పరారీలో క్యాషియర్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి గుర్తింపు కార్డూ ఇవ్వకుండానే రద్దరుున పెద్ద నోట్లను జమ చేసి కొత్త నోట్లు తీసుకెళ్లిన బ్యాంకు క్లర్క్‌ను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్ ఏసీిపీ వేణుగోపాలరావు వివరాలు వెల్లడించారు. చిక్కడపల్లి బాపూనగర్‌కు చెందిన వంగాల మల్లేశ్ (56) చైతన్యపురి కమలానగర్‌లోని సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తన వద్దవున్న రూ.6 లక్షల విలువగల రద్దరుున పెద్దనోట్లను ఈ నెల 12న బ్యాంక్‌కు తీసుకొచ్చాడు. ఎటువంటి గుర్తింపుకార్డు ఇవ్వకుండానే క్యాషియర్ రాధిక సహాయంతో రూ.6 లక్షలకు సరిపడా రూ.2వేల నోట్లను తీసుకెళ్లాడు.
రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసేందుకు నిబంధనలున్నప్పటికీ... ఒకేసారి రూ.6 లక్షలు మార్చుకోవడంతో గుర్తించిన బ్యాంకు మేనేజర్ నర్సయ్య ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరినీ సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు పొక్కడంతో రూ.5.4 లక్షలను మల్లేశ్ తిరిగి బ్యాంకులో జమచేశాడు. కాగా, నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి రెండు రూ.2 వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో జమచేసిన రూ.5.4 లక్షలు పోనూ మిగిలిన మొత్తం ఖర్చరుునట్లు మల్లేశ్ విచారణలో తెలిపాడు. మార్పిడి చేసిన డబ్బు మల్లేశ్‌దా... లేక వేరెవరిదైనానా అనేది విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. అతడికి సహకరించిన క్యాషియర్ రాధిక పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.
ఆ వార్తల్లో నిజం లేదు...
రద్దరుున నోట్ల మార్పిడి విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఏసీపీ సూచించారు. వివాహ వేడుకలుంటే... పెళ్లి పత్రిక చూపించి ఎస్పీ అనుమతితో రూ.5 లక్షలు డ్రా చేసుకోవచ్చన్న వార్తలు వాస్తవం కాదన్నారు. అలాగే మెడికల్ షాపులు, ఆసుపత్రుల్లో పాతనోట్లను ఈ నెల 24 వరకు తప్పనిసరిగా తీసుకోవాలని, నిరాకరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నగదు మార్పిడి కేసులో క్లర్క్ అరెస్టు
Published Wed, Nov 16 2016 12:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement