సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 94 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో రూ.94 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.120 కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.6,188 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 6 శాతం వృద్ధితో రూ.6,554 కోట్లకు పెరిగిందని తెలిపింది. పన్ను వ్యయాలు రూ.174 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 4.61 శాతం నుంచి 8.69 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 5.63 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ ధర 3.3 శాతం నష్టపోయి రూ.67 వద్ద ముగిసింది.