
ఒక్కోసారి జంతువులు మనతో ప్రవర్తించే తీరు భయబ్రాంతులకు, ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆ క్షణంలో చాలామంది భయంతో హడావిడి చేస్తే..కొందరు మాత్రం చాలా కూల్‌గా వ్యవహరిస్తారు. నిజానికి ఆ జంతువుల సడెన్ ఎంట్రీ కంటే.. వాటితో కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పైగా ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయానికి గురవ్వుతాం కూడా. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటు చేసుకుంది.
మనం ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా సడెన్‌గా ఓ కోతి నేరుగా మనవద్దకు వస్తే ఏం చేస్తాం చెప్పండి. భయంతో వణికిపోతాం. దాన్ని పొమ్మనే ప్రయత్నమే లేక మనమే పక్కకు తప్పుకునే యత్నమో చేస్తాం కదా..!. కానీ ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు తాను భోజనం చేస్తుండగా వచ్చిన కోతిని చూసి భయపడ లేదు కదా..!. దాన్ని చూసి ఛీత్కరించనూ లేదు.
ఆ కోతి తన పళ్లెంలోనే తింటున్న ఏం అనలేదు. పైగా దాన్ని తినమని ప్రోత్సహిస్తూ.. ఆయన కూల్‌గా భోజనం చేశారూ. అంతేగాదు అక్కడ వడ్డించేవాళ్లు ఆ కోతికి అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా..బెదురు లేకుండా తినేలా ఆ కోతికి పెద్దాయన భరోసా ఇవ్వడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు కూడా ఒకింత ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పెద్దాయన చేసిన పనికి మెచ్చుకోవడమే గాక హనుమాన్ జీ మీతో విందుని పంచుకోవాలనుకున్నారు కాబోలు అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?)
Comments
Please login to add a commentAdd a comment