ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో గురువారం వేకువజామున చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి రూ. 20 లక్షలు దోచుకెళ్ళినట్లు అధికారులు వెల్లడించారు.
చోరీ సమయంలో సీసీ కెమెరా పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
ఏటీఎంలో రూ.20 లక్షలు చోరీ
Published Thu, Sep 21 2017 9:53 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM
Advertisement
Advertisement