చిన్నారి ఛాతీపై తుపాకీ పెట్టి మరీ... | Gun Point at Son Couple looted in Indore ATM | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 9:44 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Gun Point at Son Couple looted in Indore ATM - Sakshi

ఇండోర్‌ : చిన్నారి ఛాతీపై తుపాకీ ఎక్కుపెట్టి ఓ వ్యక్తి దోపిడీకి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏటీఎమ్‌ సెంటర్‌లోకి ముసుగుతో ప్రవేశించిన ఓ వ్యక్తి.. డబ్బులు డ్రా చేస్తున్న జంటను బెదిరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. 

ఇండోర్‌ లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎమ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఓ జంట తమ పిల్లాడితో డబ్బులు డ్రా చేయటానికి లోపలికి వెళ్లింది. ఇంతలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. అతన్ని నిలువరించే యత్నం చేయగా.. గన్‌ గురిపెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయగా.. సదరు వ్యక్తి ఎదురు తిరిగే యత్నం చేశాడు. వెంటనే దొంగ తుపాకీని అతని కొడుకువైపు మళ్లించాడు.

దీంతో చేసేదిలేక ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేసి దొంగ చేతికి ఇచ్చేశాడు. ‘‘రాంగ్‌ పిన్‌ నంబర్‌ కొట్టి కాసేపు కాలయాపన చేయాలని యత్నించా. ఈలోపు ఎవరైనా వస్తారేమోనని అనుకున్నా. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు’’ అని బాధితుడు తెలిపాడు. ఘటన తర్వాత స్థానిక స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు అతను వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్‌ 27వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement