న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్‌ఆర్‌ను 9-9.35% రేంజ్‌లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించామని వివరించింది.
ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్‌ఆర్ 9.05-9.6% రేంజ్‌లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్‌ఆర్ 9.3-9.75% రేంజ్‌లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది.
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
Published Thu, Oct 6 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement