రా చేస్తున్న జంటను బెదిరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇండోర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎమ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఓ జంట తమ పిల్లాడితో డబ్బులు డ్రా చేయటానికి లోపలికి వెళ్లింది. ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. అతన్ని నిలువరించే యత్నం చేయగా.. గన్ గురిపెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా.. సదరు వ్యక్తి ఎదురు తిరిగే యత్నం చేశాడు. వెంటనే దొంగ తుపాకీని అతని కొడుకువైపు మళ్లించాడు. దీంతో చేసేదిలేక ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసి దొంగ చేతికి ఇచ్చేశాడు. ‘‘రాంగ్ పిన్ నంబర్ కొట్టి కాసేపు కాలయాపన చేయాలని యత్నించా. ఈలోపు ఎవరైనా వస్తారేమోనని అనుకున్నా. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు’’ అని బాధితుడు తెలిపాడు. ఘటన తర్వాత స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అతను వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఏటీఎమ్‌లో గన్‌తో బెదిరించి దోపిడీ
-
వైరల్ : తల పగిలినా తెగించి అడ్డుకున్నాడు
పనాజీ : ఓ ఏటీఎం సెంటర్లో దోపిడీ యత్నానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ప్రాణాలకు తెగించి సెక్యూరిటీ గార్డు ఓ దొంగను అడ్డుకున్నాడు. పాంజిమ్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలో శుక్రవారం ఓ ఆగంతకుడు ముసుగు ధరించి దొంగతనానికి యత్నించాడు. అది గమనించి అప్రమత్తమైన గార్డు అతన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో దొంగ తన దగ్గరున్న సుత్తెతో సెక్యూరిటీ గార్డు పై దాడి చేశాడు. ఈ పెనుగులాటలో గార్డు కిందపడిపోగా.. దొంగ చెలరేగి దెబ్బలు కొట్టాడు. గార్డు లాగేయటంతో దొంగ ముసుగు తొలగిపోగా.. ఆ కోపంతో దొంగ, గార్డుపై మరింతగా రెచ్చిపోయాడు. చివరకు సుత్తి లాక్కున్న సెక్యూరిటీ గార్డు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు వెంటపడ్డాడు. స్థానికులు సెక్యూరిటీ గార్డును ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ వేటలో ఉన్నారు. -
గుంతకల్లులో దోపిడీ దొంగల బీభత్సం
గుంతకల్లు: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆవరణలోని ఏటీఎంలోకి ప్రవేశించి క్యాష్ బాక్స్ ను తెరిచేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మానిటర్ ను ధ్వంసం చేసి పరారయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.