న్యూ ఢిల్లీ: కోతి చోరీకి పాల్పడింది. అయితే ఈసారి ఆహార పదార్థాలనో ఎత్తుకెళ్లలేదు. ఏకంగా బ్యాంకు ఏటీఎమ్ మీదే దాని కన్ను పడింది. ఇంకేముందీ ఎవరూ లేని సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎమ్ గదిలోకి చొరబడింది. వెంటనే దానికి తోచిన ప్లాన్‌ను అమల్లో పెట్టింది. ఏటీఎమ్‌ను పట్టుకుని వేలాడుతూ, తిరుగుతూ కుప్పిగంతులేసింది. కోతి దెబ్బకు ఏటీఎమ్ ముందు భాగం తెరుచుకుంది. ప్లాన్ సక్సెస్ అయినట్టుందంటూ హుషారుగా అందులోకి తొంగి చూసిన వానరానికి ఒక్క నోటు కూడా కనిపించలేదు. దీంతో తన శ్రమంతా వృథా అయిందని భావించిన కోతి విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చేతుల్లేకి కోతికి అరటి పండు తినిపించిన పోలీసు)
ఈ అరుదైన ఏటీఎమ్ చోరీ ఢిల్లీలో చోటు చేసుకుంది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. దోపిడీ ప్రధానాంశంగా తిరిగే పాపులర్ వెబ్ సిరీస్ "మనీ హేస్ట్"తో పోలుస్తూ కోతిని "మంకీ హేస్ట్" అని పిలుస్తున్నారు. కొందరేమో కోతి దొంగతనం కామెడీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. "అసలే మందు రేట్లు మండిపోతున్నాయి. ఓ బాటిల్ కొనుక్కునేందుకు డబ్బుల్లేక, అది దొంగతనానికి ప్రయత్నించి ఉంటుంద"ని ఓ మందుబాబు దానిపై జాలి చూపించాడు. కొందరు మాత్రం అది నిజంగా దొంగ కోతేనేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చోరీ చేయడంపై శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎమ్ మీదకు వదిలినట్టున్నారని అభిప్రాయపడుతున్నారు. (కోతులకు కరోనా సోకితే అంతే)
Comments
Please login to add a commentAdd a comment