
సెక్యూరిటీ లేకపోవడం వల్లే.. బ్యాంకు దోపిడీ యత్నం
: రేణిగుంట సీఆర్‌ఎస్ సమీపంలో ఉన్న సిండికేట్ బ్యాంకు దోపిడీకి దుండగులు శనివారం రాత్రి యత్నించారు.
రేణిగుంట సీఆర్‌ఎస్
సిండికేట్ బ్యాంకును పరిశీలించిన అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి
రేణిగుంట : రేణిగుంట సీఆర్‌ఎస్ సమీపంలో ఉన్న సిండికేట్ బ్యాంకు దోపిడీకి దుండగులు శనివారం రాత్రి యత్నించారు. సెక్యూరిటీ లేకపోవడం వల్లే దుండగు లు ఇనుప రాడ్‌లతో బ్యాంకు గేటు తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల సీసీ కెమెరాను ధ్వం సం చేశారు. హైసెక్యూరిటీ లాక్డ్ బీరువాలను పగులగొట్టేందుకు ప్రయత్నిం చినా, అవి ఓపెన్ కాకపోవడంతో పారి పోయారు. బ్యాంకు గేటు తెరిచి ఉండటాన్ని ఆదివారం ఉదయం ఓ సీఆర్‌ఎస్ ఉద్యోగి గమనించి, సీఆర్‌ఎస్ సెక్యూరిటీ అధికారి ద్వారా రేణిగుంట పోలీసులకు సమాచారమిచ్చారు. అర్బన్ సీఐ బాలయ్య, ఎస్‌ఐలు రఫీ,మధుసూదన్ , అనంతరం అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, క్రైమ్ ఏఎస్పీ మల్లారెడ్డి, రేణిగుం ట డీఎస్పీ నంజుండప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రోశిరెడ్డిని అర్బన్ ఎస్పీ విచారించారు.
నగదు, బంగారు నగలు సేఫ్
అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి సమక్షంలో బ్యాంకులోని హైసెక్యూరిటీ లాక్డ్ లాకర్లను తెరిపించారు. అందులో ఉంచిన రూ.4,5 లక్షల నగదు భద్రంగా ఉండ టంతో పోలీసు, బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరో లాకర్ లోని సుమారు రూ.4 కోట్లు విలువ చేసే బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాం కు మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ఆ లాకర్‌ను ఓపెన్ చేయడం కుదరలేదని పోలీసు అధికారులు చెప్పారు. క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణుల బృందం ఆ ధారాలు సేకరించింది. పోలీసు జాగి లం సంఘటనా స్థలం నుంచి స్థానిక జెడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలోని తెలుగుగంగ వాటర్ సంప్ ప్రాంతంలో ఆగింది. దుండగులు బ్యాంకు పక్కనే ఉన్న తపాలా బాక్సు వద్ద పడేసి వెళ్లిన తాళాలను స్వాధీనం చేసుకున్నారు.