ప్రభుత్వ రంగ బ్యాంకుగా మంచి పేరున్న సిండికేట్ బ్యాంకు 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ సమాచారం...
డిప్యూటీ జనరల్ మేనేజర్(లా) వయసు: కనీసం 40 ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్లు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ‘లా’లో గ్రాడ్యుయేట్/ఇంటెగ్రేటెడ్ లా కోర్సు గ్రాడ్యుయేట్. పని అనుభవం: కనీసం పదకొండేళ్ల పని అనుభవం ఉండాలి. అందులో మూడేళ్లు ఏదైనా కోర్టులో ఇండిపెండెంట్‌గా పనిచేసి ఉండాలి. దీంతో పాటు 8 ఏళ్లు ఏదైనా కమర్షియల్ బ్యాంకులో లా ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి. అందులో మూడేళ్లు చీఫ్ మేనేజర్ లేదా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసి ఉండాలి.
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎకానమిస్ట్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 సంవత్సరాలు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మానిటరీ/ఫైనాన్షియల్ ఎకనమిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌తో ఎకనామిక్స్‌లో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కనీసం 5 ఏళ్లు ఎకనమిక్ రీసెర్చ్‌పై పనిచేసి ఉండాలి, ఫైనాన్షియల్ మార్కెట్/డొమెస్టిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లోని క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌లో సామర్థ్యం.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(స్టాటిస్టీషియన్)
వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో స్టాటిస్టిక్స్/అప్లైడ్ టిస్టిక్స్/ఎకనోమెట్రిక్స్‌లలో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి. పని అనుభవం: కనీసం 3 నుంచి 5 ఏళ్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులో/ ఎకనోమెట్రిక్ టెక్నిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో పని అనుభవం.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ)
వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కంపెనీ సెక్రటరీ(ఏసీఎస్) ఉత్తీర్ణులై, లా డిగ్రీ ఉండాలి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) మెంబర్ అయి ఉండాలి.పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకులో కంపెనీ సెక్రటరీగా కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. సర్టిఫైడ్ బ్యాంకింగ్ కంప్లయన్స్ ప్రొఫెషనల్ కోర్సు, ఐఐబీఎఫ్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
మేనేజర్ (లా) వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు. విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉండాలి.పని అనుభవం: బార్/జ్యుడీషియల్ సర్వీస్‌లో రెండేళ్ల పని అనుభవం లేదా ఏదైన ప్రముఖ కమర్షియల్ బ్యాంకులో లీగల్ డిపార్ట్‌మెంట్‌లో లా ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి.
మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్)
వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు. పని అనుభవం: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కనీసం 5 ఏళ్లు కమిషన్డ్ ఆఫీసర్లుగా పనిచేసి ఉండాలి లేదా ఏఎస్పీ/డీఎస్పీ హోదాతో 5 ఏళ్లు పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం/కనీసం 5 ఏళ్లు పారా మిలిటరీ ఫోర్స్‌లో పనిచేసి ఉండాలి.
చార్టెడ్ అకౌంటెంట్స్
వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు. విద్యార్హత: చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం: బ్యాంకులో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-సివిల్)
వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం.
అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-ఎలక్ట్రికల్)
వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉండాలి.గమనిక: అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేలు(జేఎంజీ/ఎస్) కింద ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ అభ్యర్థులకు ఒకేడాది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఏ ప్రదేశంలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ: జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్, సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుగుణంగా రాతపరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష: ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
అంశం {పశ్నలు మార్కులు
రీజనింగ్ 50 25
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
పోస్టుకు సంబంధించి
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 100
ఇంగ్లిష్ 50 25
మొత్తం 200 200
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ: అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల సాధనలో అభ్యర్థి చొరవ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసే నైపుణ్యాలను పరీక్షించేందుకు గ్రూప్ డిస్క షన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. పీఐ/జీడీ ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే తుది ఎంపికకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
ముఖ్య తేదీలు
దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ:
డిసెంబరు 10, 2015.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015.
పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై.
వెబ్‌సైట్: www.syndicatebank.in